సంపాదకీయం

చందమామ రావె..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చం ద్ర మండలానికి రెండవసారి యాత్ర జరుపడానికి ‘భారత అంతరిక్ష పరిశోధక మండలి’ వారు సమాయత్తం కావడం మన అంతరిక్ష విజ్ఞాన ప్రస్థాన పథంలో మరో ప్రగతి పదం.. 2008వ సంవత్సరంలో తొలిసారిగా మన ‘చంద్ర ప్రస్థానం’ ఆరంభమైంది. మొదటి ‘చంద్రయాన్’ ప్రస్థానం 2008 అక్టోబర్‌లో ఆరంభమై నవంబర్‌లో చంద్ర మండల గగన పరిధిలోకి ప్రవేశించడం గొప్ప చారిత్రిక ఘటన. పదకొండేళ్ల తరువాత రానున్న ఆషాఢ పౌర్ణమి నాడు రెండవసారి చంద్రుని వైపు దూసుకెళ్లడానికి రెండవ చంద్రయాన్ సిద్ధవౌతోంది. జూలై పదునాలుగవ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత మూడవ జామున రెండు గంటల యాబయి ఒక్క నిముషాలకు మూడు గగన శకటాల సమీకృత ‘చంద్రయాన్’ వ్యవస్థ శ్రీహరికోట నుంచి పైకెగసి తెల్లటి వెనె్నలలు దారి చూపగా వెనె్నల రాజు స్థావరం వైపు దూసుకొనిపోనున్నదట. సెప్టెంబర్ ఆరవ తేదీన ఈ రెండవ చంద్రయాన్ వ్యవస్థలోని ఒక శకట విభాగం చంద్రుని తలంపై అవతరించనుంది. మరో శకట విభాగం ‘అవతరించిన శకట విభాగం’ పనితీరును పర్యవేక్షించనుంది. ఈ రెండు కూడ చంద్రుని చుట్టూ అంతరిక్షంలో పరిక్రమించే పెద్ద వాహకం నుంచి విడిపోయి చంద్రుని తలాన్ని చేరనున్నాయట! ఈ అద్భుత విజయానికి రంగం సిద్ధం చేసిన భారతీయ అంతరిక్ష పరిశోధక సంస్థ- ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్- ఇస్రో- అధ్యక్షుడు కె.శివన్, సంస్థకు చెందిన శాస్తవ్రేత్తలు అభినందనీయులు. అమెరికా, రష్యా తదితర సంపన్న దేశాల కంటె దాదాపు నాలుగు దశాబ్దులు ఆలస్యంగా అంతరిక్ష పరిశోధన, ప్రస్థాన రంగంలో ప్రవేశించిన మన దేశం ప్రస్తుతం ఈ దేశాలతో పోటీపడి అంతరిక్ష విజయాలను సాధిస్తోంది. ఇలా అమెరికా, రష్యాల కంటె చాలా ఆలస్యంగా మన దేశం అంతరిక్ష పరిశోధనలను ఆరంభించడానికి కారణం మన దేశం దాదాపు పదమూడు శతాబ్దులపాటు విదేశీయ బర్బర జాతుల దురాక్రమణకు గురికావడం.. దాదాపు తొమ్మిది శతాబ్దులపాటు విదేశీయుల బీభత్సపు పెత్తనానికి బలికావడం. క్రీస్తుశకం 712నుంచి 1947వరకు నడచిన దురాక్రమణను ప్రతిఘటించడంలో నిమగ్నమైన భారత జాతి విజ్ఞాన పరిశోధన శాస్త్ర ప్రగతి రంగాలలో వెనుకబడింది. భారతీయ విద్యా వైజ్ఞానిక శాస్త్ర సాంకేతిక రంగాలను బ్రిటన్ దురాక్రమణదారులు పనికట్టుకొని పాడుచేయడం చరిత్ర. అందువల్ల మన దేశంలో యుగయుగాలుగా పరిఢవిల్లిన అంతరిక్ష పరిజ్ఞానానికి పరిగణన లేకుండా పోయింది. ఖగోళ వాస్తవాల ప్రాతిపదికగా కొనసాగిన మన కాలగణనను మనం పట్టించుకోలేని స్థితి ఏర్పడింది! బ్రిటన్ రాజకీయ ఆర్థిక రాజకీయ బీభత్స పాలన నుంచి 1947లో మన దేశం విముక్తం అయిన నాటికి మనం అన్ని రంగాలలోను వెనుకబడి ఉన్నాం.. అంతరిక్ష పరిశోధక రంగంలో కూడ..!
