సంపాదకీయం

సంస్కృత సంధానం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావా బాలా? ‘కాంచనమాలా!’
కస్యాః పుత్రీ? ‘కనకలతాయాః!’
కిమ్ వా హస్తం? ‘తాలజపత్రం!’
కోవా లేఖా? ‘క,ఖ,గ,ఘ..’
ఇలాంటి ‘పదలయ’- రైమ్- విన్యాసాలు పాఠశాలల్లో మారుమోగడం చరిత్ర. చిన్నపిల్లలు ప్రధానంగా ఆడపిల్లలు బడికి వెళ్లి ఇలాంటి ‘పదలయ’లను పలికిన చరిత్ర అనాదిగా కొనసాగింది! ‘ఎవరు పాపా నీవు?’- కావా బాలా?- అన్న ప్రశ్నకు తన పేరు ‘కాంచనమాల’ అన్నది పాప చెప్పిన సమాధానం! ‘ఎవరి కుమార్తెవు’- కస్యాః పుత్రీ?- అన్నది తరువాతి ప్రశ్న. పాప తాను ‘కనకలత’ కుమార్తెనన్న వాస్తవాన్ని వివరించింది! ‘చేతిలో ఏమిటది?’-కిమ్ వా హస్తం?- అన్న ప్రశ్నకు తన చేతిలో ఉన్న తాటాకును పాప చూపించింది. ఆ ఆకులో ఏమి వ్రాస్తావు?- కవా లేఖా-అన్నది కొనసాగిన ప్రశ్న! తాను ఆ తాటి ఆకుపై అక్షరాలను- కఖగఘలను- వ్రాసినట్టు ఆ చిట్టిపాప- ఐదేళ్ల శిశువు- ప్రకటించింది. అన్ని భారతీయ భాషలలోనూ అవే అక్షరాలు, అదే అక్షర క్రమం. ఎందుకంటె భారతీయ భాషలన్నీ ఒకే ‘సంస్కృత భాషా కుటుంబాని’కి చెందిన అక్కచెల్లెళ్లు, తల్లి సంస్కృత భాష. ‘జనని సమస్త భాషలకు సంస్కృత భాష ధరాతలమునన్’ అన్న వాస్తవాన్ని భారతజాతి సహస్రాబ్దుల పాటు, సహస్రాబ్దులతో కూడిన యుగాలపాటు పరిగణించడం చరిత్ర. సంస్కృత భాషకు మూల లిపి అయిన ‘బ్రాహ్మీ’ నుంచి అన్ని భారతీయ భాషల ‘లిపులు’ రూపాంతరం చెందాయి. అందువల్లనే అన్ని భారతీయ భాషల అక్షర క్రమం కూడ ఒకే విధంగా ఉంది. అక్షరాల సంఖ్యలో తేడాలు ఉండవచ్చు. కానీ ‘అ’ నుంచి ‘హ’ వరకూ గల అక్షర క్రమం అన్ని భాషలకూ సమానం! విదేశాల నుంచి మన దేశానికి విస్తరించిన భాషలలో ప్రధానంగా ఈ అక్షర క్రమం లేదు. భారతీయ భాషలన్నింటిలోను ‘అక్షర రమ్యత’ ఉంది, అక్షర ధ్వనికి, పద ధ్వనికి మధ్య సమానత్వం ఉంది. ‘అమ్మ’ అనే అక్షరాల ధ్వని, ‘అమ్మ’ అనే పద ధ్వని- ఉచ్చారణ- ఒకే విధంగా ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చిన భాషలలో ప్రధానంగా ఆంగ్లభాషలో ఈ సమన్వయం లేదు. సమానత్వం లేదు. అక్షరాల ఉచ్చారణ- ధ్వని- వేఱు, అక్షరాల సమాహారమైన పదాల ధ్వని- ఉచ్చారణ వేఱు! ఇదంతా మాతృభాషల చరిత్రతో ముడివడిన వ్యవహారం. భారతదేశమంతటా అనేక ప్రాంతీయ భాషలు వికసించాయి. సంస్కృత భాషా భూమికపై అంకురించిన భారతీయ భాషలన్నీ ఇలా సమాన స్వరూప స్వభావాలతో ముడివడి ఉన్నాయి. ప్రాంతీయ మాతృభాషల నిరంతర అనుసంధానం