సంపాదకీయం

వాణిజ్య మాయ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లావణ్య వాణి- స్మార్ట్ ఫోన్- దేశంలోని జనమంతా కొని తీరవలసిన అనివార్యం ఏర్పడిపోవడం ‘ప్రపంచీకరణ’ప్రగతికి నిదర్శనం. భారతదేశంలోని పల్లెలో రావిచెట్లూ వేప చెట్లూ ఉండేవి, గడ్డివాములూ పేడ కుప్పలూ కనిపించేవి! బెల్లం తయారుచేసే గానుగ ఇళ్లూ, భజనలు చేయడానికి పందిళ్లు కనిపించేవి. ఇంటి బయట కూచున్న వారిని మామిడి పువ్వుల వాసనలు, మల్లెపువ్వుల సుగంధాలు, మకరందాల పరిమళాలు పరవశింప చేసేవి! ఇంటి లోపల ఉన్న వారిని వంట ఇంటి మాధుర్యాలు మైమరపించేవి. ‘ప్రపంచీకరణ’ చెట్లను హతమార్చింది, విద్యుత్ ధ్వజ స్తంభాలు వెలశాయి, సంచారవాణి సిమెంటు ఉక్కు లోహాల గోపురాలు వెలశాయి. బెల్లం తయారు కావడం లేదు, చెఱకును దూర ప్రాంతాలలోని కర్మాగారాలకు తరలించుకుని పోతున్నారు. భజనలు చేయడం అనాగరికమైంది, ‘రికార్డు డాన్సులు’ నాగరికమైంది... ‘ప్రపంచీకరణ’ రూపొందించిన ‘పుడమిపల్లె’ మద్యం వాసనలతో మత్తెక్కిపోతోంది, అర్ధరాత్రి వరకు ‘డాన్స్’ చేస్తోంది! ఆవులను పశువులను దూడలను కోడెలను హత్యచేసి డబ్బాలలో భద్రపరచి విదేశాలకు ఎగుమతి చేసేశారు. అందువల్ల ‘పుడమిపల్లె’లో పేడ కుప్పలు లేవు. గడ్డి తినడానికి ఆవులు పశువులు లేవు. కనుక గడ్డిని తగలబెడుతున్నారు. పొగచూరి ఉండడం ‘పుడమిపల్లె’- గ్లోబల్ విలేజ్- నైజం! పొగ లేని పొయ్యిలు వచ్చాయన్న ‘మురెపం’ మూలపడి పోయింది. వంట ఇల్లులేని- కిచెన్‌లెస్- అంతస్థుల భవనాలు ‘పుడమిపల్లె’ను ఊపిరి ఆడని సిమెంటు పెట్టెగా మార్చి ఉన్నాయి. అందువల్ల వండిన కూరలమ్మే దుకాణాల - కర్రీ పాయింట్స్- నుంచి పదార్థాలు కొని తెచ్చుకోవడం ‘పుడమిపల్లె’ నాగరికం. పూర్వం సంచులు పట్టుకొని కూరగాయల సంతకు, కిరాణాకొట్టుకు వెళ్లినవారు ప్రస్తుతం ‘డబ్బా’లను పట్టుకొని ‘కర్రీ పాయింట్ల’వద్ద కొలువుతీరుతున్నారు. ‘మధుమేహగ్రస్తులు’ రొట్టెలూ, చేదు వంటకాలు సైతం ఈ ‘కర్రీ పాయింట్ల’వద్ద కొనేసి ఇంటికి తీసుకొచ్చి తినేస్తున్నారు. మధుమేహం లేని వారు మాత్రం ‘విద్యుత్ ఆవిరి పాత్రల’- ఎలక్ట్రిక్ కుక్కర్స్-లో ‘‘ఇన్ని బియ్యం పడేసుకుంటున్నారు’’-అట!! ప్రపంచీకరణ ముదురుతున్నకొద్దీ ‘‘కిరాయి నాగరికం’’ మరింత ముదురుతోంది! ‘‘కర్రీ పాయింట్ల’’వద్దకు మనం పోనక్కరలేదు! ‘తరంగ పంక్తి’- ఆన్‌లైన్- మాధ్యమం ద్వారా ‘్భజనాలు’ ఇంటికే తెచ్చిపెడుతున్న ఘరానా పంపిణీ సంస్థలు వెలసిపోయాయి. అందువల్ల వంటచేయని ఇళ్లలోనివారు అన్నం తినాలంటే ‘లావణ్య