సంపాదకీయం

అమెరికా ‘మేధా’ మథనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్‌లో నిర్మించండి-అన్న స్ఫూర్తి మేధా సంపత్తి హక్కుల వ్యవస్థకు భంగం కారాదని అమెరికా ప్రభుత్వం ఉచిత సలహానిస్తోంది. మన అంతర్గత వ్యవహారాలలో అమెరికా ప్రభుత్వం వారు అక్రమ ప్రమేయం కల్పించుకొనడం దశాబ్దుల చరిత్ర. ఈ అక్రమమైన జోక్యానికి ఇప్పుడు అమెరికా విడుదల వార్షిక వాణిజ్య ప్రత్యేక నివేదికలో మరిన్ని ఆధారాలు లభిస్తున్నాయి. ఈ అక్రమ ప్రమేయం ప్రపంచీకరణ -గ్లోబలైజేషన్‌తో సమాంతరంగా పొడుచుకుని వచ్చిన భారత వ్యతిరేక పరిణామం. మన ప్రభుత్వం అంతర్గత పారిశ్రామిక ఉత్పత్తులను పెంచడానికి అత్యధిక ఉత్సాహం చూపుతుండడంవల్ల మేధా సంపత్తి హక్కుల వ్యవస్థ-ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రిజీమ్-నీరుగారిపోతోందని అమెరికా వార్షిక ప్రణాళికలో నిర్ధారించారు. ఈ నిర్ధారణ అమెరికా-ఐరోపా ప్రయోజనాలు ప్రపంచ ప్రయోజనాలన్న శతాబ్దుల దురహంకార ప్రవృత్తికి మరో నిదర్శనం. భారత్‌లో నిర్మించండి-మేక్ ఇన్ ఇండియా-అన్న నినాదాన్ని మన ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించినప్పటినుంచి అమెరికా ప్రభుత్వం, ఐరోపా దేశాల సమాఖ్య అసహనానికి గురి అవుతునే ఉన్నాయి. చైనా ప్రభుత్వం మరింత అసహనంతో ఉన్నప్పటికీ, చైనా ఉత్పత్తులు మన దేశంలో విచ్చలవిడిగా అమ్ముడుపోతూనే ఉన్నాయి కనుక, మేక్ ఇన్ ఇండియా పథకం పట్ల వ్యతిరేకతను బహిరంగ పరచడంలేదు. పరోక్షంగా మాత్రమే చైనా మేక్ ఇన్ ఇండియాను వెక్కిరించింది. కానీ అంతర్జాతీయ సమాజం లో తమ ఉత్పత్తులకు క్రమం గా తగ్గిపోతున్న గిరాకీ అమెరికా ఐరోపాలను ఆందోళనకు గురి చేస్తోంది. చైనా దక్షిణ కొరియా జపాన్ దేశాల వస్తువులకు అంతర్జాతీయంగా గిరాకీ పెరిగిపోతోంది! ఈ నేపథ్యంలో మేక్ ఇన్ ఇండియా పథకం విజయవంతమైనట్టయితే తమ ఉత్పత్తులను మన దేశానికి భారీగా ఎగుమతి చేయడానికి వీలుండబోదన్నది అమెరికా వారి కలవరం, ఐరోపా దేశాలకలవరం... అందువల్లనే అమెరికా మేక్ ఇన్ ఇండియా పథకాన్ని రకరకాలుగా విమర్శిస్తోంది. గత సెప్టెంబర్‌లో మన ప్రధానమంత్రి అమెరికాలో పర్యటించడానికి ముందు ఆ దేశంనుంచి దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల రక్షణ సామగ్రిని కొనుగోలు చేయడానికి మన ప్రభుత్వం అంగీకరించింది. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి పెరిగినట్టయితే ఇలా ఆయుధాలు అమ్ముకోవడానికి అమెరికాకు వీలుండదు. అలాగే ఫ్రాన్స్‌నుంచి యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి కూడ మనదేశం అంగీకరించింది. గత జనవరిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోరుూ హోలెండ్ మన దేశానికి వచ్చిన సందర్భంగా ఇరవై ఆరువేల కోట్ల రూపాయల విలువైన ముప్పయి ఆరు రాఫెల్ గగన సమర శకటాలను కొనుగోలునకు సంబంధించిన ఒప్పందం కుదిరింది. డిసెంబర్‌లో నరేంద్రమోదీ రష్యాకు వెళ్లి వచ్చిన సందర్భంగా ముప్పయి తొమ్మిది వేల కోట్ల రూపాయల విలువైన రక్షణ సామగ్రిని క్షిపణులను ఆ దేశంనుండి కొనడానికి మన ప్రభుత్వం అంగీకరించింది. మేక్ ఇన్ ఇండియా-్భరత్‌లో నిర్మించండి-స్ఫూర్తికి ఈ కొనుగోళ్లు నేపథ్య వైపరీత్యం...
