సంపాదకీయం

గోసంతతి ‘ప్రగతి’..??

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో దాదాపు యాబయి నాలుగు కోట్ల ఆవులు, ఎద్దులు, పెయ్య లు, కోడెలు, ఇతర పాడిపశువులు జీవిస్తున్నట్టు వెల్లడికావడం ఆందోళన కలిగించదగిన వాస్తవం. ప్రతి జిల్లాలోను కనీస స్థాయిలో పశుసంపద మానవుల సంఖ్య కంటె ఇరవై శాతం ఎక్కువ ఉండాలన్నది ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్’ ఉన్నత న్యాయస్థానం 2012 ఆగస్టులో వ్యక్తం చేసిన అభిప్రాయం. జనాభా కంటె పశుసంతతి తగ్గిపోయి ఉండడం దేశమంతటా కొనసాగుతున్న దుస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానం వారు నిర్దేశించిన ప్రాతిపదిక ప్రకారం దేశంలో కనీసం నూట అరవై ఐదు కోట్ల పాడిపశువులు ఉండాలి. సగం కూడ లేకపోవడం పర్యావరణ ‘స్వచ్ఛ సూచిక’ దశాబ్దుల తరబడి భారీగా పతనమైపోయి ఉందన్నదానికి నిదర్శనం. పాడి పశువుల సంఖ్య పెరగడం ‘సహజమైన ప్రగతి’ వేగవంతం అవుతుందనడానికి చిహ్నం. ఈ ఆర్థిక సౌష్టవాన్ని తరతరాలుగా మన దేశంలో ప్రజలు గుర్తించారు. పాడి పశువుల వల్ల వ్యవసాయ భూమికి సేంద్రియమైన ఎఱువులు లభించడం, పొలాలు విరగ పండడం చరిత్ర. పాడి పశువుల వల్ల రోగ నిరోధకమైన పాలు, పెరుగు, నెయ్యి, పంచితం, పేడ లభించడం చరిత్ర. ఈ ఐదు ‘ఆవు ఉత్పత్తులు’- పంచగవ్యాలు- ప్రకృతిని, వ్యవసాయాన్ని, పరిసరాలను, మానవులను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం చరిత్ర. బ్రిటన్ బౌద్ధిక బీభత్స ‘పాలన’లోను, అంతకు పూర్వం ‘జిహాదీ’ల భౌతిక బీభత్సకాండ కొనసాగిన శతాబ్దుల కాలంలోను ఆవులను, గోసంతతిని విచ్చలవిడిగా హత్యచేశారు. మన దేశపు ‘గోసంపద’, పాడి పశువుల సంఖ్య భయంకరంగా తగ్గిపోవడానికి ఇదీ కారణం! ‘వ్యవసాయ సూచిక’ ప్రాతిపదికగా ఆర్థిక సౌష్టవాన్ని నిర్ధారించే పద్ధతిని బ్రిటన్ తదితర విదేశాల దురాక్రమణకారులు ధ్వంసం చేశారు. ‘వాణిజ్య సూచిక’ ఆధారంగా ప్రగతిని నిర్ధారించే పద్ధతిని మాత్రమే విదేశీయులు కొనసాగించారు. ఈ ‘వాణిజ్య సూచిక’క్రమంగా ‘వాణిజ్య సంస్థల’ ‘వాటా’ల సూచిక- స్టాక్ మార్కెట్ ఎక్స్‌ఛేంజ్ ఇండెక్స్-గా మారిపోయింది. కొన్ని వేల వాణిజ్య సంస్థల, కొన్ని లక్షల ‘మదుపరుల’కు పరిమితమైన ‘వాణిజ్యపు వాటాలు’- స్టాక్- పెరగడం, తగ్గడం ప్రాతిపదికగా మాత్రమే వందల కోట్ల ప్రజలున్న దేశాల ‘ప్రగతి’స్థాయి నిర్ధారితవౌతోంది. వ్యవసాయానికి, గోసంపదకు ప్రాధాన్యం లేదు, కోట్లమంది జీవన ప్రమాణాలకు ప్రాధాన్యం లేదు. కేవలం కొన్ని లక్షల మంది వాణిజ్యపు వాటాలకు మాత్రమే ప్రాధాన్యం ఏర్పడి ఉంది. ‘వ్యవసాయ సూచిక’ ప్రాతిపదికగా ఆర్థిక వ్యవస్థ పరిఢవిల్లిన కాలం- బ్రిటన్ దురాక్రమణకు పూర్వం-లో మొత్తం ప్రపంచపు ఎగుమతులలో మన దేశం ‘వాటా’ నలబయి శాతం.. పాశ్చాత్య దురాక్రమణ ముగిసేనాటికి మన దేశపు ఎగుమతుల శాతం రెండు శాతానికి దిగజారింది. గత డెబ్బయి ఏళ్ల కృషి తరువాత కూడ ప్రపంచపు ఎగుమతులలో మన దేశపు వాటా ఐదు శాతం కూడ లేదు! ‘వాణిజ్య ప్రపంచీకరణ’ దుష్ఫలితాలు పాతికేళ్ల తరువాత, ఇప్పుడు ఆందోళనకరంగా ఆవిష్కృతం అవుతున్నాయి. మన స్థూల జాతీయ ఉత్పత్తి-గ్రాస్ డొమస్టిక్ ప్రాడక్ట్- జీడీపీ- పెరుగుదల వేగం తగ్గిపోతోందన్న ప్రచారానికి ఇదంతా నేపథ్యం. ఆవుల సంఖ్య, ‘‘గోసంతతి సంఖ్య ఆర్థిక సౌష్టవానికి ప్రాతిపదిక’’అన్న యుగయుగాల వాస్తవాన్ని మనలో చాలామంది విశ్వసించ లేకపోవడం ప్రపంచీకరణ వాణిజ్య మాయాజాలం..
