సంపాదకీయం

‘సౌదీ’ దౌర్జన్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో తిష్ఠవేసిన సమయంలో ఘోర నేరాలు చేసిన విదేశీయులు తప్పించుకొని స్వదేశాలకు వెళ్లగలుగుతున్నారు. కొందరు మన యంత్రాంగం కళ్లుగప్పి జారుకున్నారు, మరికొందరు మన యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా పారిపోగలిగారు. ఇంకొందరు బహిరంగంగా, దర్జాగా, ప్రభుత్వం వారి అనుమతితోను సహకారంతోను విమానాలనెక్కి ఉడాయించారు. కానీ నేరం చేయని మన దేశస్థులు నేరారోపణలకు గురై విదేశాల జైళ్లలో మగ్గుతున్నారు. ఇతర దేశస్థులపై మన దేశంలో ‘ఈగలు వాలిన’ సమయంలో ఆయా విదేశాల ప్రభుత్వాలు ‘రోకలి బండలను ధరించి’ మన ప్రభుత్వంపై దౌత్య దౌర్జన్యానికి ఒడిగడుతున్నాయి. చిన్నచిన్న దేశాల ప్రభుత్వాలు సైతం అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన మన దేశంపై ‘ఆధిపత్య దౌత్యాన్ని’ ప్రయోగిస్తుండడం నడచిపోతున్న చరిత్ర. విదేశాలలో మన పౌరులపై దౌర్జన్యకాండ, బీభత్సకాండ జరిగిన సమయంలో ఆయా దేశాల ప్రభుత్వాలు ఎలాంటి నిరోధక చర్యలను తీసుకొనక పోవడం, నేరస్థులనే వెనకేసుకొని మన ప్రభుత్వాన్ని వికృతంగా వెక్కిరించడం కూడ పదే పదే ఆవృత్తవౌతున్న చరిత్ర. ఈ మన ప్రభుత్వపు మెతక ధోరణికి విదేశీయ ప్రభుత్వాల దౌర్జన్య దౌత్యానికి ఉదాహరణలు కోకొల్లలు. నిజామాబాద్ జిల్లాకు చెందిన షేక్ అఝీముద్దీన్ అనే యువకుడు ఏప్రిల్ ఇరవయ్యవ తేదీనుంచి సౌదీ అరేబియాలోని జైళ్లలో మగ్గుతుండడం సరికొత్త ఉదాహరణ. ఉద్యోగం కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన అఝీముద్దీన్ చేసిన ‘నేరం’ తన యజమాని కుమార్తెను పెళ్లిచేసుకొనడం! సౌదీ అరేబియాకు, పర్షియా సింధుశాఖ ప్రాంత దేశాలకు చెందిన సంపన్నులైన ప్రచ్ఛన్న లైంగిక బీభత్సకారులు మన దేశానికి వచ్చి ఇక్కడి యువతులను, బాలికలను ‘పెళ్లిచేసుకుంటున్నారు..’, ఆ తరువాత వారిని వంచిస్తున్నారు. ఈ వధువులను కొందరు ‘అరబ్బీలు’, సింధుశాఖ ప్రాంత దేశీయులు తమ దేశాలకు తరలించుకొనిపోయి అక్కడ వదిలి పెట్టేస్తున్నారు. ఇలా ‘వదలింపు’నకు గురైన భారతీయ వధువులు కొందరు మాత్రం తిరిగి వస్తున్నారు. ఇక్కడ జీవచ్ఛవాలుగా మనుగడ సాగిస్తున్నారు, మరికొందరు ఆ విదేశాలలోనే అలమటించి అలమటించి అంతరించిపోతున్నారు. ఇలా ‘పెళ్లి’చేసుకున్న ‘అరబ్బీ’లు, సింధు శాఖీయ ముష్కరులు ఆ నవవధువులతో ఇక్కడనే కొన్నాళ్లు ‘కాపురం’చేసి వారిని ఇక్కడనే వదిలిపెట్టి తమ దేశాలకు ఉడాయించారు. కొన్నాళ్ల తరువాత తమ దేశాలకు రప్పించుకుంటామని పెళ్లానికి మాటిచ్చి జారుకున్న ముష్కరులు మళ్లీ రారు. ఇలా మన దేశపు ‘వధువు’లను వివిధ పద్ధతుల ద్వారా వంచించిన వంచిస్తున్న తమ దేశాల ప్రచ్ఛన్న లైంగిక బీభత్సకారులను సైదీ అరేబియా ప్రభుత్వం శిక్షించడం లేదు. ఇతర ఇస్లాం మత రాజ్యవ్యవస్థలున్న దేశాల ప్రభుత్వాలలో అధిక శాతం శిక్షించడం లేదు. కానీ సౌదీ అరేబియా వధువును పెళ్లిచేసుకొని సక్రమంగా మన దేశంలో కాపురం చేస్తుండిన షేక్ అఝీముద్దీన్‌ను మాత్రం రెండు నెలలకు పైగా సౌదీ అరేబియాలో నిర్బంధించి ఉన్నారు..
