సంపాదకీయం

కృత్రిమ సమైక్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవికి ఊర్జిత్ పటేల్ రాజీనామా చేయడం, ఢిల్లీలో జరిగిన ప్రతిపక్షాల సమావేశం సమాంతర పరిణామాలు! ఈ రెండు పరిణామాలకు ఎలాంటి సంబంధం లేదు. వ్యక్తిగత కారణాల ప్రాతిపదికగా తాను రాజీనామా చేస్తున్నట్టు ఊర్జిత్ పటేల్ చెప్పినట్టు ప్రాథమిక సమాచారం! అందువల్ల కేంద్ర ప్రభుత్వంతో ఆయనకు కొనసాగినట్టు ప్రచారమైన ‘విధాన విభేదాలు’ రాజీనామాకు దోహదం చేశాయా? లేదా? అన్నది ఇప్పుడప్పుడే స్పష్టం కాదు. ఈ ‘విధాన విభేదాలు’ సమసిపోయినట్టు, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ విషయంలో ప్రభుత్వానికీ, రిజర్వ్ బ్యాంక్‌కీ మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు గత నెల చివరిలో ప్రచారమైంది. అయినప్పటికీ ‘‘రాజ్యాంగ వ్యవస్థలను భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యవంలో కేంద్ర ప్రభుత్వం ధ్వంసం చేస్తోందన్న’’ ప్రతిపక్షాల ప్రచారానికి ఈ ‘రాజీనామా’ కొత్త ఊపు! ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనుండడం సోమవారం ఢిల్లీలో జరిగిన ప్రతిపక్ష సమావేశానికి మరో విచిత్ర నేపథ్యం! భారతీయ జనతాపార్టీ- భాజపా-ని వ్యతిరేకిస్తున్న జాతీయ, ప్రాంతీయ పక్షాలన్నింటినీ ఒకే కూటమిగా ఏర్పాటు చేయడానికై తెలుగుదేశం ‘జాతీయ’ అధ్యక్షుని హోదాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న ‘కీలక’పాత్ర ఈ సోమవారం నాటి ‘ఇంద్రప్రస్థ’- ఢిల్లీ- సమావేశానికి ప్రాతిపదిక! గత నెలలోనే జరుగవలసి ఉండిన ఈ ‘సమైక్య సభ’ వాయిదాపడడానికి కారణం ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలలో ఈ ప్రతిపక్షాల నేతలు ప్రచార నిమగ్నులై ఉండడం.. అని ప్రచారం జరిగింది. కానీ ఎన్నికల ప్రక్రియ పూర్తికాక పూర్వమే- ఫలితాలు వెలువడడానికి ఒక రోజు ముందు- ఈ సమైక్య సమావేశాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారన్నది అంతుపట్టని వ్యవహారం. ఫలితాలు వెలువడిన తరువాత ఈ ‘ భాజపా’ వ్యతిరేక సభను నిర్వహించి ఉండవచ్చు. ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే ఈ ప్రతిపక్ష శిఖర సభను ఏర్పాటుచేసి ఉండవచ్చు. ‘్ఫలితాల’కు ఒక రోజుముందే ‘సభ’ను ఏర్పాటు చేయడం ఎందుకని?? ఐదు రాష్ట్రాల ఫలితాల ప్రభావం ప్రతిపక్ష ఐక్యతకు కొంత విఘాతకరం కావచ్చునని చంద్రబాబు నాయుడు అనుమానించాడా? అందువల్ల ఫలితాలు వెలువడక ముందే ప్రతిపక్షాలను ఐక్య ప్రతిజ్ఞాబద్ధులను చేయాలని భావించాడా?? ఒకసారి ‘‘కట్టుబడిన తరువాత’’ ఈ ‘ భాజపా’ వ్యతిరేక పక్షాలు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వల్ల ప్రభావితం కాబోదని విశ్వసిస్తున్నాడా?? స్పష్టం కాలేదు! మంగళవారం నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కనుక అన్ని పార్టీల అగ్రనేతలు సోమవారం ఢిల్లీకి వస్తారు కాబట్టి అందరినీ కూడగట్టడం సులభమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భావించాడా?? ఏమయినప్పటికీ విశ్వాసాలు పెరగడం, విశ్వాసాలు విరగడం రాజకీయాలలో అసహజం కాదు, ఆశ్చర్యకరం కాదు!
