సంపాదకీయం

విద్రోహ విలాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్లగూబలు వికృతంగా విలపిస్తున్నాయి. సమీకృత వైవిధ్య భావ కిరణ సమగ్ర సూర్యుడు మళ్లీ ఉదయిస్తున్నాడు. సూర్య దర్శనాన్ని సహించలేని ఈ ‘‘ఉలూక రాజులు’’ స్వయం విదారక రోదనలను ఆవిష్కరిస్తుండడం నడుస్తున్న చరిత్ర. ఈ ‘ఉలూక’ సమూహాలు ప్రస్తుతం పళనియప్పన్ చిదంబరం వంటి వారి రూపాలను ధరించి ఉండడం కాల వైపరీత్యం. దేశ ‘స్వరూప’ రక్షణకు, ‘స్వభావ’ పరిరక్షణకు నిరోధకంగా మారి ఉండిన భారత రాజ్యాంగంలోని మూడువందల డెబ్బయ్యవ అధికరణం రద్దయిపోవడం- చిదంబరం వెక్కివెక్కి ఏడుపును లంఘించుకొని ఉండడానికి కారణం! ఈ గుదిబండ అధికరణం డెబ్బయి ఏళ్లకు పైగా భరతమాత మెడలో వేలాడింది. ఆకుపచ్చని అందాల జమ్మూకశ్మీర్ మానవ రక్తంతో ఎఱ్ఱబడడానికి దోహదం చేసింది.. ఈ రక్తం జిహాదీ బీభత్సకారులు చిందించింది, భరతజాతికి విద్రోహం తలపెట్టినవారు చిందించినది, పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత పైశాచిక మృగాలు చిందించినది. కశ్మీర్ లోయ ప్రాంతం నుంచి ‘సర్వమత సమభావ వ్యవస్థ’ను పెకలించి వేసిన ఉన్మాదపు ఉగ్రమూకలు చిందించినది! ‘గుదిబండ’ అధికరణం తొలగిపోవడంతో ‘లోయ’ ప్రాంతంలో మళ్లీ సర్వమత సమభావ స్వభావ సూర్యుడు అసంఖ్యాక కిరణాలతో ఉదయిస్తున్నాడు.. కశ్మీరీ సహజ స్వరూప కమలాలు మళ్లీ వికసిస్తున్నాయి, సనాతన భారత జాతీయ సహజ స్వభావ సుగంధాలను పంచిపెడుతున్నాయి. చిదంబరం వంటి వారికి ఈ సూర్యోదయం గిట్టడం లేదు. కశ్మీర్ ‘లోయ’ ప్రాంతంలో మళ్లీ ‘సర్వమత సమభావం’ వికసించడాన్ని ఇలాంటివారు మెచ్చడం లేదు. అందువల్లనే మత విద్వేషాలను రెచ్చగొట్టి కశ్మీర్ లోయలో మాత్రమేకాక దేశమంతటా మరోసారి వివిధ మతాల మధ్య వైరుధ్యాలను రగిలించడానికి పళనియప్పన్ చిదంబరం వంటివారు యత్నిస్తున్నారు. జమ్మూకశ్మీర్ జనాభాలో ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఉన్నందువల్లనే ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కట్టబెట్టిన మూడువందల డెబ్బయ్యవ రాజ్యాంగ అధికరణాన్ని రద్దుచేసినట్టు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిదంబరం ఆరోపణలు చేస్తున్నాడు. ఒకవేళ జమ్మూకశ్మీర్ జనాభాలో ‘హిందూ మతాల’వారు అధిక సంఖ్యలో ఉండి ఉన్నట్టయితే ఈ అధికరణాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి ఉండేది కాదన్నది చిదంబరం కనిపెట్టిన దేశద్రోహకరమైన, సర్వమత సమభావ వ్యతిరేకమైన, జిహాదీ బీభత్సకారులకు