నిజానికి మనం వెనుకబడి ఉన్నామని భావించడం భ్రాంతి! మన ఖగోళ అంతరిక్ష విజ్ఞాన ప్రాతిపదికలు పాశ్చాత్యులకు తెలియవు. అందువల్ల తమకు తెలిసినది మాత్రమే విజ్ఞానం అని భావించే ‘‘కూపస్థ మండూక’’- బావిలోని కప్ప- బుద్ధిగల ఐరోపావారు తమతోనే ప్రపంచం, చరిత్ర, విజ్ఞానం మొదలైందని భ్రమించడం సహజం! అజ్ఞానం, అహంకారం కవలలు! అందువల్ల అహంకరించిన ఐరోపావారు తాము భారతదేశానికి పెత్తందార్లుగా ఉండిన సమయంలో- భారతీయ విజ్ఞానాన్ని మూఢ విశ్వాసంగా చిత్రీకరించి వెళ్లారు. ‘చంద్ర గ్రహణం’, ‘సూర్యగ్రహణం’ ఉదాహరణలు మాత్రమే! పాశ్చాత్యులు బట్టకట్టడం నేర్వడానికి పూర్వం లక్షల ఏళ్లుగా భారతీయులు చంద్ర గ్రహణాన్ని, సూర్యగ్రహణాన్ని నిర్దిష్టంగా, నిర్దుష్టంగా గుర్తించగలిగారు. ఈ ‘పరిగణన’ను మన పంచాంగాలలో ఆవిష్కరించారు! ఖగోళ వాస్తవ విజ్ఞానం గురించి గ్రహాల, నక్షత్రాల, ఉపగ్రహాల చలనం గురించి భూభ్రమణం గురించి సూర్యుని చుట్టూ పరిభ్రమణం గురించి ఈ గగన చరాలతో భూమికి గల సాపేక్ష సంబంధం గురించి మన పూర్వులకు తెలుసు. సూర్య సిద్ధాంతం వంటి ఖగోళ విజ్ఞాన గ్రంథాలు ఈ దేశంలో లక్షల ఏళ్లుగా ప్రచారంలో ఉన్నాయి. క్రీస్తుకు పూర్వం ఒకటవ శతాబ్దినాటి విక్రమ సమ్రాట్ ‘నక్షత్ర శాల’ను నిర్మింపచేయడం యుగాల విజ్ఞాన పరంపరకు ఆధునిక ధ్రువీకరణ మాత్రమే! భారతదేశంలో ‘ప్రాచీన చరిత్ర’ అని అంటే కలియుగం పూర్వ చరిత్ర.. కలియుగంలోని ఐదువేల నూట ఇరవై ఒక్క ఏళ్ల చరిత్ర లక్షల ఏళ్ల చరిత్రలో ఆధునిక ఘట్టం! విక్రముని ఆస్థానంలోని వరాహ మిహిరుడు, మహాకవి కాళిదాసు గొప్ప ఖగోళ విజ్ఞానవేత్తలు..
