సంపాదకీయం

‘తోక ముడిచిన’ చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోడేలు ‘దూకడం’ మానుకోదు! ఒకచోట తోక ముడిచిన తోడేలు మరోచోట దూకుతుంది, వేరొకచోట నక్కుతుంది. అందువల్ల ‘ఐక్యరాజ్యసమితి’లో ‘తోక ముడిచిన’ చైనాకు మన దేశం పట్ల సుహృత్‌భావం వెల్లివిరిసినట్టు కాదు. మసూద్ అఝార్ అన్న పాకిస్తానీ జిహాదీ హంతకుడిని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి బుధవారం ‘ప్రపంచ బీభత్సకారుడు’- గ్లోబల్ టెర్రరిస్ట్-గా ప్రకటించిన తరుణంలోనే మన దేశంలోని ‘మావోయిస్టులు’ మహారాష్టల్రోని గడ్చిరోలీ జిల్లాలో భయంకర బీభత్సకాండను సృష్టించారు, పదిహేను మంది రక్షకులను, పౌరులను పొట్టన పెట్టుకున్నారు. మసూద్ అఝార్‌ను ‘భద్రతా మండలి’ ‘ప్రపంచ బీభత్సకారుడు’గా ప్రకటించడం చైనాకు చెంప పెట్టు, అంతర్జాతీయ అభిశంసన. ఏళ్ల తరబడి మసూద్ ముష్కరుడిని భుజాలకెత్తుకొని చైనా మన దేశాన్ని వెక్కిరించింది. అంతర్జాతీయ సమాజాన్ని ధిక్కరించింది. చివరికి అంతర్జాతీయ సమాజం ఒత్తిడికి తల ఒగ్గక తప్పలేదు. కోరలు విరిగిన తోడేలు వలె చైనా ‘ఐరాస’ భద్రతా మండలిలో ఇతర పదునాలుగు దేశాల అభిప్రాయం ముందు తోక ముడువక తప్పలేదు. మన దేశానికి ఈ పరిణామం చారిత్రక విజయం. అక్కడ ముడిచిన తోకను ఇక్కడ గడ్చిరోలీలో చైనా ఎత్తడం సమాంతర విపరిణామం! భద్రతా మండలిలో చైనా పరాజయం, గడ్చిరోలీలో మావోయిస్టులు జరిపిన హత్యాకాండ భిన్నభిన్న ఘటనలు! కానీ ఈ ఘటనల మధ్య సమానత్వం నిరంతరం భారత వ్యతిరేక విషం కక్కుతున్న చైనా ‘కమ్యూనిస్టు’ ప్రభుత్వ విధానం. మావోయిస్టులు చైనా ప్రభుత్వ అంతర్జాతీయ ఆధిపత్య విస్తరణ విష వ్యూహంలో పంచమాంగ దళం. చైనా ప్రభుత్వానికి మావోయిస్టు బీభత్సకారులు ప్రచ్ఛన్న సైనికులు! మన దేశానికి, మన ప్రజలకు, మన భద్రతకు, మన ప్రగతికి ఎప్పటికప్పుడు ఎంతోకొంత నష్టం కలిగించాలన్నది చైనా విధానం. భిన్నభిన్న ఘటనలుగా కన్పించే భారత వ్యతిరేక చైనా చర్యల మధ్య నిరంతర అనుసంధానం ఏర్పడి ఉంది. ఈ అనుసంధాన వ్యవస్థలో పాకిస్తానీ ప్రభుత్వ బీభత్స విభాగమైన ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్’ కీలక పాత్రధారి, మరో కీలక పాత్రధారి మావోయిస్టుల బీభత్సం. మసూద్ అఝార్‌ను ‘గ్లోబల్ టెర్రరిస్టు’గా ‘మండలి’ ప్రకటించగలగడం చైనాకు వ్యతిరేకంగా భారత్ సాధించగలిగిన దౌత్య విజయం. ఈ విజయ ఉత్సవ వేళ గడ్చిరోలీ హత్యలు అపశ్రుతులు.. ఈ అపశ్రుతులను మావోయిస్టులు పథకం ప్రకారం వినిపించారు. సమితి ‘మండలి’లో చైనాకు దాపురించిన పరాజయానికి ‘ప్రతీకార ప్రతిధ్వనులు’ గడ్చిరోలీలో మావోయిస్టులు కల్పించిన బీభత్స విస్ఫోటనాలు! ‘మండలి’లో మసూద్‌ను శిక్షించే తీర్మానాన్ని చైనా బలపరచక తప్పదని ఏప్రిల్ ఇరవై మూడవ తేదీనాటికి నిర్ధారణ జరిగింది. బుధవారం ఈ తీర్మానాన్ని అంగీకరించక తప్పదని చైనాకు, వివిధ సభ్యదేశాలకు స్పష్టమైంది. ఈ చైనా పరాజయ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని మన దేశంలోని మావోయిస్టులు భావించి ఉండవచ్చు.. పథకం ప్రకారం బుధవారం మహారాష్టల్రోని గడ్చిరోలీలో ‘క్షిప్ర విస్ఫోటన నాళిక’- ఇంప్రువైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్-లను పేల్చారు, కుర్‌ఖేడా ‘రక్షక ఠాణా’- పోలీస్‌స్టేషన్‌కు చెందిన పదిహేను మందిని పొట్టనపెట్టుకున్నారు. అమరులైన ‘రక్షకులు’ భరతమాత యశోవిభవ రక్షకులు, వజ్రాల బిడ్డలు.. మావోయిస్టులు మాతృభూమిని కాక శత్రుదేశమైన చైనాను పూజిస్తున్న విద్రోహులు... 2050 సంవత్సరం నాటికి భారత ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థను కూలదోయాలన్నది మావోయిస్టుల లక్ష్యం!
