సంపాదకీయం

జాతీయత ఒక మతమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రీయ విద్యాలయాలలో సంస్కృత ప్రార్థనలు జరుగరాదన్నది బ్రిటన్ దురాక్రమణదారులు నాటిన విష బీజాలు వృక్షాలుగా విస్తరిస్తున్న వాస్తవానికి మరో సాక్ష్యం. భారతీయతను పరిరక్షించడానికి ప్రభుత్వం కాని ఇతర సంస్థలు కాని చేస్తున్న ప్రతి ప్రయత్నానికి అవరోధం కల్పించడం ‘ఆధునికత’గా చెలామణి అవుతోంది, హేతుబద్ధతగా ప్రచారం అవుతోంది. భారతీయతను ‘మతవ్ఢ్యౌం’గా ప్రచారం చేయడం ఈ ప్రచారకర్తల వ్యూహం! ఈ వ్యూహం బ్రిటన్ దురాక్రమణకారులు మన దేశంపై పెత్తనం వహించిన కాలంలో అంకురించింది, భారతదేశ స్వభావాన్ని చెఱచి భారతీయులకు భారత వ్యతిరేక పాఠాలను మప్పడం బ్రిటన్ దొరలు విరచించిన విద్యాప్రణాళిక ఇతివృత్తం. భారతీయుల వేష భాషలను ఆహార రీతులను సంప్రదాయాలను వికృతపరచడం స్వరూప వైకల్యం కల్పించడంలో భాగం. సంస్కృత భాషను తొలగించిన బ్రిటన్ ‘దొరలు’ ఆంగ్ల భాషను ఆ స్థానంలో ప్రవేశపెట్టారు. బ్రిటన్‌వారు మన దేశంలోకి చొరబడి స్థిరపడి తమ బీభత్సపాలనను మొదలుపెట్టేవరకు మన దేశంలో మాత్రమేకాక ఇప్పుడు ఇరుగుపొరుగు దేశాలుగా ఉన్న అనేక దేశాలలో కూడ సంస్కృత భాష ఉన్నత విద్యాబోధనకు మాధ్యమ భాష. అనేక భాషలు మాట్లాడిన వివిధ ప్రాంతాల మధ్య అనుసంధాన భాష సంస్కృత భాష, పాలన భాష సంస్కృత భాష. భారతీయ సంస్కృతి అనాదిగా వికసించడానికి వౌలిక భూమిక సంస్కృత భాష! ఈ సుస్థితి కొనసాగి ఉండినట్టయితే మన భాషను మనలోని కొందరు వ్యతిరేకించే దుస్థితి దాపురించి ఉండేది కాదు. కేంద్రీయ విద్యాలయాలలో సంస్కృత భాష మాధ్యమంగా ప్రార్థన జరుగరాదని కొందరు ఆర్భాటిస్తుండడం ఈ దుస్థితి.. ఈ దుస్థితికి కారణం కలియుగం యాబయ్యవ- క్రీస్తుశకం పంతొమ్మిదవ- శతాబ్ది ఆరంభం నుండి బ్రిటన్ బీభత్స ‘పాలకులు’ మన దేశంలో చేసిన భాషా పరివర్తన! బ్రిటన్ దొరలు దశలవారీగా సంస్కృత భాషను తొలగించారు, ఆంగ్ల భాషను ఉన్నత విద్యాబోధనకు మాధ్యమ భాషగా వ్యవస్థీకరించారు. అనుసంధాన భాషగా, పాలన భాషగా ‘ఇంగ్లీషు’ అవతరించింది. ఇదంతా యుగయుగాల హైందవ జాతీయ స్వరూపాన్ని చెఱచిన బ్రిటన్ ‘పాలకుల’ కుట్రలో భాగం. ఈ స్వరూప వైకల్యం కారణంగా భారత జాతికి స్వభావ వైక్లబ్యం దాపురించింది! ‘పేరంటం’ అని చెప్పడం మతమైంది, మత వ్ఢ్యౌమైంది, ‘్ఫంక్షన్’ అని పలకడం జీవన విలాసం - ఫ్యాషన్- అయిపోయింది! ఇది ఒక ఉదాహరణ మాత్రమే! భారతీయుల బుద్ధి నుండి మనసు నుంచి భారతీయత తొలగిపోవడానికి ‘ఐరోపీయ నాగరికం’ ఆవహించడానికి ‘‘సంస్కృత హననం’’ ద్వారా ‘‘ఆంగ్ల అవతరణ’’ద్వారా జరిగిన ఈ భాషాపరివర్తన అంకురార్పణ! సకల జగత్తునకు వర్తించే ‘కలియుగం’- కాలగణనం- మత తత్త్వం అని ప్రచారమైంది. మతంతో కేవలం ఒక్క మతంతో ముడివడిన క్రీస్తుశకం- పాశ్చాత్యమత శకం- వ్యవహార శకమని సాధారణ శకమని, సామాన్య శకమని ప్రచారమైంది. సర్వజనీనం మతతత్త్వమైంది, కేవలం ఒక మతం సర్వజనీనంగా చెలమణి అవుతోంది...
కేంద్రీయ విద్యాలయాలలో సంస్కృత భాషలో ప్రార్థన చేయడానికి వ్యతిరేకిస్తూ కొందరు సర్వోన్నత న్యాయస్థానంలో ‘ప్రజాప్రయోజన వివాదాన్ని’ దాఖలు చేయడానికి ఇది రెండు శతాబ్దుల నేపథ్యం. ఈ వివాదాన్ని ఐదుగురు న్యాయమూర్తుల సర్వోన్నత రాజ్యాంగ ధర్మాసనం విచారించనున్నదట. కేంద్ర ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో దేశమంతటా పదకొండువందల ఇరవై ఐదు కేంద్రీయ విద్యాలయాలు నడుస్తున్నాయి. ఈ విద్యాలయాలన్నింటిలోను విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ ప్రార్థన సమావేశానికి హాజరుకావాలని ‘మానవ వనరుల మంత్రిత్వశాఖ’ వారు ఇటీవల నిర్ధారించారట. ఈ సమావేశంలో జరిగే ప్రార్థన ఏ మతానికి కాని చెందిన ప్రార్థన కాదు. బృహదారణ్యక ఉపనిషత్తులోని ‘‘అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృతోర్మా అమృతంగమయ’’- అసత్యం నుండి సత్యం వైపునకు, చీకటి నుంచి వెలుగునకు, అశాశ్వత స్థితి నుంచి శాశ్వత స్థితివైపు నడిపింపుము- అన్నది ప్రార్థన! ఈ ప్రార్థన ఏ ఒక్క మతం వారికి పరిమితం కాదు. సర్వమత సమభావ సంపుటమైన భారతదేశంలోని స్వజాతీయుల ఆకాంక్ష ఇది. ఈ ‘స్వజాతి’ మత వైవిధ్యాలకు అతీతంగా వికసించింది, ఏ ఒక్క మతం కూడ ఈ జాతీయ వికసనానికి ప్రాతిపదిక కాలేదు.. అన్ని మతాల వారికి ఆకలిని తీర్చే అన్నం వలె ఈ జాతీయ స్వభావం అన్ని మతాలను సమాన సంస్కృతి నిబద్ధులను చేయడం ఇందుకు కారణం. ఈ సమాన జాతీయ సంస్కృతి అనాదిగా భారతీయత, హిందుత్వం....
