సంపాదకీయం

సాధికార సాంకర్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరీక్ష వ్రాసిన విద్యార్థి తన పరీక్షా పత్రాన్ని తానే దిద్దుకుని ‘ఉత్తీర్ణత’ను నిర్ణయించడానికి అవకాశం ఇచ్చినట్టయింది! అందువల్ల పరీక్ష వ్రాసిన వారందరూ ఉత్తీర్ణులయిపోవడం ఖాయం! ‘ఆహార శుద్ధి ప్రక్రి య’ద్వారా తినుబండారాలను ఉత్పత్తి చేస్తున్న సంస్థలకు ఆహార ప్రమాణాలను నిర్ధారించడానికి ప్రభుత్వం ఇలా అవకాశం ఇస్తోంది. అందువల్ల ఇకపై సకల విధ సాంకర్య- కల్తీ- ఆహార పదార్థాలు స్వచ్ఛమైనవిగా, ఆరోగ్యదోహకమైనవిగా ముద్రపడడానికి రంగం సిద్ధమైంది. ‘ఆహార స్వచ్ఛత, ప్రమాణాల భారత సాధికార సంస్థ’ - ఫుడ్ సేఫ్టీ స్టాండర్‌డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా- ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ- వారు ఈ రంగాన్ని సిద్ధం చేశారు. రసాయన విషాలతో ‘కల్తీ’అయిన తిండి పదార్థాలను ‘రుచికరమైనవి’గాను ‘శుచికరమైనవి’గాను ప్రచారం చేస్తున్న ఉత్పాదక సంస్థలను ప్రమాణాల నిర్ధారణ ప్రక్రియలో భాగస్వాములను చేయడానికి ‘ఆహార స్వచ్ఛత, ప్రమాణాల సాధికార సంస్థ’ నిర్ధారించిందని ప్రచారం జరుగుతోంది. ఇలా తమ ఉత్పత్తుల ప్రమాణాలను నిర్ధారించే ప్రక్రియలో తామే భాగస్వాములు అవుతున్న- పరీక్ష వ్రాసిన వారే పరీక్షలు అయినట్టు- ప్రభుత్వేతర సంస్థలలో అధిక శాతం విదేశీయ సంస్థలు, బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు- మల్టీ నేషనల్ కంపెనీస్- ఎమ్‌ఎన్‌సిలు-! వివిధ సంస్థలు ‘శుద్ధి’-ప్రాసెసింగ్- ప్రక్రియ ద్వారా తయారుచేస్తున్న ఆహార పదార్థాలు ఖాద్యయోగ్యములా? కాదా? - అన్న విషయాన్ని నిర్ధారించవలసిన అధికార సంస్థ ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’. ఇందుకోసం ఈ సంస్థకు దేశవ్యాప్తంగా పరిజ్ఞాన, పాటవ, యంత్రాంగ వ్యవస్థ ఉంది. ఇప్పుడీ సాధికార సంస్థవారు ఈ ప్రక్రియను నిర్వహించే బాధ్యతలో ప్రభుత్వేతర వాణిజ్య సంస్థలను భాగస్వాములను చేస్తోందట. ప్రజాహితం ‘సాధికార సంస్థ’ లక్ష్యం. లాభాలను ఆర్జించడం మాత్రమే ప్రభుత్వేతర సంస్థల లక్ష్యం! అందువల్ల ఆహార ఉత్పాదక వాణిజ్య సంస్థలు ప్రమాణాలకు విరుద్ధంగా ‘శుద్ధి ఆహారాన్ని’- ప్రాసెస్డ్ఫుడ్ -తయారుచేస్తున్నాయి. కోకోకోలా, పెప్సీ, నెజల్, యూనీ లివర్ తదితర విదేశీయ ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ ‘‘శుద్ధిచేసి’’డబ్బాలకు, సీసాలకు, ప్లాస్టిక్ సంచులకు నింపుతున్న తిండి పదార్థాలలో రకరకాల కాలుష్య రసాయన విషాలు కలసిపోయినట్టు దశాబ్దుల తరబడి ప్రచారం అవుతూనే ఉంది. ఈ కల్తీని నిరోధించడంలో ‘సాధికార సంస్థ’, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమైపోతుండడం నడుస్తున్న చరిత్ర. ‘దొంగల చేతులకు తాళాలను ఇచ్చినట్టు’ ప్రమాణాలను నిర్ధారించే ప్రక్రియలో దోపిడీ దొంగల వంటి ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ను భాగస్వాములను చేస్తున్నారు. ఈమేరకు ‘ఆహార స్వచ్ఛత ప్రమాణాల సాధికార సంస్థ’కూ, వివిధ వాణిజ్య సంస్థలకూ మధ్య ‘అవగాహన’ కుదిరిపోయిందట. అందువల్ల ఆహారం కల్తీచేసినట్టు ఆయా సంస్థలకు వ్యతిరేకంగా ఆరోపణలు సైతం వచ్చే అవకాశం కూడ లేదు. ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’ కలసి సంయుక్తంగా ప్రమాణాలను నిర్ధారించే ఆయా ప్రభుత్వేతర వాణిజ్య సంస్థలు తమ ‘కల్తీ’ఉత్పత్తులు ‘‘హరిద్వార గంగ’’వలె స్వచ్ఛమైనదని నిర్ధారించగలరు.. జనానికి దిక్కెవ్వరు?