అనుకూలమైన, పాకిస్తాన్‌కు సంతోషకరమైన అబద్దం... వాస్తవాలను వక్రీకరించడం ద్వారా, సత్యాన్ని అసత్యంగాను అసత్యాన్ని సత్యంగాను ప్రచారం చేయడం ద్వారా చిదంబరం వంటివారు చరిత్రకు ద్రోహం చేస్తున్నారు, మాతృదేశ భౌగోళిక స్వరూప సమగ్రతను, జాతీయ స్వభావ సమైక్యాన్ని చెఱపివేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇస్లామేతర మతాలవారు దేశమంతటా అన్ని ప్రాంతాలలోను సంస్థానాలలోను అధిక సంఖ్యలో ఉండడం ఈ దేశం నుండి బ్రిటన్ దురాక్రమణదారులు నిష్క్రమించిన నాటి స్థితి. అనాదిగా భౌగోళిక, సాంస్కృతిక, జాతీయ వాస్తవమైన అఖండ భారత్ ముక్కలైన నాటి స్థితి ఇది. ఇస్లాం మతస్థులు జనాభాలో అధిక సంఖ్యలో ఉండిన ‘అఖండ భారత్’ భూభాగాలు పాకిస్తాన్‌గా ఏర్పడిన నాటి స్థితి. అఖండ భారత్ అనాదిగా ‘సర్వమత సమభావ’-సెక్యులర్- వ్యవస్థగా వికసించింది. ఈ సర్వమత సమభావం నిజానికి హైందవ జాతీయ తత్త్వంలో ప్రధానమైన అంశం! అవశేష భారత్‌లో కూడ యథావిధిగా ఈ సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ కొనసాగుతోంది. ఇందుకు కారణం హైందవ జాతీయ మతాలవారు అవశేష భారత్‌లో అధిక సంఖ్యలో ఉండడం. కానీ విదేశాల నుంచి అఖండ భారత్‌కు వ్యాపించి విస్తరించిన ఇస్లాం మతం వారు అధిక సంఖ్యలో ఉన్న పాకిస్తాన్‌లో సర్వమత సమభావ వ్యవస్థ నిర్మూలనకు గురికావడం చరిత్ర. పాకిస్తాన్ ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థగా ఏర్పడింది, ఇస్లామేతర మతాలవారిని పాకిస్తాన్‌లోని జిహాదీలు, ప్రభుత్వ దళాలవారు నిర్మూలించడం చరిత్ర! అవశేష భారత్‌లోని అన్ని ప్రాంతాలలోను సర్వమత సమభావ వ్యవస్థ పరిఢవిల్లుతుండగా జమ్మూకశ్మీర్‌లోని ‘లోయ’ప్రాంతంలో మాత్రం జిహాదీలు ఈ సర్వమత సమభావ వ్యవస్థను పెకలించి వేశారు. క్రీస్తుశకం 1947 నాటికి కశ్మీర్ లోయ జనాభాలో ఇరవై మూడు శాతం ఉండిన ఇస్లామేతర మతాలవారిని ‘జిహాదీ’లు దశలవారీగా నిర్మూలించారు. అందువల్ల కశ్మీర్ లోయ ప్రాంతంలోని జనాభాలో దాదాపు అందరూ ఇస్లాం మతస్థులే అయిన ‘ఏక మత’ వ్యవస్థ కొనసాగుతోంది. దేశమంతటా సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ ఉన్నప్పుడు జమ్మూకశ్మీర్‌లోని జమ్మూ, లడక్ ప్రాంతాలలో అన్ని మతాలవారు కలసిమెలసి సహజీవనం చేయగలుగుతున్నప్పుడు కశ్మీర్ ‘లోయ’ ప్రాంతంలో మాత్రం సర్వమత సమభావ వ్యవస్థ ఎందుకని నిర్మూలనకు గురి అయింది? ‘జిహాదీ’లు ఇస్లాంను తప్ప మరో మతాన్ని మిగలనివ్వరాదన్న మతోన్మాద కార్యక్రమాన్ని అమలుచేశారు కనుక!
