సంపాదకీయం

‘సౌదీ’ బీభత్సం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌదీ అరేబియా రాజధాని రియాధ్‌లో ముగ్గురు భారతీయులు హత్యకు గురికావడం సౌదీ సమాజంలో నిహితమై ఉన్న పైశాచిక క్రౌర్యానికి మరో నిదర్శనం. సౌదీ అరేబియాకు ఉపాధి కోసం వెళ్లిన లక్షల భారతీయులు దశాబ్దుల తరబడి యజమానుల రాక్షసత్వానికి బలి అయిపోవడం నడుస్తున్న చరిత్ర. పురుషులను నిర్దాక్షిణ్యంగా చంపివేయడం, మహిళలను లైంగిక అత్యాచారాలకు గురిచేయడం వంటి ‘జిహాదీ’ప్రవృత్తికి జన్మస్థానం సౌదీ అరేబియా! ఈ ‘జిహాదీ’ ప్రవృత్తి శతాబ్దులపాటు అంతర్జాతీయ సమాజంపై దాడి చేసింది. ఈ జిహాదీ హత్యాకాండకు ఈ శతాబ్దులలో ప్రధానంగా బలి అయిపోయింది భారతదేశం. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ దేశాల రూపురేఖలు మారిపోయాయి, రాజకీయ పరివర్తనలు జరిగాయి, భౌగోళికమైన సరిహద్దులు మారాయి, కొన్ని దేశాలు విభజనకు గురిఅయ్యాయి, మరికొన్ని దేశాలు ఒకటిగా కలసిపోయాయి. కానీ శతాబ్దులు గడచినప్పటికీ ‘జిహాదీ’ల స్వభావం, కార్యక్రమం, లక్ష్యం, వ్యూహం మాత్రం మారలేదు. ఈ ‘జిహాదీ’ ప్రవృత్తికి ఇప్పటికీ సౌదీ అరేబియా సమాజం సైద్ధాంతిక స్ఫూర్తిని అందిస్తోంది. ఆర్థిక సహాయం అందిస్తోంది. సౌదీ అరేబియా సమాజ సమష్టి స్వభావంలో క్రౌర్యం, రాక్షసత్వం, పైశాచికత్వం వంటివి నిహితమై ఉండడానికి ఇదీ నేపథ్యం. ప్రపంచంలోని అన్ని ఇతర మతాలను హతం చేసి ఇస్లాంను ఏకైక మతంగా నిలబెట్టడం ‘జిహాదీ’లు స్వయంగా ప్రకటించిన, ప్రచారం చేస్తున్న లక్ష్యం! అందువల్ల ‘సర్వమత సమభావం’ సనాతన స్వభావం అయిన భారత జాతీయ సమాజం పట్ల జిహాదీ తత్త్వం స్వభావమైన సౌదీ అరేబియా వంటి సమాజాల సహజమైన ద్వేషం నిహితమై ఉంది! ఈ అన్యమత విద్వేషం తరాల తరబడి పెంచిన హంతక ప్రవృత్తి సౌదీ అరేబియా వంటి దేశాలలోని అధికాధిక ప్రజల చిత్తవృత్తిని, జీవన దృక్పథాన్ని ప్రభావితం చేసింది. యజమానులు తమవద్ద పనిచేసే వారిపట్ల, పురుషులు మహిళల పట్ల, ప్రభుత్వ విమర్శకుల పట్ల, ఉద్యమకారుల పట్ల, ఆయా ‘మత రాజ్యాంగ’ దేశాల ప్రజలు, విదేశీయుల పట్ల నిరంతరం క్రౌర్యం ప్రదర్శించడానికి ఇదీ శతాబ్దుల నేపథ్యం. సౌదీ అరేబియాలోని యజమానులు భారతీయులను, విదేశీయులను మాత్రమే కాదు స్వదేశానికి చెందిన కార్మికులను సైతం చంపేస్తున్నారు. స్వదేశీయులను చంపిన యజమానులపై అభియోగాలను నమోదు చేసి విచారిస్తున్నారు. ‘అభియోగాలు ఋజువయ్యే సందర్భాలు చాలా తక్కువ’ కానీ విదేశీయులను చంపిన హంతక యజమానులపై అభియోగాలు సైతం దాఖలు కావడం లేదు. ఇందుకు కారణం ‘సౌదీ అరేబియా’ ప్రభుత్వ యంత్రాంగాలకు విదేశీయుల బతుకుల పట్ల కల క్రూరమైన నిర్లక్ష్యం మాత్రమే కాదు, సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీయడంలో మన ప్రభుత్వం విఫలమవుతుండడం కూడ..