సంపాదకీయం

‘అభినందన’ దౌత్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శస్త్ర విజయంతోపాటు ‘శాస్త్ర’ విజయం కూడ మన దేశానికి లభించింది. పాకిస్తాన్ ప్రభుత్వ అక్రమ నిర్బంధంనుంచి మన వాయుసేన ‘విభాగ అధిపతి’ అభినందన్ వర్థమాన్‌కు శుక్రవారం విడుదల లభించనుండడం మన ప్రభుత్వానికి లభించిన శాస్త్ర విజయం... దౌత్య శాస్త్ర విజయం. ‘అధీన రేఖ’ను దాటి వెళ్లిన మన వైమానిక దళం ‘గగన సమర శకటాలు’- యుద్ధ విమానాలు- పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లోని బూలకోట తదితర ప్రదేశాలలో నెలకొన్న ‘జైషే మొహమ్మద్’ జిహాదీ బీభత్స స్థావరాలను సోమవారం తెల్లవారుజామున బద్దలుకొట్టడం ‘శస్త్ర’ విజయం. బుధవారం ఉదయం మన గగనతలంలోకి దూసుకొని వచ్చిన పాకిస్తానీ దురాక్రమణను కూల్చివేయడం శాస్త్ర విజయం. ఇలా ఈ గగన తల దురాక్రమణను తిప్పికొట్టిన సమయంలో గాయపడి పాకిస్తాన్ సైనికులకు చిక్కిన అభినందన్ వర్థమాన్ శుక్రవారం మన దేశానికి తిరిగి వస్తుండడం మన దేశం సాధించగలిగిన విజయం, దౌత్యశాస్త్ర విజయం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం మరోసారి చెప్పినట్టు ‘మన జాతి మొత్తం ఒక్కటిగా దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతోంది, ఒక్కటిగా నిలచి విజయం సాధిస్తోంది’. అభినందన్ వర్థమాన్ క్షేమంగా తిరిగి వస్తోండడం ఇలా జాతీయ సమష్టి దౌత్య విజయం. అంతర్జాతీయ దౌత్య నిబంధనలకు విరుద్ధంగా, జెనీవా ఒప్పందంలోని యుద్ధ నియమావళికి వ్యతిరేకంగా అభినందన్‌ను ‘కళ్లకు గంతలుగట్టి అవమానకరమైన రీతి’లో ప్రదర్శించి పైశాచిక ఆనందాన్ని పొందిన పాకిస్తాన్ ప్రభుత్వం ముప్పయి ఆరు గంటలు గడవకముందే తోక ముడవక తప్పలేదు. అభినందన్ వర్థమాన్‌ను నిర్బంధ ముక్తుడిని చేసి భారతదేశానికి శుక్రవారం తిప్పి పంపుతున్నట్టు గురువారం పాకిస్తాన్ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో పాకిస్తాన్ ప్రధానిగా చెలామణి అవుతున్న ప్రచ్ఛన్న బీభత్సకారుడు ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించవలసి వచ్చింది. ‘అభినందన్ నిర్బంధం’ తమ నెత్తిమీదికెక్కిన ‘నిప్పులకుంపటి’ అన్నది ఇమ్రాన్‌ఖాన్ ‘‘ప్రభుత్వం’’ గ్రహించిన వాస్తవం. అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్‌ను తీవ్రంగా అభిశంసించడం ఈ ‘నిప్పుల కుంపటి’....
