సంపాదకీయం

సముచిత చర్య..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ కశ్మీర్ శాసనసభను రాజ్యపాల్ సత్యపాల్ మాలిక్ రద్దుచేయడం ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియను పరిరక్షించడంలో భాగం. రాజకీయ నైతిక నిష్ఠకు దోహదకరం, అవకాశవాద పదవీస్వామ్య నిరోధకం.. జమ్మూ కశ్మీర్‌లో రెండు దశాబ్దులకు పైగా బద్ధవిరోధులైన ప్రాంతీయ పక్షాలు పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ- పిడిపి-, నేషనల్ కాన్ఫరెన్స్-ఎన్‌సి- జట్టుగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి యత్నించడం అవకాశవాద రాజకీయానికి పరాకాష్ఠ, అనైతికమైన పొత్తులకు పరాకాష్ఠ.. ఈ రెండు పార్టీల కూటమికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడానికి సిద్ధమయిపోవడం అస్తిత్వ రక్షణకు అక్రమ మార్గాలను అనే్వషించే రాజకీయానికి నిదర్శనం. 2002లో జరిగిన శాసనసభ ఎన్నికల తరువాత ‘పిడిపి’తో కలిసి జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ 2008 నాటికి ‘పిడిపి’కి బద్ధశత్రువుగా మారింది. చెరి మూడేళ్ల చొప్పున ముఖ్యమంత్రి పదవిని పంచుకోవడం 2002లో కాంగ్రెస్‌కు, ‘పిడిపి’కి కుదిరిన ఒప్పందంలో భాగం. అలా పంచుకున్నారు కూడ. మొదట ‘పిడిపి’ అధినేత ముఫ్తీ మహమ్మద్ సరుూద్ మూడేళ్లపాటు ముఖ్యమంత్రి పదవిని నిర్వహించాడు. ఆ తరువాత కాంగ్రెస్‌కు చెందిన గులామ్‌నబీ ఆజాద్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆజాద్ పదవీకాలం పూర్తవుతుండిన సమయంలో ఉభయ పార్టీలు కలహించి విడిపోవడం చరిత్ర. 2008నాటి ఎన్నికల తరువాత మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాతో కాంగ్రెస్ జట్టుకట్టింది. ఆయన నాయకత్వంలోని ‘నేషనల్ కాన్ఫరెన్స్’తో కలిసి కూటమిని ఏర్పాటు చేసింది. 2008లో ముఖ్యమంత్రి అయిన ‘కాన్ఫరెన్స్’ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా ఆరేళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ పొత్తు ఫలితంగా కాంగ్రెస్‌కు ముఖ్యమంత్రి పదవి దక్కలేదు, అయినప్పటికీ కాంగ్రెస్ వారు ‘ఎన్‌సి’తో జట్టుకట్టడం ‘పిడిపి’తో రాజకీయ విరోధం సాధించడం కోసం! 2014నాటికి కాంగ్రెస్‌కూ, ‘ఎన్‌సి’కి మధ్య బెడిసింది. 2014నాటి ఎన్నికల తరువాత మళ్లీ ‘పిడిపి’కి మద్దతును ప్రకటించడానికి కాంగ్రెస్ సిద్ధమైంది. ‘పిడిపి’ కాంగ్రెస్‌ను తిరస్కరించింది. ఆ తరువాత ‘ఎన్‌సి’తో చేరడానికి సైతం కాంగ్రెస్ చేసిన యత్నం విఫలమైంది. ఇలా 2014 నుంచి పరస్పరం ప్రబల ‘శత్రువు’లుగా ఉన్న ఈ మూడు పార్టీలు ఇప్పుడు మళ్లీ జట్టుకట్టడానికి సిద్ధం కావడం అవకాశవాద రాజకీయానికి అత్యాధునిక సాక్ష్యం! ఈ రాజకీయ వ్యూహం ఫలించకుండా రాజ్యపాల్- గవర్నర్- నిరోధించగలిగాడు, శాసనసభను రద్దుచేశాడు. మరోసారి జనాదేశానికి రంగం సిద్ధం చేశాడు..
