సంపాదకీయం

‘చొరబాటు’పై సమరం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగ్లాదేశ్ సరిహద్దు పొడవునా కంచెను ఏర్పాటు చేయడానికి కృషి చేయనున్నట్టు అస్సాం నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన శర్బానంద్ సోనోవాల్ ప్రకటించడం హర్షణీయ పరిణామం! అస్సాంను మాత్రమే కాక యావత్ భారత జాతిని దశాబ్దుల తరబడి పట్టి పీడిస్తున్న భయంకర సమస్య బంగ్లాదేశీయుల చొరబాటు...దశాబ్దుల తరబడి మన దేశంలోకి చొరబడిన బంగ్లాదేశీయ అక్రమ ప్రవేశకుల సంఖ్య లక్షలను దాటి కోట్లకు చేరింది. దాదాపు కోటి మంది బంగ్లాదేశీయ అక్రమ ప్రవేశకులు ఈశాన్య ప్రాంతంలోకి చొరబడినట్టు 1980వ దశకం ఆరంభం నాటికే ఆధికారికంగా నిర్ధారణ జరిగింది. ఆ తరువాత మూడు దశాబ్దులు గడిచిపోయాయి. చొరబాటుదారుల సంఖ్య రెండు కోట్లనుంచి మూడు కోట్ల వరకు ఉండవచ్చుననేది ఇటీవల అంచనా! చొరబడినవారు ఇక్కడే స్థిరపడిన తరువాత వారి కుటుంబాలు ఏర్పడినాయి. వారి పిల్లలు పిల్లల పిల్లలు...ఇలా చొరబాటుదారుల జనాభా పెరిగింది. ఇలా బంగ్లాదేశీయులు మనదేశంలోకి నిరంతరం అక్రమంగా ప్రవేశించగలగడానికి కారణం ఉభయ దేశాల సరిహద్దుల్లో సంపూర్ణంగా సమగ్రంగా కంచె-ఫెన్సింగ్ ఏర్పడకపోవడం. కంచెను ఏర్పాటు చేసే కార్యక్రమం దశాబ్దుల క్రితం మొదలైనప్పటికీ ఇప్పటివరకు పూర్తి కాకపోవడానికి కారణాలు అనేకం... కేంద్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులకు చిత్తశుద్ధి లేకపోవడం, అక్రమ ప్రవేశకులను నిరోధించాలన్న నిష్ఠ లేకపోవడం, ఇటీవల ముగిసిన అసోం శాసనసభ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతాపార్టీ ఈ చొరబాటు సమస్యను ప్రధానంగా ప్రచారం చేసింది. 1983లో చొరబాటును తుదముట్టించడానికై కేంద్ర ప్రభుత్వానికీ, అసోం ప్రభుత్వానికీ చొరబాటు వ్యతిరేక ఉద్యమ కారులకు మధ్య ఒప్పందం కుదిరింది. కానీ ఇది అమలు కాలేదు. అమలు కాకపోవడానికి ప్రధాన కారణం ఈ ఒప్పందం ప్రాతిపదికగా రూపొందించిన న్యాయ మండలుల ద్వారా అక్రమ ప్రవేశకుల నిర్ధారణ చట్టం(ఇల్లీగల్ మైగ్రంట్స్ డిటర్మినేషన్ బై ట్రిబ్యునల్స్-ఐఎమ్‌డిటి-యాక్ట్) ఇరవై రెండేళ్ల తరువాత 2005లో ఈ చట్టాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది! 1980 దశకం నాటి ఒప్పందాన్ని అమలు జరుపడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని కూడ శర్బానంద్ సోనోవాల్ హామీ ఇవ్వడం కూడ భాజపా ఎన్నికల వాగ్దానానికి అనుగుణం! చొరబాటు సమస్యను కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వాలు దశాబ్దుల తరబడి పరిష్కరించలేకపోయాయి. ఈ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయానికి, భాజపా కూటమి ఘనవిజయానికి చొరబాటు ప్రధాన కారణం!
