సంపాదకీయం

శ్రీలంక ప్రస్థానం ఎటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీలంక అధ్యక్షుడిగా గోతబయ రాజపక్షే ఎన్నిక కావడం శ్రీలంకలో జరిగిన చైనా అనుకూల పరిణామం.. గత పదేళ్లుగా జరిగిన శ్రీలంక అంతర్గత పరిణామక్రమం ఇందుకు నిదర్శనం. 2009వ 2010వ సంవత్సరాలలో శ్రీలంక ప్రభుత్వం ‘తమిళ ఈలం లిబరేషన్ టైగర్ల’ (ఎల్‌టిటిఇ) నడుములను విరిచేయగలిగింది! ఎల్‌టిటిఇ బీభత్స సంస్థ దశాబ్దాలపాటు శ్రీలంకలో భయంకర హత్యాకాండ జరపడం చరిత్ర! కానీ ఎల్‌టిటిఇ నుంచి విముక్తియైన శ్రీలంక క్రమంగా చైనాకు సన్నిహితం కావడం కూడా నడుస్తున్న చరిత్ర. ఎల్‌టిటిఇని కఠినంగా అణచివేయగలిగిన సమయంలో శ్రీలంక ప్రభుత్వ అధినేత మహేంద్ర రాజపక్షే 2015 వరకు మహేంద్ర రాజపక్షే శ్రీలంక అధ్యక్షుడిగా కొనసాగాడు. ఆ సమయంలోనే చైనాకు శ్రీలంకకు మధ్య రహస్య సైనిక సంబంధాలు పెంపొందాయి. ప్రస్తుతం శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన గోతబయ రాజపక్షకు మహేంద్ర రాజపక్ష సోదరుడు. అందువల్ల మహేంద్ర రాజపక్ష విధానాలను ప్రత్యేకించి ‘్భరత వ్యతిరేక, చైనా అనుకూలం’ విదేశాంగ, రక్షణ నీతిని గోతబయ ప్రభుత్వం అనుసరించవచ్చునన్న సందేహం అతార్కిం అయితే శ్రీలంక ప్రజలు భారత ప్రజలతో యుగయుగాల తరతరాల మైత్రి మరింత పటిష్టం కావాలని కోరుతున్నారన్నది వాస్తవం. ఈ వాస్తవం గతంలో 2015 నాటి శ్రీలంక అధ్యక్షుని ఎంపిక సందర్భంగా ధ్రువపడింది. ఎల్‌టిటిఇని అణచివేసిన నేతగా మహేంద్ర రాజపక్ష శ్రీలంక ప్రజల మన్ననలను పొందాడు. అందువల్లనే ఆ తరువాత అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో మహేంద్ర రాజపక్ష మరోసారి విజేత కాగలిగాడు. 2009లో ఎల్‌టిటిఇని శ్రీలంక ప్రభుత్వ దళాలు అణచివేసిన సమయంలో ‘శరత్ ఫోన్‌సెకా’ అనేది శ్రీలంక సైనిక దళాలకు ప్రధాన అధికారి. అతను ఆ తరువాత జరిగిన ఎన్నికలలో శరత్ ఫోన్‌సెకా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా అధ్యక్ష పదవికి పోటీ చేశాడు. మహేంద్ర రాజపక్షతో తలపడినాడు. ఆ ఎన్నికలలో మహేంద్ర రాజపక్ష గెలుపొందడం ‘పౌర ఆధిపత్యం’ (సివిల్ సుప్రమసీ) సిద్ధాంతానికి విజయం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆటుపోటులకు, ఉత్థాన పతనాలకు బాధ్యత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదేకాని, ప్రభుత్వ ఆదేశాలను అమలు జరుపవలసిన సైనిక నేతది కాదన్నది ‘పౌర ఆధిపత్య’ సూత్రం! ఈ సూత్రాన్ని శ్రీలంక ప్రజలు అంగీకరించారు. కానీ ఆ తరువాత మహేంద్ర రాజపక్ష విధానాలను, చైనా అనుకూల ధోరణిని ప్రజలు నిరసించారు. 2015 జనవరిలో అధ్యక్ష పదవికి మళ్లీ పోటీ చేసిన మహేంద్ర రాజపక్షను ఓడించారు, మైత్రీపాల సిరిసేనను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. 2015 నాటి శ్రీలంక ప్రజల తీర్పు ‘చైనా అనుకూల ప్రభుత్వ విధానాలకు ఘోరమైన అభిశంసన’ అన్నది శ్రీలంక రాజకీయవేత్తలు గ్రహించిన గుణపాఠం. అందువల్ల గోతబయ రాజపక్ష గతంలో మహేంద్ర రాజపక్ష వలె చైనాను తమ దేశంలో ‘చేర్చే’ దుస్సాహసానికి ఒడిగట్టుకోరాదన్నది చారిత్ర పాఠం...
