సంపాదకీయం

టిబెట్ ప్రాధాన్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిబెట్‌తో మన దేశానికి అనాదిగా సంబంధం ఉంది! టిబెట్ స్వా తంత్య్ర ఉద్యమానికి మన ప్రభుత్వం బహిరంగంగా మద్దతును ప్రకటించడం వర్తమాన చారిత్రక అనివార్యం. మన జమ్మూ కశ్మీర్‌లో నిరంతరం జోక్యం కల్పించుకుంటున్న చైనా నియంతలను నోరుమూయించడానికి ఈ ‘చారిత్రక అనివార్యం’ దోహదం చేయగలదు. జమ్మూకశ్మీర్‌తో వేల సంవత్సరాలుగా చైనాకు సంబంధం లేదు, జమ్మూకశ్మీర్ అనాదిగా మన దేశపు భూభాగం. అలాంటి జమ్మూకశ్మీర్‌లోకి చైనా చొఱబడి ఉంది, రెండుచోట్ల దురాక్రమణను కొనసాగిస్తోంది. దశాబ్దుల తరబడి ఈ భౌతిక దురాక్రమణను కొనసాగిస్తున్నది చాలక ఆర్థిక దురాక్రమణకు కూడ పూనుకొంది. పాకిస్తాన్ దురాక్రమిత జమ్మూకశ్మీర్‌లోని ‘వాణిజ్య పారిశ్రామిక ప్రాంగణ పథం’- ఎకనమిక్ కారిడార్ - ఈ ఆర్థిక దురాక్రమణ! మన ప్రభుత్వ నిరసనలను, అభ్యంతరాలను పట్టించుకోకుండా చైనా పాకిస్తాన్‌తో కలసి ఈ ‘ఎకనామిక్ కారిడార్’ను నిర్మించడం నడుస్తున్న వైపరీత్యం. పాకిస్తాన్ ప్రభుత్వం ఉసిగొల్పుతున్న జిహాదీ బీభత్సకారులను సమర్ధించడం చైనా ప్రభుత్వం మన దేశానికి వ్యతిరేకంగా జరుపుతున్న వ్యూహాత్మక దురాక్రమణ! జమ్మూకశ్మీర్‌ను పునర్ వ్యవస్థీకరించి రెండు ప్రాంతాలుగా ఏర్పాటు చేయడం ‘‘తమ సార్వభౌమ అధికారానికి భంగకరమని’’ చైనా నియంతృత్వ ప్రభుత్వం ప్రకటించడం ఈ దురాక్రమణ వ్యూహానికి, వ్యూహాత్మక దురాక్రమణకు సరికొత్త నిదర్శనం. చైనా ప్రభుత్వ దురహంకార ప్రకటనను మన ప్రభుత్వం అక్టోబర్ ముప్పయి ఒకటవ తేదీన తీవ్రంగా నిరసించింది. జమ్మూకశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా వ్యవస్థీకృతం అయిన రోజుననే చైనా ఇలా తన వికృత వాదం వినిపించడం దుర్భుద్ధికి దర్పణం! దశాబ్దుల తరబడి చైనావారి ఈ దుందుడుకు వైఖరిని సహించడం మన ప్రభుత్వ విధానంలోని మెతకతనం. ఈ మెతకతనం కొంత కరకుతేలుతుండడం గత ఐదేళ్ల చరిత్ర. చైనా ప్రభుత్వం ‘ఉమ్మడి’ జమ్మూకశ్మీర్‌లో రెండుచోట్ల తిష్ఠవేసి ఉందని, మన భూభాగాలు చైనావారి అక్రమ అధీనంలో ఉన్నాయని మన విదేశాంగ మంత్రిత్వశాఖ వారు చైనాకు గుర్తుచేయడం పెరిగిన కరకుతనం... కానీ చైనా దురాక్రమణ వ్యూహానికి దీటైన నిరోధక వ్యూహం టిబెట్ స్వాతంత్య్రం...! ఈ దిశగా ఇప్పుడైన మన ప్రభుత్వం ఆలోచించాలి!
