సంపాదకీయం

జనం నిలధీయాలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఫ్ఘానిస్థాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి తరిమివేతకు గురైన భరతమాత బిడ్డలకు మన దేశ పౌరసత్వం కల్పిస్తామన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదే పదే చెబుతున్న మాట! మూడవ తేదీన జమ్మూ కశ్మీర్‌లోని లడక్‌లో పర్యటించిన సందర్భంగా ఈ హామీని ప్రధాని మరోసారి పునరుద్ధరించారు. ఇందుకోసం ప్రభుత్వం 1955 నాటి ‘‘పౌరసత్వపు చట్టానికి’’ సవరణలను చేయతలపెట్టింది. ఈ సవరణలను పార్లమెంటు ఆమోదించినట్టయితే పొరుగు దేశాల నుంచి తరిమివేతకు గురైన దాదాపు రెండు లక్షల మంది ఇస్లామేతర మతాల ‘భారతీయుల’కు మళ్లీ మన దేశపు పౌరసత్వం లభిస్తుందని 2016లో ప్రచారమైంది. తరిమివేతకు గురైనవారు ఒకప్పుడు ‘అఖండ భారత్’ పౌరులన్నది చారిత్రక సత్యం. గత నెలలో లోక్‌సభ ఆమోదించిన ఈ ‘సవరణ’ను రాజ్యసభలో కొన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తుండడం నడుస్తున్న చరిత్ర. ఇది మొదటి వైపరీత్యం. అస్సాంలో ‘పౌరుల జాతీయ సూచిక’- నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్- ఎన్‌ఆర్‌సి- రూపొందడం వల్ల ఆ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులు బయటపడతారు. ఈ అక్రమ ప్రవేశకులను దేశం నుంచి బహిష్కరించడానికి వీలవుతుంది. కానీ ఈ ‘జాతీయ సూచిక’ రూపొందరాదని కొన్ని రాజకీయ పక్షాలు వాంఛిస్తున్నాయి. ఈ ‘సూచిక’ రూపొందడం వల్ల లక్షల మందికి దేశంలో నిలువనీడ లేకుండా పోతుందన్నది ఈ పక్షాల వాదన. కానీ ఇలా నిలువనీడ లేకుండాపోనున్న వారు ఈ దేశంలోకి అక్రమంగా చొరబడి తిష్ఠవేసినవారు, వారి వారసులు. దశాబ్దులపాటు బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి, బెంగాల్‌లో ఇతర ఈశాన్య ప్రాంతాలలోకి లక్షల మంది అక్రమంగా చొరబడిపోయారు. ఈ చొరబాటుదారులలో జిహాదీ బీభత్సకారులు కూడ వేల సంఖ్యలో ఉండడం బహిరంగ రహస్యం. ‘ఎన్‌ఆర్‌సి’ని రూపొందించాలన్న కార్యక్రమం సర్వోన్నత న్యాయస్థానం వారి ఆదేశం ప్రకారం 2013 నుంచి కొనసాగుతోంది. ఈ ‘చొరబాటు’వల్ల అస్సాంలోను, బెంగాల్‌లోను విదేశీయుల జనాభా విపరీతంగా పెరిగింది. మన దేశంలోకి రెండు కోట్ల మంది బంగ్లాదేశీయులు అక్రమంగా ప్రవేశించి తిష్ఠవేసి ఉన్నట్టు 2016 నవంబర్ 16న కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. ఈ అక్రమ ప్రవేశకులను మన దేశపు పౌరుల నుంచి వేఱుచేయడానికి వీలుగా ‘ఎన్‌ఆర్‌సి’ కార్యక్రమం మొదలైంది. నిజానికి దేశమంతటికీ ‘ఎన్‌ఆర్‌సి’ రూపొందాలన్నది 1950 దశకంలోనే ప్రభుత్వం ఆమోదించిన విధానం. ఇప్పుడు అస్సాంలో ‘ఎన్‌ఆర్‌సి’ రూపొందుతోంది. పశ్చిమ బెంగాల్‌లో కూడ రూపొందే అవకాశం ఉంది. కానీ ‘ఎన్‌ఆర్‌సి’ని కొన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇలా వ్యతిరేకిస్తున్న పక్షాలలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధ్యక్షత వహిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ ముందు వరసలో ఉంది. ఇది రెండవ వైపరీత్యం. గత ఆగస్టులో అస్సాంకు వెళ్లి ‘ఎన్‌ఆర్‌సి’కి వ్యతిరేకంగా ‘ప్రదర్శనలు’ జరుపనెంచిన తృణమూల్ కాంగ్రెస్ బృందం సభ్యులను అస్సాం పోలీసులు నిరోధించి వెనక్కి పంపారు. సోమ,మంగళవారాలలో మమతాబెనర్జీ బృందం వారు కలకత్తాలో జరిపిన అకాండ తాండవానికి ‘ఎన్‌ఆర్‌సి’ పట్ల వ్యతిరేకత కూడ ఒక కారణం!
