సంపాదకీయం

ఏ జట్టులో ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఒరిస్సాను సందర్శించడం రాజకీయాలతో సంబంధం లేని ‘అధికార’ కార్యక్రమం కావొచ్చు. అందువల్ల ఆదివారం ఒరిస్సా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు జరిపిన సమావేశం ప్రధాని పర్యటనకు విచిత్ర నేపథ్యం. చంద్రశేఖరరావు ఒరిస్సా ముఖ్యమంత్రితో జరిపిన సమావేశానికి రాజకీయాలతో సంబంధం ఉంది. ప్రధాని పర్యటన, చంద్రశేఖరరావు పర్యటన సమాంతర పరిణామాలు అయినప్పటికీ వీటి మధ్య సంబంధం లేదు. ఒరిస్సాలోని పరదీప నుంచి తెలంగాణలోని హైదరాబాద్ శివారులోని మల్కాపూర్ వరకూ నిర్మాణం కానున్న ఇంధన సరఫరా గొట్టపు నిర్మాణ శిలాన్యాస - పునాది వేయడం - కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొనడమే. పనె్నండు వందల పనె్నండు కిలోమీటర్ల ఈ గొట్టపు మార్గం గుండా పెట్రోల్, డీజెల్ నూనె, కిరోసిన్, విమాన ఇంధనం వంటి ఇంధన సరఫరా అవుతుందట. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఈ ఇంధన అనుసంధానానికి రాజకీయ ప్రాధాన్యం లేదు. చంద్రశేఖరరావు, నవీన్ పట్నాయక్‌ల మధ్య జరిగిన చర్చలకు రాజకీయ ప్రాధాన్యం ఉంది. అందువల్లనే సోమవారం మోదీ జరిపిన ఒరిస్సా పర్యటనకు ఆదివారం భువనేశ్వర్‌లో జరిగిన ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం విచిత్రమైన నేపథ్యం. ఈ సమావేశం వల్ల తెలంగాణ రాష్ట్ర సమితికీ, బిజూ జనతాదళ్‌కూ మధ్య స్పష్టమైన పొత్తు కుదిరిందా? అన్నని ధ్రువపడలేదు. కానీ జాతీయ స్థాయిలో చంద్రశేఖరరావు ఏర్పాటుచేయ తలపెట్టిన ప్రాంతీయ రాజకీయ పక్షాల ఫెడరల్ - సమాఖ్య - కూటమి నిర్మాణానికి ఆదివారం ‘శంకుస్థాపన’ జరిగినట్టయింది. సోమవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో చంద్రశేఖరరావు చర్చలు జరపడంలో ‘సమాఖ్య కూటమి’ నిర్మాణ సంభాషణలు ముమ్మరమయ్యాయి. అయితే భారతీయ జనతాపార్టీకి, కాంగ్రెస్‌కు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత ఏర్పాటుచేయ తలపెట్టిన సమాఖ్య కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ చేరుతుందా? అన్న ప్రశ్నకు సోమవారం కలకత్తాలో సమాధానం లభించలేదు. చర్చలు ముమ్మరమయ్యాయని మాత్రమే తెలంగాణ ముఖ్యమంత్రి కలకత్తాలో చెప్పడంతో రాజకీయ ఉత్కంఠతో ఊపిరాడక సతమతమవుతున్న కుతూహలగ్రస్తులు గొప్ప నిరాశకు గురి అయ్యారు.
కాంగ్రెస్‌కూ, భాజాపాకు కూడా వ్యతిరేకంగా ఏర్పడే సమాఖ్య కూటమి ఏమి సాధించగలదన్నది రాజకీయ ఉత్కంఠను రేకెత్తిస్తున్న మొదటి సమస్య. కాంగ్రెస్ కాని, భాజాపా కాని లేకుండా కూటమి ఏర్పాటుచేయడానికి లక్ష్యం 2019 ఎన్నికల తరువాత కేంద్రంలో ‘భాజాపా’ లేని ‘భాజాపా’ మద్దతు లేని, కాంగ్రెస్ లేని, కాంగ్రెస్ మద్దతు లేని ప్రభుత్వం ఏర్పడటం. ఇలాంటి ప్రభుత్వం ఏర్పడిన దాఖలా 1952లో మొదటి లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పటినుంచి లేదు. అందువల్ల 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్, భాజపాలు లేని ప్రభుత్వాన్ని చంద్రశేఖరరావు నిర్మించ తలపెట్టిన ‘కూటమి’ వారు ఏర్పాటుచేయగలిగితే అది భారత రాజకీయ చరిత్రలో ‘అత్యద్భుతం’ కాగలదు. కానీ ఇలాంటి ‘అతి అద్భుతం’ సంభవించాలంటే ఈ ఏర్పడనున్న సమాఖ్య కూటమి - ఫెడరల్ ఫ్రంట్ -కి ఐదువందల నలభై మూడు స్థానాల లోక్‌సభలో కనీసం రెండువందల డెబ్బయి రెండు స్థానాలు లభించడం తప్పనిసరి. అందువల్ల ఇన్ని స్థానాలను ఎలా గెలవగలరన్నది ‘సమాఖ్య కూటమి’ తరపున చంద్రశేఖరరావు సమాధానం చెప్పదగిన ప్రశ్న! ‘సమాఖ్య కూటమి’లో - భాజాపా, భాజాపా మిత్రపక్షాలు; కాంగ్రెస్, కాంగ్రెస్ మిత్రపక్షాలు మినహా - ఏయే రాజకీయ పక్షాలు చేరనున్నాయి? ఈ ప్రశ్నకు చంద్రశేఖరరావు ఇప్పుటికిప్పుడే సమాధానం చెప్పకపోయినప్పటికీ సమాధానం ఆయనకు తెలిసి ఉండాలి. కలకత్తాలో మమతా బెనర్జీతో కలిసి మాధ్యమ ప్రతినిధులతో చంద్రశేఖరరావు మాట్లాడిన సందర్భంగా ధ్వనించిన ప్రశ్న ఇది.
తెలంగాణ ముఖ్యమంత్రి తన ‘సమాఖ్య కూటమి’ నిర్మాణం కోసం సంప్రదిస్తున్న రాజకీయ పక్షాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సంప్రదిస్తున్నాడు. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం కాంగ్రెస్‌తో జట్టు కట్టి ఉంది. అందువల్ల ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న ‘్భజాపా’కు లేదా ‘్భజాపా’ నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య సంఘటన -ఎన్‌డీఏ -కు వ్యతిరేకంగా రెండు కూటములు రూపొందబోతున్నాయన్నది మాత్రమే ఇప్పటివరకు స్పష్టంగా ప్రస్ఫుటించిన రాజకీయ వాస్తవం. ఈ రెండు కూటములు కూడ పరస్పరం విరోధిస్తున్నాయి కాబట్టి జాతీయస్థాయి ఎన్నికలలో ముక్కోణపు పోటీ నెలకొంటుందన్నది ‘కుతూహలగ్రస్తులు’ చేస్తున్న విశే్లషణ. ఇలాంటి ముక్కోణపు పోటీవల్ల ఎవరికి లాభం? అన్న విషయమై కూడ ఎలాంటి స్పష్టత లేదు. అందువల్ల ఈ ‘సమాంతర’ కూటముల ఏర్పాటువల్ల - చంద్రశేఖరరావు కూటమి, చంద్రబాబు కూటమి - ఈ రెండు కూటములలో దేనికి కూడా 2019నాటి ఎన్నికల తరువాత లోక్‌సభలో ‘సంఖ్యాధిక్యం’ - మెజారిటీ - ఉండబోదన్నది స్పష్టం. అందువల్ల ఈ కూటములు స్వయంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయడం మాత్రం అసాధ్యం! చంద్రబాబు నాయుడి కూటమికి, చంద్రశేఖరరావు కూటమికి మధ్య - ఈ కూటములు ఏర్పడితే వైరుధ్యం కొనసాగుతుంది కనుక ఎన్నికల తరువాత ఈ కూటములు ‘్భజాపా’కు వ్యతిరేకంగా సహకరించుకునే అవకాశం కూడ లేదు!
కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, బిహార్, ఝార్‌ఖండ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హిమాచల్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలలో భాజాపాకు, కాంగ్రెస్‌కు మధ్య, లేదా ఈ పార్టీలు భాగస్వాములుగా ఉన్న కూటముల మధ్య మాత్రమే ప్రధానంగా ‘పోరు’ జరుగనుంది. ఓటర్లు ఈ ప్రాంతాలలో సమీకృతమై ఉన్నారు. అందువల్ల ఈ ప్రాంతాలలోని ఏ పార్టీలు చంద్రశేఖరరావు ప్రతిపాదిస్తున్న కూటమిలో చేరగలవు? ఉత్తరప్రదేశ్‌లో ‘్భజాపా’ తిరుగులేని శక్తి! అందువల్ల మాయావతి నాయకత్వంలో బహుజన సమాజ్ పార్టీ, ములాయంసింగ్ యాదవ్ తనయుడు అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ కూటమిగా ఏర్పడి భాజాపాను ఓడించే ప్రయత్నాలు ఆరంభించాయి. ఈ రెండు పార్టీలు కూడ మధ్యప్రదేశ్‌లోను, రాజస్థాన్‌లోను కాంగ్రెస్ ప్రభుత్వాలకు మద్దతునిస్తున్నాయి. అందువల్ల మాయావతి పార్టీని, అఖిలేష్ యాదవ్ పార్టీని చంద్రశేఖరరావు తన సమాఖ్య కూటమిలో చేర్చగలడా? చేర్చగలిగితే అది మరో అత్యద్భుతం కాగలదు.
తెలంగాణ ముఖ్యమంత్రి తన జాతీయస్థాయి కూటమి ఏర్పాటు గురించి మొదట చర్చలు జరిపింది మమతా బెనర్జీతోనే. ఆయన గత మార్చి నెల మూడవ తేదీన మొదటిసారి ‘తృతీయ కూటమి’ని ప్రతిపాదించారు. అదే నెల ఏడవ తేదీన చంద్రబాబునాయుడు తమ పార్టీని ఎన్‌డిఏనుంచి ఉపసంహరించుకున్నాడు. ఈ సమాంతర పరిణామాల పట్ల హర్షం ప్రకటించిన మమతా బెనర్జీ ఇటు చంద్రశేఖరరావుతోను, అటు కాంగ్రెస్ అధిష్ఠానంతోను చర్చలు జరుపుతోంది. జాతీయ కూటమికి నాయకత్వం వహించండి అని ఆమెని - కర్నాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణం చేసిన సందర్భంగా - చంద్రబాబు కోరినట్టు అప్పుడు ప్రచారమైంది. మార్చి 18న చంద్రశేఖరరావు కలకత్తాకు వెళ్లి మమతా బెనర్జీతో చర్చలు జరిపాడు. అదే నెల 28న బెనర్జీ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చలు జరిపింది. సోమవారం చంద్రశేఖరరావుతో కలిసి మాధ్యమ ప్రతినిధులకు కనిపించిన ‘బెంగాల్ బెనర్జీ ఏమి చెప్పింది?? చంద్రశేఖరరావు ‘ద్రవిడ మునే్నట్ర కజగం’ నాయకులతోను, లౌకిక జనతాదళ్ నాయకులతోను కూడా చర్చలు జరిపారు. ద్ర.ము.క. నాయకుడు ఎం.కె.స్టాలిన్ రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని పగటి కల కంటున్నాడు. లౌకిక జనతాదళ్, కాంగ్రెస్ కలసి కర్నాటకలో ప్రభుత్వం నడుపుతున్నారు... చంద్రశేఖరరావు ఎవరిని నమ్మాలి??