సంపాదకీయం

‘నిర్వాహక’ అలసత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి భారతీయ జనతాపార్టీ నాయకుడు ఆదిత్యనాథ యోగి మూడురోజులపాటు ‘‘ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదని’’ ‘ఇసి’ ఆదేశించడం అపూర్వ, అపురూప పరిణామం! ‘బహుజన సమాజ్ పార్టీ’ అధినాయకురాలు మాయావతి కూడ రెండు రోజులపాటు ప్రచారానికి దూరంగా ఉండాలని ‘ఇసి’ నిర్దేశంచడం ‘‘నోళ్లు పారేసుకొనే’’ రాజకీయ ప్రదర్శనలకు మరో నిరోధం! ‘‘నరేంద్ర మోదీ - చౌకీదార్- దొంగ- చోర్-’’అన్న తన ‘‘కనిపెట్టడాన్ని’’ సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించిందన్న రాహుల్‌గాంధీ చేస్తున్న ప్రచారానికి ఎదురుదెబ్బ తగలడం సమాంతర పరిణామం! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవనప్రస్థానం ప్రాతిపదికగా రూపొందిన చలనచిత్రం- బయోగ్రాఫికల్ పిక్చర్- ‘ఇసి’ చూసిన తరువాతనే ఈ చలనచిత్రం ప్రదర్శనపై నిర్ధారించాలని సర్వోన్నత న్యాయస్థానంవారు ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకున్న మరో గొప్ప ప్రచార పరిణామం. రాజ్యాంగ సంస్థలను రాజకీయవేత్తలు, రాజకీయ ప్రత్యర్థులు పరస్పరం తిట్టడం! రాజ్యాంగ సాధికార సంస్థల నిష్పక్ష స్వతంత్ర కార్యాచరణను రాజకీయవేత్తలు సందేహిస్తుండడం ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో ప్రస్ఫుటిస్తున్న ప్రధాన వైపరీత్యం! రాజకీయవేత్తల ఆరోపణల సంగతి ఎలా ఉన్నప్పటికీ ‘్భరత ఎన్నికల సాధికార సంఘం’- ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా-‘ఇసి’-వారి పనితీరులో ‘సందిగ్ధత’ ఏర్పడి ఉందన్నది మాత్రం స్పష్టం. ఈ వాస్తవం ‘సర్వోన్నత న్యాయస్థానం’వారు ‘ఎన్నికల సాధికార సంఘం’వారి అలసత్వం గురించి చేసిన వ్యాఖ్యలతో మరోమారు ధ్రువపడింది. ‘‘యుద్ధం చేయాలా? వద్దా?’’ అన్నది ఐదువేల నూట యాబయి ఆరేళ్లకు పూర్వం- క్రీస్తునకు పూర్వం మూడువేల నూట ముప్పయి ఎనిమిదవ సంవత్సరం- జరిగిన మహాభారత సంగ్రామ సమయంలో అర్జునునికి వచ్చిన సందేహం! ‘‘చర్య తీసుకోవాలా? వద్దా...??’’ అన్న ‘మీమాంస’ ఎన్నికల సంఘం వారిని ఆవహించి ఉండడం నేటి ప్రచార ఘట్టంలోని ప్రధాన అంశం. రాజకీయవేత్తలు ‘ఎన్నికల సంఘం’ గురించి చెపుతున్న మాటలలో వాస్తవం ఉండవచ్చు, లేకపోవచ్చు! రాజకీయవేత్తలు- ప్రధానంగా ఓటమి భయం ఆవహించిన రాజకీయ పక్షాలవారు- ‘ఇసి’ తమకు వ్యతిరేకంగా పనిచేస్తోందన్న ఆరోపణలను ‘‘సంధిస్తున్నారు.’’ వారి భయంకూడ నిజం కావచ్చు, కాకపోవచ్చు! అయినప్పటికీ భయపడుతున్న రాజకీయవేత్తలు ‘‘తమ ఓటమికి’’- ఒకవేళ ఓడినట్టయితే- కారణం ప్రజలుకాదని ప్రజల మద్దతును తాము కోల్పోవడం కాదని వాదించడానికి వీలుగా ముందుగానే ‘‘మతదాన ప్రక్రియలో అక్రమాలు జరిగిపోయాయి’’ అని ఆర్భాటిస్తూ ఉండవచ్చు! దీనివల్ల ‘ఎన్నికల సంఘం’వారి నిష్పక్ష వ్యవహారం భంగపడదు. కానీ ‘‘ఏమిచేస్తే ఏమి జరుగుతుందో??’’ అన్న తడబాటు ‘ఎన్నికల సంఘం’ వారిని ఆవహించి ఉందన్నది మాత్రం స్పష్టం! ‘ఎన్నికల కమిషన్’ కేవలం ‘నోటీసుల’ను మాత్రమే జారీచేస్తూ ఉందని, తప్పుచేస్తున్న రాజకీయవేత్తలపై చర్యలు తీసుకోవడం లేదని ‘సర్వోన్నత న్యాయస్థానం’ వ్యాఖ్యానించిన తరువాత కాని ‘ఎన్నికల సంఘం’ చర్యలకు పూనుకోవడం లేదు.