ఈ ‘జిహాదీ’ల అన్యమత విద్వేషం కారణంగానే శతాబ్దుల చరిత్ర రక్తసిక్తం అయింది. జిహాదీలు నిష్కరుణగా ఇస్లామేతరులను హత్య చేయడం శతాబ్దుల తరబడి కొనసాగిన బీభత్సకాండ. క్రీస్తుశకం ఏడవ శతాబ్దిలో ఇస్లాం మతం పుట్టేనాటికి జమ్మూకశ్మీర్‌లోని ప్రజలు వంద శాతం స్వజాతీయ హిందూ మతాలవారు. భారతదేశంలో ఒక్క ఇస్లాం మతస్థుడు కూడా లేడు. చిదంబరం ‘‘కనిపెట్టినట్టు’’ ఇప్పుడు కమ్మూకశ్మీర్‌లో ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యాకులు ఎలా అయ్యారు? ఇస్లాం మతస్థులే అధిక సంఖ్యలో ఉన్న జమ్మూకశ్మీర్‌లో ‘కల్పాంతం’వరకు ఇస్లాం మతస్థులే అధిక సంఖ్యలో ఉండాలని కోరుతున్న చిదంబరం వంటివారు ఇదే ‘సంఖ్యాబాహుళ్య’- మెజారిటీ- సూత్రాన్ని దేశంలోని ఇతర ప్రాంతాల విషయంలో ఎందుకని ప్రస్తావించడం లేదు? మొత్తం అవశేష భారత్‌కు ఎందుకు వర్తింపచేయాలని కోరడం లేదు?? ఇస్లాం మతస్థులు అధికంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో జన సంఖ్యలోని మతాల నిష్పత్తిలో మార్పు జరుగరాదన్నది చిదంబరం వంటి ‘వేత్త’ల ఆకాంక్ష! మరి ఇస్లామేతర మతాలవారు అత్యధిక సంఖ్యలో ఉన్న అవశేష భారత్‌లో మాత్రం జనాభాలోని వివిధ మతాల నిష్పత్తిలో మార్పులు జరుగవచ్చునా?? చరిత్రను తల్లకిందులుగా నిలబెట్టడానికి యత్నిస్తున్న చిదంబరం వంటి వారు సమాధానం చెప్పాలి! బ్రిటన్ విముక్త భారత్‌లోని దాదాపు ఐదువందల డెబ్బయి ఐదు సంస్థానాలు విలీనం అయ్యాయి. జమ్మూకశ్మీర్ కూడ ఒక సంస్థానం. మిగిలిన సంస్థానాలకు దక్కని ప్రత్యేక ప్రతిపత్తిని జమ్మూకశ్మీర్‌కు మాత్రం- మూడువందల డెబ్బయ్యవ రాజ్యాంగపు అధికరణం ద్వారా- ఎందుకని కట్టబెట్టారు? ముస్లిం మెజారిటీ ప్రాంతం కాబట్టి జమ్మూకశ్మీర్‌కు ఇలా ‘ప్రత్యేకత’ను కట్టబెట్టారని ఇప్పుడు చిదంబరం చెప్పదలచుకున్నాడా?? అదే నిజమైతే అది భారత జాతీయ సర్వమత సమభావ స్వభావానికి విరుద్ధం కదా?? ‘రద్దు’కు కారణాలను నిర్ధారిస్తున్నవారు అదే ‘గీటురాయి’ని ‘కట్టబెట్టడానికి’గల కారణాలను నిర్ధారించడానికి ఎందుకని ఉపయోగించడం లేదు..
అనాదిగా అఖండ భారత జాతీయత మతాలకు భాషలకు ఇతర అసంఖ్యాక వైవిధ్యాలకు అతీతంగా వికసించింది. ఈ దేశపు జాతీయతకు ఒక మతం కాని ఒక భాష కానీ మరో వైవిధ్యం కాని ప్రాతిపదిక కాలేదు. ‘‘మాతా భూమి. పుత్రోహం పృథివ్యాః’’- భూమి తల్లి.. నేను ఆమె పుత్రుడను- అన్న సహజ ప్రాకృతి వాస్తవం ప్రాతిపదికగా మాత్రమే ఈ జాతి వికసించింది. ఈ దేశంలో పుట్టిన శైవ, వైష్ణవ, శాక్త, సౌర, గాణా పత్య, స్కాంద, సనాతన, బౌద్ధ, జైన, శిక్కు, ఆర్యసమాజం వంటి మతాలు అన్నీ ఈ జాతీయతలో భాగం అయ్యాయి. విదేశాల నుంచి వ్యాపించిన ఇస్లాం, క్రైస్తవం వంటి మతాలు కూడ ఈ జాతీయతలో భాగం కావడం కాలక్రమం.. ఈ ‘క్రమాన్ని’వ్యతిరేకించిన జిహాదీలు దేశాన్ని ముక్కలు చేశారు, పాకిస్తాన్‌ను ఏర్పాటుచేశారు. జమ్మూకశ్మీర్‌ను విడగొట్టడానికి సైతం ఇదే జిహాదీ శక్తులు పనిచేశాయి. తాత్కాలికంగా వారి ఆటకట్టింది...