సంపాదకీయం

వాణిజ్య కలహం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాణిజ్య మహాసంస్థల మధ్య చెలరేగుతున్న సమర విన్యాసాలు- కార్పొరేట్ వార్‌ఫేర్- గురించి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించడం సందర్భోచిత పునశ్చరణ.. వాస్తవాలను పదే పదే ప్రస్తావించక పోయినట్టయితే వాటి గురించి జనం మరచిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల దశాబ్దుల తరబడి ఘరానా వాణిజ్య సంస్థల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య సమరం గురించి పదే పదే ప్రస్తావించడం ఔచిత్యవంతం.. రక్షణమంత్రి మాత్రమే కాదు, ప్రభుత్వ నిర్వాహకులు, ప్రతిపక్షాల వారు, మేధావులు, విశే్లషకులు, దేశహితం కోరే ప్రతి ఒక్కరూ ఈ ‘కార్పొరేట్ వార్‌ఫేర్’ గురించి సామాన్య ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉండాలి! సామాన్య జనానికి ఈ ‘వాణిజ్య మహాసమరం’ వల్ల కలిగిన, కలుగబోతున్న విపరిణామాలను వివరిస్తూ ఉండాలి! దీనివల్ల అందరికీ కాకపోయినప్పటికీ కనీసం ఇలా జ్ఞాపకం చేస్తున్న వారికైన ఈ వాణిజ్య సమరం కల్పిస్తున్న మహావిపత్తు గురించి ‘‘జ్ఞాపకం’’ ఉంటుంది. ‘జ్ఞాపకం’ ఉన్నప్పటికీ జ్ఞాపకం లేనట్టు అభినయ విన్యాసాలను ప్రదర్శిస్తున్న రాజకీయవేత్తలు, బహుళ జాతీయ వాణిజ్య సంస్థల- మల్టీ నేషనల్ కంపెనీస్-కు అధికార, అనధికార, అక్రమ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్న ఆర్థికవేత్తలు దేశం నిండా ఉన్నారు. అందువల్ల కొందరు ఈ ‘కార్పొరేట్’ వార్‌ఫేర్ గురించి ప్రస్తావించినప్పుడు వారి ‘ప్రత్యర్థులు’ ఇలా ప్రస్తావించిన వారిపై విరుచుకొని పడుతూ ఉంటారు. మళ్లీవారు ప్రస్తావించినప్పుడు వీరు విరుచుకొని పడుతుంటారు. కానీ ఈ ‘వాణిజ్య మహాధిపత్య సమరం’ వల్ల దేశం గుల్లకాకుండా నివారించడానికి ‘వారు’ కాని, ‘వీరు’ కాని ప్రయత్నించడం లేదు. ఇప్పుడు రక్షణమంత్రి ఈ సంగతిని ప్రస్తావించడం వల్ల భారతీయ జనతాపార్టీకి రాజకీయ ప్రత్యర్థులైన వారు ఆగ్రహించడం అందువల్ల సహజం! ఫ్రాన్స్ నుంచి మన దేశం కొనుగోలు చేస్తున్న ‘రఫేల్’ యుద్ధ విమానాలపై జరుగుతున్న రగడకు కారణం ‘కార్పొరేట్’ కలహమన్నది రక్షణమంత్రి కనిపెట్టిన వాస్తవం! ఈ కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టు ప్రచారం చేస్తున్న రాజకీయ ప్రత్యర్థులు ‘వాణిజ్య మహాసంస్థలు’ ఆధిపత్యం కోసం పరస్పరం జరుపుతున్న యుద్ధంలో పావులుగా మారారన్నది, వీరికి దేశరక్షణ గురించి ఆసక్తి లేదన్నది రక్షణమంత్రి చేసిన ఆరోపణ! ప్రభుత్వం ఈ ‘కార్పొరేట్’ కలహాన్ని ఎందుకు నిరోధించలేదన్నది రాజకీయ ప్రత్యర్థుల ప్రశ్న... వాణిజ్య మహాసంస్థల ప్రయోజనాలను కాపాడడం కోసం ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలను బలి చేసిందన్నది రాజకీయ ప్రత్యర్థుల రభసకు ప్రాతిపదిక అయిన ప్రధానమైన ఆరోపణ! ఇదంతా ప్రతీక మాత్రమే! దశాబ్దుల తరబడి జరిగిపోతున్న ఈ వాణిజ్య మహాధిపత్య సమరం శతాబ్దుల పాటు మన దేశంలో కొనసాగిన విదేశీయ వాణిజ్య దురాక్రమణకు విస్తృతి కావడం విస్మృతికి గురి అవుతున్న మహావిపత్తు.. మనకు ధ్యాస ఉన్నప్పటికీ, లేనప్పటికీ విపత్తు మాత్రం కొనసాగుతూనే ఉంది!
