సంపాదకీయం

‘చొరబాటు’కు బాసట?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్బంధ గృహాలలో ఉన్న విదేశీయులను తాత్కాలికంగా విడుదల చేయాలన్న అస్సాం ప్రభుత్వ ప్రతిపాదనను సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించడం అంతర్గత భద్రత పరిరక్షణకు దోహదం చేస్తున్న పరిణామం. విడుదల చేయాలని ప్రతిపాదిస్తున్న అస్సాం ప్రభుత్వాన్ని గురువారం సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం వారు అభిశంసించడం ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులకు గుణపాఠం వంటిది. అస్సాంలోకి దశాబ్దుల తరబడి లక్షల మంది విదేశీయులు ప్రధానంగా బంగ్లాదేశీయులు చొరబడడం నడచిపోతున్న విపరిణామ క్రమం. ఇన్ని లక్షల మంది చొరబాటుదారులలో కేవలం తొమ్మిది వందల మందిని, అస్సాంలోని న్యాయ మండలులు విదేశీయులని నిర్ధారించిన వారిని మాత్రమే ప్రభుత్వం నిర్బంధ గృహాలలో ఉంచడం విచిత్రమైన వ్యవహారం. ఈ తొమ్మిది వందల మందినైనా మన దేశం నుండి వారి స్వదేశానికి తరలించడానికి ప్రభుత్వాలు ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం పట్ల సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయి, న్యాయమూర్తులు దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేయడం అక్రమ ప్రవేశకుల కొమ్ముకాస్తున్న కొన్ని రాజకీయపక్షాల నాయకులకు చెంపపెట్టు! అస్సాంలోకి అక్రమంగా ప్రవేశించిన విదేశీయులను పసికట్టి పట్టుకొని మన దేశం నుండి వెళ్లగొట్టే కార్యక్రమం మూడు దశాబ్దులుగా నవ్వులాటగా మారిపోయింది. అక్రమ ప్రవేశకుల సంఖ్య కోటిన్నర అని ప్రభుత్వాలు నిర్ధారించాయి, రెండున్నర కోట్లన్నది అనధికార ప్రచారం, కానీ 1983 నుంచి కొన్ని వేల మంది మాత్రమే విచారణకు గురి అయినారు. నిర్ధారణ జరిగిన అక్రమ ప్రవేశకుల సంఖ్య పది వేల లోపే. వీరిలో కొన్ని వందల మందిని మాత్రమే ఇంతవరకు బంగ్లాదేశ్‌కు తరలించారు. తొమ్మిది వందల మంది ఐదేళ్లుగా అస్సాంలోని ‘నిర్బంధ గృహాల’- డిటెన్షన్ సెంటర్స్-లో ‘మగ్గిపోతున్నారన్నది’ అస్సాం ప్రభుత్వం వారు సుప్రీం కోర్టుకు చేసిన నివేదన. ఇలా ‘‘మగ్గిపోతున్నారన్న’’ చిత్రీకరణను సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి తీవ్రంగా తప్పుపట్టాడు. ‘‘వారికి నిర్బంధ గృహాలలోని విదేశీయులకు- మీరు ఐదు నక్షత్రాల సదుపాయాల- ఫైవ్‌స్టార్ ఫెసిలిటీస్-ను కల్పిస్తారా? వారిని స్వదేశాలకు తరలించడానికి అనుమతినివ్వవలసిందిగా ఆయా దేశాల ప్రభుత్వాల ముందు మీరు మోకరిల్లుతారా??’’ అని సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి గగోయి అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలోక్‌కుమార్‌ను నిలదీశాడు! ‘‘లక్షలాది విదేశీయులు ఇదివరకే స్థానికులతో కలసిపోయారు, ఇలా కలసిపోయిన అక్రమ ప్రవేశకులు వోటర్ల జాబితాకెక్కిపోయారు, రాజ్యాంగ ప్రక్రియలో భాగస్వాములు అవుతున్నారు..’’ అన్న సర్వోన్నత న్యాయస్థానం వారి నిర్ధారణ జనమెరిగిన దశాబ్దుల వైపరీత్యానికి ధ్రువీకరణ! లక్షల మంది విదేశీయులు ఇలా భారతీయ పౌరులుగా మారిపోయి ఉండడం గురించి ప్రజలకు తెలుసు. రాజకీయ పక్షాలకు తెలుసు; ప్రభుత్వాలకు తెలుసు. ఈ వాస్తవాన్ని ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ధ్రువీకరించింది. మరి ఇలా మన దేశపు పౌరులుగా చెలామణి అవుతున్న విదేశీయులను ఎవరు ఎలా గుర్తించాలి?