ఈ ‘అవగాహన’, ‘భాగస్వామ్యం’ కుదరడానికి ముందే దశాబ్దుల తరబడి ప్రభుత్వమే ‘కల్తీ’ని పరోక్షంగా, ప్రత్యక్షంగా ప్రోత్సహించడం జనానికి ధ్యాస లేని వ్యవహారం. ఉదాహరణలు కోకొల్లలు. ‘స్వచ్ఛమైన పల్లీ- వేరుసెనగ- నూనె’’ను వివిధ సంస్థలవారు ప్లాస్టిక్ సంచులలోను, ప్లాస్టిక్ డబ్బాలలోను నింపి సరఫరా చేస్తున్నారు. కిలో నూనెను తొంబయి నుంచి నూట పదిహేను రూపాయల వరకూ చిల్లర దుకాణాలలో విక్రయిస్తున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగ పారిశ్రామిక సంస్థలవారు ఈ స్వచ్ఛమైన- రిఫైండ్-, ద్విగుణ స్వచ్ఛమైన - డబుల్ రిఫైన్డ్- వేరుసెనగ నూనెను, ఇతర వంట నూనెలను విక్రయిస్తున్నారు. కానీ ‘నూనె గానుగ’లను నిర్వహించే చిన్న పారిశ్రామికులు ఈ ‘రిఫైన్డ్’నూనెల బండారాన్ని బయటపెడుతున్నారు. ఒక ‘కిలో’స్వచ్ఛమైన వంటనూనె కావాలంటే కనీసం మూడున్నర కిలోల నూనెగింజలు వాడాలన్నది అందరికీ తెలిసిన వ్యవహారం. కిలో ‘పల్లీ’పప్పులను నూట ఇరవై రూపాయలకు విక్రయిస్తున్నారు. అంటే కిలో పల్లీనూనె తయారుచేయడానికి నాలుగువందల ఇరవై రూపాయల విలువైన ‘పల్లీ’లు కావాలి! ఇదే సూత్రం కొబ్బరి, మంచి నువ్వులు, ‘ప్రొద్దుతిరుగుడు పువ్వుల విత్తనాల’- సన్‌ఫ్లవర్ సీడ్స్- నూనెలకు వర్తిస్తోంది. గానుగలవారు ‘టోకు’న పప్పులను కొంటుండడంవల్ల మూడున్నర కిలోల ‘పప్పు’లు లేదా నూనె గింజలు వారికి మూడువందల యాబయి రూపాయలకు, అంతకంటె తక్కువకు లభించవచ్చు. ఏమయినప్పటికీ ఒక కిలో స్వచ్ఛమైన ‘గానుగ’ వంట నూనె ఉత్పత్తికి మూడువందల యాబయి రూపాయల ఖర్చవుతోంది. అందువల్ల ‘ప్లాస్టిక్’ పాకెట్లలోని వంట నూనెలను ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలవారు కిలో వంద రూపాయలకే ఎలా విక్రయిస్తున్నారు?- అన్నది ఏళ్లతరబడి సమాధానం దొరకని ప్రశ్న!