మన దేశానికి వ్యతిరేకంగా 1947 వరకు కొనసాగిన వాణిజ్య, రాజకీయ, సాంస్కృతిక, వ్యూహాత్మక దురాక్రమణకు పునరావృత్తి 1994లో మొదలైన ‘వాణిజ్య ప్రపంచీకరణ’ - గ్లోబలైజేషన్! వాణిజ్య దురాక్రమణ స్వరూపం మారింది, స్వభావం మారలేదు, లక్ష్యం మారలేదు. ఈ దేశాన్ని గుల్లచేయడం ఈ లక్ష్యం, ఈ దేశపు స్వయం సమృద్ధిని, స్వావలంబనను, ఆర్థిక స్వరాజ్యాన్ని చితకబాదేయడం ఈ లక్ష్యం! ఐరోపా వారి వాణిజ్య సంస్థల చొరబాటునకు పదహారవ శతాబ్ది నుంచి అనుమతినిచ్చిన ‘స్వదేశ నిర్వాహకుల’ అజ్ఞానానికి 1993-94లో ‘ప్రపంచీకరణ’ను వ్యవస్థీకరించిన మన ప్రభుత్వ నిర్వాహకుల ‘అనభిజ్ఞత’ పునరావృత్తి! ఈ ‘అనభిజ్ఞత’ ఇప్పటికీ కొనసాగుతుండడం మన దిగుమతులు నిరంతరం పెరుగుతుండడానికి ఏకైక కారణం! శత్రు దేశమైన చైనాకు చెందిన బహుళ జాతీయ వాణిజ్య సంస్థలను సైతం మనం నిరోధించలేకపోయాము, చైనా నుండి దిగుమతులను నిషేధించలేక పోతున్నాము. ‘ప్రపంచీకరణ’ వ్యవస్థ మన రాజ్యాంగ వ్యవస్థను నియంత్రిస్తున్న తీరు ఇది. మన ఆర్థిక సార్వభౌమ అధికారం హరించుకొనిపోతోంది. ‘‘హరించుకొని పోలేదని’’ భ్రమించడం ‘‘బహుళ’’ జాతీయ వాణిజ్య మాయామృగాల విన్యాసాలు మన ప్రభుత్వాల విధానాలను నిర్దేశిస్తున్న తీరునకు అద్దం.. అందువల్ల దేశంలో ‘పోటీ’ రాజకీయ పక్షాల మధ్య జరగడం లేదు, బహుళ జాతీయ వాణిజ్య సంస్థల మధ్య జరుగుతోంది! ‘ప్రపంచీకరణ’ మొదలైన తరువాత స్వదేశీయ ప్రభుత్వేతర వాణిజ్య సంస్థలు కూడ ‘బహుళ జాతీయ స్వభావాన్ని’ సంతరించుకున్నాయి. జాతీయతా నిష్ఠను వాణిజ్య నిష్ఠ కబళించింది. మాతృభూమి పట్ల గల మమకారాన్ని ‘వాణిజ్య సంస్థల పట్ల’ ఉద్యోగులకు పెరుగుతున్న మమకారం గ్రసిస్తోంది!
తోడేళ్లు గుంటనక్కలూ
తలపడి పోరిన వేళ..
ధర్మాత్ములు ఎవరన్నది
దగుల్బాజి ప్రశ్నన్నా!
వాణిజ్యపు పెను ముఠాల
ఆధిపత్య సమరంలో
‘జాతి హితం’ పేరెత్తుట
జన వంచన చిన్నన్నా!!
