సబ్ ఫీచర్

ఉద్యోగుల సమస్యలపై ఎందుకు వివక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమంకోసం కట్టుబడి ఉంటుందని, తాను మారిన మనిషినని ఉద్యోగులకి వేధింపులు ఇబ్బందులు అంటూ ఉండవని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు హామీలమీద హామీలు ఇచ్చిమరీ ఓట్లేయించుకున్నారని అవసరం తీరాక పట్టించుకోవడం లేదు. ఉద్యోగులకి రావలసిన కరువుభత్యం ఇవ్వకుండా ఇంతకాలం నెట్టుకొచ్చారు. కరువుభత్యం అడిగితే 43% ఫిట్‌మెంటు ఇచ్చాం. అంటుంటారే కానీ పెరిగిన ధరలబట్టి కరువుభత్యం ఉంటుందన్న విషయాన్ని తెలియనట్లు చెప్పటం విడ్డూరం. ప్రభుత్వం ఉద్యోగుల ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర నాల్గవ తరగతి ఉద్యోగులు ఇలా అనేక కేటగిరీల ఉద్యోగులకు పెరిగిన ధరలు జీవన వ్యయాలని అనుసరించి కరువు భత్యం ఎప్పటికప్పుడు అనగా ప్రతి 6 నెలలకి ఒకసారి ప్రకటించటం సంప్రదాయం. గతంలో వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఉద్యోగులకి కావలసిన అన్ని సదుపాయాలు నెరవేర్చారు. మంచి పేరు సంపాదించుకున్నారు. చంద్రబాబు పాలన మొదటినుండీ ఉద్యోగ వ్యతిరేకతనే మిగుల్చుకున్నారు. మారిన మనిషిని అంటూ చేసిన ప్రమాణాలు అసత్యాలుగా మిగిలిపోవటం నేటి వైచిత్రం.
ఉద్యోగుల ఆరోగ్య భద్రం గురించి ఆరోగ్యకార్డులు జారీచేసిన ప్రభుత్వం ఆసుపత్రులు అను సంధానం లేకపోవటంతో ఆ సమస్య అపరిష్కృతంగా ఉంది. పేరివిజన్ కమిషన్ నివేదికలో సమర్పించినట్లుగా ఎటువంటి సూచనలూ పాటించనే లేదు. ఎనామలిస్ కమిటీలు వేయనే లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందంటూనే ఎం.ఎల్.ఏ.లకు, జడ్.పి.టి.సి.లకు, జిల్లా పరిషత్ ఛైర్లన్లు ఇంకా ఇతరత్రా అందరికీ ఎటువంటి కమిటీలు కమిషన్లు లేకుండా జీతాలు ఎడాపెడా పెంచేసుకున్నారు. డి.ఏ. అడిగితే మీనమేషాలు లెక్కించే ప్రభుత్వం రాజకీయ నాయకులకై ఎవరు అడిగినా అడక్కపోయినా తనంతట తానే సభలో తీర్మానం చేయించి మరీ లక్షల్లో వేతనాలు అలవెన్సులూ పెంచేసుకోవటం పట్ల సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఉద్యోగుల వ్యవహారంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. కాలానుగుణంగా కరువుభత్యం ప్రకటించటం ఉద్యోగుల పట్ల అనుకూల వైఖరిగానే ఉంటున్నది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలోకి రావడానికి చెప్పిన వాగ్దానాలు ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఉద్యోగులకి కావలసిన కనీస డిమాండ్లు నెరవేర్చకుండా కాలయాపన చేయటం వెనుక ఉద్యోగులని అణచివేసి కాలం గడుపుకుందాం అనే ఉద్దేశ్యమే కనపడుతోంది.
కేంద్రం ఇచ్చే నిధులు అన్నీ వాడుకుంటూ జమాలెక్కలు చెప్పటం లేదని, ఇచ్చిన సొమ్ముకు సరైన యుటిలైజేషన్ లెక్కలు ఇవ్వటం లేదని కేంద్రం వైపు వాదన. ఏది ఏమైనా కేంద్ర రాష్ట్రాల పంతాల మధ్యలో ఉద్యోగులు నలిగిపోతున్నారన్నది వాస్తవం. ఉద్యోగుల సంక్షేమం అంటూ చంద్రబాబు చెప్పినది నేతిబీరకాయలో నేతి చందంగా మారింది. ధరలు పన్నులు అధికం అవటం, బస్సుచార్జీల పెరగటం, కరెంటు ఛార్జీలు పెరగటం వంటి అన్ని అంశాలపై ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జనానికి అసలు సంగతి అనుభవంలోకి వచ్చింది. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించాలి. వారి సమస్యలను పరిష్కరించాలి. చేసిన వాగ్దానాలను నెరవేర్చాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చడం ద్వారా ప్రభుత్వం తన విశ్వసనీయతను నిరూపించుకోవాలి. కొత్త రాష్ట్రం సమస్యల్లో ఉన్న మాట నిజమే. అందుకు ఎవ్వరూ కాదనడం లేదు. కానీ పరిష్కరించగలిగే కొన్ని సమస్యలను కొత్త రాష్ట్రం సాకుతో దాటవేయడం సమంజసం కాదు.

- ఎన్.నాగేశ్వరరావు