సంపాదకీయం

హంతకులకు విముక్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటలీకి చెందిన హంతక నావికులకు అనుకూలంగా ఐక్యరాజ్యసమితి ‘మధ్యవర్తిత్వ శాశ్వత న్యాయ మండలి’ - పర్మినెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ - మధ్యంతర నిర్ణయాన్ని ప్రకటించడం ఆశ్చర్యకరం కాదు. ఐరోపా దేశాల దురహంకార పూరితమైన దౌత్య దౌర్జన్యం ఈ వ్యవహారంలో మొదటినుంచీ కొనసాగుతుండడం ఇందుకు మొదటి కారణం. మన కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్యపరమైన విధానం రెండవ కారణం! 2012 ఫిబ్రవరి పదిహేనవ తేదీన ‘మసిమిలియానో లాటోరే’, ‘సాల్వటోరే గిరానే’ అన్న ఇటలీ నావికులు చేతుల దురద తీర్చుకొనడానికై మన దేశానికి చెందిన ఇద్దరు జాలర్లను హత్య చేశారు. భారతీయులను చిన్నచూపు చూడడం, వెక్కిరించడం, అపహాస్యం చేయడం, అవమానించడం, హత్యలు చేయడం ఐరోపావారి శతాబ్దుల బీభత్స స్వభావం! ఈ భయంకర రాక్షస ప్రవృత్తి కారణంగానే ఐరోపాకు చెందిన వివిధ దేశాల వారు శతాబ్దాల తరబడి మన దేశాన్ని ఆర్థికంగా, భౌగోళికంగా, సాంస్కృతికంగా, వ్యూహాత్మకంగా దురాక్రమించారు. భౌగోళక దురాక్రమణ ముగిసినప్పటికీ మిగిలిన దురాక్రమణలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మసిమిలియానో, సాల్వటోరే అనే ఈ దుండగులు మన జాలర్లను హత్య చేయడం సాంస్కృతిక దురాక్రమణలో భాగం. తెల్లతోలు కప్పుకున్న నల్లని హృదయాల ఇటలీ వారికి, ఐరోపా వారికి భారతీయతపట్ల కొనసాగుతున్న తరతరాల విద్వేషం ఈ సాంస్కృతిక దురాక్రమణ ప్రాతిపదిక. ఐరోపా వారికి తమ ప్రాణాలు అమూల్యమైనవి కానీ భారతీయులు, వర్థమాన దేశాల ప్రజలు వారి దృష్టిలో అనాగరికులు. అందువల్ల చేతుల దురద తీర్చుకొనడానికి, రాక్షసానందం అనుభవించడానికి వీలుగా నిష్కారణంగా భారతీయులను హత్య చేయడం తప్పుకాదన్న పాశ్చాత్యుల సమిష్టి దురహంకార స్వభావం! శతాబ్దుల నాటి ఈ వారసత్వం నిండిన ఈ ‘లాటోరే’, ‘గిరానే’ అన్న దుండగులు అందువల్లనే కేరళ సముద్రతీరంలోని మన సార్వభౌమ జలాల -టెరిటోరియల్ వాటర్స్ -లోకి చొచ్చుకొని వచ్చి హత్యలు చేశారు. తమ నౌకను చూసి దారి వదలి, దూరంగా వెళ్లడానికి ప్రయత్నించిన జాలర్ల పడవ మీదికి ఇటలీ నావికులిద్దరూ కాల్పులు జరిపారు. ఫలితంగా ఇద్దరు భారతీయులు హతులయ్యారు. అప్పటినుంచి ఇప్పటివరకూ ఇటలీ ప్రభుత్వం, ఐరోపా సమాఖ్యవారు ఈ వ్యవహారంలో అక్రమంగా జోక్యం చేసుకుంటూ ఉండడం వ్యూహాత్మక దురాక్రమణకు నిదర్శనం. ఇప్పుడీ మధ్యవర్తిత్వ న్యాయస్థానం తీర్పు పరాకాష్ఠ...
