ఉత్తరాయణం

ఆశలు అడియాశలు కావద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృపాల్‌సింగ్..!ఎక్కడా, ఎప్పుడూ ఈ పేరు వినలేదే. ఓహో-1992వ సంవత్సరం వాఘా వద్ద సరిహద్దులు దాటుతుండగా భారత్ గూఢచారేమోనని పాకిస్తాన్‌వారు అతన్ని బంధిం చి వారి జైల్లోపెట్టారా? 2016 ఏప్రిల్ 13న అయిదుపదుల వయసులో అనారోగ్యంతో మరణించాడా? అయ్యో పాపం. ఈ పాతికేళ్ళు పాలించిన ఏ ఒక్క భారత ప్రభువుకు ఈ సంగతులు తెలియవా! గత పాక్, భారత్‌యుద్ధాల్లో పట్టుబడిన వేల పాక్ సైన్యాన్ని పూర్ణకుంభంతో వారి దేశానికి పంపిన విశాల హృదయమే మనవారిది. ఈ ఇచ్చిపుచ్చుకోడాలు తెలియని పుచ్చు, కుళ్ళు, సంకుచిత మనస్తత్వం కలదా ఆ దేశ పాలకులది! ‘‘మహాత్మాగాంధీ పేరు, భగత్‌సింగ్ పేరు ఎవరో చెప్పగా విన్నాం. వివేకానందుడు, బుద్ధుడు ఏం చేసారీ దేశానికి? రాముడెవరు?- ఓ అమాయకుడు. కృష్ణుడెవరు?- ఓ మోసకారి. దుర్గమ్మ ఎవరు? ఓ వ్యభిచారిణి,’’ ఇవి నేటి విద్యార్థులకు కొంతమంది ఉపాధ్యాయులకు తెలిసిన పుణ్యసమాచారం. ముదిగొండ శివప్రసాద్‌గారు పేరున్న చరిత్రకారులు. ప్రధాని మోదీ మీద తరగని విశ్వాసం, నమ్మకంతో, మమకారం చావక చంకనెత్తించుకున్నారు ఎన్నో రచనలలో. ఆయనిప్పుడు నిజం తెలుసుకుంటున్నారు. ప్రేమగా పాఠాలు చెబుతున్నా చెవికెక్కించుకోని మరో వౌనముని మోదీగారు. ఇంకెంత చెబుతాం? ఎన్నిసార్లు రాస్తాం. ఇప్పటికే పదవీ జీవితంలో సగం ఊరికే హరించుకుపోయింది. మిగిలిన సగంకూడా బయటి ఊళ్ళు తిరుగుతూ, ఇంటి పట్టునుండక ఇల్లుచక్కదిద్దుకోకపోతే, ఈ ఉన్న యింట్లోకి మరొకరు ప్రవేశించే ప్రమాదం పొంచిఉన్నది. ఈ దేశ ప్రజల ఆశలు అడియాసలు కావని ఆశిద్దాం.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
దెబ్బతింటున్న మనోభావాలు
భారతదేశం విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. భిన్నత్వంలో ఏకత్వం యావత్ ప్రపంచంలో ఒక భారతదేశంలోనే సాధ్యమయ్యింది. అన్నిమతాలను ఆదరించడం, అక్కున చేర్చుకోవడం, సర్వమత సమానత్వం వంటి అంశాలను హిందువులు తరతరాలనుండి ఆచరించి చూపిస్తున్నారు. హిమాలయాల వంటి ఉన్నత, వ్యక్తిత్వం, వైశిష్ట్యం స్వంతంచేసుకున్న హిందూమతంపై సత్సంప్రదాయాలపై ఈమధ్యకాలంలో అనేక వివాదాలు సృష్టిస్తున్నారు. ఇటీవల శని శింగణాపూర్ దేవాలయంలో మహిళలకు ప్రవేశం కల్పించాలన్న ఉద్యమం మొదలయ్యంది. మహిళలకు సమాన హక్కుల నినాదం ముసుగులో హిందు మతంపై బురదజల్లే ప్రయత్నం సాగుతోంది. అనాదిగా ఆగమశాస్త్ర నియమాలు