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు వాహన చోదకులు- డ్రయివర్స్-ను రియాధ్‌లోని ఒక వ్యాపారి హత్యచేయడానికి తరతరాల రక్తనిష్ఠమైన ఈ పైశాచిక క్రౌర్యం ప్రేరకం! ఉత్తరప్రదేశ్‌లోని అజాంగఢ్ జిల్లా పోలీసు అధికారి రవిశంకర చౌబీ ఈ హత్యలు జరిగినట్టు ధ్రువపరిచాడు. హతుల మృతదేహాలను తరలించుకొని రావడానికి ప్రయత్నిస్తున్నట్టు ఆయన తెలిపాడు. అజాంగఢ్‌కు సమీపంలోని రౌణాపూర్ చెందిన ఇద్దరు సోదరులు షఫ్‌ఖత్, షమీమ్ అనే యువకులు, జీయాన్‌పూర్‌కు చెందిన ఫయ్యాజ్ అనే మరో చోదకుడు కొన్ని నెలలుగా రియాధ్‌లో పనిచేశారట! నిబంధనల విషయంలో యజమానితో వివాదం ఏర్పడడంతో షఫ్‌ఖత్ పదిహేను రోజుల క్రితం ఉద్యోగం మానివేయడానికి నిశ్చయించుకున్నాడు. యజమానితో పరిష్కారం కోసం యత్నించిన ఈ యువకుడిని మిగిలిన ఇద్దరినీ కూడ ఆ ‘రియాధ్ యజమాని’ హత్యచేసినట్టు ధ్రువపడింది. మన దౌత్య అధికారులు, మన ప్రభుత్వం వారు ఈ విషయమై సౌదీ ప్రభుత్వాన్ని సంజాయిషీ కోరిన ‘దాఖలా’లేదు. హంతకుడిని నిర్బంధించి విచారించాలని అడిగినట్టు సమాచారం లేదు..
సౌదీ అరేబియా ప్రభుత్వం 2013లో రూపొందించిన విధానం ప్రకారం ‘స్వదేశీయులకు మాత్రమే’ ఉద్యోగాలను ఇవ్వాలన్న నిబంధనలు అమలులోకి వచ్చాయి. స్వదేశీయులు లభించనప్పుడు ‘ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థలున్న’ దేశాల వారిని ఉద్యోగాలలో నియమించుకోవాలన్న ‘నితాఖత్’ చట్టం అమలులోకి వచ్చింది. ఇలా ‘ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థల’కు చెందినవారు లభించనప్పుడు మాత్రమే ఇతర దేశాల వారికి ఉద్యోగాలను ఇవ్వడమన్న నిబంధన అమలులోకి వచ్చింది. అంతవరకు సౌదీ అరేబియాలో పనిచేస్తుండిన ఇరవై ఎనిమిది లక్షల మంది భారతీయులకు ఈ కొత్త చట్టం వల్ల భద్రత లేకుండాపోయింది. నిబంధనల మేరకు ఉద్యోగాలు పొందిన భారతీయులు తమ దేశంలో కొనసాగవచ్చునని సౌదీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మిగిలినవారు నిర్ణీత కాలవ్యవధిలో సక్రమ పద్ధతుల ద్వారా ఉద్యోగాలు పొందవచ్చునని కూడ సౌదీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. సౌదీ అరేబియాలోని ప్రభుత్వేతర రంగంలోని ఉద్యోగులలో