అనాదిగా తమకు సంబంధం లేని జమ్మూకశ్మీర్‌ను తమ సార్వభౌమ అధికారంతో ముడిపెట్టడం బరితెగించిన చైనా దురాక్రమణ స్వభావానికి నిదర్శనం. కానీ టిబెట్‌తో మన అనాదిగా సంబంధం ఉంది. మహాభారత యుద్ధం తరువాత ‘రూపతి’ అన్న కురువంశ వీరుడు టిబెట్- త్రివిష్టపం- ను పరిపాలించడం చరిత్ర. అప్పటికి టిబెట్ భారతదేశంలో భాగం, అఖండ భారత సమీకృత సామ్రాజ్యవ్యవస్థలోని ఒక రాజ్యం. మహాభారత యుద్ధం క్రీస్తునకు పూర్వం మూడువేల నూట ముప్పయి ఎనిమిదవ సంవత్సరంలో జరిగింది. అది ద్వాపర యుగం చివరినాటి ‘యుద్ధం’. క్రీస్తునకు పూర్వం మూడువేల నూట రెండవ సంవత్సరంలో కలియుగం ఆరంభమైంది. ప్రస్తుతం కలియుగంలో ఐదువేల నూట ఇరవై ఒకటవ సంవత్సరం నడుస్తోంది. ఇలా ఐదువేల నూట యాబయి ఆరేళ్ల క్రితం జరిగిన మహాభారత యుద్ధ సమయంలో టిబెట్ మన దేశపు అంతర్భాగం. దేశ విదేశాలలోని చరిత్ర పరిశోధకులు నిర్ధారించిన సంగతి ఇది. టిబెట్‌కూ భారత్‌కూ మధ్య అందువల్లనే ఇప్పటికీ సాంస్కృతిక సామ్యం కొనసాగుతోంది. ఈ సాంస్కృతిక సమానత్వం చైనాకు, టిబెట్‌కు మధ్యలేదు. సంస్కృత భాషకు రూపాంతరం త్రివిష్టపీయ భాష! భాషా శాస్తవ్రేత్తలు నిర్ధారించిన వాస్తవం ఇది. గాంధారం- నేటి ఆప్ఘనిస్థాన్ దక్షిణ ప్రాంతం-నుంచి అరుణాచల్ వరకు వ్యాపించి ఉన్న అఖండ భారత ఉత్తర భాగంలో ఉన్న అనేక భాషలు లిపి ‘బ్రహ్మీ’లిపి రూపాంతరాలు. దరదస్థాన్‌లోను, కశ్మీర్‌లోను, లడక్‌లోను, నేపాల్‌లోను, భూటాన్‌లోను, టిబెట్‌లోను, అరుణాచల్‌లోను నేడు మాట్లాడుతున్న భాషలు ‘బోటీ’ భాషకు వివిధ రూపాలు. ‘బోటీ’్భషకు మాతృక సంస్కృత భాష! ఇలా ఈ ప్రాంతాలన్నీ అఖండ భారత్‌లోని ఉత్తరపుసీమలు! చైనా భాషతో వీటికి ఎలాంటి సంబంధం లేదు. టిబెట్ క్రీస్తునకు పూర్వం ఐదవ శతాబ్ది తరువాత భారత్ నుంచి విడివడి స్వతంత్ర దేశంగా అవతరించింది. ఈ స్వతంత్ర టిబెట్ రెండువేల ఏళ్లపాటు చైనీయ దురాక్రమణను తిప్పికొట్టడం కూడ చరిత్ర. క్రీస్తుశకం ఇరవైయవ శతాబ్దివరకూ చైనాకు, టిబెట్‌కు మధ్య వస్తు రవాణా, రాకపోకలు మన దేశంలో భాగమై ఉండిన బర్మా ద్వారా జరిగేవి! క్రీస్తుశకం 1959లో చైనావారు టిబెట్‌ను దురాక్రమించి స్వాతంత్య్రాన్ని హరించిన తరువాత ఈ చారిత్రక భౌగోళిక ధ్యాస మరుగున పడింది. అందువల్ల ఈ చారిత్రక ‘్ధ్యస’ను ఇప్పుడైన మన ప్రభుత్వం పునరుద్ధరించాలి!! దక్షిణ భారతంలో పాటిస్తున్న ‘చాంద్రమాన’ కాలగణన పద్ధతినే ఇప్పటికీ టిబెట్ ప్రజలు పాటిస్తున్నారు!!
