సంపాదకీయం

బలికొంటున్న ఉన్మాదం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నమ్రితా చాందినీ అన్న వైద్య విద్యార్థిని మృతదేహం లభించడం పాకిస్తాన్‌లో హిందువులపై జరుగుతున్న బీభత్సకాండలో భాగం. సింధు ప్రాంతంలోని ‘ఘోటకీ’ జిల్లాకు చెందిన ఈ బాలిక ‘లార్కానా’లోని ‘అసిఫా’ దంత వైద్యకళాశాల విద్యార్థిని. మంగళవారం హాస్టల్ గదిలో ఆమె మృతదేహం లభించిందట! పాకిస్తాన్‌లో మత, భాషాపరమైన ‘అల్పసంఖ్య’ ప్రజలపై భయంకర అత్యాచారాలు కొనసాగుతుండడం 1947లో పాకిస్తాన్ ఏర్పడిన నాటి నుంచి నడుస్తున్న కథ. అఖండ భారతదేశాన్ని బ్రిటన్ బీభత్స పాలకులు మత ప్రాతిపదికపై విడగొట్టిపోవడం 1947 ఆగస్టు 15వ తేదీనాడు జరిగిన విషాద చారిత్రక ఘటన. ‘అఖండ భారత్’ అనాదిగా సర్వమత సమభావ వ్యవస్థ. కానీ ‘ఇస్లాం’ మతం వారు జనాభాలో అధిక సంఖ్యలో ఉండిన ‘అఖండ భారత’ ప్రాంతాలను 1947 ఆగస్టులో బ్రిటన్ ‘మారీచ’ పాలకులు పాకిస్తాన్‌గా ఏర్పాటుచేసిపోయారు. అవశేష భారత్‌లో యథాపూర్వంగా- అనాదిగా కొనసాగిన రీతిలోనే- సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ కొనసాగుతోంది. అందువల్లనే అవశేష భారత్‌లో ఇస్లాం సహా అన్ని మతాల వారు సమాన ప్రాతిపదికపై జీవించగలుగుతున్నారు. అల్పసంఖ్య మతాలవారికి ‘్భరత్’లో లభిస్తున్న భద్రత, ప్రత్యేక అధికారాలు ప్రపంచంలో మరే దేశంలోను ‘అల్పసంఖ్య’- మైనారిటీ- ప్రజలకు లభించడం లేదు. ఇందుకు ఏకైక కారణం భారత్ అనాదిగా వికసించిన హిందూ జాతి సర్వమత, సర్వభాషా, సర్వ వైవిధ్య సమభావ భూమికపై ప్రగతి సాధించింది. హైందవ జాతీయ తత్త్వం సర్వమత సమభావం, సర్వ వైవిధ్య సమభావం. అందువల్లనే ఇక్కడ- అవశేష భారతదేశంలో- అధిక సంఖ్య- మెజారిటీ-లో ఉన్న మతాలవారు ‘అల్పసంఖ్య’ మతాలవారిని నిర్మూలించలేదు. కానీ ‘అఖండ భారత’ హైందవ జాతీయ స్వభావం అడుగంటిపోయిన పాకిస్తాన్‌లో 1947 నుంచీ కూడ ‘మైనారిటీ’గా మారిన స్వజాతీయ మతాల వారిని ‘మెజారిటీ’గా మారిన ఇస్లాం మతానికి చెందిన ‘జిహాదీ’లు హత్య చేస్తున్నారు, మతం మార్చుతున్నారు, తరిమి వేస్తున్నారు. క్రీస్తుశకం 712లో సింధు ప్రాంతంలోకి అరేబియా నుంచి ‘జిహాదీ’లు చొఱబడిన నాటికి నేడు పాకిస్తాన్‌గా చెలామణి అవుతున్న ‘అఖండ భారత ప్రాంతం’లో ఒక్క ఇస్లాం మతస్థుడు కూడ లేరు. ‘జిహాదీ’లు 712 నుంచి ‘స్వజాతీయ మతాల’వారిని చంపడం ద్వారా, బలవంతంగా మతం మార్చడం ద్వారా ‘ఇస్లాం’ను భారత్‌లో వ్యాపింపచేశారు. ఫలితంగా 1947 నాటికి పాకిస్తాన్‌గా ఏర్పడిన ప్రాంతంలో అనాది స్వజాతీయ హైందవ మతాలవారు ‘అల్పసంఖ్య’గా మారిపోయారు, విదేశాల నుంచి వ్యాపించిన ఇస్లాం మతం వారు ‘అధిక సంఖ్య’ను పొందారు. సామాన్య ఇస్లాం మతస్థులు అన్యమతాలను ద్వేషించడం లేదు. కానీ ఇస్లాం మతం ‘మెజారిటీ’గా మారినచోటల్లా ‘జిహాదీ’లు పైశాచికంగా విస్తరించి ఇస్లామేతర మతాలవారిని నిర్మూలించడం ప్రపంచ చరిత్ర. 1947నుంచి పాకిస్తాన్‌లో ఈ చరిత్ర నడుస్తోంది..