మన దేశం బ్రిటన్ దురాక్రమణ నుంచి విముక్తం అయ్యేనాటికి దేశం జనాభా ముప్పయి కోట్లు. అప్పుడు దేశంలో దాదాపు నూట ఇరవై రెండు కోట్ల దేశవాలీ ఆవులు, గోసంతతి ఉండేదట. సగటున ప్రతి మనిషికీ నాలుగు ‘గోసంతతి’ పశువులు చొప్పున ఉండేవి! కలియుగం ఆరంభంలో అంటే ఐదువేల నూట ఇరవై ఏళ్లకు పూర్వం ఈ ‘గోసంపద’ చాలా ఎక్కువగా ఉండేది. కేవలం పది పదిహేను ఆవులు కోడెలు ఉండడం సాధారణ కుటుంబాల కథ.. మధ్యతరగతి వారికి వందనుంచి వేయి వరకు- కుటుంబానికి-ఆవులు, కోడెలు ఇతర గోసంతతి ఉండడం చారిత్రక వాస్తవం! ఆవులనిచ్చి ఆహార పదార్థాలను కొనుక్కునేవారు, ఆవులనిచ్చి వస్త్రాలను కొనేవారు. ఆవు గోసంతతి వినిమయ ద్రవ్యానికి ప్రామాణికమైన ప్రాతిపదిక-అన్నది వేల ఏళ్లు సాగిన కలియుగం చరిత్ర. సంపన్నుల ‘తొఱ్ఱుపట్టు’-గోపాల ప్రాంగణం-లలో పది వేలకు పైబడిన ‘గోసంపద’ ఉండేది. ప్రాంతీయ పాలకులు, వివిధ ప్రాంతీయ రాజ్యాల సమాఖ్యను ‘సామ్రాజ్యం’గా పాలించిన భారత సమ్రాట్టులు వందలాది ఇలాంటి ‘తొఱ్ఱుపట్టుల’ను నిర్వహించడం చరిత్ర. కలియుగం ఆరంభంలో ‘కురువంశపు జనమేజయుడు’ మొత్తం భారతదేశాన్ని పాలించాడు. ధాన్యకటకం రాజధానిగా ‘శాతవాహనులు’ తెలుగు నేలను పాలించారు. ఆ సమయంలో ఆంధ్ర సీమలలో ప్రధానంగా సముద్రతీర ప్రాంతంలో ఇలాంటి- పెద్దపెద్ద ‘తొఱ్ఱుపట్టు’లు ఉండేవట- కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వివరించి ఉన్నాడు. నందవ్రజం-వ్రేపల్లె- యమునా తీరంలోని ‘తొఱ్ఱుపట్టు’-గోకులం- చరిత్ర ప్రసిద్ధం. ద్వాపరయుగం చివరిలో దాదాపు వంద ఏళ్లు భారతదేశ చరిత్రగతిని నిర్దేశించిన యదుకుల కృష్ణుడు ఈ ‘వ్రేపల్లె’లోనే బాల్యంలో ఆవులను మేపడం చరిత్ర! గోపాలన గౌరవప్రదమైన తరతరాల జీవన సంప్రదాయం...