మొత్తంమీద గొప్ప గందరగోళం నెలకొని ఉండడం సామాన్యులకు అంతుపట్టని వ్యవహారం. ఈ గందరగోళం నెలకొని ఉండడానికి ‘ఎన్నికల సాధికార సంఘం’వారు కూడ దోహదం చేస్తున్నారు. సర్వోన్నత న్యాయస్థానంవారు ‘‘ఎన్నికల సంఘానికి’’ ఉన్న అధికారాలను బాధ్యతలను గుర్తుచేయవలసి వచ్చింది. గుర్తుచేసిన తరువాత కాని రాజకీయవేత్తల ‘‘నోళ్ల’’ను అదుపుచేయడానికి ఎన్నికల సంఘంవారు పూనుకోలేదు. ఆదిత్యనాథయోగి, మాయావతి ఎన్నికల ప్రచార సమయంలో ‘‘మతపరమైన వైరుధ్యాలను రెచ్చగొట్టడానికి యత్నిస్తున్నట్టు’’ సర్వోన్నత న్యాయస్థానం జోక్యంచేసుకున్న తరువాత కాని ‘ఇసి’వారు నిర్ధారించలేకపోయారు. కాంగ్రెస్‌కు వోట్లువేయడం ద్వారా తమ వోట్లను చీల్చవద్దని ఇస్లాం మతస్థులను మాయావతి కోరిందట! ‘‘మీకు ‘అలీ’ ఉంటే మాకు ‘బజరంగ్‌బలి’ ఉన్నాడు’’ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించాడట! అందువల్ల ‘ఇసి’వారు ఈ ఇద్దరు నాయకులను శిక్షించింది. ఇలా ‘‘మత’’ వైరుధ్యాలను రెచ్చగొట్టడం’’ వీరిద్దరికి మాత్రమే పరిమితమైన అంశమా?? దేశమంతటా అనేకమంది రాజకీయవేత్తలు మతవైరుధ్యాలను రెచ్చగొట్టినట్టు ఫిర్యాదులు వచ్చాయి.’’ కానీ ‘ఇసి’వారు చర్యతీసుకోవాలా? వద్దా??’’అన్న సందిగ్ధతను ప్రదర్శించారు. ఆనాడు మహాభారత యుద్ధసమయంలో అర్జునునికి యదుకుల కృష్ణుడు కర్తవ్యబోధ చేశాడు. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం చురకలు అంటించిన తరువాత కాని ‘ఎన్నికల సాధికార సంఘం’లో కదలిక ఏర్పడలేదు. ఈ కదలిక కూడ ఇద్దరిని ప్రచార బహిష్కృతులను చేయడానికి మాత్రమే పరిమితమైంది. మిగిలిన ‘‘నోరుపారేసుకుంటున్న’’ రాజకీయ ‘ఘరానా’ల మాటేమిటి?? ఎన్నికల ‘నైతిక ప్రవర్తన నియమావళి’- మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్- కేవలం మత వైరుధ్యాలను రెచ్చగొట్టడాన్ని మాత్రమే నిషేధించడం లేదు. అనేక ఇతర నిషేధాలు కూడా ఉన్నాయి.