జమ్మూ కశ్మీర్ గత జూన్ 20న ‘గవర్నర్’ పాలన కిందికు వచ్చింది. ‘పిడిపి’తో కలసి 2015 నుంచి ప్రభుత్వాన్ని నడిపిన ‘్భరతీయ జనతాపార్టీ’ ప్రభుత్వం నుంచి వైదొలగడం ఇందుకు కారణం. ‘్భజపా’ మద్దతును ఉపసంహరించిన కారణంగా ‘పిడిపి’ నాయకురాలు, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. జమ్మూ కశ్మీర్ శాసనసభలో ఎనబయి ఏడు స్థానాలున్నాయి. జూన్ ఇరవయ్యవ తేదీ నాటికి, నవంబర్ ఇరవై ఒకటవ తేదీన సభ రద్దయిన నాటికి శాసనసభలో వివిధ పక్షాల బలాలు మారలేదు. అందువల్ల గవర్నర్ పాలన ఏర్పడడానికి దారితీసిన ‘రాజ్యాంగ సంక్షోభం’ తొలగలేదు. రద్దయిన సభలో ‘పిడిపి’కి ఇరవై తొమ్మిది, ‘్భజపా’కు ఇరవై ఐదు, ‘ఎన్‌సి’కి పదహైదు, కాంగ్రెస్‌కు పనె్నండు, ‘పీపుల్స్ కాన్ఫరెన్స్’- పిసి-కి రెండు స్థానాలున్నాయి. శాసనసభను రద్దుచేసి కొత్తగా ఎన్నికలు జరిపించాలని ‘రాజ్యపాల్ శాసనం’ ఆరంభమైన నాటినుంచి ‘పిడిపి’ అధినేత్రి ముఫ్తీ మెహబూబా కోరుతోంది. ‘ఎన్‌సి’ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడ ఇదే పాట పాడాడు. ఇలా కోరిన ఈ పార్టీలు కలసికట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడడం వారి ద్వంద్వ ప్రవృత్తికి నిదర్శనం. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగాలు, ప్రజాస్వామ్య ప్రాతిపదికలు. రాజ్యాంగ నిబద్ధతను ప్రకటించి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములైన ఈ రెండు ప్రధాన పార్టీలు జమ్మూ కశ్మీర్‌లో జరిగిన, జరుగుతున్న ‘స్థానిక’, సంస్థల ఎన్నికలను బహిష్కరించాయి. ‘హురియత్’ వంటి బీభత్స సంస్థలు పాకిస్తాన్‌ను బాహాటంగా సమర్ధిస్తున్నాయి. అందువల్ల ఇలాంటి దేశ వ్యతిరేక సంస్థలు ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలకు పిలుపులను ఇస్తుండడంలో ఆశ్చర్యం లేదు. కానీ ‘రాజ్యాంగ నిబద్ధత’ను అభినయిస్తున్న ‘పిడిపి’, ‘ఎన్‌సి’ ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కాకపోవడం ప్రచ్ఛన్న విద్రోహ ప్రవృత్తికి నిదర్శనం! ఇలాంటి పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసే ప్రమాదం తప్పిపోవడం హర్షణీయ పరిణామం..