దశాబ్దుల తరబడి పాకిస్తాన్ ప్రభుత్వం బీభత్స స్వరూపాన్ని తానే వికృతంగా ప్రదర్శించడం చారిత్రక పునరావృత్తి! మన వాయుసేనకు చెందిన విభాగ దళాధిపతి- వింగ్ కమాండర్- అభినందన్ వర్థమాన్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం అనాగరిక పద్ధతిలో ప్రదర్శించిన తీరు ఈ పునరావృత్తి. పాకిస్తాన్ వైమానిక దళం బుధవారం ఉదయం పది గంటల ఇరవై నిముషాలకు జమ్మూకశ్మీర్‌లో అధీనరేఖ- లైన్ ఆఫ్ కంట్రోల్‌ను అతిక్రమించి మన వైపునకు దూసుకొని రావడం పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స రాజకీయ స్వభావానికి అనుగుణమైన విపరిణామం. ఈ దురాక్రమణను మన వాయుసేనకు చెందిన గగన సమరవీరులు తిప్పికొట్టడం సహజమైన ప్రతిక్రియ. ఇలా దురాక్రమణను ప్రతిఘటించడం తరతరాల భారతీయ స్వభావం! ఈ ప్రతిఘటన బుధవారం విజయవంతమైంది. ప్రతిఘటనలో భాగంగా మన గగన సమరవీరుడు అభినందన్ వర్థమాన్ గాయపడడం, ‘అధీనరేఖ’కు ఆవలివైపున పాకిస్తాన్ దురాక్రమణలో ఉన్న జమ్మూకశ్మీర్ భూభాగంపై పడడం దురదృష్టకరం. మాతృదేశ యశోవిభవ రక్షణలో లక్షలాది భరతమాత వజ్రాల బిడ్డలు క్షతగాత్రులు కావడం మన తరతరాల ప్రతిఘటన చరిత్ర. మనకు పట్టుబడిన విదేశీయ దురాక్రమణకారులను మన పాలకులు హింసించలేదు, సమ్మాన పూర్వకంగా వారిని నిర్బంధంలో ఉంచారు, ఆ తరువాత విడుదల చేశారు. పట్టుబడినవారు యుద్ధవీరులు అయినప్పుడు వారిని అవమానించరాదన్నది ధర్మయుద్ధ నీతి. యుద్ధవీరులకు ధర్మయుద్ధం సాగించిన ప్రత్యర్థులకు లభించవలసిన ఈ ‘నిర్బంధ’ ప్రతిపత్తిని మన పాలకులు బీభత్సకారులకు, దొంగదెబ్బ తీసిన ఆకతాయిలకు, చీకటిలో చొరబడి నిరాయుధులను చంపిన విదేశీయ హంతకులకు సైతం కట్టబెట్టడం చరిత్ర తిలకించిన మితిమీరిన ఔదార్యం. ఈ మితిమీరిన ఔదార్యం మన దేశానికి మహావిపత్తుగా పరిణమించడం కూడ చరిత్ర. మహమ్మద్ ఘోరీ, వాస్కోడిగామా వంటి బీభత్సకారులు విదేశాలనుంచి చొరబడి మన దేశంలో పట్టుబడి విముక్తిని పొందారు. ఇలాంటివారు మళ్లీ మన దేశంలోకి చొరబడి భయంకర బీభత్స పైశాచిక హత్యాకాండను కొనసాగించడం శతాబ్దుల చరిత్ర. అయినప్పటికీ మన పాలకులను పట్టుబడిన విదేశీయ దురాక్రమణకారులను, బీభత్సకారులను క్షమించి వదలిపెట్టడం చరిత్ర. ఈ చరిత్ర వేమన యోగి వంటివారి నోట ‘‘చంపదగిన యట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు.... పొసగ మేలుచేసి పొమ్మనుటే చాలు’’అని పలికించింది. ‘జైషే మొహమ్మద్’- జెఇఎమ్- జిహాదీ ముఠా నిర్వాహకుడిని, అజార్ మసూద్‌ను నిర్బంధించిన మన ప్రభుత్వం వాడిని మట్టుపెట్టలేదు, నిర్బంధించింది. ఆ తరువాత వాడు తప్పించుకోగలగడం బీభత్సం విశ్రమించబోదన్న చారిత్రక వాస్తవానికి మరో నిదర్శనం.