చైనా ఇలా మసూద్ అఝార్‌ను ‘చంకనుంచి దించడానికి’ ప్రబల కారణం భద్రతా మండలిలోను, అంతర్జాతీయ సమాజంలోను జిహాదీ తీవ్రవాదం పట్ల పెరుగుతున్న వ్యతిరేకత. దశాబ్దుల తరబడి జిహాదీ బీభత్సకారులు మన దేశంలో హత్యాకాండను సృష్టించారు! జిహాదీ బీభత్సకారులు చైనాలోని సింకియాంగ్- జింఝియాంగ్-లో అనేక ఏళ్లపాటు భయానక హత్యాకాండను జరిపారు. చైనా ప్రభుత్వం అంతకంటె భయంకరంగా ‘జిహాదీ’లను అణచివేసింది. ఈ అణచివేతలో భాగంగా జిహాదీ హత్యాకాండతో కాని, జిహాదీ ముఠాలతో కాని సంబంధం లేని సామాన్య ఇస్లాం మతస్థులను సైతం చైనా ప్రభుత్వం చిత్రహింసలపాలు చేయడం చరిత్ర. పోలీసులు, సైనికులు ‘మసీదు’లలోకి చొరబడిన ‘జిహాదీ’లను- మసీదులలో నక్కిన హంతకులను- బయటకు ఈడ్చుకొని రావడం కూడ చరిత్ర! పాకిస్తాన్ అమెరికాతో అతి సన్నిహితంగా ఉండిన సమయంలో ఈ చరిత్ర నడిచింది. పదేళ్లకు పైగా పాకిస్తాన్ అమెరికాకు దూరంగా జరిగింది, చైనాకు మిక్కిలి చేరువ అయింది. చైనాకూ పాకిస్తాన్‌కూ మధ్య రాజీ కుదిరింది. అందువల్ల జిహాదీ బీభత్సకాండ చైనాలోని సింకియాంగ్‌లో ఆగిపోయింది. తమ దేశంలో హత్యాకాండ జరుపకపోతే చాలు, ఇతర దేశాలలో వారు యథేచ్ఛగా హత్యాకాండ జరుపవచ్చు- అన్నది చైనా విధానం. అందువల్లనే జిహాదీలను మన దేశంలోకి ఇతర దేశాలలోకి ఉసిగొలుపుతున్న అన్ని ‘ఇస్లామీయ మత రాజ్యాంగ వ్యవస్థ’లు కల దేశాలనూ చైనా సమర్ధించింది, సమర్ధిస్తోంది! మన దేశం విషయంలో చైనా ఈ బీభత్సపథంలో ముందుకువెళ్లి, మన దేశంలో జిహాదీలు- పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్సకారులు- హత్యాకాండ జరుపాలన్నదే చైనా విధానం, అభీష్టం. మసూద్ అఝార్ వంటి జిహాదీ ముష్కరులను చైనా ఇంతకాలం సమర్ధించడానికి ఈ భారత వ్యతిరేకతే కారణం...