జాతీయ మాతృభాష అయిన సంస్కృత భాష ద్వారా కొనసాగడం సుదీర్ఘ చరిత్ర. ఈ చరిత్రను మన దేశాన్ని ఆర్థికంగా భౌతికంగా సాంస్కృతికంగా దివాలా తీయించిన బ్రిటన్ దురాక్రమణకారులు చెఱచిపోయారు. ఈ ‘చెడబాటు’ దశాబ్దులుగా బ్రిటన్ దురాక్రమణ విముక్త భారతదేశమంతటా వ్యవస్థీకృతమై ఉండడం జాతీయ వైపరీత్యం! ‘బాబా బ్లాక్‌షీప్’ అని మూడేళ్ల పిల్లలు పాఠశాలల్లో వల్లె వేస్తుండడం ఈ ‘చెడబాటు’! సూర్యోదయంతో మొదలు కావలసిన ‘కాలగణన’ అర్ధరాత్రి కారుచీకటితో మొదలవుతుండడం ఈ ‘చెడబాటు’. ఈ ‘చెడబాటు’ను సరిదిద్దడానికి అనేకమంది జాతీయభావ నిష్ఠులు, జాతీయ సాంస్కృతిక ఉద్యమ సంస్థలు కృషి చేస్తుండడం సమాంతర శుభ పరిణామం. శనివారం నుంచి మూడురోజులు దేశ రాజధానిలో జరుగుతున్న ‘విశ్వ సంస్కృత సమ్మేళనం’ ఈ కృషిలో భాగం..
‘సంస్కృత భారతి’ సంస్థవారు ఢిల్లీలోని ఛాత్రపుర దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ సంస్కృత భాషా సమ్మేళనంలో దేశ విదేశాలకు చెందిన దాదాపు నాలుగు వేలమంది ప్రతినిధులు పాల్గొంటున్నారట. అధ్యాపకులు మేధావులు విద్యాధికులు శాస్తవ్రేత్తలు మాత్రమే కాక ఇళ్లలో సంస్కృత భాషను నేర్పుతున్న కుటుంబాల నుంచి కూడ ప్రతినిధులు ఈ సమ్మేళనంలో పాల్గొంటున్నారట. సంస్కృత భాష కేవలం విద్వత్ భాష కాదన్న, ఇప్పటికీ దేశవ్యాప్తంగా కొన్నివేల కుటుంబాల వారి నిత్య వ్యవహార భాష సంస్కృతమన్న వాస్తవానికి తగిన ప్రచారం లేదు. పిఎన్ బక్, కోట వెంకటాచలం వంటి చరిత్రకారులు ‘ఒకప్పుడు ప్రపంచమంతటా సంస్కృత భాష వ్యవహార భాషగా ఉండేదన్న’ వాస్తవాన్ని తమ గ్రంథాలలో వివరించారు. ‘ది వరల్డ్ వేదిక్ హెరిటేజ్’- ప్రపంచ వైదిక వారసత్వం- అనే బృహత్ గ్రంథంలో పిఎన్ బక్ ఈ వాస్తవాన్ని విపులంగా వివరించి ఉన్నాడు. కానీ భారతీయులు వ్రాసిన చరిత్రను, వివరించిన భాషా వికాస క్రమాన్ని భారతీయులే నమ్మని దుస్థితి ఇప్పుడు దాపురించింది. ఇందుకు కారణం బ్రిటన్ బీభత్స పాలకులు నిర్వహించిన దుర్మార్గం. అజ్ఞానం, అహంకారం స్వభావమైన ఆంగ్లేయులు సంస్కృత భాషను దశలవారీగా నిర్మూలించి, సంస్కృత భాష స్థానంలో ఆంగ్లభాషను ప్రవేశపెట్టారు. ఇది మన దేశ ప్రజల ఇష్టంతో జరగలేదు. బ్రిటన్ దొరలు మన దేశ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా సంస్కృత భాషను నిర్మూలించి ఆంగ్లభాషను ప్రవేశపెట్టారు. అంతవరకు సంస్కృత భాషా మాధ్యమంగా జరిగిన సకల వ్యవహారాలు ఆంగ్లభాషలో జరగడం మొదలైంది..!
