సంపాదకీయం

రక్షణ వారధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అస్సాం, అరుణాచల్ ప్రాంతాలను కలుపుతూ బ్రహ్మపుత్ర నదిపై నిర్మాణమైన ‘యోగీవేల’ - బోగీబీల్ - వారధిపై రాకపోకలు మంగళవారం లాంఛనంగా ప్రారంభం కావడం ఈశాన్య క్షేత్ర వౌలిక ప్రగతికి మరింత దోహదకరం. చైనా మన దేశానికి వ్యతిరేకంగా కొనసాగిస్తున్న వ్యూహాత్మక, ఆర్థిక, భౌతిక, సాంస్కృతిక దురాక్రమణను ప్రతిఘటించడానికి మన ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ వంతెన నిర్మాణం మరో చారిత్రక విజయం. అస్సాంలోని దిబ్రూగఢ్‌నుంచి అరుణాచల్‌లోని ధీమాజీని కలుపుతూ నిర్మితమైన ఈ రెండు అంతస్థుల ఉక్కు వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించడం మరో చారిత్రక ఘట్టం! కింది అంతస్థులలో ‘ఇనుప దారి’ - రైలుమార్గం - పై అంతస్థులలో ‘రహదారి’ ఏర్పడి ఉన్న ఈ వంతెన దేశంలో అంత్యంత పొడవైన నదీ వారధి. నాలుగు కిలోమీటర్ల తొమ్మిదివందల నలభైమీటర్ల మేర నిర్మించిన ఈ వంతెన వల్ల దిబ్రూగఢ్ పట్టణానికీ, అరుణాచల్ రాజధాని ఇటానగర్‌కు మధ్య రహదారి దూరం నూట యాభయి ఐదు కిలోమీటర్ల మేర తగ్గిపోయిందట! రైలు మార్గం దూరం ఆరువందల తొంభయి ఎనిమిది కిలోమీటర్ల మేర తగ్గిపోవడం వల్ల ఉభయ ప్రాంతాల - అస్సాం, అరుణాచల్ - ప్రజలకు మాత్రమే కాక ఈశాన్య క్షేత్ర ప్రయాణీకులందరికీ కూడా సమయం, ధనం కూడా ఆదా కానున్నాయి. ఈ వంతెన నిర్మాణానికి ఐదువేల తొమ్మిదివందల ఇరవై కోట్ల రూపాయల వ్యయమైంది. దేశం బ్రిటన్ దురాక్రమణ నుంచి విముక్తమైన తరువాత కూడా ఈశాన్య ప్రాంతంలో దశాబ్దులపాటు బ్రిటన్ దొరల పాలన వారసత్వం కొనసాగడం విచిత్రమైన చరిత్ర. క్రీస్తుశకం 1885వరకు బర్మా ప్రాంతం - అఖండ భారత్‌లోని తూర్పు ప్రాంతం - ఈశాన్య ప్రాంతం బ్రిటన్ దురాక్రమణకు గురికాలేదు. బర్మాను దురాక్రమించిన తరువాత కూడ బ్రిటన్ తస్కరులు ఈశాన్య ప్రాంతాన్ని గురించి పట్టించుకోలేదు. అందువల్ల ఈశాన్య ప్రాంతంలోని అధికారిక భూభాగం స్వతంత్రంగా ఉండిపోయింది. అరుణాచల్ ప్రాంతం అలా పంతొమ్మిదవ శతాబ్దం చివరి వరకు బ్రిటన్‌కు లోబడకుండా స్వతంత్రంగా మనగలిగిం. పంతొమ్మిదవ శతాబ్ది చివరిలో అరుణాచల్‌ప్రదేశ్‌కున్న భౌగోళిక వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని బ్రిటన్‌వారు గుర్తించారు. అందువల్లనే అరుణాచల్‌లోకి చొరబడ్డారు. స్వతంత్ర టిబెట్ దేశానికి ఆనుకొని మన దేశపు ఈశాన్యం చివరన విస్తరించి ఉన్న అరుణాచల్‌ను స్వాధీనం చేసుకొని టిబెట్‌లోకి చొరబడాలన్నది బ్రిటన్‌వారి వ్యూహం. కానీ అరుణాచల్ ప్రాంతపు వనవాసీ ప్రజలు బ్రిటన్ మూకలను తీవ్రంగా ప్రతిఘటించారు. నిరాయుధులైన వనవాసీలపై బ్రిటన్ సైనికులు జరిపిన బీభత్సకాండ ఐరోపావారి పాశవిక ప్రైశాచిక స్వభావానికి అద్దం పట్టింది. బ్రిటన్ మూకలు గిరిజన గ్రామాలను తగులబెట్టారు. సంతలపై దాడులు చేసి వాణిజ్య విధ్వంసం సృష్టించారు. అరుణాచల్‌ను ఆక్రమించుకొన్న తరువాత బ్రిటన్ దురాక్రమణదారులు 1903లో టిబెట్‌లోకి చొరబడినారు. రాజధాని లాసాకు చొచ్చుకొనిపోయారు. అప్పటి దలైలామా - టిబెట్ అధిపతి’ - చైనావారి సహాయం అర్ధించవలసి వచ్చింది.