భాజపా నాయకత్వంలోని ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైనట్టు ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న అధికాధిక సమస్యలు నిజానికి కాంగ్రెస్ ఆధ్వర్యంలో 2004వ 2014వ సంవత్సరాల మధ్య పుట్టలు పగిలినవే... అవినీతి కావచ్చు, జిహాదీ బీభత్సం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, వాణిజ్యం కావచ్చు. అందువల్ల కేవలం ‘్భజపా’ వ్యతిరేక రాజకీయం ప్రాతిపదికగా మాత్రమే చంద్రబాబు నాయుడు ఊహిస్తున్న ‘కూటమి’ జాతీయ స్థాయిలో ఏర్పడడానికి వీలుంది. చరిత్రలోనే రెండు అతి పెద్ద ‘అవినీతి ప్రక్రియ’లు- రెండవ శ్రేణి దూరవాణి తరంగాల కేటాయింపు, బొగ్గు బరియల కేటాయింపు- కాంగ్రెస్ ప్రభుత్వం వారి వారసత్వం. ‘2జి టెలికామ్ స్పెక్టరమ్’ అవినీతి చరిత్ర ఇంకా ముగిసిపోలేదు. ‘కోల్ బ్లాక్స్’ అవినీతికి కారకులైన కొందరికి ఇటీవల న్యాయస్థానాలలో శిక్షలు పడ్డాయి. ‘అగస్టా వెస్ట్‌లాండ్’ గగన శకటాల కొనుగోలు అవినీతికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రూపకల్పన జరిగింది! ఈ అవినీతి పరిశోధనలో ‘్భజపా’ ప్రభుత్వం కొంతవరకు కృతకృత్యం కాగలిగింది. క్రిష్టియన్ మిచిల్ అనే ‘అగస్టా దళారీ’ని, అవినీతికి ప్రధాన సూత్రధారుడిని ‘యునైట్ అరబ్ ఎమిరేట్స్- ఐక్య ఆరబ్ సంస్థానాలు- యుఏఇ- నుంచి తరలించుకొని రావడం ఇందుకు నిదర్శనం. ఢిల్లీలో ప్రతిపక్ష ఏకతా సదస్సు జరుగుతున్న తరుణంలోనే ‘విజయ్ మాల్యా’ అన్న మరో ఆర్థిక బీభత్సకారుడిని మన దేశానికి తరలించడానికి బ్రిటన్‌లోని సంబంధిత న్యాయస్థానం అంగీకరించింది! బ్యాంకులలో వేల కోట్ల రూపాయలు కాజేసి ఉడాయించిన విజయ్ మాల్యా అవినీతి కలాపాలకు అంకురార్పణ జరిగింది కూడ కాంగ్రెస్ ప్రభుత్వం వారి హయాంలోనే! మాల్యాను తరలించుకొని రాలేదని ఇనే్నళ్లుగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దుయ్యబట్టాయి! విజయ్ మాల్యాను మన దేశానికి తరలించాలని బ్రిటన్ కోర్టు తీర్పుచెప్పడం మన ప్రభుత్వానికి ‘‘గొప్ప విజయమే కాదని’’ ఆషామాషీ ప్రవర్తనకు సజీవ రూపంగా నడయాడుతున్న రాజకీయ విదూషకుడు రాహుల్ గాంధీ సోమవారం వ్యాఖ్యానించాడట! ఇలాంటి రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేయడం వల్ల లభించే లాభమేమిటన్నది చంద్రబాబు వంటి మహా వ్యూహకర్తలు నిర్ధారించుకోదగిన అంశం!