ప్రభుత్వం మారినపుడల్లా దేశాల విధానాలు ‘వ్యతిరేక దిశలో’ మారడం ‘ప్రజాస్వామ్య వ్యవస్థ’లో నిహితమై వున్న ‘అపరిణత’కు ‘అపరిపక్వత’కు నిదర్శనం. పరిణత ప్రజాస్వామ్య వ్యవస్థలలో ప్రభుత్వాలు మారినప్పటికీ ‘జాతీయ ప్రయోజనం’ పట్ల ‘సమష్టి హితం’ పట్ల ప్రధానరాజకీయ పక్షాల దృక్పథం మారదు, మారబోదు! ఏదైనా అంతర్జాతీయ మహావిప్లవం సంభవించినపుడు మాత్రమే వివిధ దేశాల విదేశాంగ విధానాలు మారడం చరిత్ర. అందువల్ల అనాదిగా మన దేశంతో వున్న అనుబంధాన్ని శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ వంటి దేశాలు నిరంతరం కొనసాగించాలి. ఈ అనుబంధానికి ప్రాతిపదిక సాంస్కృతిక సమానత్వం. ఈ మూడు దేశాలు ఒకప్పుడు ‘అఖండ భారత్’లో భాగం. బ్రిటన్ దురాక్రమణ సమయంలో ఈ మూడు దేశాలూ ‘అఖండ భారత్’నుండి రాజకీయంగా విడిపోవడం చరిత్ర. కానీ యుగాలనాటి సాంస్కృతిక సమానత్వాన్ని ఈ అన్ని దేశాల ప్రజలు ఇప్పటికీ పరిగణిస్తున్నారు, పాటిస్తున్నారు. మాల్దీవులలో అనాదిగా వేదమతాలు, సాంస్కృతిక భాషా రూపాంతరాలు కొనసాగాయి. బౌద్ధమతం పరిఢవిల్లింది. క్రీస్తుశకం పనె్నండవ శతాబ్దిలో అరబ్ జిహాదీలు, ఆ తరువాత ఐరోపా దురాక్రమణదారులు మాల్దీవులలో చొరబడినారు. ‘మాల్దీవులు’ మన దేశం నుండి విడిపోయింది. ఇటీవలికాలంలో చైనా చొరబడడం మన భద్రతకు ముప్పుగా పరిణమించిన విపరిణామం. కానీ గత సంవత్సరం అధ్యక్షపదవికి జరిగిన ఎన్నికలలో మాల్దీవుల ప్రజలు చైనా అనుకూల రాజకీయవాదులను ఘోరంగా ఓడించారు. భారత అనుకూల రాజకీయ పక్షానికి విజయం చేకూర్చారు. శ్రీలంక అధ్యక్షుడుగా ఎన్నికైన గోతబయ రాజపక్ష ఈ పాఠాన్ని మరువరాదు...
