సంపాదకీయం

‘పదును’ పెట్టండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్‌కు కల్పిస్తుండిన ‘అత్యంత ప్రాధాన్య దేశం’ వాణిజ్య సౌకర్యాన్ని మన ప్రభుత్వం ఫిబ్రవరి పదహైదవ తేదీన రద్దు చేయడం ఆలస్యంగా సంభవించిన మంచి పరిణామం. దశాబ్దుల తరబడి మన దేశంలోని వేల మంది జిహాదీ బీభత్సకారులను ఉసిగొలిపి అనేక వేల మంది అమాయకులను హత్యచేయించిన పాకిస్తాన్ ప్రభుత్వంతో మన ప్రభుత్వం వాణిజ్య సంబంధాలను కొనసాగించడమే వైపరీత్యం. ‘అత్యంత ప్రాధాన్య దేశం’ హోదా- మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్- ఎమ్‌ఎన్‌ఎఫ్ స్టేటస్-ను కల్పించడం మరింత విడ్డూరం. మిత్రదేశాల మధ్య మాత్రమే కొనసాగవలసిన ఈ వాణిజ్య సౌకర్యాన్ని మన ప్రభుత్వం గతంలో పాకిస్తాన్‌కు కట్టబెట్టడం మన వైఫల్యం. ఇప్పుడు మన ప్రభుత్వం ‘పాకిస్తాన్ బీభత్స ప్రభుత్వానికి’ ఈ హోదాను రద్దుచేయడానికి తక్షణ నేపథ్యం జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవన్తిపురా సమీపంలో నలబయి మంది కేంద్ర పోలీసులను పాకిస్తాన్ ప్రభుత్వం హత్య చేయించడం.. నలబయి మంది భరతమాత వజ్రాల బిడ్డలను అత్యంత పైశాచికంగా హత్యచేయించిన పాకిస్తానీ బీభత్స ప్రభుత్వానికి ఇలాంటి ‘అల్పశిక్ష’ను మాత్రమే విధించడం మరో వైపరీత్యం. 1993 నుంచి పాకిస్తాన్ మన దేశంలో జిహాదీ బీభత్సకాండను ముమ్మరం చేసింది. ఈ జిహాదీ బీభత్సకాండ 1947లో అఖండ భారతదేశ విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడిన ఫలితం.. 1947లో జరిగిన అఖండ భారత విభజన క్రీస్తుశకం ఎనిమిదవ శతాబ్ది నుంచి మన దేశంలో చొఱపడిన ‘జిహాదీ’ ఉన్మాదుల బీభత్సకాండ ఫలితం! ప్రపంచంలోని అన్ని ఇతర మతాలనూ ధ్వంసం చేసి, నిర్మూలించి ఇస్లాంను ఏకైక మతంగా నిలబెట్టడం జిహాదీ బీభత్సకారుల లక్ష్యం.. ఈ లక్ష్యం నెరవేరదు.. కానీ నెరవేరేవరకు హత్యాకాండను, బీభత్సకాండను కొనసాగించాలన్నది ‘జిహాదీ’ల స్వభావం! అందువల్ల పాకిస్తాన్ ఉసిగొల్పుతున్న జిహాదీ బీభత్సం స్వభావాత్మకమైనది. అది ప్రతి క్రియాత్మకమైనది కాదు. ఏదో ఒక ‘ఘటన’ జరిగినప్పుడు దానికి ‘ప్రతిక్రియ’గా మరో ఘటన జరిగినట్టయితే అది ప్రతిక్రియాత్మకం!! ‘కుక్క తోకను తొక్కినప్పుడు అది గట్టిగా అరచి గోళ్లతో గీరడం’ ప్రతిక్రియకు ఒక ఉదాహరణ! కానీ తోడేళ్లు ఆవుల మందలలోకి చొరబడి ఆవుల దూడల గొంతులను కొరకడం ‘ప్రతిక్రియ’ కాదు. అలా ఆవులను గొంతులు కొరికి హత్యచేయడం తోడేళ్ల సహజ స్వభావం! ‘జిహాదీ’లు ఇలాంటి తోడేళ్లు.. ఈ జిహాదీ స్వభావం నిహితమై ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వంతో మన ప్రభుత్వం దౌత్య వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకొని ఉండరాదు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మన దేశ ప్రజలను హత్యచేస్తుండిన దశాబ్దుల కాల వ్యవధి మన ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది, వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకొంది, జమ్మూ కశ్మీర్‌లో ‘అధీనరేఖ’- లైన్ ఆఫ్ కంట్రోల్- ఎల్‌ఓసి- పాకిస్తాన్‌తో ‘సీమాంతర వాణిజ్యాన్ని’ ప్రారంభించింది, పాకిస్తాన్‌కు ‘ఎమ్‌ఎఫ్‌ఎన్’ను కట్టబెట్టింది! ఈ ‘సీమాంతర వాణిజ్యం’- క్రాస్ బార్డర్ ట్రేడ్- పాకిస్తాన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘సీమాంతర బీభత్సం’- క్రాస్ బార్డర్ టెర్రరిజమ్- మరింత విస్తరించడానికి దోహదం చేయడం దశాబ్దుల విపరిణామం..