విదేశీయ అక్రమ ప్రవేశకులను శరణార్థులుగాను, శరణార్థులను అక్రమ ప్రవేశకులుగాను చిత్రీకరించే మతోన్మాద రాజకీయ ప్రయత్నం మన దేశంలో కొనసాగుతోంది. అక్రమ ప్రవేశకులను సక్రమ ప్రవేశకులుగా గుర్తించి వారికి పౌరసత్వం కల్పించాలన్న కుట్రను కొనసాగిస్తున్నవారు అస్సాంలో రూపొందిన ‘జాతీయ పౌర సూచిక’- నేషనల్ రిజిస్టార్ ఆఫ్ సిటిజెన్స్- ఎన్‌ఆర్‌సి-ని వ్యతిరేకిస్తున్నారు. ఈ ‘రిజిస్టర్’ను చింపిపారేయాలన్నది వీరి ఆర్భాటంలో నిహితమై ఉన్న దేశ వ్యతిరేక వాంఛ. ఇది మొదటి సగం.. అప్ఘానిస్థాన్ నుంచి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి తరిమివేతకు గురి అయిన, జిహాదీల హత్యాకాండకు బలికాకుండా పారిపోయి మన దేశానికి వచ్చేసిన నిజమైన శరణార్థులకు మన దేశంలో మనుగడ సాగించడం తప్ప మరో జీవన ప్రత్యామ్నాయం లేని ఇస్లామేతర మతాల వారికి మాత్రం ఈ దేశపు పౌరసత్వం ఇవ్వరాదని ఈ దేశ వ్యతిరేక రాజకీయవాదులు కోరుతున్నారు. ఇలా నిజమైన శరణార్థులకు- కొన్నివేల మందికి- భారతీయ పౌరసత్వాన్ని ప్రసాదించగల చట్టానికి సంబంధించిన ‘ముసాయిదా’-బిల్-ను గత జనవరిలో లోక్‌సభ ఆమోదించింది. కానీ కేంద్ర ప్రభుత్వ పక్షానికి రాజ్యసభలో సంఖ్యాధిక్యం- మెజారిటీ- లేనందువల్ల ఈ ‘బిల్లు’ రాజ్యసభ ఆమోదానికి నోచుకోలేదు. ఇలా లక్షల మంది చొరబాటుదారులను, విదేశీయ అక్రమ ప్రవేశకులను దేశం నుండి వెళ్లగొట్టరాదని కోరుతున్న కొన్ని రాజకీయ పక్షాలవారు వేలమంది సక్రమ ప్రవేశకులైన శరణార్థులకు మాత్రం మన దేశపు పౌరసత్వం ఇవ్వరాదని పట్టుపడుతుండడం రెండవ సగం. మొదటి సగం ‘ఎన్‌ఆర్‌సి’ పట్ల వ్యితిరేకత, రెండవ సగం ‘పౌరసత్వ సవరణ ముసాయిదా’- సిటిజన్ షిప్ అమెండ్‌మెంట్ బిల్-! ఇదీ వైపరీత్యం! సర్వోన్నత న్యాయస్థానం వారు అస్సాం ప్రభుత్వాన్ని మందలించడానికి ఇదంతా సుదర్ఘ నేపథ్యం..