పాకిస్తాన్‌లోను అఫ్ఘానిస్థాన్‌లోను బంగ్లాదేశ్‌లోను జిహాదీల హత్యాకాండ నుంచి తప్పించుకొని పారిపోయి శరణార్థులుగా తలదాచుకుంటున్నవారు హిందువులు. 1947లో ‘అఖండ భారత్’ విభజన జరుగకపోయి ఉండినట్టయితే, అంతకు పూర్వమే బ్రిటన్ దురాక్రమణదారులు మన దేశం నుంచి అఫ్ఘానిస్థాన్‌ను విడగొట్టకపోయినట్టయితే ఈ హిందువులు, ఈ భారతీయులు- తరతరాలుగా ఈ మూడు ప్రాంతాలలోను నివసించినవారు తమ స్వస్థలాలను వదలిపెట్టవలసి వచ్చేది కాదు. ఎందుకంటె తరతరాలుగా అఖండ భారత్‌లో సర్వమత సమభావ సమాజం వికసించింది. అన్ని హైందవ జాతీయ మతాల వారు, విదేశాల నుంచి వ్యాపించిన యూదు, పారశీక, ఇస్లాం, క్రైస్తవ మతాలవారు సమాన అధికారాలతో హాయిగా జీవించారు. 1947 తరువాత ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఉన్న బంగ్లాదేశ్‌లోను, పాకిస్తాన్‌లోను అల్పసంఖ్యలో ఉన్న ఇస్లామేతరులను ‘జిహాదీ’లు నిర్మూలించడం మొదలైంది. అఫ్ఘానిస్థాన్‌లో కూడ ‘జిహాదీ’ల బీభత్సకాండ నుండి తప్పించుకొని ప్రాణావశిస్టులైన ఇస్లామేతర మతాలవారు మన దేశానికి శరణార్థులుగా వచ్చేశారు. ఒకప్పటి అఖండ భారత పౌరులైన వీరందరూ అవశేష భారత్‌లో సహజంగానే పౌరులు. అఖండ భారత్‌లో వలెనే అవశేష భారత్‌లో కూడ సర్వమత సమభావ సమాజం యథాతథంగా కొనసాగుతోంది కనుక ఈ శరణార్థులు ఈ దేశంలో మాత్రమే తమకు భద్రత ఉందని భావిస్తున్నారు. ఇలాంటి శరణార్థుల సహజమైన భారతీయ వారసత్వపు హక్కులు, పౌర సత్వపు హక్కులు హరించిపోవడం 1947 నాటి అఖండ భారత విభజన ఫలితం. తమ దేశంలోనే శరణార్థులుగా మారిన ఈ శరణార్థులకు పౌరసత్వం కల్పించకపోవడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. కానీ ఈ సహజ న్యాయాన్ని అనేక రాజకీయ పక్షాలు ఎందుకని వ్యతిరేకిస్తున్నాయి? దేశ ప్రజలకు ఈ రాజకీయవాదులు సమాధానం చెప్పవలసి ఉంది.
