ఉత్తరాయణం

హిందూ ధర్మాన్ని అనుసరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూమతాన్ని ప్రతి హిందువు ఆచరించాలి. కేవలం విగ్రహారాధన వల్ల ప్రయోజనం లేదు. పురాణ పఠనం, ప్రవచనం లాంటివి ప్రతిదేవాలయంలో ఉండాలి. సీతారాముల కల్యాణం, శ్రీభూ సమేత వరాహస్వామి, లక్ష్మీనరసింహ స్వామి పూజలు నిర్వహించాలి. ప్రలోభాలకు లొంగి మతం మార్చుకొనకూడదు. మత మార్పిడుల వల్ల హిందూ సంస్కృతి దెబ్బతింటుంది. ఎవరి మతాలు వారు అనుసరించాలి. హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలి.
- కె. విరూపాక్ష, కంచరపాలెం
తెలుగు భాషకు తెగులు
తెలుగు భాష అంతరించిపోవడానికి పాలకులు, ప్రజలు యధాశక్తి కృషి చేస్తున్నారు. భాషను పోషించి ప్రభలు విరజిమ్మ వలసిన మన మాతృభాషకు వత్తులు, దీర్ఘాలు, ఎలా పలకాలోకూడా తెలియని తెలుగువారున్నారంటే అందుకు ముఖ్యకారణం తెలుగు మాధ్యమం లేని కానె్వంట్ చదువులు. మరోకారణం తల్లిదండ్రులు. తెలుగు చదివితే ఉద్యోగాలు రావనే బెంగ. ఇతర రాష్ట్రాల వారు తమ భాషకు పట్టం కడుతుంటే, తెలుగువారు తమ భాషకు తెగులు పుట్టిస్తూ మృతభాషను చేసేస్తున్నారు.
- ఎన్. రామలక్ష్మి, సికిందరాబాద్
అటవిక సంస్కృతి
నివాసగృహాల మధ్య, కాలనీ ఏరియాల్లోను ఆలయాలు, కళ్యాణ మండపాలు కట్టుకోవచ్చు. శుభ కార్యాలు జరుపుకోవచ్చు. కాని ఆ సంబరాలను ఇతరులకి కష్టం కలుగకుండా నిర్వహించుకోవాలి. కాని అతి భారీ సౌండ్‌తో వాద్యబృందాలు ఒకపక్క, మరోపక్క చెవులు చిల్లులు పడే శబ్దంతో నేల బాంబులు పేల్చడం అవసరమా? ఎవరైనా ప్రశ్నిస్తే ఆరోజు వాడకానికి కమిటీ వారికి వేల రూపాయలు చెల్లించామంటారు. రహదారిలో ట్రాఫిక్‌కు అంతరాయం కల్పిస్తూ స్టేజీలు నిర్మించేవారూ ఎక్కువే. వీరు చేసే ఒక్కరాత్రి గానా బజనాలకుతోడు బాంబుల మోతలు. ఇటువంటి వీధి జాతరలకి ఎమ్మెల్యేల ఫోటోలు అతికిస్తారు. సంవత్సరం పొడవునా ఇదే తంతు. ఈ పబ్లిక్ న్యూసెన్స్‌ను పోలీసులు అరికట్టాలి. నాయకుల ఒత్తిళ్లను పట్టించుకోకుండా, పోలీసులు ఈ అటవిక సంస్కృతికి అడ్డుకట్ట వేయాలి.
-తాళాబత్తుల సత్యనారాయణ మూర్తి,
మల్కాపురం, విశాఖ
రియాల్టీ షోలు అవసరమా?
టీవీ ఛానళ్లలో రియాల్టీ షోల పేరుతో వస్తున్న సాహసాలు యుతవను ఆకర్షింపచేస్తూ వారికి ప్రాణసంకటంగా మారుతున్నాయి. వీటిని అనుకరించి యువత ప్రాణాలకు ముప్పు కొని తెచ్చుకుంటున్నారు. మరి ఇలాంటి షోలు అవసరమా? వీటికి పరిమితులు ఉండాలి. అలాగే డ్యాన్స్ కార్యక్రమాలు కొన్నింటిని చూస్తుంటే ఇవి డ్యాన్స్ పోటీలా, మనుషులతో చేయించే సర్కస్ ఫీట్లా అనిపిస్తుంది. ప్రాణాల మీదికి తెచ్చుకోవడం అవసరమా? ఇలాంటివి చేసేటప్పుడు ప్రేక్షకుల క్షేమాన్ని కాంక్షిస్తే మంచిది.
-సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
ఇంకుడు గుంతలు
తప్పనిసరి చేయాలి
ఇంటింటికీ ఇంకుడు గుంతలను మున్సిపాలిటీ వారు తప్పనిసరి చేసినట్లే, గ్రామ పంచాయతీలు, తండాల్లో కూడా ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలను తప్పనిసరి చేయాలి. డాబాద్వారా వచ్చే నీరు ఇంకుడు గుంతలకు కలపాలి. దాంతో భూగర్భ జలవృద్ధి జరుగుతుంది. వచ్చే జూన్, జులై కల్లా దేశం మొత్తం నిర్మాణం జరిగితే, క్రమంగా నీటికొరత తగ్గి కరువుకాటకాలు రాకుండా పోతాయి. కాబట్టి ప్రజలు తమంత తాముగా ఎవరింట్లో వారే ఇంకుడు గుంతలను నిర్మించుకోవచ్చు. దీన్ని పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించాలి.
- కొత్తపల్లి పోషన్న
ములుగు, వరంగల్ జిల్లా