సంపాదకీయం

విచక్షణకు విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండేళ్ల క్రితం సంభవించిన మహా పరివర్తన ప్రభావం మరింతగా విస్తరించడం ఐదు శాసనసభల ఎన్నిల ఫలితాల ద్వారా ప్రస్ఫుటించిన అతిప్రధాన పరిణామం. అసోం ఎన్నికల ఫలితాలు ఈ విస్తృతికి ప్రతీకలు. పరివర్తన విస్తృతి వేగం ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాలలో సమానంగా సంభవించకపోవడం సహజం. ఒకే సారి బ్రహ్మాండం బద్దలైపోయినంత స్థాయిలో పరివర్తన సంభవించాలని, సంభవిస్తుందని ఎదురుచూసిన ఉత్కంఠగ్రస్తులకు అందువల్ల నిరాశ కలిగివుండవచ్చు. కానీ పరివర్తన విస్తరిస్తోంది. ప్రజల్లో కోరుకుంటున్న మార్పునకు భారతీయ జనతాపార్టీ పతాకగా మారి ఉండడం ప్రబల రాజకీయ ప్రత్యర్థులు సైతం నిరాకరించజాలని వాస్తవం. ప్రజలు వదిలించుకోవాలని భావిస్తున్న దానికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా అవతరించడం కూడ ఈ ఐదు సభల ఎన్నికల ఫలితాల తీరుతెన్నులు వివరిస్తున్న నిజం. కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం నానాటికీ ‘వామనీకృత’మైపోతోంది. భాజపా ప్రభావం త్రివిక్రమస్ఫూర్తి సంతరించుకొని ఉంది.్భరతీయ జనతాపార్టీ కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో భాగంగా గత రెండు సంవత్సరాలుగా అనుసరిస్తున్న విధానాలు కాంగ్రెస్ పార్టీ విధానాల కంటె ఎంతమేరకు భిన్నంగా ఉన్నాయన్నది ఏకాభిప్రాయానికి నోచని వాస్తవం. కానీ భాజపా ప్రభుత్వం పనితీరు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు కంటె పూర్తి విరుద్ధంగా ఉన్నదన్న విషయంలో భిన్నాభిప్రాయాలకు తావులేదు. మన్‌మోహన్ సింగ్ నాయకత్వంలో కాంగ్రెస్ కేంద్రంలో నడిపించిన పదేళ్ల పాలన అవినీతికి ప్రతిరూపంగా మారిందన్న ఆరోపణలు ఇప్పటికీ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిత్వంలో భాజపా 2014 మే 26 నుంచి నడిపిస్తున్న పాలనకు అవినీతి అంటలేదు..ఇదీ వైరుధ్యం. అందుకే మెల్లమెల్ల గానే కావచ్చు గాక, ప్రజలు కోరుకుంటున్న పరివర్తన విస్తరిస్తోంది. మహారాష్ట్ర, హర్యానా, జమ్మూకాశ్మీర్‌లలో విస్తరించిన ఈ ప్రభావానికి వర్తమాన ఘట్టం అసోం . అసోం శాసనసభ ఎన్నికలలో భాజపా కూటమి విజయకేతనం ఎగురవేయగలిగింది. అసోం ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకున్నారు. అంతర్గత వైరుధ్యాలకు, వైరుధ్యాలు సృష్టించిన హింసాకాండకు ప్రత్యామ్నాయం కోరుకున్నారు. బంగ్లాదేశ్ నుండి చొరబడిపోతున్న అక్రమ ప్రవేశకులను నిరోధించలేని దశాబ్దుల చతికిలపడిన తనానికి ప్రత్యామ్నాయాన్ని కోరుకున్నారు. ఈ ప్రత్యామ్నాయం భాజపా రూపంలో లభించింది.. సమైక్యం, భద్రత వంటి దీర్ఘకాల జాతీయతా విధానాలతో రానున్న అభిలషణీయ పరివర్తనకు అస్సాం ఎన్నికలఫలితాలు సంకేతాలు...
కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ శాసనసభల ఎన్నికల ఫలితాలలో కూడా పరివర్తన మరోవిధంగా ప్రస్ఫుటించి ఉంది. కేరళలో ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని ఓటర్లు మార్చేస్తుంటారు. అందువల్ల వామపక్ష ప్రజాస్వామ్య కూటమికి విజయం లభించింది. ఐదేళ్లపాటు పాలనను నిర్వహించిన కాంగ్రెస్ ఓడిపోవడం సహజ పరిణామం! రెండు చొక్కాలు ఉన్నవాడు ఒకటి మాసిపోతే దాన్ని గూటానికి తగిలించి, గూటానికున్న రెండవ చొక్కాను ధరించినట్టుగా కేరళ రాజకీయ పరిస్థితి. రెండవ చొక్కా మాసిపోయిన వెంటనే మళ్లీ గూటానికున్న మొదటి అంగీనిధరించవలసి వస్తోంది. తృతీయ ప్రత్యామ్నాయం లభించకపోవడం తృతీయశక్తిగా ఎదగడానికి భాజపా చేస్తున్న దశాబ్దుల యత్నాలు ఎప్పటికప్పుడు వమ్ము కావడం కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్ పార్టీలు వంతుల వారీగా గెలవడానికి కారణం. అధికారపార్టీ గొప్పగా పాలించిందా? తప్పుగా పాలించిందా అన్న విచక్షణకు కేరళ రాజకీయాలలో స్థానం లేదన్నది ధ్రువపడిన వాస్తవం. ‘దొందు దొందే’ కాబట్టి ప్రతిసారి కేరళలో వోటర్లకు ప్రభుత్వ పక్షాన్ని మార్చడం మినహా గత్యంతరం లేని పరిస్థితి కేరళలో నెలకొని ఉంది. అయితే మార్క్సిస్టు పార్టీ నాయకత్వం లోని కూటమి దాదాపు మూడింట రెండువంతుల మెజారిటీ లభించడమే అద్భుతం. ఓడిన కాంగ్రెస్ పరాజయ తీవ్రతకు ప్రధాన కారణం గెలవని భాజపా అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓట్లను చీల్చింది. వోటర్ల ద్విదా విభక్తమైన కేరళలో గెలిచిన అభ్యర్థులకు ఓడిన వారికంటె అతితక్కువ వోట్ల ఆధిక్యత మాత్రమే లభిస్తోంది. అందువల్ల భాజపా దాదాపు పదిహేను నియోజకవర్గాల్లో చీల్చగలిగిన వోట్లు కాంగ్రెస్ వారి భారీ పరాజయానికి ఒక ప్రధాన కారణం. అందువల్ల కమ్యూనిస్టులు మురిసిపోవడానికి సహేతుకమైన ప్రాతిపదిక లేదు. పుదుచ్చేరికి చెందిన మహే నియోజకవర్గం కేరళను ఆనుకొని ఉంది. కాబట్టి అక్కడ కూడ మార్క్సిస్టులు గెలవగలిగారు. పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్-వామ కూటమి పెట్టుకున్న పొత్తు అవకాశవదానికి పరాకాష్ఠ...సైద్ధాంతికంగా దివాలా తీసిన కాంగ్రెస్‌కు కేరళ వోటర్లు, వామ కూటమికి ‘వంగ’ ప్రజలు తగిన శాస్తి చేయడం మరో పరివర్తన.
తమిళనాడులో నిజానికి డబ్ముకూ డబ్బుకూ మధ్య పోటీ జరిగింది. అవినీతి రాజకీయానికి, అవినీతి రాజకీయానికి మధ్య ప్రధానంగా కుమ్ములాట జరిగింది. అయితే 1989 నుంచీ ప్రతిసారీ అధికారపార్టీని మార్చిన తమిళ ప్రజలు ఈసారి మార్చకపోవడానకి కారణం మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పదవీ లాలసత. డిఎంకెలో తిరుగులేని తొంబయి ఏళ్ల కరుణానిధి మళ్లీ ముఖ్యమంత్రి కావడం తమిళ వోటర్లు ఊహించుకోలేపోయినట్టు ప్రచారమైం ది. ఈ దుర్భరదృశ్యం ఆవిష్కృతం కాకుండా నిరోధించాలన్న పట్టుదలతోనే తమిళ వోటర్లు మరోసారి ముఖ్యమంత్రి జయలలిత నాయకత్వంలోని ఎఐడిఎంకె వారిని మళ్లీ గెలిపించారట. ఎన్నడూ లేని విధంగా తమిళనాడు శాసనసభలో ప్రతిపక్షం వారి సంఖ్యాబలం పెరగడం పురుచ్చితలైవీ పాలిట కొంత నిరసనకు సంకేతం. అన్నాడిఎంకె, డిఎంకె కూటముల మధ్య ఓట్ల శాతంలో తేడా కూడా కేవలం మూడు శాతం మాత్రమే. ఈ ఐదు శాసనసభల ఎన్నికలలో అత్యంత ప్రజాదరణ పొందిన ఒకే ఒక వ్యక్తి, తిరుగులేని శక్తి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. గతంలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసినప్పటికంటే ఒంటరిగా పోటీ చేసిన ప్రస్తుత ఎన్నికల్లో బెంగాల్ దీదీక ఎక్కువ శాసనసభ స్థానాలు లభించడం ప్రత్యర్థులందరినీ విస్మయచకితులను చేసిన పరమాద్భుతం. భాజపా, మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని వామకూటమి వోట్లను చీల్చడం ఇందుకు ఒక కారణం. భాజపా కాంగ్రెస్ కంటె ఎక్కువ శాతం వోట్లు రావడం, కాంగ్రెస్ వామకూటమి కంటె ఎక్కువ సీట్లు బెంగాల్ శాసనసభలో ప్రస్ఫుటించడం విచిత్రాలు. ప్రత్యామ్నాయ ఆర్థిక నీతికి మమతా బెనర్జీ నాయకత్వలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధిగా అవతరించడం ప్రచారం కాని మహా విషయం. ప్రపంచీకరణ ఆర్థిక దురాక్రమణకు, భారతీయతకు మధ్య జరుగుతున్న సైద్ధాంతిక సంఘర్షణలో బెంగాల్ దీదీ భారతీయతకు ప్రతినిధిగా సలడని నిష్ఠ పాటిస్తోంది.
మరుగుజ్జుగా మారుతున్న కాంగ్రెస్‌కు మిగిలింది కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి మాత్రమే. 1989 వరకు దేశంలో కాంగ్రెస్ ప్రధానశక్తి. 2014 నుంచి భాజపా ప్రధానశక్తిగా దేశమంతటా విస్తరించిపోతోంది. ఈ పరివర్తనకు అస్సాం విజయం మరో ప్రతీక..బంగ్లాదేశ్ నుంచి దశాబ్దులపాటు చొరబడిన దాదాపు రెండు కోట్ల మందిని భాజపా ఈశాన్యం నుండి వెళ్లగొట్టగలగాలి. కేంద్ర రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న భాజపా నిర్వహించదగిన ప్రథమ కర్తవ్యమిది.