ఇలా టిబెట్‌లోకి బ్రిటన్ చొరబడటం చైనావారికి అనుకూలంగా పరిణమించిన విపరిణామం. దాదాపు వెయ్యేళ్లు టిబెట్ పాలకులు చైనాతో నిరంతర యుద్ధం చేశారు. చైనా దురాక్రమణను ప్రతిఘటించారు. ఈ కాల వ్యవధిలో టిబెట్ తన స్వాతంత్య్రాన్ని కోల్పోలేదు. అయితే బ్రిటన్‌వారు మరోవైపున ప్రమాదకరంగా పరిణమించడంతో టిబెట్ చైనాకు, బ్రిటన్ దురాక్రమిత భారత్‌కూ మధ్య సమాన దూరాన్ని పాటించవలసి వచ్చింది. టిబెట్‌లో ఆ తరవాత జరిగిన చైనా దురాక్రమణకు ఇదీ నేపత్యం. టిబెట్‌ను 1959లో పూర్తిగా దురాక్రమించి దిగమింగిన చైనా అప్పటినుంచీ ఇప్పటివరకూ అరుణాచల్ ప్రదేశ్ కూడ తనదేనని అబద్ధపు ప్రచారం చేస్తోంది. 1962లో చైనా మనపై దొంగదెబ్బ తీసింది. ఇలా దొంగదెబ్బ తీయడానికి కారణం ‘భారత్ టిబెట్ సరిహద్దు’ 1959 తరువాత ‘భారత్ చైనా సరిహద్దు’గా మారిపోవడం. చైనా దురాక్రమణ ప్రమాదాన్ని ఊహించని, ఊహించలేని మన ప్రభుత్వం అరుణాచల్‌లోను, టిబెట్‌తో మనకున్న సరిహద్దు పొడవునా కూడ వౌలిక సదుపాయాలను, సైనిక శకటాలు పయనించగల రహదారులను ఏర్పాటుచేయలేకపోయింది. ఫలితంగా 1962లో చైనా అరుణాచల్‌లోకి అస్సాంలోకి చొచ్చుకొని రాగలిగింది. ఈ దురాక్రమణకు కొద్దికాలం ముందు ఏర్పడిన ‘మన సరిహద్దు ప్రాంతపు రహదారుల సంస్థ’ తగిన రవాణా సౌకర్యాలను ఏర్పాటుచేయడంలో విఫలమైంది. ఈ అవినీతి గతుకులలో కూరుకొనిపోవడం ఇప్పుడు చరిత్ర. ‘వేయని’ బాటలను ‘వేసినట్టు’ చిత్రపటాలలో చూపించారట. ఈ చిత్రాలను తీసుకొని చైనా మూకలతో తలపడటానికి వెళ్లిన మన సైనికులు ‘దారులు’ కనిపించలేదు.
