సంపాదకీయం

‘అగస్టా’ దళారి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటన్‌కు చెందిన ‘ఆర్థిక బీభత్సకారుడు’ క్రిస్టియన్ జేమ్స్ మిచెల్‌ను మన దేశానికి తరలించుకొని రావడం మన ప్రభుత్వం సాధించిన దౌత్య విజయం. విదేశాలలో నక్కి ఉన్న మన దేశానికి చెందిన ఆర్థిక, భౌతిక బీభత్సకారులను తరలించుకొని రావడంలో మన ప్రభుత్వం దశాబ్దుల తరబడి విఫలం చెందడం చరిత్ర. విదేశీయ ఆర్థిక నేరస్థులను తరలించుకొని రావడం దాదాపు అసాధ్యం కావడం కూడ చరిత్ర. ఈ చరిత్రకు అపవాదంగా బ్రిటన్‌కు చెందిన ఈ మిచెల్- మిషెల్-ను మంగళవారం రాత్రి మన దేశానికి తరలించుకు రాగలగడం నేర నిరోధక చరిత్రలో అద్భుతమైన పరిణామం. బ్రిటన్ నుంచి నిష్క్రమించి ‘ఐక్య అరబ్ సంస్థానాల’- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్- యుఏఇ-లో నక్కి ఉండిన ఈ దుర్మార్గపు దళారీని మన దేశానికి పట్టి తేవడంతో ‘అగస్టా వెస్ట్‌లాండ్’ గగన శకటాల అవినీతి పరిశోధనలో గొప్ప ముందడుగు. ‘అగస్టా వెస్ట్‌లాండ్’ అన్న బ్రిటన్ వాణిజ్య సంస్థ ఇటలీకి చెందిన ‘్ఫన్ మెక్కానికా’ అన్న సంస్థకు అనుబంధమై ఉంది. ఈ ఇటలీ సంస్థకు, ‘అగస్టా వెస్ట్‌లాండ్’ సంస్థకు క్రిస్టియన్ జేమ్స్ మిచెల్ దళారీగా వ్యవహరించాడు. ప్రముఖులు ప్రయాణం చేయడానికి వీలుగా ‘అగస్టా వెస్ట్‌లాండ్’ వద్ద పనె్నండు గగన శకటాల- హెలికాప్టర్స్-ను కొనుగోలు చేయడానికై 2010లో కుదుర్చుకున్న ఒప్పందంలో క్రిస్టియన్ జేమ్స్ మిచెల్ కీలక పాత్ర పోషించినట్టు 2012లో ధ్రువపడింది. ఈ ఒప్పందాన్ని కుదిర్చిపెట్టిన మిచెల్‌కు ‘అగస్టా వెస్ట్‌లాండ్’, ‘్ఫన్ మెక్కానికా’ సంస్థలు దాదాపు మూడువందల కోట్ల రూపాయల లంచం ఇచ్చినట్టు 2012లో వెల్లడైంది. ఇలా లంచం మింగిన మిచెల్ ‘అగస్టా’ గగన శకటాలను అధిక ధరలకు మన రక్షణ శాఖకు అంటగట్టడానికి కృషిచేశాడు. మన ప్రభుత్వం నిర్ధారించిన ‘ప్రమాణాల’ను నీరుకార్చి నాసిరకం ‘హెలికాప్టర్’లను అంటగట్టడానికి వీలుగా మన దేశానికి చెందిన వారిని ఒప్పించడంలో కూడ ఇతగాడు కీలక పాత్ర వహించాడు. ఇందుకోసం మన ప్రభుత్వ ‘సంబంధితుల’కు సైతం ‘అగస్టా’వారు లంచాలను పంచినట్టు 2013లో బయటపడింది. ఈ ఒప్పందం కారణంగా నాసిరకం గగన శకటాలను మన ప్రభుత్వం కొనుగోలు చేయవలసి వచ్చేది. ఈ ఒప్పందం కారణంగా మన ప్రభుత్వానికి దాదాపు రెండువేల ఏడు వందల కోట్లు రూపాయల నష్టం వాటిల్లుతున్నట్టు ‘కేంద్ర నేర పరిశోధక మండలి’- సిబిఐ-వారు ఆ తరువాత నిర్ధారించారు. అవినీతి పుట్ట పగిలిన తరువాత సైనిక అధికారులకు, ఇతరులకు వ్యతిరేకంగా ‘సిబిఐ’ ఆరోపణలను నమోదు చేసింది. 2014లో మన ప్రభుత్వం ఈ గగన శకటాల కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవలసి వచ్చింది. దోషులను దండించడానికి జరుగుతున్న న్యాయ ప్రక్రియలో ‘మిచెల్’ను పట్టుకొనగలగడం, న్యాయస్థానం ముందు నిలబెట్టగలగడం కీలకమైన పరిణామం!
విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి ఆర్థిక నేరస్థులు దేశం నుంచి పారిపోయారు, విదేశాలలో విహరిస్తున్నారు. జాకిర్ నాయక్ వంటి జిహాదీ బీభత్సకారులు, ఎమ్‌ఎఫ్ హుస్సేన్ వంటి బౌద్ధిక బీభత్సకారులు న్యాయ ప్రక్రియ నుండి తప్పించుకొనడానికై మన దేశం నుండి జారుకున్నారు. భరతమాతను సైతం నగ్నంగా చిత్రీకరించడానికి ఒడిగట్టిన ఎమ్‌ఎఫ్ హుస్సేన్‌ను ఖతార్ నుంచి తరలించుకొని రావడం మన ప్రభుత్వం తరం కాలేదు, ఆ తరువాత అతనికి వ్యతిరేకంగా దాఖలయిన అభియోగాలు కాలదోషం పట్టాయి, రద్దయిపోయాయి. బంగ్లాదేశ్‌లోను, మన దేశంలోను ‘జిహాదీ’ హంతకులను ఉసిగొల్పినట్టు ఆరోపణలకు గురి అవుతున్న జాకిర్ నాయక్ సౌదీ అరేబియాలో కొంతకాలం నక్కాడు, ఆ తరువాత అక్కడి నుంచి కూడ జారుకున్నాడు. ఎక్కడ ఉన్నాడన్నది అంతర్జాతీయ నేర పరిశోధక సంస్థ ‘ఇంటర్ పోల్’ కనిపెట్టాలి! దావూద్ ఇబ్రహీం వంటి భయంకర ‘జిహాదీ’ హంతకులు పాకిస్తాన్‌కు ఇతర దేశాలకు పారిపోయారు. 1984లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలోని ‘యూనియన్ కార్బయిడ్’ సంస్థకు చెందిన కర్మాగారం నుంచి విషవాయువు వెలువడింది. వేలాది మంది అకాల మృత్యువు పాలయ్యారు, క్షతగాత్రులయ్యారు, శాశ్వత శారీరక మానసిక అస్వస్థతకు గురి అయ్యారు. ఈ ‘యూనియన్ కార్బయిడ్’ అన్న ఎఱువుల ఉత్పత్తిసంస్థ అమెరికాకు చెందిన ‘యూనియన్ కార్బయిడ్’ సంస్థకు అనుబంధమై ఉండేది. యాజమాన్యం వారి ఘోరమైన అమానవీయమైన నిర్లక్ష్యం అలా వేల కుటుంబాలకు భయంకర విషాదాన్ని కలుగచేసింది. కానీ ఈ ఘోరం జరిగిన వెంటనే ‘కార్బయిడ్’ సంస్థ అధిపతి వారన్ ఆండర్‌సన్ భోపాల్ నుంచి ఢిల్లీకి అక్కడి నుంచి అమెరికాకు సురక్షితంగా పారిపోయాడు. అతగాడిని అమెరికా నుంచి తరలించుకొని వచ్చి న్యాయస్థానాల ముందు నిలబెట్టడానికి ముప్పయి ఏళ్లపాటు మన ప్రభుత్వానికి వీలుకాలేదు. 2014లో అతగాడు అమెరికాలోనే మరణించాడు.