అనుగుణంగా ప్రతీ దేవాలయంలో కొన్ని నిబంధనలు వుంటాయి. వాటివెనుక లోతైన పరమార్థం వుంటుంది. మన మహర్షులు తమ తపశ్శక్తిద్వారా వీటిని ఏర్పరిచారు. వీటిని అర్థంచేసుకోకుండా, ఆగమశాస్త్ర నియమాలను ఉల్లంఘించి కొన్ని పనులు చేస్తామంటే అది మంచి పద్ధతి కాదు. ఈ విషయంలో కోర్టులు జోక్యంచేసుకోవడం మన భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
ఫ్లెక్సీలతో ఇబ్బందులు
ఎన్నికల సమయంలో, నాయకులు మంత్రులు వచ్చే సమయంలో ఫ్లెక్సీ బోర్డులు ప్రధాన రోడ్లకు ఇరుప్రక్కల ఏర్పాటువల్ల వాహనదారులు ఇబ్బందులపాలవుతున్నారు. ప్రమాదాలకు గురవుతున్నారు. ఫ్లెక్సీ ఆకర్షణీయంగా ఉండటం వాటివైపు దృష్టిసారించటంవల్ల వాహనాలు అక్కడ నిలిపివేసి చూడటంవల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతోంది. రోడ్డు డివైడర్స్‌లోని వాటిల్లో ఫ్లెక్సీలు ప్రమాదమయవౌతున్నాయి. ప్రతి చిన్న చిన్న బజారుల్లో, ఎక్కడబడితే అక్కడ విద్యుత్, టెలిఫోన్ ఇతర స్తంభాలకు ఏర్పాట్లవల్ల ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రతి రహదారిలో ప్రకటన నిమిత్తం ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు సైతం దృష్టిమళ్లించేవిధంగా ఉంటున్నాయ. దీంతో ప్రజలు నానా ఇబ్బందులకు గురిఅవుతున్నారు. పార్టీలకు సంబంధించిన బెలూన్ ఏర్పాటువల్ల కూడా ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రజలకు ఇబ్బంది లేక, అసౌకర్యం కలిగించకుండా ఫ్లెక్సీల ఏర్పాట్లుచేసుకునే విధంగా ప్రభుత్వ అధికారులు చర్యలుతీసుకోవాల్సి ఉంటుంది. పట్టణ స్థాయికి మించి ఫ్లెక్సీలు ఉండటం భావ్యంకాదని స్థానికులు కోరుతున్నారు.
- అయినం రఘురామరావు, ఖమ్మం
మీడియా పక్షపాత వైఖరి
అసోం ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌కే ఓటు వేయాలన్న ముస్లిం పెద్దల నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక గృహిణి భాజపాకి ఓటు చేసినందుకు తలాఖ్ చెప్పి భర్త ఆమెకు విడాకులిచ్చాడు. మీడియా దృష్టిలో ఇది వార్త కాదు. ప్రచారమే లేదు. అదే ఒక హిందూ గృహిణి పెద్దల్ని ధిక్కరించి ఓటు వేసి విడాకులకు గురయితే ఎంత యాగీ జరిగేది? మనదేశంలో ప్రజాస్వామ్యమే అంతరించిందని వామపక్షాలు చెలరేగేవి. మహిళా సంఘాలు ఊగిపోయేవి. టీవీల్లో చర్చల రచ్చలు జరిగేవి. ఆలయాల్లో మహిళల ప్రవేశం కోసం కోర్టుకెక్కిన మహిళా సంఘాలు ముస్లిం గృహిణి విడాకుల విషయం పట్టించుకోలేదు. ఎంత విచిత్రం!
- చంద్ర, కాకినాడ