అందువల్ల మన ప్రభుత్వం టిబెట్ స్వాతంత్య్ర పునరుద్ధరణకు ఇప్పుడైన పూనుకోవడం చైనాతో మన ‘సరిహద్దు’తగాదాను పరిష్కరించుకోవడానికి శాశ్వత పరిష్కారం. స్వతంత్ర టిబెట్ ఉండిన రోజులలో చైనావారికి మన లడక్‌లోని కశ్మీర్‌లోకి చొఱబడడానికి వీలుండేది కాదు, మన అరుణాచల్ తమదని వాదించడానికి అవకాశం ఉండేది కాదు. ఎందుకంటె మన దేశానికీ చైనాకు మధ్య స్వతంత్ర టిబెట్ నెలకొని ఉండేది. టిబెట్‌నకు ఉత్తరంగా ఉండిన చైనాకు లడక్‌లోకి చొఱబడాలన్న ఊహ కూడ రాలేదు. టిబెట్ తమ అక్రమ అధీనంలోకి వచ్చిన తరువాతనే చైనావారు లడక్‌లోకి చొఱపడినారు. ఉత్తర కశ్మీర్‌లోని ఆరువేల చదరపు కిలోమీటర్ల మన భూమిని పాకిస్తాన్ ప్రభుత్వం చైనాకు కట్టబెట్టడానికి వీలుకలిగింది. మళ్లీ టిబెట్ స్వతంత్ర దేశమైతే ఈ సమస్యలు సహజంగానే అంతరించిపోగలవు. 1959నుంచి మన హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో టిబెట్ ప్రవాస ప్రభుత్వం ఏర్పడి ఉంది. ఈ ప్రవాస ప్రభుత్వాన్ని మన ప్రభుత్వం కాని ఏ ఇతర దేశం ప్రభుత్వం కాని గుర్తించకపోవడం అమానవీయ ప్రవృత్తికి నిదర్శనం. ఈ అమానవీయ ప్రవృత్తి చైనా దురాక్రమణ టిబెట్‌లో మరింతగా వ్యవస్థీకృతం కావడానికి దోహదం చేసింది! ఈ ‘దురాక్రమణ’ కొనసాగడంవల్ల మనం మన సరిహద్దు రక్షణ కోసం ఏటా వేలాది కోట్ల రూపాయలను వెచ్చించవలసి వస్తోంది. వేలాది మంది ‘్భరత టిబెట్ సరిహద్దు’ పోలీసులు నిరంతర నిర్నిద్రులై కాపలాకాయవలసి వస్తోంది. స్వతంత్ర టిబెట్ మళ్లీ అవతరించినట్టయితే ఈ ఖర్చు, శ్రమ తగ్గిపోతాయి. నేపాల్‌లోకి ప్రస్తుతం మనం నిర్నిరోధంగా రాకపోకలు సాగించగలుగుతున్నాము.. 1949కి పూర్వం టిబెట్‌లోకి కూడ మనం ఇలా నిర్నిరోధంగా రాకపోకలు సాగించగలిగాము. క్రీస్తుశకం 1914వ సంవత్సరానికి ముందు స్వతంత్ర టిబెట్ మన దేశానికి మధ్య ‘కైలాస మానస ప్రాంతం’ సరిహద్దుగా ఉండేది. అందువల్ల మనం కైలాస మానస సందర్శనకు ఎవరి అనుమతిని కూడ తీసుకోవలసిన అవసరం ఉండేది కాదు... మన దేశపు సాంస్కృతిక నిష్ఠలేని బ్రిటన్‌వారు మన దేశంపై పెత్తనం చెలాయించిన కాలంలో లడక్‌కూ, కైలాసానికీ మధ్య ఉన్న ప్రాంతాన్ని టిబెట్‌కు వదలివేశారు. అలా మానస సరోవరం కైలాసం టిబెట్‌లో కలిసిపోయాయి...
అయినప్పటికీ స్వతంత్ర టిబెట్ ప్రభుత్వం ‘కైలాస మానస’ ప్రాంతంలోని మన యాత్రికులను నిర్నిరోధంగా అనుమతించింది. కానీ టిబెట్‌ను చైనా ఆక్రమించిన తరువాత ‘మానస కైలాస్’ ప్రాంతాన్ని మనం నిర్నిరోధంగా దర్శించే అవకాశం కోల్పోయాము, చైనా ప్రభుత్వం అనుమతి తీసుకోవలసిన దుస్థితి ఏర్పడి ఉంది. అందువల్ల స్వతంత్ర టిబెట్ ఏర్పడడం చైనా ప్రమాదం నుంచి మన దేశానికి శాశ్వత విముక్తి మార్గం... తొలి మెట్టుగా మన ప్రభుత్వం టిబెట్ ప్రవాస ప్రభుత్వాన్ని స్వతంత్ర టిబెట్ ప్రభుత్వంగా గుర్తించాలి..