కాంగ్రెస్ అధ్యక్షుడుగా చెలామణి అవుతున్న రాహుల్‌గాంధీకి సర్వోన్నత న్యాయస్థానం ‘న్యాయధిక్కరణ’ అభియోగపత్రాన్ని- కంటెప్ట్ ఆఫ్ కోర్టు నోటీస్- జారీచేయడం ‘‘నోళ్లు పారేసుకుంటున్న’’ రాజకీయవేత్తలకు కనువిప్పు కలిగించదగిన శుభపరిణామం! ఎన్నికల ప్రచారం ముగిసిన రాష్ట్రాలలోను, ఎన్నికల మతప్రదానం- పోలింగ్-కూడ పరిసమాప్తమైన రాష్ట్రాలలోను రాజకీయవేత్తలు ‘‘నోళ్లుపారేసుకుంటునే’’ ఉన్నారు. అందువల్ల ప్రచార ఘట్టంలో విన్యాసాలు ప్రదర్శిస్తున్నవారు నోరుపారేసుకోవడం ఆశ్చర్యంకాదు. అలాగే రాహుల్‌గాంధీ కూడ నోరు పారేసుకున్నారు. ‘‘చౌకీదార్ చోర్ హై’’- కాపలాదారుడు దొంగ- అని ప్రధానిపై తాను చేస్తున్న వ్యాఖ్యను సర్వోన్నత న్యాయస్థానం కూడ అంగీకరించిందన్నది రాహుల్‌గాంధీ చెప్పిన ప్రచార అబద్ధం. అహంకారం, అజ్ఞానం కవలలు. అహంకారం ఉన్నచోట అజ్ఞానం కూడ ఉంటుంది. అందువల్ల అహంకారి అయిన రాహుల్‌గాంధీని అజ్ఞానం కూడ ఆవహించి ఉంది. కానీ ప్రచార సమయంలో రాహుల్‌గాంధీ చెప్పిన ఈ అబద్ధం ‘నైతిక ప్రవర్తన’కు విరుద్ధంకాదా?? ‘ఇసి’ ఎందుకని చర్య తీసుకోలేదు. ‘సుప్రీంకోర్టు’ చర్యతీసుకొనవలసి వచ్చింది. ఆఝంఖాన్ అనేవాడు ఉత్తరప్రదేశ్‌లో రామ్‌పూర్ నియోజకవర్గం నుండి సమాజ్‌వాదీ పార్టీ తరఫున లోక్‌సభకు పోటీచేస్తున్నాడట! భారతీయ జనతాపార్టీ తరఫున జయప్రద అనే చలనచిత్ర నటి పోటీచేస్తోందట. అందువల్ల ఆఝంఖాన్ అనేవాడు మహిళలను, మాతృమూర్తులను ఘోరంగా అవమానించే రీతిలో నీచ నికృష్ట పదజాలంతో వ్యాఖ్యానించాడట! అతగాడిపై ‘నేరారోపణ పత్రం’- ఫస్ట్ ఇన్‌ఫర్‌మేషన్ రిపోర్ట్- నమోదైంది. ‘ఇసి’వారు ఎందుకని తక్షణం చర్యతీసుకోలేదు? తటపటాయింపు దేనికని??
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హిందువులను కించపరిచే విధంగా ఎన్నికల ప్రచార సమయంలో వ్యాఖ్యలు చేశాడన్నది విశ్వహిందు పరిషత్‌వారు చేసిన ఆరోపణ. తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు ఎమ్.రామరాజు ఈమేరకు ‘ఇసి’కి ఫిర్యాదుచేశాడు. ‘ఇసి’ వెంటనే స్పందించి నిజానిజాలను నిగ్గుతేల్చలేదు. తేల్చి ఉండినట్టయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మతవైరుధ్యాలను రెచ్చగొట్టాడని కాని, రెచ్చగొట్టలేదని కాని ధ్రువపడి ఉండేది. ఆయన నిర్దోషి అయి ఉంటే సమస్యలేదు. కానీ ఆయన ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్టు ధ్రువపడి ఉంటే ఆదిత్యనాథ్‌యోగికి విధించిన ‘శిక్ష’ను చంద్రశేఖరరావుకు కూడా విధించి ఉండాలి! ఈ రెండింటిలో ఏదీకూడ ప్రచారం ముగిసేలోగా జరగలేదు. ఇది ‘ఇసి’అలసత్వం! ప్రవర్తన నియమావళిని రాజకీయవేత్తలు ఉల్లంఘించిన సమయంలో ‘ఇసి’ తనంతతానుగా ఎందుకని స్పందించడం లేదు?? ఎవరో ఒకరు ఫిర్యాదుచేస్తే తప్ప ‘ప్రచార నేరాలు’ ‘ఇసి’కి తెలిసిరావా?? ‘‘నోళ్లుపారేసుకుంటున్న’’ రాజకీయవేత్తలు ‘ఇసి’పై చేస్తున్న ఆరోపణలలో నిజం ఉండవచ్చు లేకపోవచ్చు. కానీ అలసత్వం, నిర్లక్ష్యం ‘ఇసి’ని ఆవహించి ఉన్నాయన్నది మాత్రం సతార్కికమైన సందేహం! తెలంగాణలోని అనేక లోక్‌సభ నియోజకవర్గాలలో ‘పోలింగ్’ ముగిసిన తరువాత ‘ఇసి’ ప్రకటించిన పోలయిన వోట్ల శాతం మరుసటిరోజు ఎందుకని పెరిగింది?? నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులోని ఒక పాఠశాల- పోలింగ్ కేంద్రం-లో ‘వివిప్యాట్’- వోటర్ వెరిఫికేషన్ పేపర్ ఆడిట్ ట్రయిల్- స్లిప్పులు- కాగితాలు- విడిగా దొరికాయట! ఇది ఎలా సాధ్యం?? ఉపయోగించని ‘ఇవిఎమ్’లు ప్రభుత్వ కార్యాలయాలలో ఎందుకు ఉన్నాయి. ‘ఎన్నికల సాధికార సంఘం’వారు చెప్పగలగాలి!