అసోంలోను బెంగాల్‌లోను వివిధ జన సముదాయాల నిష్పత్తిలో వచ్చిన విపరీతమైన మార్పులకు బంగ్లాదేశ్ నుండి చొరబడిన వారు ప్రధాన కారణం! దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్‌లోని ఇస్లాం మతస్థుల సంఖ్య పద్నాలుగు శాతం కాగా ప్రస్తుతం వీరి సంఖ్య ఇరవై ఎనిమిది శాతానికి పైబడింది. అసోంలో ఇస్లాం మతస్థుల సంఖ్య మొత్తం జనాభాలో ముప్పయి ఐదు శాతానికి పైబడింది. ఇదంతా 1947 నాటి దేశ విభజనతో ముడివడి ఉన్న సమస్య. దేశ విభజనకు పూర్వం అనాదిగా అఖండ భారత దేశంలో సర్వమత సమభావ వ్యవస్థ పరిఢవిల్లింది. మత వైవిధ్యాలు మత వైరుధ్యాలు రాలేదు. కానీ విదేశీయ దురాక్రమణ కొనసాగిన సమయంలో ఈ వ్యవస్థకు విఘాతం ఏర్పడింది. ప్రపంచంలోని అన్ని ఇతర మతాలను నిర్మూలించి ఇస్లాంను ఏకైక మతంగా స్థాపించాలన్న లక్ష్యంతో జిహాదీలు వెయ్యేళ్లకు పైగా మనదేశంలోని స్వజాతీయులను ఊచకోత కోయడం చరిత్ర.. స్వజాతీయ హైందవ మతాలవారిని జిహాదీలు బలవంతంగా ఇస్లాంలోకి మార్చడం కూడా చరిత్ర. ఈ చరిత్ర కారణంగానే 1947 ఆగస్టు 14న దేశ విభజన జరిగింది! ఇస్లాం మతస్థులు అధికంగా ఉన్న ప్రాంతాలు పాకిస్తాన్‌గా ఏర్పడినాయి. అవశేష భారత్‌లో సర్వమత సమభావ వ్యవస్థ అనాదిగా కొనసాగినట్టే 1947 ఆగస్టు 14 తరువాత కూడ యథావిధిగా కొనసాగుతోంది. దీనికి కారణం అవశేష భారత్‌లో అనాదిగా ఉన్న హైందవ జాతీయులు అధికాధికాధిక సంఖ్యలో ఉండడం. హిందుత్వం సర్వమతాల సంపుటం... హిందుత్వం అనాదిగా ఈ దేశపు జాతీయత! కానీ ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఉన్న పశ్చిమ పాకిస్తాన్‌లోను, తూర్పు పాకిస్తాన్-బంగ్లాదేశ్‌లోను జిహాదీలు హిందువులను నిర్మూలించారు. అత్యల్ప సంఖ్యాకులుగా మారిన హిందువులను సైతం ప్రస్తుతం నిర్మూలిస్తున్నారు...
అందువల్ల బంగ్లాదేశ్‌నుంచి చొరబడుతున్న ఇస్లాం మతస్థుల సంఖ్య క్రమంగా పెరిగి అసోంలోను, పశ్చిమ బెంగాల్‌లోను ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యాకులుగా మారవచ్చునన్న భయాందోళనలకు స్వదేశీయులైన హిందువులు దశాబ్దులుగా గురి అవుతున్నారు. ఇలా బంగ్లాదేశ్‌నుంచి చొరబడిన ముస్లింల సంఖ్య పెరగడంవల్ల జమ్ము కశ్మీర్‌లోని కశ్మీర్ లోయలో వలె తమ రాష్ట్రాలలో సైతం జిహాదీలు చెలరేగి హిందువులను నిర్మూలించవచ్చునన్న భయాందోళనలు కూడ ఈశాన్యంలో 1980 నాటికే వ్యాపించాయి. ఆ తరువాత జరిగిన ఘటనలు కూడ ఈ భయాందోళనలను ధ్రువపరిచాయి. బంగ్లాదేశ్‌నుండి చొరబడినవారు అధిక సంఖ్యాకులుగా మారిన కరీంగంజ్ వంటి జిల్లాలనుంచి స్వదేశీయులైన హిందువులను తరిమవేశారు. హిందు యువతులను, బాలికలను అపహరించడం వారిని అత్యాచారాలకు గురి చేసి హత్య చేయడం జిహాదీల బీభత్సకాండలో భాగమైపోయింది. మైదాన ప్రాంతంలోని హిందువులు ఈ విదేశీయ అక్రమ ప్రవేశకుల ముందు చతికిలపడి కానీ గిరిజనులు, వనవాసీలు మాత్రం చొరబాటుదారులను ప్రతిఘటిస్తున్నారు. బంగ్లాదేశీయులు తమ భూములను ఆక్రమించకుండా నిరోధిస్తున్నారు. బోడో వనవాసీలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమించడానికి కారణం కూడా చొరబాటే. చొరబాటుదారులను నిరోధించడంలో ప్రభుత్వాలు విఫలం కావడం వల్లనే తమంత తాముగా తమ భూమిని అడవిని రక్షించుకోవడానికి బోడోలు ఉద్యమించారు. ఈ ఉద్యమం దేశ వ్యతిరేక విద్రోహంగా మారడం వేరే కథ...అసోంలో కాంగ్రెస్ ఓటమికి భాజపా కూటమి విజయానికి స్థానికులు చొరబాటును వ్యతిరేకించడం ప్రధాన నేపథ్యం..
ఐఎమ్‌బిటి చట్టం బంగ్లాదేశీయులను పసికట్టి పట్టుకుని స్వదేశానికి తరలించడానికై ఏర్పడింది. కానీ ఈ చట్టం ప్రకారం బంగ్లాదేశీయులు తమ ప్రాంతంలో నివసిస్తున్నట్టు స్థానికులు ఫిర్యాదు చేయాలి. అలా ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే పోలీసులు న్యాయమండలిలో చొరబాటుదారులకు వ్యతిరేకంగా కేసులు పెడతారు. గ్రామాలు, బస్తీలు బంగ్లాదేశీయులతో నిండి ఉన్న చోట్ల ఫిర్యాదు చేసే వారు లేరు. ఫిర్యాదు చేసిన స్థానికులపై జిహాదీలు దాడులు జరిపారు. ఫలితంగా ఫిర్యాదులు ఆగిపోయాయి. చివరికి సుప్రీంకోర్టు ఈ గుదిబండ చట్టాన్ని రద్దు చేసింది..దేశానికంతటికీ వర్తించే విదేశీయుల నిర్ధారణ చట్టం కింద బంగ్లాదేశీయులను గుర్తించి తరలిస్తామని సోనోవాల్ వాగ్దానం చేశారు.