మేక్ ఇన్ ఇండియా విజయవంతం అయినట్టయితే ఇలా విదేశాలు తమ ఉత్పత్తులను మనకు తగలగట్టడానికి వీలుండదు. అందువల్లనే అమెరికా ఆరంభం నుండీ వ్యతిరేకిస్తోంది. ప్రపంచీకరణ వ్యవస్థలో భాగంగా ప్రపంచ వాణిజ్య సంస్థ వారి పర్యవేక్షణలో అమలు జరుగుతున్న మేధా సంపత్తి హక్కుల పరిరక్షణ నియమావళిని అమెరికా, చైనా, ఐరోపా సమాఖ్య బాహాటంగా ఉల్లంఘిస్తునే ఉన్నాయి. కానీ వర్ధమాన దేశాలలో మాత్రం ఈ నియమావళిని అమలు జరిపించాలన్నది సంపన్నుల వాణిజ్య వ్యూహం! అందువల్లనే భారత్‌లో తయారయ్యే వస్తువులవల్ల తమ ఉత్పత్తుల ఎగుమతికి భంగం వాటిల్లుతుందన్న ప్రచారం అమెరికా ముందుగానే ప్రారంభించింది. మేక్ ఇన్ ఇండియావల్ల తమ మేధాసంపత్తికి హాని కలుగుతుందని నిన్న మొన్న విడుదల చేసిన వాణిజ్య నివేదికలో అమెరికా ఆందోళనను అభినయించింది. ఈ అభినయం-ఉప్పోడు ఏడవలేదు, పప్పోడు ఏడవలేదు టెంకాయలోడు పొర్లిపొర్లి ఏడ్చాడు-అన్న సామెతకు అనుగుణంగా ఉంది! వర్షం వస్తే సంతలో నానిపోయి పాడయ్యేవి ఉప్పు, పప్పు...కొబ్బరి కాయలకేమీ హాని లేదు! అందువల్ల అమెరికా వారు ఆందోళన చెందడం అతిజాగ్రత్తకు, ఒత్తడిపెంచే విధానానికి అనుగుణమైన చర్య...
నిజానికి నరేంద్ర మోదీ ప్రకటించక పూర్వం దశాబ్దులుగా విదేశీయ సంస్థలు మేక్‌ఇన్ ఇండియాను మరో విధంగా అమలు జరిపిస్తున్నాయి. ప్రపంచీకరణ మొదలైన తరువాత ఈ విచిత్ర ఉత్పత్తి ప్రక్రియ బహుళ జాతీయ వాణిజ్య రూపాన్ని సంతరించుకుంది. విదేశీయ సంస్థలు భారీగా చొరబడి పోయి స్థిరాస్థి రంగాన్ని కబ్జా చేసాయి, పట్టణ వాటికలను నిర్మించాయి, ఇదే మేక్ ఇన్ ఇండియా...లావాసా అన్న విదేశీయ సంస్థ పుణె నగరం సమీపంలో జరిపిన మేక్ ఇన్ ఇండియా వల్ల పడమటి కనుమలలో వందల చదరపు కిలోమీటర్ల హరిత శోభ అంతరించింది, భూగర్భ జలా లు ఇంకిపోయాయి. పెప్సీ, కోకో వంటి సం స్థలు భూమిని లోతుగా తవ్వేసి నీరుతోడేసాయి, రుచికరమైన క్రిమినాశక రసాయనాలను మిళితం చేసి శీతల పానీయాలను ఉత్పత్తి చేసాయి. ఇది కూడ మేకిన్ ఇండి యా!మద్యం తాగడంవల్ల మృత్యువునకు చేరువవుతామన్నది ప్రచారం... ఈ శీతల పానీయాలను మరగడం కూడ అంతకంటె తక్కువ ప్రమాదకరం కాదు! ఐస్ క్రీములను చాక్లెట్లను విదేశీయ కంపెనీలు భారత్‌లో నిర్మించాయి! బంగాళాదుంపలను వేయించి అంకుల్‌శామ్ చిప్స్ పేరుతో మనకంటగట్టడం ఈ విచిత్ర మేక్ ఇన్ ఇండియాకు పరాకాష్ట. ఈ వైపరీత్యాన్ని తొలగించడానికై నరేంద్ర మోదీ ప్రభుత్వం నిజమైన నిర్మాణ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా వౌలిక పారిశ్రామిక ఉత్పత్తుల రంగంలో మొదలైన ప్రగతి అంతంతమాత్రమే! యుద్ధ విమానాలను, విమాన వాహక యుద్ధ నౌకలను దిగుమతి చేసుకోవడం మానడానికి ఇంకా ఎంతో కాలం పట్టవచ్చు గాక. కనీసం రక్షణ అవసరాలకు ఉపయోగపడే ట్రక్కులను సైతం మనం తయారు చేసుకోలేమా! బ్రిటన్ కంపెనీలనుంచి ఎందుకు దిగుమతి చేసుకోవాలి? యుద్ధ శకటాలు సరేసరి మామూలు జనం పయనించే బస్సులు సైతం మనదేశంలో తయారుకావడంలేదు, వోల్వో బస్సులను విదేశాలనుండి రప్పించి రోడ్డు ప్రమాదాల సంఖ్యను పెంచుకుంటున్నాము...
మనం స్వయం సమృద్ధిని సాధించకుండా నిరోధించే పాశ్చాత్యుల వ్యూహం ఆంగ్లేయులు మన దేశాన్ని దురాక్రమించిన నాటినుంచి కొనసాగుతోంది. అమెరికావారు ఐరోపా దేశాల వారసులు మాత్రమే. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒత్తడికి లొంగి మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం చిల్లర వ్యాపారంలోకి అమెరికన్ సంస్థల చొరబాటును అనుమతించింది. మోదీ ప్రభుత్వమైనా ఈ అమెరికా వాణిజ్య ఆధిపత్యాన్ని ప్రతిఘటించగలదా?