నిందితులను విచారించి నిజానిజాలను నిగ్గుతేల్చే న్యాయ ప్రక్రియలో సౌదీ అరేబియా వంటి దేశాల ప్రభుత్వాలకు చిత్తశుద్ధితో మన ప్రభుత్వం సహకరిస్తున్న తీరునకు, సౌదీ అరేబియా వంటి దేశాల ప్రభుత్వాలు మన ప్రభుత్వంతో సహకరించని తీరునకు అఝీముద్దీన్ వ్యవహారం మరో ఉదాహరణ. ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన ఈ ఇందూరు- నిజామాబాద్- యువకుడు జెద్దాలోని నస్సర్ అల్ హర్బీ అనే వ్యక్తి వద్ద వాహన చోదకుడు- కారు డ్రయివర్-గా పనిచేశాడట. ఇతడు ఉద్యోగం చేస్తుండిన సమయంలో నస్సర్ అల్ హర్బీ కుమార్తె రజా అల్ హర్బీ అఝీముద్దీన్‌ను ప్రేమించిందట. వారిద్దరూ పెళ్లిచేసుకొనడానికి అల్ నర్సర్ హర్బీ అంగీకరించలేదు. పనిమానేసి స్వదేశానికి తిరిగి వచ్చాడు అఝీముద్దీన్. రజా కూడా మన దేశానికి వచ్చేసింది, నిజామాబాద్‌కు వచ్చింది. మన దేశానికి వచ్చిన నాటికి ఆమె వయస్సు ఇరవై ఏడు సంవత్సరాలట! ఆ తరువాత నిజామాబాద్‌లో రజాను అఝీముద్దీన్ పెళ్లిచేసుకున్నాడు. వాళ్లిద్దరూ కలసి కాపురం చేస్తున్నప్పటికీ, తన కుమార్తెను అఝీముద్దీన్ బలవంతంగా అపహరించుకొని వెళ్లాడని నస్సర్ అల్ హర్బీ సౌదీ అరేబియా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాడట. వెంటనే సౌదీ ప్రభుత్వం మన ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. మన ప్రభుత్వం స్పందించడం, అఝీముద్దీన్‌పై అభియోగం నమోదు కావడం చకచకా జరిగిపోయాయి. మన ప్రభుత్వం సౌదీ ప్రభుత్వానికి సహకారం అందించిన తీరునకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే! కానీ నిర్దోషి అయిన అఝీముద్దీన్‌ను సౌదీ అరేబియాలోని అక్రమ నిర్బంధం నుంచి రెండునెలలు దాటిన తరువాత కూడ మన ప్రభుత్వం విడిపించలేకపోతోంది. మన ప్రభుత్వ నివేదికను సౌదీ ప్రభుత్వం పట్టించుకొనకపోవడానికి, సహకరించని వైఖరికి ఇది నిదర్శనం..
