సబ్ ఫీచర్

ఉజ్జయిని కుంభమేళాపై ప్రపంచ దేశాల చూపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ వ్యాప్తంగా హిందువులు అత్యంత పవిత్రంగా భావించి, తమ జీవితంలో ఒక్కసారి అయిన కుంభమేళాలో స్నానమాచరిస్తే తమ జీవితం ధన్యమైనట్లే అని భావిస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళా మన దేశంలోని ఉజ్జయిని, అలహాబాద్, హరిద్వార్, నాసిక్‌లలో జరుగుతాయి. కుంభమేళాకు అశేష జనసందోహం హాజరవుతారు. ఈ జన సందోహాన్ని నియంత్రించడం మానవమాత్రులకు సాధ్యమయ్యే పనికాదు. అయినప్పటికీ శతాబ్దాల తరబడి కుంభమేళాలు ప్రశాంతంగా జరిగిపోతూనే ఉన్నాయి. దీనికి కారణం, కుంభమేళాకు హాజరయ్యే ప్రజల యొక్క భక్తి, ఆ ప్రాంతానికి ఉన్న ప్రాశ్యస్థమే. దేశంలో ఆటంకవాదుల దుశ్చర్యలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఆటంకవాదులు విధ్వంసం సృష్టించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఆటంకవాదులకు చెక్ పెట్టడంతోపాటు, ఎటువంటి తొక్కిసలాటలు కుంభమేళ ప్రాంగణంలో జరుగకుండా నిరోధించేందుకు ఈ దఫా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు.
ఉజ్జయినిలో ఏప్రిల్ 22 నుండి కుంభమేళా ప్రారంభమైంది. ఈ కుంభమేళకు సుమారు పది కోట్ల మందికిపైగా భక్తులు హాజరవుతారని అంచనా. కుంభమేళా సందర్భంగా ఎటువంటి తొక్కిసలాట జరుగకుండా నిరోధించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ దఫా ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంను వినియోగించుకొంటున్నది. కుంభమేళ సందర్భంగా భక్తులు పుణ్యస్నాన మాచరించే నదీ తీరం వెంబడి పూర్తిగా వైఫై సౌకర్యం కల్పిస్తున్నారు. జి.పి.ఎస్ సిస్టమ్‌తో ఎలక్ట్రానిక్ పరికరాల సహాయంతో ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసేందుకు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటుచేస్తున్నారు. తమకు ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఎప్పటికప్పుడు అందే సమాచారాన్ని విశే్లషించడానికి 350 మంది శాస్తవ్రేత్తలు, ఇంజనీర్లను నియమించారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఎక్కడైనా తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటే, సదరు విషయం 30 నిముషాల ముందుగా తెలిసిపోతుంది. తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలకు వెంటనే పోలీసు సిబ్బందిని పంపించి, అక్కడ తొక్కిసలాట జరుగకుండా నిరోధించవచ్చు. యావత్ ప్రపంచం ఉజ్జయిని కుంభమేళలో వినియోగిస్తున్న ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో మతపరమైన కార్యక్రమాలు జరిగే సమయంలో హాజరయ్యే భక్తులు తొక్కిసలాట వలన ఇబ్బందులకు గురికాకుండా నిరోధించడం ఒక సమస్యగా మారింది. ఉజ్జయిని కుంభమేళలో చేస్తున్న ప్రయోగం విజయవంతం అయితే, ప్రపంచ దేశాలన్నీ ఈ విధానాన్ని ఆచరించే అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ రంగంలో మన దేశం అగ్రస్థానంలో ఉందన్న విషయం ఈ ప్రయోగం ద్వారా తేటతెల్లం అవుతున్నది.
హిందూ పురాణాల ప్రకారం, కుంభమేళ సమయంలో నదీ జలాలలో అమృత బిందువులు కలసిన జలాలలో స్నానమాచరిస్తే వ్యాధులన్నీ తగ్గిపోయి, ఆరోగ్యవంతులు అవుతారన్నది నమ్మకం. అందువల్లనే, కుంభమేళలలో నదీ స్నానమాచరించడానికి కోట్లాది మంది ప్రజలు వస్తారు. ఉజ్జయినిలో జరుగనున్న కుంభమేళా ప్రశాంతంగా జరగాలని ఆశిద్దాం.

- పి. మస్తాన్‌రావు