గత శతాబ్ది ఆరంభం వరకు కూడా భారతీయులు సింహళ-శ్రీలంక ప్రజలు కొలంబోనుంచి కైలాసం వరకూ వున్న అఖండ భారత భూమిని మాతృభూమిగా భావించడం చరిత్ర. క్రీస్తుశకం 19వ శతాబ్ది చివరిలో అమెరికాకు వెళ్లిన వివేకానందస్వామి మూడేళ్ల తరువాత తిరిగి వచ్చాడు. సింహళ ద్వీపంలోని ‘కొలంబో’లో ఓడ దిగిన తరువాత వివేకానంద స్వామి మాతృభూమిని సందర్శించిన ఆనందంతో పరవశుడయ్యాడు. కొలంబోలో నేలపై పొర్లి మాతృభూమికి అంజలి ఘటించాడు. భరతమాతకు కైలాస పర్వత ప్రాంతం శిరోభాగం, మాల్దీవులు, సింహళం పాదయుగళం. అందువల్లనే కొలంబోలో వివేకానందుడు భరతమాత పాదాలకు నమస్కరించాడు. సింహంలో శాంకరీదేవీ శక్తిపీఠం నెలకొని వుంది. భారత జాతీయుల స్ఫూర్తికేంద్రాలు, సాంస్కృతిక తీర్థస్థలాలు భారత్ సరిహద్దుల లోపలనే ఉండటం చరిత్ర. భౌగోళిక వాస్తవాన్ని బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో మన నాయకులు మరచిపోవడం మన దక్షిణ భద్రతకు ముప్పుతెచ్చిన వైపరీత్యం. కోట్ల సంవత్సరాల క్రితం ‘సింహళ’ భూభాగం భారతదేశపు ప్రధాన భూమిని అంటుకొని వుండేది. కాలగర్భంలో జరిగిన మార్పులవల్ల సంభవించిన ‘్భఖండ చలనం’- కాంటినెంటల్ డ్రిఫ్ట్- ఫలితంగా ‘సింహళం’ భరత ఖండపు ప్రధాన భూమికి దూరంగా జరిగింది. అందువల్ల చైనా, అమెరికా వంటి దేశాలు సమీప ద్వీపాలను తమ దేశాలలోనే ఉంచుకోగలిగినట్టుగానే 1947 తరువాత మాల్దీవులను, శ్రీలంక సింహళంను మన ప్రభుత్వం మన దేశంలో ఉంచుకొనగలిగి ఉండాలి. అది జరగలేదు. మన దక్షిణ సరిహద్దులలో చైనా చొరబాటునకు ఇదంతా చారిత్రక నేపథ్యం...
ఎల్‌టిటిఇ శ్రీలంకకు మాత్రమే కాదు మన దేశానికి కూడా శత్రువు. కానీ శ్రీలంక ప్రభుత్వం ఎల్‌టిటిఇ ప్రజ్వరిల్లిన యుద్ధాన్ని శ్రీలంకలోని సామాన్య తమిళ ప్రజలపై జరిగిన దమనకాండగా ప్రచారం జరిగింది. తమిళనాడులోని ద్రవిడ మునే్నట్ర కజగం తదితర ద్రవిడ పక్షాలు ఈ అసత్యపు ప్రచారం చేశాయి. 2009వ 2014లమధ్య ఈ ద్రవిడ పక్షాల ఒత్తిడికి లోనైన మన ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకతను ప్రదర్శించింది. శ్రీలంక ప్రభుత్వం సామాన్య ప్రజలపై దమనకాండ సాగించిందన్న తీర్మానానికి అనుకూలంగా మన ప్రభుత్వం 2012 మార్చిలో ‘ఐక్యరాజ్యసమితి’లో ఓటువేసింది. మన దేశం పట్ల మహేంద్ర రాజపక్ష ప్రభుత్వం విముఖతను ప్రదర్శించడానికి ఇది కూడ ఒక ఉదాహరణం! మైత్రీపాల సిరిసేన పాలనలో ఈ పాత గాయం మానింది. గోతబయ రాజపక్ష కూడా అందువల్ల గత ఐదేళ్లుగా మళ్లీ వికసించిన భారత సింహళ మైత్రీ విధానాన్ని మరింత పోషించగలగాలి!