సంపాదకీయం

‘సుఖం’గా నిలబడి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిలబడి ‘సుఖంగా’ ప్రయాణం చేయాలన్నది ‘నిలువున’ పెరుగుతున్న నగరాలలోని జీవన రీతి- లైఫ్ స్టయిల్-! ఆధునిక విలాసం- మోడరన్ ఫాషన్. ఎందుకంటె పద్దెనిమిది ఏళ్లు నిండిన నలబయి ఐదు ఏళ్లు నిండని నాగరిక యువజనులలో అత్యధికులకు- కూచోవడానికి వీలుగా వంగవలసిన- మోకాళ్లు వంగడం లేదు. లావెక్కి ఉన్న నడుములు ఎలాగూ వంగవు. ‘అదేమిటయ్యా? నేలమీద కూర్చొనడానికి కదా నడుములు, మోకాళ్లు వంగవలసిన అవసరం ఉంది.. రైళ్లలోను, బస్సులలోను ‘సీట్ల’ను అలంకరించడానికి ఈ అవయవాలు వంగవలసిన అవసరం ఏముంది?’ అన్న ప్రశ్నకు గతంలో సందర్భశుద్ధి ఉండేది, ఇప్పుడు లేదు. ఎందుకంటె ‘కుర్చీ పట్టని’ యువజనులు కూర్చోలేరు. కూచున్న వెంటనే కాళ్లు ఎదురుగా ఉన్న బల్లమీదనో లేదా మరో కుర్చీ మీదనో, రైళ్లలో ఎదురుగా ఉన్న ‘శయ్య’- బెర్త్- మీదనో పెట్టకుండా రెండు నిముషాలు కూడా ఉండలేని యువజనులు కోకొల్లలు. అలా అసభ్యంగా అసహ్యంగా- చూసేవారికి- ఎదురు ‘శయ్య’పై కాళ్లు పెట్టకపోతే వారు కూచోలేరట, కాళ్లు లాగి పారేస్తాయట! యోగ విద్యా దినోత్సవాలు ‘పద్మాసనం’ వేయడాలు ప్రచారం కోసం మాత్రమే! కాళ్లు- ఎదురుగా ఏది కనిపిస్తే దానిమీదికి, చాచి కూలబడే దృశ్యాలు ఆధునిక జీవన వాస్తవాలు. అందువల్ల ‘రైళ్ల’లో సుఖంగా కూచుని- పగటిపూట- ప్రయాణం చేయడం గతం. మహా నగరాలలోని ‘మెట్రో’ రైళ్లలో సుఖంగా నిలబడి ప్రయాణం చేయడం ‘ప్రపంచీకరణ’ యుగం.. వర్తమాన యుగం! మోకాళ్లు వంగని, నడుములు వంగని యువజనుల సౌకర్యార్థమే హైదరాబాద్‌లోను ఇతర చోట్ల నిలబడి ప్రయాణం చేసే సుఖకరమైన వ్యవస్థను ఏర్పాటు చేశారట. ప్రభుత్వేతర రంగాలలో, ప్రభుత్వ రంగాలలో మెరుగైన సేవలు తక్కువ ఖర్చుతో వినియోగదారులు పొందగలరన్నది గతం! బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు- మల్టీనేషనల్ కంపెనీస్- ఎమ్‌ఎన్‌సిలు-, స్వదేశీయ ఘరానా వాణిజ్య సంస్థలు - ప్రభుత్వేతర రంగ సంస్థలు- వినియోగదారులపై ‘సేవా దౌర్జన్య బీభత్సకాండ’ను కొనసాగిస్తుండడం ప్రపంచీకరణ యుగం. ఈ ‘దౌర్జన్య సేవల’ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు ప్రోత్సహిస్తుండడం వికృతంగా విన్యాసాలను చేస్తున్న వాస్తవం! ఈ ‘ప్రోత్సాహం’పేరు ‘ప్రభుత్వ ప్రభుత్వేతర భాగస్వామ్యం’- పబ్లిక్ ప్రయివేట్ పార్ట్‌నర్‌షిప్- పీపీపీ-! ఈ ప్రోత్సాహం ప్రపంచీకరణ స్వభావం. దీనికి స్వరూపం ‘స్వేచ్ఛావిపణి’- మార్కెట్ ఎకానమీ-! ‘్భరత్‌లో నిర్మించండి’- మేక్ ఇన్ ఇండియా- స్ఫూర్తికి, ఎగుమతులను పెంచాలన్న లక్ష్యానికి, స్వదేశీయ స్వాభిమాన స్వయం సమృద్ధ సాధన సిద్ధాంతానికి పూర్తి విరుద్ధమైన రీతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీయ వాణిజ్య సంస్థల చొఱబాటును ప్రోత్సహిస్తున్నాయి. నోరు మాట్లాడుతోంది- స్వయం సమృద్ధ భారతం! నొసలు వెక్కిరిస్తోంది- బహుళ జాతీయ ‘వాణిజ్య సేవల’ కబంధ బంధంలో జనజీవనం విలవిలలాడుతున్న దృశ్యం! ఇదీ ప్రభుత్వాల విధానాలలో నిహితమై ఉన్న వైరుధ్యం...