చైనా దురాక్రమణ తరువాత కూడ దశాబ్దులపాటు ఈశాన్యంలో రహదారులను, రైలు మార్గాలను నిర్మించడానికి జరిగిన ‘కృషి’ నత్తల నడకతో పోటీపడటం మరో వైఫల్య చరిత్ర. 1962 వరకు బ్రహ్మపుఅత నదిపై వంతెన నిర్మాణం జరగకపోవడం మన పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ ఘోరమైన నిర్లక్ష్యం బ్రిటన్ దుండగుల వారసత్వం. మన దేశం బ్రిటన్ బీభత్స పాలకులకు మాతృభూమి కాదు. అందువల్ల వారికి ఈ దేశం పట్ల మమకారం లేదు. అందినంత దోచుకొని తమ దేశానికి తరలించుకొని పోవడం మాత్రమే బ్రిటన్ మూకల స్వభావం, కార్యక్రమం, విధానం, లక్ష్యం! అందువల్ల వారు ‘లాభసాటి కాని’ ఈశాన్య క్షేత్రాన్ని మిగిలిన దేశాన్ని రహదారులతోను, ఇనుప మార్గంతోను కలపడానికి అనుమతించలేదు. టిబెట్ దేశం మనకు - చైనాకు మధ్య నెలకొని ఉండేది. ఈ భౌగోళిక వ్యవస్థను శాశ్వతం చేయడానికి వీలుగా 1914లో బ్రిటన్‌వారు టిబెట్ ప్రభత్వుంతో సిమ్లాలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ఫలితంగా భూటాన్‌నుంచి అరుణాచల్ వరకూ గల మన భూభాగానికీ, స్వతంత్ర టిబెట్ దేశానికి మద్య ‘సరిహద్దు’ వ్యవస్థీకృతమైంది. ఈ సరిహద్దు ‘మెక్‌మోహన్ రేఖ’గా ప్రసిద్ధికెక్కింది. ఎందుకంటే సిమ్లా చర్చలకు ఆధ్వర్యం వహించిన భూటాన్ అధికారి పేరు మెక్ మోహన్! టిబెట్ శాశ్వతంగా స్వతంత్ర దేశంగా ఉంటుందని భావించిన బ్రిటన్‌వారు ఈ ‘మెక్ మోహన్’ రేఖ భద్రతను పట్టించుకోలేదు. ఎందుకంటే టిబెట్ మన దేశంపై దాడి చేసే ప్రసక్తి లేదు. అరుణాచల్‌లోను మిగిలిన ఈశాన్య ప్రాంతంలోను బ్రిటన్ ‘దొరలు’ రక్షణ సదుపాయాలను కల్పించకపోవడానికి ఇదీ కారణం! తమ సైనిక దళాలు వేగవంతంగా ఒక చోటనుంచి మరోచోటికి తరలి వెళ్లడానికి మాత్రమే బ్రిటన్‌వారు మన దేశంలో రైలు మార్గాలను, వంతెనలను, రహదారులను నిర్మించారు. తమ దేశానికి మన అటవీ వ్యవసాయ ఉత్పత్తులను తరలించుకొని పోవడానికి వీలుగా వారు ఓడరేవులను రైలుమార్గాలలో అనుసంధానం చేశారు.
ఈ నిర్లక్ష్యం వారసత్వంగా గ్రహించిన మన పాలకులు నిద్దురపోవడం వల్లనే ఈశాన్య ప్రాంతం ఆర్థికంగా వెనుకబడింది. చైనా ప్రేరిత, ఐరోపా ప్రేరిట, పాకిస్తాన్ ప్రేరిత వివిధ రకాల బీభత్సకారులకు విద్రోహులకు నిలయమైంది. చైనా టిబెట్ పొడవునా, టిబెట్ చైనా సరిహద్దునుంచి టిమెట్ భారత సరిహద్దు వరకు అధునాతన రైలు మార్గాలను నిర్మించిన తరువాత కూడా దాదాపు దశాబ్ది గడిచింది. ఈ రైలు మార్గం భారత వ్యతిరేక ‘దురాక్రమణ పథం’ గత రెండు దశాబ్దులుగా మాత్రమే ఈ దురాక్రమణ గురించి మన ప్రభుత్వాలకు ధ్యాస పెరిగింది. బ్రహ్మపుత్రపై వంతెనల నిర్మాణం ఈ ధ్యాస పెరగడంలో భాగం. గత నాలుగున్నర ఏళ్లలో బ్రహ్మపుత్ర మూడు ప్రధానమైన వంతెనల నిర్మాణ జరిగింది. మంగళవారం నరేంద్ర మోదీ ప్రారంభించిన వంతెన నాలుగున్నరేళ్లలో నిర్మితమైన నాలుగవ వంతెన! 2014 నాటికి బ్రహ్మపుత్రపై మూడు వంతెనలు మాత్రమే ఉండేవి. మరో నాలుగు వంతెనలు కూడా నిర్మాణంలో ఉండటం చైనాను భౌతికంగాను, వ్యూహాత్మకంగాను ప్రతిఘటించడంలో భాగం.