‘గానుగ’ల ద్వారా స్వచ్ఛమైన నూనెలను తీస్తున్నవారి వద్ద కిలో మూడువందల యాబయి రూపాయల ధరతో అనేకమంది వినియోగదారులు వంట నూనెలను కొంటున్నారు. కానీ ఈ వినియోగదారుల సంఖ్య మొత్తం వినియోగదారుల సంఖ్యలో ఒక శాతం కూడ లేదు. మిగిలిన తొంబయి తొమ్మిది శాతం పెద్దపెద్ద సంస్థలు తయారుచేస్తున్న ఈ నకిలీ స్వచ్ఛ- రిఫైన్డ్- వంట నూనెల ‘పాకెట్ల’ను ‘డబ్బా’లను కొంటున్నారు. నిజమైన స్వచ్ఛమైన వంట నూనెను ఇరవై ఐదు శాతం, అంతకంటె తక్కువ శాతం, ‘తెల్ల నూనె’- వైట్ ఆయిల్- పేరుతో పిలిచే వంట నూనెను డెబ్బయి ఐదు శాతం కలిపి ‘రిఫైన్డ్’వంట నూనెను తయారు చేస్తున్నారట. అందువల్లనే మూడువందల యాబయి రూపాయల నుంచి వంద రూపాయల స్థాయికి ‘దిగివచ్చింది’. కానీ ఈ ‘రిఫైన్డ్’ ‘సన్‌ఫ్లవర్’నూనెలో అసలు నూనె ఇరవై ఐదు శాతం, ‘రిఫైన్డ్’పల్లీ నూనెలో కూడ అసలు నూనె ఇరవై ఐదు శాతమే. ఇదే ‘సాంకర్య సూత్రం’అన్ని వంట నూనెలకు వర్తిస్తోంది. అందువల్ల ‘రిఫైన్డ్’వంట నూనెలలో ‘కల్తీ’జరగడం బహిరంగ రహస్యం! అయినప్పటికీ ఈ ‘కల్తీ’-‘రిఫైన్డ్’వంట నూనెలను ఆయా ‘ఘరానా’ పరిశ్రమల వారు, ‘మిల్లు’ల వారు స్వచ్ఛమైన నూనెలుగా చెలామణి చేస్తున్నారు. ప్రభుత్వాలు ఆమోదించాయి. ‘ఆహార స్వచ్ఛత, ప్రమాణాల భారత సాధికార సంస్థ’వారు అనుమతినిచ్చారు. ‘స్వచ్ఛ అధికార ముద్ర’తో ఈ కల్తీ నూనెలు వంటిళ్లలోకి చొఱబడిపోతున్నాయి... ధ్యాసలేని జనానికి దిక్కెవ్వరు?
‘ఆహార శుద్ధి’పేరుతో జరిగిపోతున్న ప్రహసనం దశాబ్దుల కాలుష్య కార్యక్రమం. శుద్ధిప్రక్రియలో ‘అనుమతించిన మేర’ రసాయన విషాలను వాడవచ్చునన్నది ప్రభుత్వాల విధానం. అయితే ‘నెజల్’-నెస్లే-, ‘కోకో’, ‘పెప్సీ’వంటి బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు ఈ అనుమతి పరిమితికి మించి ఈ రసాయన విషాలను కలుపుతుండడం బహిరంగ రహస్యం. అది వేఱు! కానీ ఈ ‘పరిమిత’నిష్పత్తిలో ‘రసాయనాల’- ప్రిజర్వెంట్స్, యాడెడ్ ఫ్లేవర్-ను ఆహారంలో కలుపడానికి ప్రభుత్వాలు ఎందుకని దశాబ్దులుగా అనుమతి నిచ్చాయి? శతాబ్దులుగా సహస్రాబ్దులుగా ఇళ్లలోను, గృహపరిశ్రమలలోను కుటీర పరిశ్రమలలోను ఎలాంటి ర‘సాయనాలు’కాని కలుపకుండానే ఆహారం శుద్ధిచేసి నిలువచేసిన చరిత్ర మనకుంది. ఇలాంటి లక్షల ‘కుటీర’ పరిశ్రమలను మూత వేయించారు. వందల కొలదీ ‘రసాయన శుద్ధి’ ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నారు!