తయారై ఉన్న- రెడీమేడ్- రైళ్లను ప్రభుత్వేతర సంస్థల నుంచి కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగిస్తోందన్న ప్రచారానికి ఈ విధాన వైరుధ్యం విచిత్రమైన నేపథ్యం. ఇలా ప్రభుత్వేతర సంస్థల ‘రెడీమేడ్’ రైళ్లను పెద్దఎత్తున కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించిందట, పరిశీలిస్తోందట. ఈ ప్రతిపాదనను అంగీకరించి అమలు జరిపినట్టయితే దేశంలోని ప్రభుత్వరంగపు ‘రైలుపెట్టెల’ నిర్మాణ పరిశ్రమల ప్రాధాన్యం తగ్గిపోయే ప్రమాదం ఉంది. ప్రాధాన్యం తగ్గడం ఆరంభం.. మూతపడడం చివరి ఘట్టం! దాదాపు రెండువేల కొత్త రైళ్లను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందట. అయితే ఈ నిర్ణయంలో రైలు సేవల విస్తరణ కంటె ప్రభుత్వేతర సంస్థల వాణిజ్య ఆధిపత్య విస్తరణ అతిగా ప్రస్ఫుటిస్తోంది. ఈ రెండువేల కొత్త రైళ్లలో మూడువందల ఇరవై ‘వందే భారత్’ ఎక్స్‌ప్రెస్ తరహా రైళ్లుకూడ పరుగులెత్తనున్నాయట. కలకత్తా ‘మెట్రో’ మార్గంలో నడపడం కోసం నూట ఇరవై ఐదు రైళ్లను సిద్ధం చేయనున్నారట. ఇదంతా మూడేళ్లలో అమలు జరుగనున్న పథకం. అందువల్ల ఈ రైళ్లకు కావలసిన పెట్టెలను ప్రభుత్వరంగ కర్మాగారాల నుంచి సమకూర్చుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వరంగంలో దేశంలోని మూడుచోట్ల రైలుపెట్టెల నిర్మాణ కర్మాగారాలు నెలకొని ఉన్నాయట. ఇంకా కొన్ని కర్మాగారాలు నిర్మాణ దశలోను, ప్రతిపాదన దశలోను, విజ్ఞప్తుల దశలోను ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో రైలుపెట్టెల నిర్మాణ కర్మాగారాలను ప్రారంభించాలన్న ‘ప్రతిపాదనలు కొనసాగుతూనే ఉన్నాయి.’ అందువల్ల నష్టాలు లేని ‘రైలు’రంగాన్ని ప్రభుత్వ నిర్వహణలోనే ఉంచి విస్తరింపచేయడం మేలు. ఉన్న కర్మాగారాల ఉత్పాదక సామర్థ్యాన్ని ఉత్పాదక పరిమాణాన్ని పెంచడం ద్వారా ప్రభుత్వ రంగంలోనే వలసిన రైలుపెట్టెలను సమకూర్చుకోవాలి! అవసరమైన పెట్టెలు వస్తురవాణాకు అవసరమైన ‘మక్కెర’- వాగన్-లు ప్రభుత్వరంగంలో లభ్యం కానప్పుడు మాత్రమే ప్రభుత్వేతర రంగం వైపు చూడాలి!