ఈ హత్యలు మన సార్వభౌమ జలాలలో జరిగాయి. అందువల్ల ఈ అభియోగాల విచారణ మన న్యాయస్థానాల పరిధిలో మాత్రమే జరగాలి. కానీ మన సార్వభౌమ జలాలలో హత్యలు జరిగాయా లేదా అన్న అనుమానాన్ని ఆది నుంచి మన ప్రభుత్వం వ్యక్తం చేయడమే ఘోరమైన వైపరీత్యం. అందువల్లనే ఇటలీ ప్రభుత్వం కాని ఐరోపా సమాఖ్య వారు కానీ దౌత్యదౌర్జన్య కాండకు ఒడిగట్టడానికి వీలయింది. మసిమిలియానో లాటోరే ఇదివరకే ఇటలీకి జారుకున్నాడు. ‘‘నేను భారతదేశానికి తిరిగి వెళ్లను...’’ అని అతగాడు ఇదివరకే ప్రకటించాడు. ఇతగాడి ఈ చర్యను సమర్ధించడం ద్వారా ఇటలీ ప్రభుత్వం అంతర్జాతీయ దౌత్య నియమాలను బాహాటంగా ఉల్లంఘించింది; దాదాపు నాలుగు నెలలుగా మొరాయించిన లాటోరేను తిరిగి రప్పించడానికి మన ప్రభుత్వం చేసింది సున్నా. గతంలో బెయిల్‌పై ఇటలీకి వెళ్లిన ఈ హంతకులిద్దరూ తిరిగి మన దేశానికి రాబోమని మొరాయించారు. మన ప్రభుత్వం అప్పుడు కూడా చతికిలపడి వౌనంగా ఉండిపోయింది. అయితే మన సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంది. నిందితులిద్దరూ మన దేశానికి తిరిగి వచ్చేవరకూ మన దేశంలోని ఇటలీ రాయబారి ‘డేనియల్ మాన్‌సినీ’ స్వదేశానికి వెళ్లటానికి వీలు లేదని ఆదేశించింది. దాంతో ఇటలీ ప్రభుత్వం దిగి వచ్చింది. హంతక నావికులు తిరిగివచ్చారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో ఇటలీకి వెళ్లిన మసిమిలియానో 2015 ఏప్రిల్ నుంచి అక్కడే ఉండిపోయాడు. అతగాడు తిరిగి రావడానికి నిరాకరించిన తరువాత ఐదు నెలలు గడిచాయి. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు వెలువడే వరకూ వేచి ఉండాలని మన ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పడం మరింత దిగ్భ్రాంతికరం. ఇప్పుడు ఆ అంతర్జాతీయ న్యాయ నిర్ణయం వెలువడింది. మన దేశంలో ఉన్న హంతకుడు కూడా చల్లగా జారుకోవడానికి వీలు ఏర్పడింది!
గత ఏడాది చివరిలో ఈ ‘అంతర్జాతీయ న్యాయ మండలి’ కెక్కిన ఇటలీ ప్రభుత్వం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ‘మసిమిలియానో’ భారత్‌కు తిరిగి వెళ్లడని ప్రకటిస్తూనే ఉంది. అంటే అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పుతో నిమిత్తం లేదన్న మాట! ఈ ‘అంతర్జాతీయ న్యాయ మండలి’కి ఈ వివాదాన్ని విచారించే అధికారం ఈ దశలో లేదు. ఈ అధికార పరిధి లేని విషయాన్ని ప్రస్తావించకపోవడం మన ప్రభుత్వం వారి మరో వైఫల్యం. మన న్యాయస్థానాలలో వివాదం ముగిసి తుది తీర్పు వెలువడిన తరువాత మాత్రమే ఇటలీ ఈ అంతర్జాతీయ న్యాయ మండలిని ఆశ్రయించవచ్చు. కానీ మన ప్రభుత్వం ఈ న్యాయనియమాన్ని ప్రస్తావించకపోవడంతో అంతర్జాతీయ ‘మండలి’కి లేని అధికారం దక్కిపోయింది! ఒక దేశంలో నేరాలు చేసిన మరో దేశపు పౌరులను విచారించి శిక్షించే అధికారం నేరం జరిగిన దేశాల న్యాయస్థానాలకే ఉంది! వందలాది మంది భారతీయ పౌరులు విదేశాలలో అభియోగాలకు గురి అయి ఆ దేశాలలోని న్యాయస్థానాలలోనే దోషులుగాను నిర్దోషులుగాను నిగ్గుతేలడం చరిత్ర. మన ప్రభుత్వం ఇలా విచారణ దశలోనే అంతర్జాతీయ ‘మధ్యవర్తిత్వ మండలి’ని ఆశ్రయించిన చరిత్ర లేదు.
ఎండ్రికా యాలెక్సీ అన్న ఇటలీ నౌకలో పయనిస్తుండగా నిందితులు 2012 ఫిబ్రవరి 15న పట్టపగలే ఈ హత్యలు జరిపారు. నిరాయుధులైన జాలర్లను తాము ఓడ దొంగలని భావించినట్టు ఆ తరువాత వారు అబద్ధం చెప్పారు. ఈ పచ్చి అబద్ధాన్ని నిజమని ఇటలీ ప్రభుత్వం ప్రచారం చేసింది. నేరస్థులిద్దరినీ నిర్నిబంధంగా విడుదల చేసి ఇటలీకి పంపించాలని ఐరోపా పార్లమెంటు తీర్మానించడం నేరపూరితమైన నిర్లజ్జాకరమైన దౌత్య దౌర్జన్యానికి నిదర్శనం. కానీ 2012 ఏప్రిల్ 21న అడిషనల్ సొలిసిటర్ జనరల్ హరీన్ రావత్ సుప్రీంకోర్టులో ‘ఇటలీ తరఫున వాదించడమే’ దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిన ఘటన. నేరం భారతీయ జలాలలో కాక అంతర్జాతీయ జలాలలో జరిగిందని రావత్ చెప్పడంతో విస్మయానికి గురి అయిన సుప్రీం న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని మందలించడం అప్పటి కథ....