ఉత్తరాయణం

విశాఖ రైల్వే స్టేషన్‌లో సమస్యల తిష్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ రైల్వేస్టేషన్‌లో వైఫై సేవలు, అంతర్జాతీయ ప్రమాణాలతో క్యాంటీన్ నిర్మాణం వంటి అధునాతన హంగుల స్థాపనకోసం కృషిచేస్తున్న రైల్వేశాఖ స్టేషన్‌లో తిష్టవేసుకున్న కొన్ని ముఖ్య సమస్యలపై కూడా దృష్టిసారించాలి. బుకింగ్ కౌంటర్ల కొరత కారణంగా ప్రయాణీకులు కనీసం గంటసేపు క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. స్టేషన్‌లో దొంగల బెడద బాగా ఎక్కువైంది. రైల్వేట్రాక్‌లు మలమూత్రాలతో నిత్యం అపరిశుభ్రంగా వుంటున్నాయి. మంచినీటి సౌకర్యం లేకపోవడంవలన అందరూ మినరల్ వాటర్ బాటిల్స్‌పై ఆధారపడాల్సి వస్తోంది. క్యాంటీన్‌లలో ఎమ్.ఆర్.పి. కంటే అధిక ధరలకు ఆహార పదార్థాలను అమ్ముతున్నారు. ప్రీపెయిడ్ ఆటోలకోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. రిజర్వేషన్లలో భారీగా అవకతవకలు సాగుతున్నాయి. జ్ఞానపురం ద్వారా రాత్రిళ్లు ఆకతాయిలకు, మందుబాబులకు అడ్డాగా మారింది. వౌలిక సమస్యల పరిష్కారంకోసం రైల్వేశాఖ కృషిచేయాలి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
సనాతన ధర్మాన్ని కాపాడాలి
మతం అనేది ఓ వ్యక్తి సొంత విషయం. ఇందులో మిషనరీల జోక్యం అనవసరం. ‘మా మతం స్వీకరించండి, మీ పాపాలన్నీ నశిస్తాయి. కష్టాలన్నీ తీరుతాయి. రోగాలన్నీ నాశనమైపోతాయి. ఎన్ని పాపాలు చేసినా క్షమింపబడతాయి! పాప క్షమాపణ మా మతంలోనే ఉంది. వేరే ఏ మతంలోనూ లేదు. రండి. పునర్జీవనం పొందండి. మతం మారండి’’అని హిందువులను తమ మతంలోనికి చేర్చుకుంటున్నాయి. మత మార్పిడులను ప్రతీ హిందూ వ్యక్తి ఎదుర్కోవాలి. సనాతన ధర్మం కాపాడాలి. హిందూ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి. నైతిక విలువలు, సనాతన సంప్రదాయాలు హైందవంలో ఇంకా పటిష్టంగా ఉన్నాయ. వీటిని కాపాడాలి.
- వి.వివేక్, విశాఖపట్నం
తూకాల్లో మోసం
కొన్ని రైతుబజార్లలో కొంతమంది రైతుల పేరుతో రైతుబజార్లలో వ్యాపారాలు నిర్వహించేవారు తప్పుడు తూకాలకు పాల్పడుతున్నారు. తూకాల మోసంవల్ల 50గ్రాములనుండి 100 గ్రాముల వరకు వినియోగదారులు నష్టపోతున్నారు. బోర్డుమీద ఉన్న రేట్లను సైతం కొందరు రైతులు, వ్యాపారులు ఫాలో కావటంలేదు. మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌నుబట్టి రైతుబజార్లలో నిర్ణయించిన రేట్ల పట్టిక అనుగుణంగా కాక అధిక రేట్లకు కొందరు విక్రయిస్తున్నారు. రైతుబజార్లవద్ద పార్కింగ్ సమస్య ఉత్పన్నమవుతున్నది. రైతుబజార్ల ప్రధాన రహదారుల వద్ద సెంటర్లలో ఉండటంవల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతున్నది. పార్కింగ్ సమస్య రోడ్లుపక్కన ఉన్న ట్రాఫిక్ సమస్య దృష్ట్యా వాహనాలను నిలువనివ్వటంలేదు. రైతుబజార్ ఆవరణలోకి ఆటోలు అనుమతివల్ల ఇబ్బందుల పాలవుతున్నారు. వీటిని పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై వుంది.
- అయినం రఘురామరావు, ఖమ్మం

తజకిస్తాన్ పాలన అవసరమే
మధ్య ఆసియాముస్లిం ప్రాబల్య దేశమైన తజకిస్తాన్ పాలన కొంతవరకు ఇండియాలో కూడ అవసరమే. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని తుదముట్టించేందుకు అక్కడ ఇస్లామిక్ రాజకీయ పార్టీని పూర్తిగా నిషేధించారు. పురుషుల గడ్డాలు తొలగింపజేశారు. స్ర్తిలు తల వస్త్రాన్ని ధరించకుండా చేశారు. ఇవన్నీ కేవలం తీవ్రవాదులను అడ్డుకోవడానికేనని చెప్పారు. గడ్డాలు, ముసుగులు ధరించి తిరగేవాళ్లలో ఇస్లామిక్ తీవ్రవాదులు, ఐఎస్‌ఐ తీవ్రవాదులు వండవచ్చని వాళ్ల వాదన.
-జి. శ్రీనివాసులు, అనంతపురం