ఇప్పుడైన మన ప్రభుత్వం పాకిస్తాన్‌తో వాణిజ్య సంబంధాలను పూర్తిగా తెగతెంపులు చేసుకొనక పోవడం, అవన్తిపురం హత్యాకాండ నేపథ్యంలో మన ప్రభుత్వ వైఖరిలో పెరిగిన ‘కరకుతనం’ వెనుక నుండి తొంగిచూస్తున్న ‘మెతకతనం’. మన ప్రభుత్వ ‘మెతక తనం’ వల్లనే దేశంలోని అనేక ప్రాంతాలలో పాకిస్తాన్ అనుకూల ‘ప్రచ్ఛన్న బీభత్సపు తోడేళ్లు’ కోరలను నిగిడిస్తున్నాయి, అవన్తిపురంలో మన నలబయి మంది జవానులను చంపిన పాకిస్తాన్‌ను సమర్ధించడానికి యత్నిస్తున్నాయి. ఈ ‘తోడేళ్లు’ మానవ అధికార ఉద్యమకారుల రూపంలోను, విద్యార్థుల రూపంలోను, అధ్యాపకుల రూపంలోను, మేధావుల రూపంలోను దేశమంతటా ఇప్పటికీ సంచరిస్తూనే ఉండడం మన భద్రతా వ్యవస్థలో ఏర్పడి ఉన్న ఛిద్రాలకు - కన్నాలకు- నిదర్శనం. సైనిక దళాలు, అనుబంధ సైనిక దళాలు జమ్మూ కశ్మీర్‌లో ‘మానవుల’ హక్కులకు భంగం కలిగిస్తున్నందుకు ప్రతిక్రియగా మాత్రమే పుల్వామా జిల్లాలోని అవన్తిపురావద్ద మన పోలీసుల హత్య జరిగిందని ఇలాంటి ప్రచ్ఛన్న బీభత్సకారులు సామాజిక మాధ్యమాలలో నిర్లజ్జగా ప్రచారం చేయగలగడానికి కారణం కూడ మన ప్రభుత్వ స్వభావంలో 1947 నుంచి నిహితమై ఉన్న మెతకతనం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోనే ఇలాంటి ‘సామాజిక మాధ్యమ బీభత్సకారులు’ నలుగురు పట్టుబడ్డారు, ఇతర ప్రాంతాలలో సైతం అనేకమందిని పోలీసులు నిర్బంధిస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రచ్ఛన్న- పరోక్ష- బీభత్సకారులను, పాకిస్తాన్ సమర్ధకులను ‘ఘటనలు’ జరుగకముందే పసిగట్టి పట్టుకోవడం భద్రత పటిష్ఠం కావడానికి దోహదం చేయగలదు!