ఆండర్‌సన్ ఇలా న్యాయ ప్రక్రియను తప్పించుకొని స్వదేశానికి పారిపోవడానికి 1984నాటి మన కేంద్ర ప్రభుత్వ నిర్వాహకులు, మధ్యప్రదేశ్ నిర్వాహకులు సహకరించారన్నది ఆ తరువాత ధ్రువపడింది. ఆ తరువాత న్యాయస్థానాలు ఎన్నిసార్లు ఆదేశించినప్పటికీ నేరస్థుడిని మన ప్రభుత్వం పట్టుకోలేకపోయింది. ఇలా ఘోర నేరస్థులను విదేశాల నుంచి తరలించుకొని రావడంలో మన ప్రభుత్వాల వైఫల్యానికి మరో చారిత్రిక సాక్ష్యం- ఇటలీకి చెందిన బుట్టాలియో కుత్రోచీ పలాయనం.. 1980వ దశకంలో మన ప్రభుత్వం స్వీడన్ సంస్థ ‘బోఫోర్స్’ నుంచి కొనుగోలు చేయతలపెట్టిన హావిట్జర్ శతఘు్నల వ్యవహారం అవినీతిగ్రస్తం కావడానికి ఈ కుత్రోచీ కారకుడు. బోఫోర్స్ సంస్థవారు కుత్రోచీకి, మన ప్రభుత్వ నిర్వాహక రాజకీయవేత్తలకు భారీగా లంచాలను చెల్లించినట్టు వెలువడిన ఆరోపణలు దశాబ్దులపాటు ప్రకంపనాలు సృష్టించాయి. కానీ కుత్రోచీని పట్టితేవడానికి మన నిఘా సంస్థలు, పరిశోధక సంస్థలు చేసిన ప్రయత్నాలు 2013వరకు ఫలించలేదు. కుత్రోచీ 2013లో మరణించాడు. అంతకు పూర్వం మొదట మలేసియా నుంచి ఆ తరువాత అర్జంటీనా నుంచి కుత్రోచీని తరలించుకొని రావడానికి జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు, ఇలా కుత్రోచీ తరలిరాకుండా మన ప్రభుత్వ నిర్వాహకులే అడ్డుపడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. కుత్రోచీని నిర్బంధించి మన దేశానికి తరలించుకొని రావలసిందిగా మన ప్రభుత్వం 2002లో ‘ఇంటర్ పోల్’ను కోరింది. కానీ ఈ ‘నిర్బంధ ఆదేశాన్ని’ మన ప్రభుత్వమే 2009లో రద్దుచేసుకొనడం ఇలా ‘‘అడ్డుతగలడానికి’’ నిదర్శనం.
ఈ చరిత్రకు భిన్నంగా ఇప్పుడు క్రిస్టియన్ మిచెల్‌ను దుబాయి నుంచి మన ప్రభుత్వం తరలించుకొని రాగలిగింది. 2017లోనే ‘యుఏఇ’ అధికారులు మిచెల్‌ను నిర్బంధించినప్పటికీ ఇతగాడు మన దేశానికి తరలిరావడానికి పంతొమ్మిది నెలలు పట్టింది. ఈలోగా ‘అగస్టా వెస్ట్‌లాండ్’ అవినీతిగ్రస్తులైన సైనిక అధికారులకు, ఇతరులకు వ్యతిరేకంగా అభియోగాలు దాఖలయ్యాయి. వైమానిక దళం మాజీ అధిపతి ఎన్‌పి త్యాగి అభియోగానికి గురికావడం అవినీతి విస్తృతికి కారణం. 2010లో పురుడుపోసుకున్న ఈ అవినీతి 2013లో బహిర్గతం కావడానికి కారణం అప్పటి మన ప్రభుత్వ నిర్వాహకుల ‘ఘనత’ కాదు. ఇటలీ పోలీసులు, అక్కడి న్యాయస్థానాలు ఈ అవినీతిని బయటపెట్టాయి. ‘్ఫన్ మెక్కానికా’ సంస్థ అధిపతి ‘గూసెప్పేవోర్సీ’ అనే వాడి అవినీతి కలాపాల గురించి దర్యాప్తుచేసిన ఇటలీ ప్రభుత్వం 2013లో ‘తీగె లాగింది, డొంక కదిలింది..’. ‘డొంక కదులుతూనే ఉండడం’ క్రిస్టియన్ జేమ్స్ మిచెల్ తరలింపువల్ల మరోమారు ధ్రువపడిన వికృత వాస్తవం...