అఝార్ మసూద్‌ను, పాకిస్తానీ జిహాదీ ముఠాలను మాత్రమే కాదు, బీభత్స మృగాలను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మాత్రమే కాదు, జిహాదీ స్వభావం కల అనేక దేశాల ప్రభుత్వాలను సైతం చైనా బహిరంగంగాను, రహస్యంగాను బలపరుస్తోంది. పాశ్చాత్య దేశాలతో ప్రధానంగా అమెరికాతోను, ఐరోపా సమాఖ్య దేశాలతోను చైనా సాగిస్తున్న ఆధిపత్య సమరం ఇందుకు కారణం. సూడాన్‌లో దశాబ్దుల పాటు క్రైస్తవ మతం వారిని, అతి ప్రాచీన వన మతాల వారి- ప్రకృతి ఆరాధక మతాలవారి-ని హత్యచేయించిన ఆ దేశం అధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్‌ను చైనా సమర్ధించడం చరిత్ర. అల్ బషీర్ భయంకర మానవ హంతకుడని, బీభత్సకారుడని అంతర్జాతీయ నేర విచారణ న్యాయస్థానం నిర్ధారించింది. అతగాడిని నిర్బంధించాలని, తమ ఎదుట నిలబెట్టాలని దశాబ్దికి పూర్వమే ఈ న్యాయస్థానం వారు ఆదేశించారు. కానీ ఒమర్ బషీర్‌ను నిర్బంధించడానికి అంతర్జాతీయ నిఘాసంస్థ - ఇంటర్‌పోల్- చేసిన ప్రయత్నాలను చైనా ఎప్పటికప్పుడు వమ్ము చేసింది. బషీర్ ప్రభుత్వం పాటించిన జిహాదీ మతోన్మాద బీభత్స విధానం ఫలితంగా ఇరవై లక్షలకు పైగా ఇస్లామేతర మతాలవారు హత్యకు గురయ్యారు. అంతర్యుద్ధం చెలరేగింది. చివరికి క్రైస్తవ మతం వారు, ప్రకృతి ఆరాధక మతాల వనవాసీ ప్రజలు అధిక సంఖ్యలో ఉన్న సూడాన్ దక్షిణప్రాంతం దేశం నుంచి విడిపోయింది, ‘దక్షిణ సూడాన్’గా ఏర్పడింది. ఇస్లాం మతస్థులు అత్యధిక సంఖ్యలో ఉన్న ఉత్తర ప్రాంతం మాత్రమే ప్రస్తుతం సూడాన్‌లో మిగిలి ఉంది. ఇంతటి భయానక విపరిణామాలకు కారకుడైన జిహాదీ బీభత్సకారుడు దాదాపు ముప్పయి ఏళ్లు సూడాన్‌పై పెత్తనం వహించడానికి కారణం అతగాడికి చైనా ఇచ్చిన మద్దతు. అల్‌బషీర్ ఒమర్ వ్యతిరేకులను అమెరికా సమర్ధించింది. సూడాన్‌లో అమెరికా, చైనాలు ఆర్థిక వాణిజ్య ఆధిపత్యం కోసం పోటీపడడం ఇందుకు కారణం. అల్ బషీర్ ఒమర్ అనే ఈ జిహాదీ నియంతను సూడాన్‌లోని సైనిక దళాలు, ఏప్రిల్ పదకొండవ తేదీన పదవి నుంచి తొలగించి నిర్బంధించడం చైనాకు ఎదురుదెబ్బ! ఇప్పుడు మసూద్ అఝార్ విషయంలో చైనా అభిశంసనకు గురి అయింది!
మసూద్ అఝార్ జాయిష్ ఏ మొహమ్మద్ ముఠాలోని మొదటి జిహాదీ బీభత్సకారుడు. జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవన్తీపుర వద్ద నలబయి మంది మన వీరులను హత్య చేయడం ‘జాయిష్ ఏ మొహమ్మద్’ మన దేశం అనేక ఏళ్లుగా సాగిస్తున్న బీభత్సకాండలో భాగం! ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని అమలు జరుపనున్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ తీర్మానం ప్రకారం ‘గ్లోబల్ టెర్రరిస్టు’గా నిర్ధారణ జరిగిన మసూద్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం నిర్బంధిస్తుందా? విచారణ జరిపి శిక్షిస్తుందా? 2008 డిసెంబర్‌లో ‘జమాత్ ఉద్ దావా’ బీభత్సకారుడు హఫీజ్ సరుూద్‌ను నిర్బంధించి విచారించి శిక్షించాలని ‘సమితి’ తీర్మానించింది. కానీ హఫీజ్ సరుూద్‌ను ఇప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం శిక్షించలేదు.