ఇలా సహజమైన అర్హత ఉన్న శరణార్థులకు పౌరసత్వం ఇవ్వరాదని వాదిస్తున్న రాజకీయ పక్షాలవారు, బంగ్లాదేశ్ నుంచి బర్మా నుంచి మన దేశంలోకి చొరబడిన అక్రమ ప్రవేశకులకు మాత్రం మన దేశపు పౌరసత్వం ఇవ్వాలని వాదిస్తున్నారు. శరణార్థులు ‘జిహాదీ’ల మతోన్మాదానికి బలైనవారు, ఇస్లాం మతేతర హిందువులు. అక్రమ ప్రవేశకులు ఇస్లాం మతస్థులు. ఈ అక్రమ ప్రవేశకులలో మన దేశంలో బీభత్సకాండను జరుపడం లక్ష్యంగా చొరబడిన ‘జిహాదీ’లు కూడ ఉన్నారు. అందువల్ల జాతీయ నిష్ఠకల, దేశభద్రత పట్ల నిబద్ధతకల అన్ని రాజకీయ పక్షాలవారు శరణార్థులకు మన దేశపు పౌరసత్వం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చట్టాన్ని సమర్ధించాలి, అక్రమ ప్రవేశకులను వెళ్లగొట్టడానికై రూపొందిన ‘జాతీయ సూచిక’ను సమర్ధించాలి. కానీ అనేక రాజకీయ పక్షాలు ఈ రెండు అంశాలలోను విపరీత విధానాన్ని అనుసరిస్తున్నాయి. శరణార్థులకు పౌరసత్వం కల్పించరాదట, అక్రమ ప్రవేశకులను వెళ్లగొట్టరాదట! ఇలాంటి రాజకీయ పక్షాలను జనం నిలదీయవలసిన అనివార్యం ఏర్పడి ఉంది. ఇలా నిలదీయడానికి మాధ్యమం ఎన్నికలలో ఈ మానవత్వం లేని పక్షాలను, అక్రమ ప్రవేశకులను సమర్ధిస్తున్న పక్షాలకు వ్యతిరేకంగా వోట్లు వేయడం.. కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న రాజకీయ పక్షాన్ని విపక్షాలు వ్యతిరేకించవచ్చు, ఓడించడానికి యత్నించవచ్చు. ఇదంతా ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియలో భాగం. కానీ సహజ మానవీయ న్యాయసూత్రాలను నిలబెట్టడంలోను, జాతీయ సమైక్యాన్ని ప్రాదేశిక సమగ్రతను ఆంతరంగిక భద్రతను పరిరక్షించడంలో అన్ని రాజకీయ పక్షాలకు సమాన బాధ్యత ఉంది. అన్ని రాజకీయ పక్షాలవారు ఈ జాతీయ భూమికపై నిలబడి ఆత్మమధనం చేసుకోవాలి!!
ఈ శరణార్థుల సమస్య, ఈ అక్రమ ప్రవేశకుల సమస్య- ఈ రెండూ మన పొరుగు దేశాలలోని బీభత్స రాజ్యాంగ వ్యవస్థలతో ముడివడి ఉన్నాయి. ఇస్లాం మతస్థులను తప్ప మరో మతం వారిని బతకనివ్వరాదన్న జిహాదీ స్వభావం ఈ పొరుగు దేశాల సమష్టి సమాజ స్వభావం.. అందువల్ల తమ దేశంలోని అల్పసంఖ్య మతస్థులను జిహాదీలు నిర్మూలిస్తున్నారు. మన దేశంలో ఇస్లాం మతస్థుల సంఖ్యను పెంచడానికై బంగ్లాదేశ్ నుంచి బర్మానుంచి అక్రమ ప్రవేశకులు చొరబడుతున్నారు. ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఉన్న, ఇస్లాం మతస్థులు సంఖ్యా బాహుళ్యం సాధించిన దాదాపు అన్ని దేశాలలోను ‘సర్వమత సమభావం’ అడుగంటిపోవడానికి కారణం జిహాదీలు. సామాన్య ఇస్లాం ప్రజలకు ఈ జిహాదీ లక్ష్యాలతో సంబంధం లేదు.. మన దేశంలోని రాజకీయ పక్షాలు గ్రహించవలసిన అంతర్జాతీయ పాఠం ఇది!