తొంబయి ఐదు శాతానికి పైగా విదేశీయులు ఉండడం అప్పటి స్థితి. ఇందుకు కారణం జనసాంద్రత చాలా తక్కువగా ఉన్న సౌదీ అరేబియాలో నైపుణ్యం ఉన్న ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువ. నైపుణ్యం లేని కార్మికులు కూడ అక్కడ లభించడం లేదు. సౌదీ అరేబియాలోని ప్రభుత్వేతర రంగంలో ఐరోపా, అమెరికా దేశాల సంస్థల సంఖ్య కూడ ఎక్కువ. కానీ ‘నితాఖత్’ వచ్చిన తరువాత పది శాతం ఉద్యోగులు విధిగా సౌదీ అరేబియా వారు కావలసి వచ్చింది. ఏమైనప్పటికీ 2013 నవంబర్‌లో కాలవ్యవధి ముగిసేలోగా పది లక్షల భారతీయుల ఉద్యోగాలు పదిలమయ్యాయి. వీరందరూ సక్రమంగా ఉద్యోగాలు పొందినవారు. కానీ ఆ తరువాతనే సౌదీ స్థానిక యజమానులు భారతీయ ఉద్యోగులను భయంకర హింసకు గురిచేస్తున్న కథనాలు వెలువడినాయి. ఒక యజమానురాలు ఒక భారతీయ మహిళను వీపుపై ఇనుప దబ్బను కాల్చి వాతలు పెట్టింది. మరో యజమాని భారతీయ కార్మికులను వారాల తరబడి బంధించి ఉంచాడు. వేరొక ‘తాటకి’ తమిళనాడుకు చెందిన ఒక మహిళను రెండవ అంతస్థు నుంచి కిందకు తోసేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్మికులు సౌదీ అరేబియాలో అనుభవించిన నరక యాతనల కథనాలు వందల సంఖ్యలో వెలువడినాయి, వెలువడుతూనే ఉన్నాయి. నూట యాబయి మంది భారతీయుల మృతదేహాలు సౌదీ వైద్యశాలలో ‘శవ వాటిక’లలో దిక్కులేకుండా పడి ఉన్నట్టు 2016 డిసెంబర్‌లో వెలువడిన సమాచారం సౌదీ యజమానుల పైశాచిక ప్రవృత్తికి పరాకాష్ఠ..
ఢిల్లీలోని సౌదీ అరేబియా రాయబారికి కార్యదర్శిగా పనిచేసిన ఒక దౌత్యవేత్త గురుగావ్‌లోని ఒక ఇంట్లో ఇద్దరు నేపాలీ మహిళలను మూడు నెలలకు పైగా నిర్బంధించినట్టు 2015 సెప్టెంబర్‌లో ధ్రువపడింది. ఈ యువతులను ఈ దౌత్యదౌర్జన్యకారుడు, అతని బంధుమిత్రులు లైంగిక అత్యాచారాలకు గురి చేశారు. కానీ ఈ నరరూప పిశాచాన్ని మన ప్రభుత్వం శిక్షించలేకపోయింది. లేని ‘దౌత్యరక్షణ’ ఉన్నట్టుగా బుకాయించిన సౌదీ అరేబియా ప్రభుత్వం అతగాడిని సురక్షితంగా తమ దేశానికి తరలించుకొని వెళ్లింది. సౌదీ అరేబియాలో మహిళలకు ఇప్పటికీ సమాన హక్కులులేవు, ప్రజాస్వామ్యం లేదు, పారదర్శకత లేదు. ప్రజాస్వామ్య ఉద్యమకారుడైన జమాల్ ఖషోగీ అన్న పత్రికా రచయితను సౌదీ ప్రభుత్వం చంపించింది. టర్కీలోని ‘ఇస్తాంబుల్’లోని సౌదీ దౌత్య కార్యాలయంలో ఈ హత్య జరిగింది. సౌదీ ప్రభుత్వం నియమించిన హంతకులు ‘కార్యాలయం’లోనే ఖషోగీని ముక్కలుగా నరికేశారు. సౌదీ అరేబియా మనకు ‘మిత్ర’దేశం.. అమెరికాకు మరింత మిత్ర దేశం..