లక్షల మంది విదేశీయులు పౌరులుగా, వోటరులుగా మారి స్వజాతీయ సమాజంలో కలసిపోవడం ఈ దేశం పట్ల మమకారం ఉన్నవారందరికీ కలవరం కలిగించవలసిన వ్యవహారం. ఇంటిలోకి చొరబడిన దొంగలు ఇంటి వారుగా చెలామణి కావడాన్ని ఏ ఇంటివారైనా సహించగలరా? ఈ దేశంలోకి చొరబడిన విదేశీయులు ‘‘ఇంటిలో చొరబడిన దొంగలు..’’. ఈ దేశ ప్రజలు, ఈ దేశం తమ మాతృభూమి అన్న వాస్తవాన్ని గుర్తించి ప్రవర్తిస్తున్నవారు ‘‘ఇంటివారు, ఇంటి యజమానులు...’’ నిర్బంధంలో ఉన్న ఈ తొమ్మిది వందల మంది విదేశీయులు ‘‘గుమ్మడికాయలో ఆవగింజంత భాగం కాదు’’కానీ ఈ ‘సాసువ గింజల’ను- తొమ్మిది వందల మంది నిర్బంధితులను- కూడ బంధ విముక్తులను చేసి దేశ పౌరులైన జనంలోకి కలిపేయాలని అస్సాం ప్రభుత్వం భావిస్తూ ఉండడమే విచిత్రం. ఇలా ఈ తొమ్మిది వందల మందిని విడుదల చేయడం చట్టవ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ నిర్బంధితులను ఒక్కొక్కరిని ఐదు లక్షల రూపాయల హామీపత్రం ప్రాతిపదికగా విడుదల చేయాలన్న ప్రతిపాదన కూడ మరో విచిత్రం. వీరందరూ విదేశీయులు, ఐదేళ్లుగా నిర్బంధ గృహాలలో ఉన్నవారు. ఇంత మొత్తానికి హామీ ఇవ్వగల ‘ఆర్థిక స్థాయి’కి వారికి ఎలా వచ్చింది? విడుదల అయిన తరువాత వారు ఎక్కడ నివసించేది కూడ ప్రభుత్వం కనిపెట్టి ఉంటుందట! వారి వేలిముద్రలను కూడ సేకరిస్తారట! ఇదంతా ఒక ఎత్తు. మరో ప్రధాన వైపరీత్యం ఉంది. ఈ తొమ్మిది వందల మందినీ విదేశీయులని, అక్రమ ప్రవేశకులని అస్సాంలోని న్యాయ మండలులు నిర్ధారించి ఉన్నాయి. కానీ న్యాయమండలుల నిర్ధారణ తుది నిర్ణయం కాజాలదని, ఈ తీర్పులను ఆమోదించడానికి నిరకరించడానికి తమకు అధికారం ఉందని సుప్రీం కోర్టునకు సమర్పించిన ‘ప్రమాణ పత్రం’- అఫిడవిట్-లో అస్సాం ప్రభుత్వం పేర్కొనడం మరింత విస్మయకరం. ‘‘ఇలాంటి ప్రమాణ పత్రం రూపొందించి మీరు పదవిలో ఉండడానికి అర్హులు కారు..’’ అని సర్వోన్నత న్యాయస్థానం వారు అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలోక్‌కుమార్‌ను అభిశంసించడం సముచితం...
అస్సాం ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులకు సైతం ఇది సర్వోన్నత న్యాయ అభిశంసన వంటిది! ఎందుకంటే ముఖ్యమంత్రి, మంత్రివర్గం ఆదేశాలకు అనుగుణంగా మాత్రమే ప్రధాన కార్యదర్శి ఈ ‘అఫిడవిట్’ను రూపొందించి ఉంటాడు. అక్రమ ప్రవేశకులను తమ దేశాల నుంచి వెళ్లగొట్టడానికి అనేక దేశాలలో ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు సైతం నడుములను బిగించి ఉన్నాయి. తమ దేశంలోని ‘విదేశీయులను’, అక్రమంగా దేశంలోకి వచ్చి ఉన్నవారిని అమెరికా ప్రభుత్వం భారీ సంఖ్యలో నిర్బంధించి కారాగృహాలకు తరలిస్తోంది. కానీ మన దేశంలో మాత్రం నిర్బంధ గృహాలలోని విదేశీయులను విముక్తులను చేయాలనీ ప్రభుత్వాలు కోరుతుండడమే అంతుపట్టని వ్యవహారం..