సబ్ ఫీచర్

త్యాగమే టీచర్లకు ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థిని ఉపాధ్యాయుడు ఎంత చెక్కుతాడో దానికన్నా రెట్టింపు విద్యార్థితో చెక్కబడతాడు. విద్యార్థి ప్రతి ఉపాధ్యాయుడు చెప్పే మాటలను వినయంగా వింటాడు. కానీ ఉపాధ్యాయుడు ప్రతి ఘడియలో శల్యపరీక్షకు కూడా గురౌతాడు. తరగతి గదిలో ఉండే 40 మంది టీచర్‌ను చూస్తూ ఉంటారు. టీచర్ చెప్పిన మాటలను సంబంధిత టీచర్ ఆచరిస్తున్నారా అని తరగతి, విద్యార్థుల కళ్లు చూస్తుంటాయి. ఉపాధ్యాయుడు చెప్పిన మాటలకు ఆచరణకు తేడా కన్పిస్తే ఈ ఉపాధ్యాయుడొక కృత్రిమ మనిషి (హిపోక్రాటిక్) అనుకుంటారు. సిగరెట్ తాగవద్దని తరగతి గదిలో పిల్లలకు చెప్పాక సంబంధిత టీచర్ తన జీవనశైలిలో సిగరెట్ తగుతున్నాడా లేదా అన్నది పిల్లలు గమనిస్తారు. తేడావస్తే కొంతమంది పిల్లలు ‘‘సార్ మీరు మాకు క్లాసులో చెప్పింది ఏమిటి? చేస్తుందేమిటి?’’ అని అడుగుతారు.
విద్యార్థి ఉపాధ్యాయుడికుండే సంబంధం చాలా సున్నితమైనది. జవాబుదారీతనం ఉండాలి. జవాబుదారీతనం లేకుండా తరగతి గదిలో పాఠం చెప్పటం చాలా కష్టమైన పని.
నేను ప్రభుత్వ సిలబస్ చదువు చెబుతున్నానని ఉపాధ్యాయుడు అనవచ్చును.
‘‘నువ్వు చెప్పిన పాఠాన్ని నేను పరీక్షల్లో కక్కేస్తానని’’ పిల్లలూ అనవచ్చును.
కాబట్టి మనం చెప్పిన పాఠం ప్రభావం జీవితాంతం ఉండాలంటే తొలుత ఉపాధ్యాయుడు ఆచరణధారి కావాలి. సమాజంలో జరిగే ఎన్నో కార్యక్రమాలను పాఠంతో జోడించి ఉపాధ్యాయుడు చలోక్తులు వేస్తారు. కొన్ని సందర్భాలలో నిరసిస్తాడు. బైటకువెళ్లిన తర్వాత విద్యార్థి చెప్పిన పాఠాన్ని ప్రమాణంగా తీసుకుని వాటిని ఆచరిస్తాడు. కాబట్టి ఉపాధ్యాయుడిని ఎంతోమంది బైటనుంచి ప్రశ్నించేవారుంటారు. అందుకే ఉపాధ్యాయుడికి అకడమిక్ ఫ్రీడమ్ అవసరం. ఉపాధ్యాయుడు భవిష్యత్తును నిర్మించే మనిషి వచ్చే సమాజాన్ని చూస్తాడు. తన పాఠానికి కొన్ని మానవతావిలువలను కూడా జోడిస్తాడు. ఆ మానవతా విలువలను వర్తమాన కాలపు పరిస్థితులు అనుకూలించకపోతే ఉపాధ్యాయుణ్ణే దోషిగా చూడటం ఎంతవరకు న్యాయం? భవిష్యత్తును నిర్మించేవాడు సమాజంలో కనపడుతున్న దురలవాట్లను చెడు సాంప్రదాయాలను నిరసిస్తాడు.
ఉపాధ్యాయునికి రెండు కత్తులపై సవారీ చేయవలసి వస్తుంది.
1) ప్రభుత్వ నిబంధనలు 2) విద్యార్థులను రాబోయే కాలానికి తయారుచేసే బాధ్యత. ఈ రెండింటి మధ్య ఉపాధ్యాయుడు సవారీచేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు చాలామంది ఈ రెండింటిలో విద్యార్థుల వైపే మొగ్గుతారు. పాలకవర్గం ఉపాధ్యాయుడి కళ్లముందు కనపడదు. పిల్లలు అనుక్షణం కనపడతారు. అందుకే చాలామంది ఉపాధ్యాయులు విద్యార్థులతో చెక్కబడుతుంటారు. దీనిలో తన మాటలకు, ఆచరణకు, ఏమాత్రం తేడా వచ్చిన తరగతి గదిలో తన పిల్లలను తప్పించుకోలేడు. ఈరోజు మీ కళ్లముందు కనపడే రామయ్య ఎంతమంది విద్యార్థులతో చెక్కబడ్డాడో ఆలోచించండి.
తన తరగతిని ఉత్సాహంగా ఉంచటానికై ఎన్నో బాధలకు గురికావాల్సి వస్తుంది. దేనికోసం? రాబోయే నూతన సమాజ నిర్మాణంకోసం ఉపాధ్యాయుడు నిలబడతాడు.
ఉపాధ్యాయుడు కావాలనుకునేవాడు ఈ ఇబ్బందులు పడేందుకు సిద్ధపడాలి. ఫెరా, చామ్‌స్కీ ల్లాంటి ఎంతోమంది త్యాగాలే ఉపాధ్యాయ వర్గానికి ఆదర్శం. తాత్కాలిక లాభాలకోసమై శాశ్వతమైన భవిష్యత్తును తాకట్టుపెట్టకూడదు. అదే ఉపాధ్యాయ వృత్తి నాకు నేర్పింది.

- చుక్కా రామయ్య