ప్రభుత్వరంగ సంస్థలలో లభ్యం కావన్న సాకుతో ప్రభుత్వేతర రంగం నుంచి జరుపుతున్న కొనుగోళ్ల వల్ల వ్యయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. ఇదంతా ఒక వలయం.. వ్యయం పెరగడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలకు నష్టాలు రావడం, వాటిని మూతవేయడం లేదా అమ్మివేయడం.. 1993లో ప్రపంచీకరణ మొదలయినప్పటి నుంచి ఇదే తంతు! ప్రభుత్వరంగ సంస్థలు ప్రభుత్వేతర రంగ సంస్థలతో పోటీపడడం తద్వారా ఉభయ రంగాలలోను ఉత్పాదక సామర్థ్యం, ఉత్పాదక ప్రమాణాలు- నాణ్యత- పెరగడం...- ప్రపంచీకరణ మొదలైన తొలి రోజులలో ఇదీ ప్రభుత్వం ప్రచారం చేసిన సిద్ధాంతం. కానీ క్రమంగా ‘నష్టాలు వస్తున్న ప్రభుత్వరంగ సంస్థల’ను మూసివేశారు. లాభాలు వస్తున్న సంస్థల వాటాలను విక్రయించడం- డిస్ ఇనె్వస్ట్‌మెంట్- మొదలైంది. ఈ అమ్మకాలు క్రమంగా ఊపందుకున్నాయి! ప్రభుత్వ రంగ సంస్థలు అంతరించిపోవడం వల్ల, ప్రభుత్వేతర సంస్థలు గుత్త్ధాపత్యం వహించి జనం నెత్తికెక్కి తొక్కుతున్నాయి. భారతీయ జన జీవన గతిని బహుళ జాతీయ సంస్థలు నిర్దేశిస్తుండడం ప్రభుత్వం ప్రచారం చేస్తున్న ‘‘జీవన సౌలభ్యం’’- ఈజ్ ఆఫ్ లివింగ్-! పెట్టుబడులు కాని, అత్యధునాతన చిత్ర విచిత్ర సాంకేతిక పరిజ్ఞానం కాని ఏమాత్రం అవసరంలేని ‘బీమా’-ఇన్సూరెన్స్- రంగంలోకి విదేశీయ సంస్థల చొఱబాటును అనుమతించడం, చిల్లర వ్యాపారంలోకి విదేశీయపు దోపిడీ వాణిజ్య ముఠాలను అనుమతించడం, భయంకరమైన ధరలకు రైతులకు విత్తనాలను అమ్మి సొమ్ముచేసుకొనడానికి విదేశీయ సంస్థలకు వీలుకల్పించడం వంటివి ‘ప్రపంచీకరణ’ మాదకం మత్తెక్కిన ప్రభుత్వాలు పాతికేళ్లకు పైగా జరిపిస్తున్న నిర్వాకాలు! పొంతన లేని విధానాలు- ఒకవైపున స్వదేశీయ స్ఫూర్తి ఆర్భాటం, మరోవైపున విదేశీయ వాణిజ్య సామ్రాజ్య విస్తరణకు ప్రోత్సాహం- కొనసాగుతున్నాయి...
రైలు రంగంలోని వివిధ విభాగాలలోకి ఇప్పటికే ప్రభుత్వేతర, బహుళ జాతీయ సంస్థలు చొరబడి ఉన్నాయి. పెట్టెలు, పట్టాలు మాత్రమే ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. వీటిని సైతం ప్రభుత్వేతరులకు అప్పగించినట్టయితే ఏమవుతుంది? మెట్రో రైళ్లలో నిలబడి ‘నాగరికులు’ ప్రయాణం చేస్తున్న రీతిలోనే కన్యాకుమారి నుంచి జమ్మూ వరకు జనం ‘సుఖంగా నిలబడి’ ప్రయాణం చేసే ఆదర్శం సాకారం అవుతుంది! నిలబడి ప్రయాణించడం ఒకప్పుడు గొప్ప ఘోరమైన అసౌకర్యం. ఈ అసౌకర్యం గురించి కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తన ‘దమయంతీ స్వయంవరం’ నవలలో ఇలా వివరించాడు- ‘..్భం చేసి మెతుకులు నోట్లో వేసుకుంటూనే నాలుగు మైళ్లు నడిచి రైలెక్కాను.. రైలు ఎక్కాను- అని వ్రాయడం చాలా తేలికే కాని ఎక్కడం మాత్రం చాలా కష్టం. లోపలివాళ్లు ఎక్కనివ్వరు.. నాలుగుగంటలు అదే పనిగా నిలుచున్నాను.. కొందరు బనాయించి పడుకుంటారు.. మనం ఏం చేయాలి? వాడు కాళ్లు చాచి పడుకుంటే పక్కన నిలుచోవాలి, కనుక నిలుచున్నాను..’’ ఇది 1950వ దశకం నాటి మాట! నిలుచుండడం అసౌకర్యం! ఇప్పుడు ‘విలాసం’-్ఫషన్-గా మారింది! నిలుచుని ‘మెట్రో’లో పయనించడం ‘గొప్ప సౌకర్యం’. ఇదీ ప్రపంచీకరణ మాయాజాలం.. సిగ్గులేనిది ఎవరికి? దేశం పట్ల ధ్యాస లేనిది ఎవరికి??