అజార్ మసూద్ వంటివారు, హఫీజ్ సరుూద్ వంటివారు దావూద్ ఇబ్రహీం ముఠావారు, కశ్మీర్ లోయలో పుట్టలు పగిలిన ‘హురియత్’, ‘జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్’- జెకెఎల్‌ఎఫ్- వంటి విద్రోహపు తండాలు కేవలం పాత్రధారులు. సూత్రధారి పాకిస్తాన్ సైన్యం. పాకిస్తాన్ సైనిక విభాగమైన ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్’- ఐఎస్‌ఐ- వారు రకరకాల పేర్లతో వివిధ జిహాదీ ముఠాలను రంగంమీదకు తెస్తున్నారు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ముఠా పేరుతో మన దేశంలో బీభత్సకాండను జరిపించడం పాకిస్తాన్ సైనిక దళాల వ్యూహంలో భాగం. ఈ ముఠాలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని, పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ పౌర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు చేస్తున్న ప్రచారం, ఈ ప్రభుత్వేతర జిహాదీ ముఠాలు ప్రత్యక్ష బీభత్సకారులు, పాకిస్తాన్ సైనిక దళాలవారు, పౌర ప్రభుత్వ నిర్వాహకులు ప్రచ్ఛన్న బీభత్సకారులు. పౌర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులను పాకిస్తాన్ సైన్యం నియంత్రిస్తోంది. మత పెద్దలుగా మత గురువులుగా మత నిష్ఠాపరులుగా చెలామణి అవుతున్న జిహాదీ సిద్ధాంతకారులు సైన్యాన్ని నియంత్రిస్తున్నారు. సైనిక నియంత్రితమైన పౌర ప్రభుత్వం మళ్లీ కొత్త జిహాదీలను తయారుచేస్తోంది. ఇదీ పాకిస్తాన్ సమాజ సమష్టి స్వభావ ‘వృత్తం’ స్వరూపం. ఈ జిహాదీ బీభత్స స్వభావం 1947నుంచి భారత వ్యతిరేక భూమికపై వికసిస్తోంది.
అందువల్ల ఒకరికి మించిన రీతిలో మరొకరు భారత వ్యితిరేక బీభత్సకాండను సాగిస్తున్నామని అంతర్గత సమాజంలో చాటుకొనడం, నిరూపించుకొనడం పాకిస్తాన్ రాజకీయవేత్తల మనుగడకు, అధికార ప్రాప్తికి వౌలిక ప్రాతిపదిక. ఈ తమ భారత వ్యతిరేకత ఏమాత్రం సడలినట్టు అనుమానం కలిగినప్పటికీ ‘జిహాదీ’సిద్ధాంత గణ నియంత్రిత సైనిక దళాలు తమను అధికారంనుండి తొలగించడం ఖాయమన్నది పాకిస్తాన్‌లో పౌర ప్రభుత్వ నిర్వాహకులుగా చెలామణి అవుతున్న పరోక్ష- ప్రచ్ఛన్న- జిహాదీలకు తెలిసిన చారిత్రక వాస్తవం. అందువల్లనే మాజీ ‘‘ప్రధానులు’’ నవాజ్ షరీఫ్, యూసఫ్ రజా జిలానీ వంటి వారికంటె మిన్నగా ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ భారత వ్యతిరేక బీభత్సాన్ని ప్రదర్శిస్తున్నాడు. ‘అభినందన్’ కళ్లగంతలు కట్టి ప్రదర్శించడం ఇందులో భాగం. గతంలో నవాజ్ షరీఫ్ దొరతనం ఇలాంటి ప్రదర్శనలు జరిపింది. అందువల్ల ఇమ్రాన్‌ఖాన్ ఈ బీభత్స ప్రదర్శనల పోటీలో వెనుకబడ దలచుకోలేదు... అంతర్జాతీయ అభిశంసనకు భయపడి అభినందన్‌ను విడుదల చేయడం తాత్కాలిక ‘అపవాదం’....