మన ప్రభుత్వం మాత్రం గొప్పగా సహకరించడం విదేశాల ప్రభుత్వాలు మాత్రం మన ప్రభుత్వాన్ని పట్టించుకొనకపోవడం..! ఇది మనకు అవమానకరం. అఝీముద్దీన్-రజా దంపతుల వ్యవహారం ‘ప్రతీక’మాత్రమే. మన దౌత్యనీతిలో ‘దాగి ఉన్న’ మెతకతనం వౌలిక వైపరీత్యం. దశాబ్దులుగా ఈ ‘మెతకతనం’ మన ప్రభుత్వ విదేశాంగ నీతిని ఆవహించి ఉంది. అఝీముద్దీన్‌కు వ్యతిరేకంగా నమోదైన ‘అపహరణ’ అభియోగాన్ని విచారించిన న్యాయస్థానం ఆయన నిర్దోషి అని నిగ్గుతేల్చింది. అఝీముద్దీన్, రజాలు విధియుక్తంగా వివాహం చేసుకున్నట్టు తీర్పు చెప్పింది. ఆ తరువాత ఈ దంపతులు నిజామాబాద్‌లో నివసించారట. అఝీముద్దీన్ భార్య గర్భవతి అయింది. ఈ దశలో ఆమె తండ్రి, వారి వివాహాన్ని తాను అంగీకరించినట్టు వర్తమానం పంపాడట. కూతురినీ అల్లుడినీ తన ఇంటికి వచ్చి తన ఆతిథ్యం స్వీకరించవలసిందిగా ఆహ్వానించాడట. అల్ నస్సర్ హర్బీ మాటలను విశ్వసించి సౌదీ అరేబియాకు వెళ్లిన అఝీముద్దీన్‌ను ఆ ‘మామ’ పోలీసులకు పట్టించాడు. ఏప్రిల్ ఇరవై తేదీ నుంచి అఝీముద్దీన్ జైలులో ఉన్నాడట.. నిజానిజాలను దర్యాప్తుచేయకుండా సౌదీ అధికారులు అఝీముద్దీన్‌ను పట్టుకొని వెళ్లి నిర్బంధ గృహం పాలుచేయడం సౌదీలోని ‘వ్యవస్థ’కు అద్దం..
అఝీముద్దీన్ తల్లి చేసిన ఫిర్యాదు మేరకు మన ప్రభుత్వం ఆయనను విడిపించే ప్రయత్నం మొదలుపెట్టింది. జెద్దాలోని మన దౌత్య కార్యాలయం వారు నిర్బంధ గృహం ఉన్న ‘తరలింపు కేంద్రాన్ని’- డిపోర్టేషన్ సెంటర్- దర్శించి అఝీముద్దీన్‌ను విడుదల చేయవలసిందిగా కోరారట. కానీ నర్సర్ అల్ హర్బీ తన ‘అభియోగాన్ని’ ఉపసంహరించుకోనిదే అఝీముద్దీన్‌ను విడుదల చేయడం సాధ్యం కాదనీ సౌదీ అధికారులు అంటున్నారట. మన దౌత్యవేత్తలు నర్సర్ అల్ హర్బీని కూడ కలసి అభియోగాన్ని రద్దుచేసుకొమ్మని ‘‘వేడుకున్నారట’’. కానీ ఆ దుర్మార్గుడు మాత్రం అభియోగాన్ని ఉపసంహరించుకొనడానికి నిరాకరించాడట! ‘‘మా దేశ పౌరుడు నిర్దోషి. అతనిపై అసత్య అభియోగం మోపిన మీ దేశ పౌరుడిని శిక్షించండి. మా పౌరుడిని వెంటనే మా దేశానికి పంపించండి....’’అని మన ప్రభుత్వం సౌదీ ప్రభుత్వానికి ఎందుకని గట్టిగా చెప్పలేకపోతోంది? నాలుగేళ్లక్రితం ఢిల్లీలోని సౌదీ అరేబియా కార్యాలయంలో పనిచేసిన ఒక బీభత్స దౌత్యవేత్త తన నివాసంలో ఇద్దరు మహిళలను ఆరు నెలలు నిర్బంధించాడు. వాడు, వాడి బంధుమిత్రులు ఆ మహిళలపై లైంగిక అత్యాచారాలు జరిపారు. అలాంటి నర పిశాచాన్ని మన ప్రభుత్వం శిక్షించలేదు. సౌదీ దౌత్య దౌర్జన్యానికి లొంగిపోయిన మన ప్రభుత్వం ఆ లైంగిక బీభత్సకారుడు స్వదేశానికి తిరిగి వెళ్ళడానికి అనుమతినిచ్చింది.. ఇదీ అంతరం..!!