కానీ అన్ని మతాలకు మాత్రమే మన దేశానికి వెలుపల ఉన్న దేశాల వారికి సమాన ఆకాంక్ష కాగలిగిన ఈ ప్రార్థన సంస్కృత భాషలో ఉంది కాబట్టి అది ‘‘మత ప్రార్థన’’ అన్నది ‘‘ప్రజాప్రయోజన వివాదాన్ని’’ దాఖలు చేసినవారి భ్రమ. ఇందుకు ప్రధాన కారణం సంస్కృత భాషను బ్రిటన్ బీభత్స పాలకులు ‘మత భాష’గా చిత్రించి వెళ్లడం. ఈ భ్రమను తొలగించడానికి బ్రిటన్ నిష్క్రమణ తరువాత కొత్త రాజ్యాంగాన్ని రచించిన సమయంలో జాతీయ మహాపురుషులు కొందరు యత్నించారు. బ్రిటన్ వారు చొరబడక పూర్వం ఈ దేశంలో జాతీయ అధికార భాష సంస్కృతం. అందువల్ల సంస్కృత భాషను స్వతంత్ర భారతదేశంలో జాతీయ అధికార భాషగా నిర్ధారించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయులు యత్నించారు. వారి యత్నాలు ఫలించి ఉండినట్టయితే సంస్కృత భాష యథాపూర్వకంగా ఉన్నత విద్యామాధ్యమ భాష అయి ఉండేది, అనుసంధాన భాష అయి ఉండేది, కేంద్ర ప్రభుత్వ అధికార- పాలన- భాష అయి ఉండేది. దేశమంతటా ‘కానె్వంట్ల’లో ఆంగ్ల భాషలో ఐరోపా గీతాలను వల్లిస్తున్న శిశువులు సంస్కృత భాషలో భారతీయ పద్యాలను, పాటలను, గీతాలను, పదాలను వల్లెవేసేవారు!
కావా బాలా? కాంచన మాలా!
కస్యాః పుత్రీ? కనకలతాయాః!
కింవా హస్తం? తాలజ పత్రం!
కోవా లేఖా? కఖగఘ....’’
పేరేమి పాపా? కాంచనమాల!
ఎవరి పాపవు? కనకలత కూతురుని!
చేతిలో ఏమిటి? కాగితము!
ఏమి వ్రాస్తావు? కఖగఘ....’’
కానీ అంబేద్కర్ మహాశయుని ప్రయత్నం ఫలించలేదు. అందువల్లనే ‘కఖగఘ’లు రాని శిశువులు ‘కఖగఘ’రాని ఉన్నత విద్యావంతులుగా మారుతున్నారు. సంస్కృత భాష పట్ల వ్యతిరేకతకు ఇదీ నేపథ్యం!
ఇప్పుడున్న అనేక మతాలు పుట్టక పూర్వం నుంచి, కొత్త మతాలు విదేశాల నుంచి మన దేశంలోకి వ్యాపించ పూర్వం నుంచి ఈ దేశ ప్రజలు ఒక జాతిగా ఏర్పడి ఉన్నారు. పాఠశాలలలో, విద్యాలయాలలో సంస్కృత భాషలోను, తెలుగు, హిందీ వంటి స్వదేశీయ భాషలలోను ప్రార్థన చేయడం జాతీయ సంప్రదాయం. కొత్త మతాలు పుట్టాయని, కొత్త మతాలు వచ్చాయని ‘జాతీయత’ మారిపోవాలా? జాతీయ సంస్కృతి మారిపోవాలా? జాతీయ సంప్రదాయాలను రద్దుచేసుకోవాలా? మతాలు ఎన్ని ఉన్నప్పటికీ ఈ దేశంలో అనాదిగా జాతీయత ఒక్కటే! సాంస్కృతిక స్వభావం ఒక్కటే! ఈ సాంస్కృతిక జాతీయ ఆకాంక్షలు ఒక్క మతానికి కానీ ఏ ఒక్క మతానికి కాని పరిమితం కాలేదు... దీనికి భిన్నమైన భ్రమలు తొలగించుకోవాలి!! అప్పుడు మాత్రమే సర్వమత సంపుటమైన భారతీయతను గుర్తించగలం..