అగస్టా వెస్ట్‌లాండ్ అవినీతికి, విజయ్ మాల్యా అవినీతికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నట్టు ఇలా న్యాయ నిర్ధారితమైంది. ఫ్రాన్స్ నుంచి ‘రాఫేల్’ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడంలో అవినీతి జరిగినట్టు ఏ న్యాయస్థానంలోను ఇంతవరకు ప్రాథమికంగా నిర్ధారణ కాలేదు. ‘అగస్టా’ ఊసెత్తని రాహుల్ ‘రాఫేల్’ గురించి ‘‘నేల నింగి బద్దలు అయ్యే ధ్వనుల’’తో ఆర్భాటంగా ప్రభుత్వ వ్యతిరేక ఆరోపణలు చేస్తున్నారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా లంచాలు పుచ్చుకున్నట్టు తనవద్ద సాక్ష్యాలున్నట్టు ప్రకటించిన రాహుల్ గాంధీ ఈ అబద్ధాన్ని నిజంగా ఋజువుచేయలేకపోయాడు, నవ్వులపాలయ్యాడు! ఆయన మాటలను ప్రజలు నమ్మలేదు, సాటి ప్రతిపక్షాలు నమ్మలేదు. సొంత పార్టీలో విజ్ఞత కలవారు సైతం నమ్మలేదు. ఇలాంటి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని నమ్ముకొని చంద్రబాబు నాయుడు రాజకీయ గోదావరిని ఈదగలడా? విజయతీరం చేరగలదా?? బోఫోర్స్ అవినీతిని నడిపిన ఇటలీ దళారి ఒట్టావియో కుత్రోచీని కాని, బోఫాల్‌లో విషవాయువును ‘చిమ్మిన’ అమెరికా దళారి వారెన్ ఆండర్‌సన్‌ను కాని కాంగ్రెస్ ప్రభుత్వం తరలించుకొని రాలేదు. వారిద్దరూ జీవితాంతం విదేశాలలో హాయిగా గడిపేయడం చరిత్ర.. జనం గమనిస్తున్నారు? అవినీతి గురించి మాట్లాడడానికి నైతిక ప్రాతిపదిక ఏమిటి?? రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేసిన చరిత్ర ఎవరిదన్నది బహిరంగ రహస్యం. విధాన విభేదాల కారణంగా ఊర్జిత్ పటేల్ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ పదవికి రాజీనామా చేసి ఉండినప్పటికీ ఈ విధాన విభేదాలు కాంగ్రెస్ ప్రభుత్వం నాటి వారసత్వం! ‘ప్రపంచీకరణ’ సృష్టించిన స్వేచ్ఛా విపణి ఫలితం! దీని వ్యవస్థీకరణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ఘనకార్యం! పెట్టుబడులు ప్రధానమన్నది ప్రభుత్వ విధానం! ఈ విధానం కాంగ్రెస్ ప్రభుత్వం నాటిది, ‘్భజపా’ ప్రభుత్వం కొనసాగిస్తోంది.. దీనికి భిన్నంగా ద్రవ్యోల్బణాన్ని, ధరలను తగ్గించాలని రూపాయి విలువ దిగజారకుండా నిరోధించాలని ‘రిజర్వ్ బ్యాంక్’ అప్పుడూ భావించింది, ఇప్పుడూ భావిస్తోంది!
అందువల్ల తమ సమైక్య బంధాన్ని బలపరచుకొనడానికి, ప్రభుత్వాన్ని నిందించడానికి ఊర్జిత్ పటేల్ నిష్క్రమణను ఆయుధంగా మార్చుకోవాలన్న ప్రతిపక్ష వ్యూహం అతార్కికమైనది, అర్థం నిది.. ‘ప్రపంచీకరణ’ మన నెత్తికెక్కి తొక్కుతుండడానికి కాంగ్రెస్, భాజపాలు సహా దేశంలోని వివిధ రాజకీయ పక్షాలు కూడ బాధ్యత ఉంది. దురాక్రమణ రూపమైన చైనా దేశపు సంస్థలకు ఆర్థిక వ్యవస్థను అప్పగించడానికి ఒప్పందాలను కుదుర్చుకుంటున్న వారికి దేశహితం గురించి మాట్లాడే నైతిక అధికారం ఉందా? ప్రభుత్వ పక్షాలు ప్రతిపక్షాలు ఆత్మమథనం చేసుకొని సమాధానం చెప్పాలి! వీటన్నింటినీ కప్పిపుచ్చి ‘్భజపా’ వ్యతిరేకులను కూడగట్టడానికి సోమవారం చంద్రబాబు జరిపిన యత్నం మరో కృత్రిమ సమైక్య చిహ్నం! మమతా బెనర్జీని, కమ్యూనిస్టులను కలపగలరా? కేజ్రీవాల్‌ను, రాహుల్ గాంధీని ఒకే కూటమిలో చేర్చగలరా? ఉత్తరప్రదేశ్‌లో కలిసిన సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ ఢిల్లీలో చంద్రబాబు నడిపిన సభకు రాలేదు..!!