బ్రిటన్ దురాక్రమణకారులు దేశం నుంచి నిష్క్రమించిన తరువాత- వారి దురాక్రమణకు పూర్వం నాటి భాషా వ్యవస్థను మనం పునరుద్ధరించుకోవలసి ఉంది. బ్రిటన్ దురాక్రమణ వ్యవస్థీకృతం అయ్యే వరకు మన దేశంలో కేంద్ర ప్రభుత్వ అధికార భాష సంస్కృత భాష. కలియుగం ఆరంభం నుంచి కలియుగం ఇరవై ఎనిమిదవ శతాబ్ది వరకు- క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్ది వరకు- ‘గిరివ్రజం’ రాజధానిగా మొత్తం భారత దేశాన్ని ఎనిమిది రాజవంశాల వారు పాలించారు. ఈ బృహద్రధ, ప్రత్యోత, శిశునాగ, నంద, వౌర్య, శుంగ, కాణ్వ, ఆంధ్ర శాతవాహన సమ్రాట్టుల కాలంలో అధికార భాష సంస్కృత భాష. పాళీ భాష కూడ కొంతకాలం సమాంతరగా రాజభాష.. క్రీస్తునకు పూర్వం నాలుగవ శతిబ్దిలో తొమ్మిదవదైన గుప్త వంశం వారు రాజధానిని ‘గిరివ్రజం’ నుంచి పాటలీపుత్రానికి మార్చారు. అప్పటి నుంచి క్రీస్తుశకం ఏడవ శతాబ్ది వరకు సంస్కృతం దేశమంతటా ఏకైక అధికార భాష. క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్దిలో పదవదైన ప్రమర వంశం వారు రాజధానిని ఉజ్జయినిలో ఏర్పాటు చేయడం చరిత్ర. క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్ది నాటి విక్రమ సమ్రాట్టు ఆస్థానంలోని వరాహ మిహిర, కాళిదాస మహాకవి వంటి ‘నవరత్నాలు’- తొమ్మిదిమంది విద్వాంసులు- సంస్కృత సాహిత్య గరిమకు శాశ్వత ప్రతీకలు. ఇలా కలియుగం ఆరంభం నుంచి కలియుగం ముప్పయి ఎనిమిదవ శతాబ్ది వరకు అంటే క్రీస్తుశకం ఏడవ శతాబ్ది ఆరంభం వరకు సంస్కృత భాష కేంద్ర ప్రభుత్వ అధికార భాష. సామ్రాజ్యంలోని వివిధ భాషల రాజ్యాల మధ్య, ప్రాంతాల మధ్య విద్యలను వివిధ ప్రాంతాలలో ఆయా ప్రాంతీయ మాతృభాషలలో, ప్రాకృత భాషలలో మప్పేవారు. కానీ ఉన్నత విద్యాబోధనకు దేశమంతటా ఏకైక మాధ్యమ భాష సంస్కృత భాష. క్రీస్తు శకం పనె్నండవ శతాబ్ది నుంచి విదేశీయ ‘జిహాదీ’ల బీభత్సపాలనకు గురి అయిన చోట్ల సంస్కృతం ప్రాధ్యాతన కొంత తగ్గింది. కానీ బ్రిటన్ దురాక్రమం వ్యవస్థీకృతం అయ్యేవరకు దేశమంతటా ఉన్నత విద్యాబోధనకు మాధ్యమం సంస్కృ భాష!!
అందువల్లనే బ్రిటన్ బీభత్సకారుల నుంచి విముక్తమైన తర్వాత దేశంలో సంస్కృత భాషను కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా, అనుసంధాన భాషగా, ఉన్నత విద్యాబోధన మాధ్యమభాషగా పునరుద్ధరించాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ ప్రతిపాదించాడు. ఆ మహనీయుని ప్రతిపాదనను రాజ్యాంగ పరిషత్ ఆమోదించి ఉంటే భారతీయులు భారతీయులుగా జీవించడానికి ప్రాతిపదిక ఏర్పడి ఉండేది. ఆయన ప్రతిపాదనను రాజ్యంగ పరిషత్ తిరస్కరించడం చారిత్రక మహాపరాధం! ఇప్పుడైన దేశమంతటా ఎనిమిదవ తరగతి వరకు ప్రాంతీయ మాతృభాషల మాధ్యమంగా విద్యాబోధన జరగాలి. సంస్కృత భాషను ఒకటవ తరగతి నుంచి దేశమంతటా నేర్పించాలి. తొమ్మిదవ తరగతి నుంచి దేశమంతటా ఉన్నత విద్యను సంస్కృత భాష మాధ్యమంగా బోధించాలి. కనీసం ఇప్పుడైన ఈ వ్యవస్థ ఏర్పడితే ప్రస్తుతం ఐరోపా వారి వలె జీవిస్తున్న భారతీయులు మళ్లీ భారతీయులుగా రూపొందడానికి ప్రాతిపదిక ఏర్పడుతుంది..