జిహాదీ పాకిస్తాన్‌కు అనుకూలంగా, బీభత్సకారులకు మద్దతుగా ఇలా అతార్కికమైన - అన్యాయం మాట దేశ విద్రోహం మాట తరువాతి విషయాలు- వాదం వినబడడం ప్రచారం కావడం విచిత్రమైన వ్యవహారం. ఏదో ఒక ఘటనకు ప్రతిక్రియగా ‘జిహాదీ’లు మన పోలీసులను సైనికులను ప్రజలను చంపుతున్నారన్నది ఈ అతార్కిక వాదం. ‘జిహాదీ’లు అసాధ్యమైన తమ లక్ష్యసాధన కోసం, ఇస్లాం మతం పుట్టిన నాటినుంచి కూడ ‘ప్రతిక్రియ’గా కాక, సహజ స్వభావంతోనే హత్యాకాండ సాగించడం అంతర్జాతీయ వాస్తవం! ఈ వాస్తవం క్రీస్తుశకం 712 నుంచి మన దేశాన్ని ఆవహించి ఉంది.. 712లో సింధు ప్రాంతంలోని దేవల పట్టణంలో మహమ్మద్ బిన్ కాసిమ్ అనే అరబ్బీ బీభత్సకారుడు జరిపిన భయంకర పైశాచిక హత్యాకాండ ఏ ఘటనకు ప్రతిక్రియ? 1947లో పాకిస్తాన్ ఏర్పడడంతో ‘జిహాదీ’లు ఆ ప్రాంతంలో తమ లక్ష్యాన్ని సాధించారు. అన్యమతస్థులను నిర్మూలించి ‘‘ఇస్లాం మత రాజ్యాం’’గా పాకిస్తాన్‌ను ఏర్పాటుచేయగలిగారు. కానీ మళ్లీ మన దేశంలోకి ‘జిహాదీ’లు అప్పటినుంచీ చొరబడుతూనే ఉన్నారు! ‘ఇది దేనికి ప్రతిక్రియ?? కశ్మీర్‌లో అల్పసంఖ్యాక మతస్థులైన కశ్మీరీ పండితులను ‘లోయ ప్రాంతం’నుంచి ‘జిహాదీ’లు తరిమేశారు, ‘లోయ’ ప్రాంతంలో సర్వమత సమభావ సమాజాన్ని నిర్మూలించారు. ఇది దేనికి ప్రతిక్రియ?? ‘జిహాదీ’ల స్వభావాత్మకమైన ఈ బీభత్సకాండను నిరోధించడానికి మాత్రమే మన సైనిక దళాలు ప్రతిఘటనకు పూనుకున్నాయి, పూనుకుంటున్నాయి. పాకిస్తాన్ జిహాదీ ప్రభుత్వ చర్యలకు మన ప్రభుత్వం ప్రతిక్రియ సాగిస్తోంది. చారిత్రక వాస్తవాలు ఇలా ‘జిహాదీ’ హత్యాకాండ సహజ స్వభావమని- తోడేళ్లకు ఆవులపై దూకడం స్వభావమయినట్టు- ధ్రువపరిచాయి, పరుస్తున్నాయి. కానీ జిహాదీలు ‘మన ప్రభుత్వం హక్కులను భంగం చేస్తున్నందున ప్రతిక్రియగా మాత్రమే దాడులు చేస్తున్న’ట్టు ప్రచారం చేయడానికి వివిధరకాల ‘ముసుగు’లలోని పాకిస్తానీ తొత్తులు మన దేశంలో ప్రచారం చేయగలగడం వాస్తవాల వక్రీకరణకు పరాకాష్ఠ.
సామాజిక మాధ్యమాలలో ఇలా పాకిస్తాన్‌ను పరోక్షంగా సమర్ధించే దేశ విద్రోహులు పుట్టుకొని రావడం ఇటీవలి పరిణామం.. పాకిస్తాన్‌ను ప్రత్యక్షంగా సమర్ధిస్తున్న దేశద్రోహులు జమ్మూ కశ్మీర్‌లో దశాబ్దుల తరబడి ‘గొప్ప గౌరవం’గా జీవించగలుగుతున్నారు. ‘హురియత్’ ముదురు ముఠాకు చెందిన సయ్యద్ అలీషా జీలానీ, ‘హురియత్’ మెతక ముఠాకు చెందిన ‘మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్’ వంటి వారు ఈ ప్రత్యక్ష పాకిస్తానీ సమర్ధకులు! జీలానీ కొన్ని నెలలుగా గృహనిర్బంధంలో ఉన్నాడట! ఉమర్ ఫరూక్, మరో ముగ్గురు పాకిస్తానీ తొత్తులు యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ నలుగురికీ ఇన్నాళ్లుగా కల్పించిన భద్రతను ప్రభుత్వం ఇప్పుడు ఉపసంహరించిందట! ఇంతవరకు ఇలాంటి విద్రోహులకు ప్రజల ధనంతో ‘్భద్రత’ను ఎందుకు కల్పించారు? వీరందరూ దేశద్రోహులని, నేరస్థులని నిరూపించగల ఆధారాలున్నప్పటికీ ఉమర్ ఫరూక్, జీలానీ వంటివారిని నిర్బంధించి న్యాయస్థానాల ముందు నిలబెట్టకపోవడం మన ప్రభుత్వం వారి దశాబ్దుల మెతకతనం.. క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్దినాటి కాళిదాస మహాకవి చెప్పినట్టు ‘ఎన్ని ఉపకారాలు చేసినప్పటికీ దుర్జనుడు తన దుర్మార్గం వీడడు. అపకారం జరిగినప్పుడు మాత్రమే వాడు అణిగిపోతాడు’- ‘‘శామ్యేత్ ప్రత్యపకారేణ, నోపకారేణ దుర్జనః..’’