1947 నాటికి పాకిస్తాన్ జనాభాలో ఇరవై నాలుగు శాతం ఉండిన హిందూ జాతీయ మతాలవారు 1948నాటికి రెండు శాతానికి పడిపోయారు. మిగిలిన ఇరవై రెండు శాతం హిందువులను ‘జిహాదీ’లు, ప్రభుత్వ దళాలు కలసికట్టుగా హత్యచేశారు, మతం మార్చారు, ‘అవశేష భారత్’లోకి తరిమివేశారు. అవశేష భారత్‌లో ‘మైనారిటీ’గా మారిన ఇస్లాం మతస్థులు ఎలాంటి వేధింపులకు గురికాలేదు, తరిమివేతకు కాని నిర్మూలనకు కాని గురికాలేదు. ‘మెజారిటీ’ మతస్థులతో కలిసి హాయిగా జీవిస్తుండడం ప్రత్యక్ష నిదర్శనం. ఎందుకంటె ‘అఖండ భారత్’నాటి సర్వమత సమభావ సమాజ సమష్టి స్వభావం ‘అవశేష భారత్’లో కూడ కొనసాగుతోంది. పాకిస్తాన్‌గా ఏర్పడిన ప్రాంతంలో ఈ అనాది స్వభావం అంతరించింది. పాకిస్తాన్‌లో సమాజ సమష్టి స్వభావం ‘ఇస్లాం ఏకమత ఉన్మాదం’.. పాకిస్తాన్‌లోని అవశేష హిందువులను సైతం నిశే్శషం చేయడానికి 1947నుంచి నేటివరకూ ‘జిహాదీ’లు కొనసాగిస్తున్న బీభత్సకాండకు ఇదీ కారణం. పాకిస్తాన్‌లో కూడ మన దేశంలో వలెనే ‘సర్వమత సమభావ రాజ్యాంగ’ వ్యవస్థ ఏర్పడినట్టయితే ఆ దేశంలోని ఇస్లామేతర మతాల వారికి రక్షణ కలుగుతుంది. లేనట్టయితే పాకిస్తాన్‌లో ఇప్పటికి మిగిలి ఉన్న నలబయి ఐదు లక్షల మంది హిందువులు సైతం అతి త్వరలో అంతరించిపోగలరన్నది పాకిస్తాన్‌లో మాత్రమేకాక అంతర్జాతీయంగా ‘మానవీయ అధికార’- హ్యూమన్ రైట్స్- ఉద్యమకారులు చెబుతున్నమాట! క్రీస్తుశకం 712 నుంచి 1947వరకు, 1947నుంచి ఇప్పటివరకు పాకిస్తాన్ ప్రాంతంలో హైందవ జాతీయ ప్రతీకలు- ఆలయాలు, మఠాలు, తీర్థ స్థలాలు, విద్యాకేంద్రాలు- క్రమంగా అంతరించాయి, అంతరించిపోతున్నాయి.
ఇదంతా 1947లో అఖండ భారత విభజనకు దోహదం చేసిన పరిణామక్రమంతోను, పాకిస్తాన్‌లోని ఇస్లాం ఏకమతోన్మాద రాజ్యాంగ వ్యవస్థతోను ముడివడి ఉన్న వ్యవహారం. పాకిస్తాన్‌లోని ‘మైనారిటీ’ల- ‘సిక్కులు’, వేదమతాలవారు, క్రైస్తవులు, ఇస్లాంలోని షియాలు, సింధీ బలూచీ ‘్ఫస్తూ’ భాషలను మాట్లాడే జన సముదాయాలు- దురవస్థను దూరం చేయడానికి యత్నించవలసిన నైతిక బాధ్యత మన ప్రభుత్వానికి ఉంది. ఐక్యరాజ్యసమితి ‘మానవ అధికారాల మండలి’కి ఈ దుస్థితిని పదే పదే నివేదించడం ద్వారా పాకిస్తానీ హిందువుల కడగండ్లను దూరం చేయడానికి మన ప్రభుత్వం యత్నించాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్‌ల నుంచి తరిమివేతకు గురి అయిన హిందువులను భారతీయ పౌరులుగా గుర్తించడానికి వీలయిన ‘బిల్లు’ను ప్రభుత్వం రూపొందించింది. ఈ ‘బిల్లు’ను దేశంలోని అన్ని రాజకీయ పక్షాలవారు సమర్ధించాలి. పార్లమెంటులో ఆమోదించాలి. కానీ ఈ రెండు చర్యలవల్ల పాకిస్తాన్‌లోని ‘మైనారిటీ’లకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలుగుతుంది. మన దేశంలోవలెనే పాకిస్తాన్‌లో కూడ ‘సర్వమత సమభావ’-సెక్యులర్- రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటుచేయించడం శాశ్వత పరిష్కారం. దక్షిణాఫ్రికా వంటిచోట్ల ‘‘వర్ణ వివక్ష రహితమైన’’ రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటుచేయించడానికి అంతర్జాతీయ సమాజం విజయవంతంగా యత్నించడం చరిత్ర. అదే రీతిలో మత వివక్ష వ్యవస్థీకృతమై ఉన్న పాకిస్తాన్ తదితర దేశాలలో ‘సర్వమత సమభావ’ రాజ్యాంగ వ్యవస్థలు ఏర్పడాలి. ఇందుకోసం అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలను ఒప్పించి పాకిస్తాన్ వంటి దేశాలపై ఒత్తిడి పెంచడానికి మన ప్రభుత్వం ఇప్పుడైన నడుం బిగించాలి. అదీ శాశ్వత పరిష్కారం. అలాంటి సర్వమత సమభావ వ్యవస్థ ఏర్పడేవరకు పాకిస్తాన్‌లోని న్యాయవ్యవస్థ ‘మైనారిటీ’లకు కల్పించలేదు. హిందూ బాలికలను ‘జిహాదీ’లు అపహరించుకొని పోతున్నారు, వారిని ఇస్లాంలోకి బలవంతంగా మార్చి ‘‘పెళ్లి’’చేసుకుంటున్నారు. ఇలాంటి లైంగిక బీభత్సకృత్యాలు పాకిస్తాన్‌లో ప్రధానంగా సింధులోను బలూచిస్థాన్‌లోను ప్రతిరోజు జరుగుతున్నాయి. బాలికలను అపహరించి మతం మార్చి ‘‘పెళ్లిళ్లు’’చేస్తున్న ‘జిహాదీ’లకు పాకిస్తాన్ సర్వోన్నత న్యాయస్థానాలు సైతం ఎలాంటి శిక్షలను విధించడం లేదు. లైంగిక బీభత్సకాండకు బలైపోయి బతుకులు బుగ్గిఅయిన హిందూ బాలికలు ఈ ‘‘జిహాదీ మొగుళ్ల’’తో కాపురం చేయవచ్చునని లేదా తల్లిదండ్రులవద్దకు తిరిగి పోవచ్చునని మాత్రమే పాకిస్తానీ న్యాయస్థానాలు తీర్పులిస్తున్నాయి. నరరూప పిశాచాలైన ‘జిహాదీ’లకు ఎలాంటి శిక్షాలేదు! పాకిస్తాన్‌లో ‘సర్వమత సమభావ రాజ్యాంగ’ వ్యవస్థ ఏర్పడేవరకు- గతంలో దక్షిణాఫ్రికాను బహిష్కరించినట్టు- ప్రపంచ సమాజం పాకిస్తాన్‌ను బహిష్కరించాలి. బహిష్కరింపచేయడం మన ప్రభుత్వం బాధ్యత.
పాకిస్తాన్‌లో మిగిలి ఉన్న దాదాపు నలబయి ఐదు లక్షల హిందువులలో మూడవ వంతు తమను హిందువులుగా నమోదు చేసుకొనడం లేదు. జిహాదీలు పసిగట్టి అత్యాచారాలకు హత్యలకు గురిచేస్తారన్న భయం ఇందుకు కారణం. నమోదుచేసుకున్న వారు నిరంతరం ప్రభుత్వ, ప్రభుత్వేతర వేధింపులకు బలి అవుతున్నారు. సింధు ప్రాంతంలోని ‘ఘోటకీ’లోని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడైన నారాయణ్‌దాస్ అన్న హిందువు ‘ఇస్లాం దైవ దూషణ’కు పాల్పడినాడన్న అబద్ధపు ఆరోపణను నాలుగురోజులుగా ప్రచారం చేశారు. ఈ సాకుతో ‘ఘోటకీ’ పట్టణంలోని రెండు హిందూ దేవాలయాలను, ఆ పాఠశాలను హిందువుల దుకాణాలను ‘జిహాదీ’లు ఈనెల పదహైదవ తేదీన ధ్వంసం చేశారు. ఈ విధ్వంసకాండను నిరసించిన ‘ఘోటకీ’ పట్టణంలోని హిందువులకు వ్యతిరేకంగా పోలీసులు ‘అభియోగాలు’ దాఖలుచేశారట. ‘‘దైవ దూషణ’’ అభియోగానికి గురిఅయిన ప్రధాన ఉపాధ్యాయుడిని కూడ పోలీసులు వేధిస్తున్నారట.. నమ్రితా చాందినీ అన్న వైద్య విద్యార్థిని కుటుంబం వారు కూడ ‘ఘోటకీ’లో నిరసన తెలిపారు. రెండురోజుల తరువాత నమ్రిత ‘లార్కానా’లోని తన కళాశాల వసతి గృహంలో మృతి చెందింది..