వాణి’ ఉండడం అనివార్యం- టిక్కు టిక్కు మని మీటలు నొక్కిన తరువాత అరగంట లోగా మన ఇంటికి ‘ఆన్‌లైన్’ భోజనం వచ్చేస్తుంది. ‘ప్రపంచీకరణ’కు పూర్వం చిన్నచిన్న భోజనశాలల వారు ఇళ్లకు భోజనం సరఫరా చేసేవారు. ఈ చిన్న భోజనశాలలు మూతపడ్డాయి, ఈ చిల్లర యజమానులు ఇప్పుడు ఘరానా ‘్భజన’ వినిమయ సంస్థలలో కూలీలు.. ఈ భోజనాలు పంపిణీ చేస్తున్న సంస్థలు విదేశాలకు చెందిన ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’- మల్టీ నేషనల్ కంపనీస్!- భారతదేశంలో భారతీయత ఆనవాళ్లు సైతం మిగలరాదన్నది బహుళ జాతీయ వాణిజ్య సంస్థల లక్ష్యం, ప్రపంచీకరణ లక్ష్యం, ‘స్వేచ్ఛా విపణి’- మార్కెట్ ఎకానమీ- లక్ష్యం.. పుడమిపల్లె- గ్లోబల్ విలేజ్- లక్ష్యం....!
భోజనం చేయడానికి మాత్రమే కాదు, ఏ వస్తువులను కొనుగోలు చేయాలన్నా కూడ ‘లావణ్యవాణి’ మనవద్ద ఉండడం అనివార్యం అయిపోయింది. భారతీయుల జీవన విధానాన్ని, మానసిక స్వభావాన్ని ‘బహుళ జాతీయ సంస్థలు’ నియంత్రిస్తున్నాయన్న వాస్తవానికి ‘లావణ్య వాణి’ విస్తరణ ప్రత్యక్ష ప్రమాణం! బస్సులలో ప్రయాణించలేనివారు, ప్రయాణించరాదని భావిస్తున్న నాగరికులు సొంత వాహనాలలో ప్రయాణిస్తున్నారు. సొంత వాహనాలు లేని నాగరికులు ఆటోరిక్షాలలో, టాక్సీ-కార్-లలో వెళ్లడం సర్వసాధారణం! ఈ సర్వసాధారణ వ్యవహారాన్ని ఇప్పుడు ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ నియంత్రిస్తున్నాయి. ‘ఓలా’ ‘ఉబర్’ వంటి రవాణా సంస్థలు నియంత్రిస్తున్నాయి. ఈ నియంత్రణ నిరంతరం పెరుగుతుండడానికి ప్రభుత్వ నిర్వాహక రాజకీయ పక్షాలు కారణం. కొంతమంది అధికార రాజకీయవేత్తలకు ఈ రవాణా సంస్థలలో భాగస్వామ్యం- వాటా- ఉందన్న ప్రచారం కూడ జరుగుతోంది. అందువల్ల ‘ఓలా’, ‘ఉబర్’ వంటి సంస్థలు జరుపుతున్న అక్రమాలను ప్రభుత్వాలు పట్టించుకోవు. ప్రయాణీకులు ఈ అక్రమాలకు బలికావడం శాశ్వత వ్యవస్థగా మారుతోంది. ‘టాక్సీ’ని ‘కాబ్’ అని పిలవడం బ్రిటన్‌పై అమెరికా సాధించిన ఆధిపత్యానికి చిహ్నం! మనకు ‘క్యాబ్’ కావాలంటే ‘రోడ్డు’మీద కాని, ‘స్టాండ్’లో కాని దొరకదు. గతంలోవలె ఖాళీగా వెడుతున్న ‘కారు’ను పిలిచి ‘కిరాయి’కి కుదుర్చుకొనడానికి వీలులేదు. ‘లావణ్య వాణి’ ద్వారాకానీ ‘కంప్యూటర్ సిస్టమ్’ద్వారా కాని ‘ఆన్‌లైన్’లో ‘క్యాబ్’ను మాట్లాడుకోవాలి, కుదుర్చుకోవాలి! ‘‘నీ వద్ద స్మార్ట్ఫోన్ లేదు, నీకు ‘కాబ్’ దొరకదు. నగరంలో నీవు ప్రయాణం చేయలేవు.’’ బహుళ జాతీయ వాణిజ్య సంస్థల మారీచ మృగమాయాజాలం విస్తరిస్తున్న తీరు ఇది!