ఈ ఖగోళ విజ్ఞానాన్ని గ్రీసు నాగరికులు, మిశ్ర- ఉత్తర ఆఫ్రికా-, పారశీక జాతులవారు భారతీయులవద్ద నేర్చుకొని వెళ్లడం చరిత్ర. ఈ చరిత్రను ఐరోపా వారు ధ్వంసం చేశారు. అందువల్ల భారతీయుల కాలగణన పద్ధతులు మూలపడ్డాయి. మనం వెనుకపడ్డాము. 1960వ దశకంలో మనం సరికొత్తగా అంతరిక్ష పరిశోధన రంగంలోకి అడుగుపెట్టే నాటికి అమెరికా అంతరిక్ష గామి- అస్ట్రానట్- నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై నడిచి వచ్చాడు. 1950వ దశకంలోనే రష్యా వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు! రష్యావారి యూరిగెగారిన్‌కున్నంత ప్రసిద్ధి ఆర్యభట్టుకు లేదు. ఆర్యభట్టుడు కలియుగం నాలుగవ శతాబ్ది- క్రీస్తునకు పూర్వం ఇరవై ఏడవ శతాబ్ది-నాటి- భారతీయ ఖగోళ విజ్ఞానవేత్త! చంద్రుడు ఉపగ్రహమైనప్పటికీ మన పూర్వులు ‘అతని’కి గ్రహప్రతిపత్తి కల్పించడానికి కారణం భూమండల వాసులపై చంద్రమండల ప్రభావం! ఉపగ్రహమైన చంద్రుడు దాదాపు బుధగ్రహమంత పరిమాణం కలవాడు. కోటి కిలోమీటర్ల దూరంగాఉన్న బుధుని కంటె మనకు కేవలం నాలుగు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడు మనపై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాడు. సముద్రాలను చంద్రుడు ఉత్తుంగ తరంగ భరితం చేయడం ప్రత్యక్ష అనుభవం. అమావాస్య పున్నములలో సముద్రాల కెరటాలు ఎగసిపడుతుంటాయి. చంద్రుడు మన మనస్సులను ప్రభావితం చేయడం కనపడని విషయం. సముద్రాలను సైతం ప్రభావితం చేయగల చంద్రుడు మనస్సును కూడ నిర్దేశించగలడు. ఇదీ తార్కిక బుద్ధి. చంద్రుడు జీవజాలానికి మనస్సు, సూర్యుడు దృష్టి... దృష్టి ‘వెలుగు’, మనస్సు ‘కోరిక’! ‘‘చంద్రమా మనసో జాతా, చక్షుః సూర్యో అజాయత..’’ అనంతంగా అనాదిగా వ్యాపించి ఉన్న అంతరిక్షపు ‘మనస్సు’నుండి చంద్రుడు వచ్చాడు, కంటినుండి సూర్యుడు భాసిస్తున్నాడు!- అన్న వేద విజ్ఞాన ఆవిష్కరణ ఈ ఖగోళ వాస్తవం! మొక్కలకు ప్రాణం ఉంది, కానీ వాటి ప్రాణం స్వభావం జీవన వ్యవహారం మానవుల ప్రాణ స్వభావం కంటె, జంతువుల స్వభావంకంటె భిన్నమైనది. ఖగోళ చరాలైన అంతరిక్ష వాసులైన గ్రహాలకు ఉపగ్రహాలకు నక్షత్రాలకు కూడ ప్రాణం ఉంది. ప్రాణం ఉంది కనుకనే అవి చరిస్తున్నాయి, తింటున్నాయి. భూమి నిరంతరం ‘విశ్వ రజాన్ని’- కాస్మిక్ డస్ట్-ను భోంచేస్తూ ఉంది. కానీ ఈ గ్రహాల ప్రాణ, భోజన, వ్యవహార స్వరూప స్వభావాలు మానవ ప్రాణ, భోజన, వ్యవహార స్వరూప స్వభావాల కంటె భిన్నమైనవి. భిన్నమైనవి కాబట్టి లేవని భావించడం అతార్కికం..
చంద్రుడు- సమీప బంధువైన చందమామ- భూమి వాసులతో ముడివడి ఉండడం ప్రాకృతిక సహజ వాస్తవం! భూమికూడ చంద్రమండలాన్ని ఇతర గ్రహాలను ప్రభావితం చేస్తోంది! ‘‘చందమామ రావె, జాబిల్లి రావె’’ అని పిలవడం కృతకమైన అనుభూతి కాదు, సహజ జీవన రీతి! చంద్రుడు, లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టిన కవలలు! చంద్రుడు మానవులకు మేనమామ, అతని సోదరి అయిన లక్ష్మీదేవి మన అమ్మ! అమ్మను ఇలా దేవతగా భావించడం నిజమైన విజ్ఞానం, ఇదీ భారత జాతీయ విజ్ఞానం!!