‘పిడిపి’తో కాని ‘ఎన్‌సి’తో కాని ‘్భజపా’వారు జట్టుకట్టడమే జాతీయ వైపరీత్యం. భారత రాజ్యాంగంలోని మూడువందల డెబ్బయ్యవ అధికరణం ప్రకారం జమ్మూ కశ్మీర్ లభిస్తున్న ప్రత్యేక ప్రతిపత్తిని ‘్భజపా’ వ్యతిరేకిస్తోంది. ఈ అధికరణాన్ని రద్దుచేయాలని ‘్భజపా’ దశాబ్దులుగా కోరుతోంది. ఈ ‘అధికరణం’ ప్రాతిపదికగా జమ్మూ కశ్మీర్‌కు లభిస్తున్న ప్రత్యేక ప్రతిపత్తివల్ల ఆ రాష్ట్రం పాకిస్తాన్ తొత్తులకు ఆలవాలమై ఉంది. దేశంలోని శాసనసభల కాలవ్యవధి ఐదేళ్లుకాగా జమ్మూకశ్మీర్ శాసనసభ కాలవ్యవధి ఆరేళ్లు. మరే ఇతర ప్రాంతానికి లేని విధంగా కశ్మీర్‌కు మాత్రం మరో రాజ్యాంగం ఉంది, మరో పతాకం కూడ ఉంది. కశ్మీర్‌కు మరో ప్రధానమంత్రి పదవి కూడ ఉండేది. 1950వ దశకంలో ‘జన సంఘ’ నాయకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ చేసిన బలిదానం కారణంగా ఈ ప్రత్యేక ప్రధాని పదవి రద్దయింది. కానీ మిగిలిన ప్రత్యేకతలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని మూడువందల యాబయి ఆరవ అధికరణం మేరకు జమ్మూ కశ్మీర్‌లో రాష్టప్రతి పాలననూ విధించవచ్చు, జమ్మూ కశ్మీర్ రాజ్యాంగంలోని తొంబయిరెండవ సూత్రంమేరకు గవర్నర్ పాలననూ విధించవచ్చు. రాష్టప్రతి పాలనను విధించడానికి పూర్వరంగంగా ‘గవర్నర్ పాలన’ను విధించడం తప్పని ప్రత్యేకత ఇదీ! దేశంలోని వివిధ రాష్ట్రాలలో అన్ని మతాలవారు భాషలవారు సమాన ప్రతిపత్తితో హాయిగా జీవిస్తున్నారు. ఈ సమానత్వం జమ్మూ కశ్మీర్‌లో లేదు. అందువల్లనే 1947 నాటికి అల్పసంఖ్యాకులైన హిందువులను జిహాదీలు ‘కశ్మీర్ లోయ’నుంచి నిర్మూలించారు. ఇదీ ప్రత్యేకత! జమ్మూ కశ్మీర్‌లో ‘కశ్మీరీ’ భాష అధికార భాషకాదు, కనీసం రెండవ అధికార భాష కూడ కాదు. ఇదీ ప్రత్యేకత! ఈ ప్రత్యేకతలు చాలవన్నట్టు తమ ప్రాంతానికి ‘స్వయం ప్రతిపత్తి’- అటానమీ-ని కల్పించాలని ‘నేషనల్ కాన్ఫరెన్స్’ కోరుతోంది. ‘పిడిపి’ దేశ వ్యతిరేక పథంలో మరింత ముందుకెళ్లి ‘స్వయంపాలన’ను కోరుతోంది. ఈ ‘స్వయం పాలన’- సెల్ఫ్‌రూల్- గురించి మొదట ప్రతిపాదించినవాడు పాకిస్తాన్ మాజీ నియంత పరవేజ్ ముషారఫ్! ‘స్వయం పాలన’ అంటే జమ్మూ కశ్మీర్ ఈ దేశం నుండి విడిపోయి మరో స్వతంత్ర దేశంగా ఏర్పడడానికి ప్రాతిపదిక!
ఇలాంటి ప్రచ్ఛన్న విచ్ఛిన్న సంస్థ ‘పిడిపి’తో ‘్భజపా’ జట్టుకట్టడం ‘హిమాలయ మహాపరాధం’. ‘పిడిపి’తో స్నేహం ‘్భజపా’కు చారిత్రిక గుణపాఠం! ఇకముందైనా ‘్భజపా’ ఈ ప్రచ్ఛన్న విచ్ఛిన్నవాదులతో జట్టుకట్టరాదన్నది ఈ గుణపాఠం! కశ్మీర్‌లో ఒకే ఒక వౌలిక సమస్య పాకిస్తాన్ ప్రభుత్వం జరిపిస్తున్న బీభత్సకాండ. దీన్ని నిరోధించడం, నిర్మూలించడం మాత్రమే పరిష్కారం. భారత రాజ్యాంగంలోని మూడువందల డెబ్బయ్యవ అధికరణం రద్దుచేయడం ఈ పరిష్కార మార్గం..