‘ప్రపంచీకరణ’ ప్రారంభం కాకముందు 1990వ దశకంలో మన ‘దేశపు స్థూల జాతీయ ఉత్పత్తి’- గ్రాస్ డొమస్టిక్ ప్రాడక్ట్- జిడిపి-విలువ దాదాపు ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయలు. అప్పటి చైనా ‘స్థూల జాతీయ ఉత్పత్తి’ విలువ దాదాపు ఇరవై ఆరు లక్షల కోట్ల రూపాయలు. అంటే చైనా ‘జిడిపి’ విలువలో మన ‘జిడిపి’ విలువ తొంబయి శాతం. చైనా కంటె జనాభాలోను, వైశాల్యంలోను మన దేశం చిన్నది. అందువల్ల 1990వ దశకం నాటికి ప్రజాస్వామ్య భారత్, కమ్యూనిస్టు చైనా ‘ఆర్థిక సౌష్టవం’లో దాదాపు సమానంగా ఉన్నాయి! 2016 నాటికి ‘చైనా స్థూల జాతీయ ఉత్పత్తి’ ఏడు కోట్ల కోట్ల రూపాయల స్థాయికి చేరింది. ఇదే పాతికేళ్లలో మన దేశపు ‘ఉత్పత్తి’ పరిమాణం కోటి నలబయి లక్షల కోట్ల రూపాయల స్థాయికి చేరింది. 1993లో మన దేశం ‘ప్రపంచీకరణ’ వ్యవస్థలో చేరిన ఫలితమిది. 2016 నాటికి మన ‘జిడిపి’ విలువ చైనా ‘జిడిపి’ విలువలో ఇరవై శాతానికి దిగజారింది. చైనా సంస్థలు మన దేశాన్ని మాత్రమే కాదు, ప్రపంచ దేశాలను దోచుకుంటున్నాయి. మన దేశం చైనా సంస్థల దోపిడీకి మాత్రమే కాదు, ఐరోపా, అమెరికా, దక్షిణ కొరియా వంటి దేశాల సంస్థల దోపిడీకి గురి అవుతోంది. ఇదీ ప్రపంచీకరణ, ఇదీ ‘కార్పొరేట్ వార్‌ఫేర్’! ప్రస్తుతం మన ‘జిడిపి’ విలువ రెండు కోట్ల కోట్ల రూపాయలు కావచ్చు. అయినప్పటికీ 1991-2018 సంవత్సరాల మధ్య మన ప్రగతి ‘పరిమాణం’ చైనా కంటె చాలా తక్కువ. ‘జిడిపి’ ‘పెరుగుదల శాతం’లో మనం చైనా కంటె ముందున్నామని మురిసిపోవడం నకిలీ ఆర్థిక పారవశ్యం మాత్రమే!
ఈ నకిలీ పారవశ్యం నిర్మించిన ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ మన దేశంలో తమ ఉత్పత్తులను అమ్ముకొనడం కోసం పోటీపడుతున్నాయి. ఒక సంస్థను మరో సంస్థ కొనుగోలు చేస్తోంది. ఈ ‘కొనుగోలు’ ఒక జంతువు మరో జాతి జంతువును నమిలి మింగడం కాదు, ఒక జంతువు తన జాతికి చెందిన మరో జంతువును దిగమింగుతోంది. ‘వాల్‌మార్ట్’, ‘అమెజాన్’ వంటి సంస్థలు వివిధ దేశాలలోని ఇతర సంస్థలను కొనుగోలు చేసి తమ వాణిజ్య సామ్రాజ్యాలను విస్తరింప చేసుకుంటున్నాయి. ఇదీ అంగడి వధ యుద్ధం.. మధ్యప్రదేశ్‌లోని ‘కన్హా జాతీయ వన్యమృగ’ ప్రాంగణంలో ఇటీవల ఒక పులి మరో పులిని చంపి తినిందట! విస్మయకరం కావచ్చు.. కానీ ఇదే పద్ధతిలో జరుగుతున్న ‘కార్పొరేట్’ కలహం ‘సహజం’గా మారి ఉంది...