అందువల్లనే పూర్వయుగాలలో దిలీపుని వంటి సమ్రాట్టులు, ఈ యుగంలో మహారాణాబాప్పా, ఛత్రపతి శివాజీ వంటివారు గోశాలలను నిర్వహించి సనాతన ఆర్థిక సంప్రదాయాన్ని, సాంస్కృతిక జీవన రీతిని కొనసాగించారు. ఇటీవలి కాలంలో ‘మైసూరు సంస్థాన పాలకులు’ నిర్వహించిన ‘తొఱ్ఱుపట్టు’-బృందావనం- ప్రసిద్ధం. దేశంలో రెండు వందల ‘తెగ’ల ఆవులు ఉండేవట. ‘మహారాణా బాప్పా’గా ప్రసిద్ధికెక్కిన ‘్భజమహారాజు’ గుజరాత్ ప్రాంతంలో ఇలాంటి ‘బృందావనాల’ను నిర్వహించాడు. అప్పుడప్పుడే మన దేశంలోకి చొఱబడుతుండిన విదేశీయ జిహాదీ మూకలు గోసంతతిని హత్యచేయకుండా నిరోధించగలిగినవాడు ‘బాప్పా’! కానీ ఆ తరువాత జిహాదీలు యథేచ్ఛగా ఆవులను చంపడం మన దేశంలో గోసంతతి నశించడానికి కారణం. కాకతీయ సామ్రాజ్యం కలియుగం నలబయి ఐదవ శతాబ్ది- క్రీస్తుశకం పదునాలుగవ శతాబ్ది-లో పతనమైన తరువాత కృష్ణా గోదావరీ నదుల మధ్య ప్రాంతంలో ‘జిహాదీ’లు భయంకర గోహత్యాకాండ సాగించడం చరిత్ర. ఆ తరువాత వచ్చిపడిన బ్రిటన్ బీభత్స ‘పాలకులు’ గోవధ కోసం ‘యంత్రాల’ను నిర్మించి గోహత్యలను మరింత ప్రోత్సహించడం చరిత్ర.
‘‘మా చూడి ఆవుల కడుపు
వేడి వేడి మాంసం
వాడికి బహు ఇష్టమంట
మా పాడి పశువుల కోస్తాడంట
మా చూడి ఆవుల మంద
సురిగి ఇంటికి రాదు...
మాకొద్దీ తెల్లదొరతనము!’’
అని బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర ఉద్యమ కవి గరిమెళ్ల సత్యనారాయణ వంటివారు నిరసన గళాలను నిగిడించడానికి ఇదీ కారణం...
అయినప్పటికీ బ్రిటన్ దురాక్రమణ ముగిసేవరకు కూడ దేశంలో నూట ఇరవై రెండు కోట్ల ఆవులు కోడెలు ఉండేవి. తొలి తెలంగాణ స్వాతంత్య్ర సమర నవల ‘ప్రజల మనిషి’లో రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి గోమాత పట్ల వ్యవసాయ కుటుంబాలకున్న అనుబంధాన్ని వివరించాడు. అడివి బాపిరాజు తన ‘నారాయణరావు’ నవలలో వివిధ వర్ణాల వివిధ తెగల ఆవులను పోషించిన తీరు ప్రస్ఫుటింపచేశాడు. ‘గుమ్మడి పండు ఆవు’ పరిమాణంలో చిన్నదైనా చెంబుల నిండా పాలిచ్చేది. ‘కపిల గోక్షీరం’ ఆయుర్వేద ఔషధం, అమృతం.. బ్రిటన్ దురాక్రమణ ముగిసిన నాటికి దేశంలో ఉండిన నూట ఇరవై రెండు కోట్ల గోసంతతి క్రమంగా క్షీణించి ప్రస్తుతం దాదాపు పదునాలుగు కోట్ల ఆవులు, కోడెలు మాత్రమే మిగిలి ఉన్నాయట. మొత్తం పాడి పశువుల సంఖ్యలో గోసంతతి సంఖ్య దాదాపు నాలుగవ వంతు! ఇరవై తొమ్మిది తెగల ‘దేశవాలీ’- స్వదేశంలో తరతరాలుగా పుట్టిపెరిగిన- తెగల ఆవులు మాత్రమే ఇప్పుడు ఊపిరితో మిగిలాయి. అయితే ఏడేళ్ల క్రితం నుంచి ఆవుల సంఖ్య పాడిపశువుల సంఖ్య క్రమంగా పెరుగుతోందట. ఇదీ ఊరట కలిగిస్తున్న పరిణామం. ఏడేళ్లలో ‘గోసంతతి’ యాబయి లక్షల మేర మొత్తం పాడి పశువులు దాదాపు రెండు కోట్ల మేర పెరిగాయట! అయితే కనీసం డెబ్బయి ఏళ్ల క్రితంనాటి స్థాయికి ‘గోసంతతి’ సంఖ్య పెరగడం సేంద్రియ వ్యవసాయ విస్తరణకు అనివార్యం పెంచవలసిన కర్తవ్యం పాలించవలసిన బాధ్యత అందరిదీ... కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘‘రాష్ట్రీయ గోకుల ఉద్యమం’’, ‘‘జాతీయ గోకుల గ్రామం’’ పథకాల విజయానికి ప్రజల భాగస్వామ్యం అనివార్యం..