క్రమంగా ఆటోరిక్షాలు కూడ ‘లావణ్య వాణి’ ద్వారా కుదుర్చుకోవలసిన పరిస్థితి దాపురిస్తోంది. హైదరాబాద్‌లో ‘ఆటోరిక్షా’లో పయనించడానికి ప్రభుత్వం నిర్ధారించిన కనీసపు శుల్కం ఇరవై రూపాయలు.. కానీ ‘ఓలా’ సంస్థవారు ఈ కనీసపు శుల్కాన్ని ఇరవై తొమ్మిది రూపాయలు చేశారు! ఇలా వాణిజ్య సంస్థలు ‘అతి ప్రభుత్వం’- సూపర్ గవర్నమెంట్-గా మారుతున్నాయి. ప్రభుత్వ నియంత్రణ నుండి పరిపాలన ‘బహుళ జాతీయ సంస్థల’ నియంత్రణలోకి పోతోంది. జనం వాణిజ్య సంస్థల అదుపాజ్ఞలకు లోబడి బతకవలసిన దుస్థితి దాపురించి ఉండడం ‘మార్కెట్ ఎకానమీ’- స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ-!! ‘‘మేము నియంత్రించబోము. గిరాకీ లభ్యత ఆధారంగా ధరలు నిర్ణయం అవుతాయి..’’ అని కేంద్ర ప్రభుత్వం వారు ఇరవై ఏళ్లుగా స్పష్టం చేస్తున్నారు. అందువల్ల బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు కృత్రిమంగా ‘గిరాకీ’ని పెంచి దోచిపారేస్తున్నాయి! ఇది మొదట దేశ వ్యతిరేక పరిణామం.. రెండవది భారతీయ సంస్థలను విదేశీయ సంస్థల వారు కొనుగోలు చేస్తుండడం! ‘్ఫ్లప్‌కార్ట్’ అన్న భారతీయ సంస్థను అమెరికా వారి ‘వాల్‌మార్ట్’ కొనేయడం ఒక ఉదాహరణ మాత్రమే! చిల్లర వ్యాపారాన్ని ‘అమెజాన్’ ‘వాల్‌మార్ట్’ నియంత్రించడం మొదలైపోయింది!! ‘‘భారత్‌లో నిర్మించండి’’- మేక్ ఇన్ ఇండియా- అన్నది ప్రభుత్వ నినాదం! ‘‘భారత్‌ను బద్దలు కొట్టడం’’ -బ్రేక్ ఇండియా- అన్నది అమలు జరుగుతున్న ఘోరం!
నెజల్- నెస్‌లే- అన్న విదేశీయ సంస్థ విష రసాయనాలు నిండిన సేమ్యా- నూడుల్-లను దశాబ్దులపాటు మన నోళ్లకెత్తింది. ప్రజలను రోగగ్రస్తం చేసింది. ప్రభుత్వాలు చూస్తూ ఉండిపోవడం నడచిన చరిత్ర. ఇప్పుడు ‘జాన్సన్ అండ్ జాన్సన్’ అన్న బహుళ జాతీయ సంస్థ దశాబ్దుల తరబడి ‘కాన్సర్ వ్యాధిని కలిగించడానికి ‘కృషి’ చేసినట్టు బయటపడింది. ఈ సంస్థను అమెరికా న్యాయస్థానాలు ఇదివరకే శిక్షించాయి. ‘జాన్సన్ అండ్ జాన్సన్’ సంస్థ తయారుచేసి విక్రయిస్తున్న ‘సౌందర్య లేపనం’- టాల్కమ్ పౌడర్-లో కాన్సర్ రోగాన్ని కలిగించే ‘ఖనిజ ధాతువులు’ కలసి ఉన్నాయట.. అమెరికాలో అలజడి జరిగిన తరువాత మాత్రమే ఇప్పుడు మన ప్రభుత్వం ‘నిఘా’ నిద్దుర లేచింది...