సంపాదకీయం
మరో ‘ప్రత్యేకత’??
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పౌరసత్వపు చట్టానికి ప్రతిపాదిస్తున్న ‘సవరణ’ ఈశాన్య ప్రాంతంలోని ఆరు రాష్ట్రాలకు వర్తింపచేయరాదన్న ప్రభుత్వ నిర్ణయం విచిత్రమైన పరిణామం. అప్ఘానిస్థాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి తరిమివేతకు గురి అయిన ఇస్లామేతర మతాల వారికి మన దేశపు పౌరసత్వం కల్పించడానికి ఈ ‘సవరణ’ వీలు కల్పిస్తోంది. ఇలా పౌరసత్వం పొందిన ‘శరణార్థులు’ దేశంలో ఎక్కడైనా నివసించవచ్చు. ఎందుకంటె మన దేశపు పౌరులు మన దేశంలో ఎక్కడైనా నివసించడానికి, స్థిర నివాసం ఏర్పరచుకొనడానికి, ఉద్యో గం- ఉపాధి పొందడానికి రాజ్యాంగం వీలుకల్పిస్తోంది. అందువల్ల అప్ఘానిస్థాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి పారిపోయి వచ్చిన వారికి భారతీయ పౌరసత్వం లభించినట్టయితే వారుకూడ మన దేశంలో ఎక్కడైన స్థిరపడ వచ్చునన్నది రాజ్యాంగ స్ఫూర్తి! కానీ ఈ స్ఫూర్తిని వమ్ముచేయడానికి వీలుగా ప్రభు త్వం ‘సవరణ’ చట్టానికి మరో సవరణను ప్రతిపాదిస్తోందట! ఇలా ఈ మూడు దేశాలనుంచి వచ్చేసిన ఇస్లాం మతేతరులు మన దేశపు పౌరసత్వం పొందిన తరువాత దేశంలో ఎక్కడైన నివసించవచ్చు, స్థిరపడవచ్చునట. కానీ ఈశాన్యంలోని ఆరు ప్రాంతాలలో మాత్రం ఈ కొత్త పౌరులు స్థిర నివాసం ఏర్పాటుచేసుకోరాదన్నది కొత్త సవరణ! ఇలా అస్సాం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలలోని వనవాసీ ప్రాంతాలలోను, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌లలోను మాత్రం ఈ కొత్త పౌరులు నివాసం ఏర్పాటుచేసుకోరాదన్నది ‘సవరణ’ ముసాయిదాకు జరిగిపోతున్న మరో సవరణ. ‘సవరణ’వల్ల కొత్తగా పౌరసత్వం పొందగల వారందరూ దేశంలో మరెక్కడ కూడ స్థలం లేనట్టు ఈ ఆరు ప్రాంతాలలో మాత్రమే స్థిరపడిపోతారన్నది నెలల తరబడి జరిగిన ప్రచారం, జరుగుతున్న ప్రచారం. ఈ ప్రచార ప్రభావానికి కేంద్ర ప్రభుత్వం కూడ లోనుకావడం విచిత్రమైన పరిణామం! అప్ఘానిస్థాన్ నుంచి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఇస్లామేతర మతాలవారు తరిమివేతకు గురికావడానికి ఏకైక కారణం ఈ మూడు దేశాల సమాజాల సమష్టి స్వభావం. ఈ సమష్టి స్వభావం ‘జిహాదీ’ మతోన్మాదం. తమ దేశాలలోనే కాదు మొత్తం ప్రపంచంలోనే ఇస్లామేతర మతాలవారు జీవించరాదన్నది ‘జిహాదీ’ల లక్ష్యం. ‘ఇస్లాం’ ఒక్కటే ‘‘ఏకైక మతం’’గా మొత్తం ప్రపంచంలో వ్యవస్థీకృతం కావడం ‘జిహాదీ’ లక్ష్యం. ఈ లక్ష్యసాధనలో భాగంగా శతాబ్దుల తరబడి ఇస్లామేతర మతస్థులను ‘జిహాదీ’లు నిర్మూలించారు. ఇస్లామేతర మతస్థులను సామూహికంగా హత్యచేయడం, ఇస్లామేతర మతాల మహిళలను లైంగిక బీభత్సకాండకు బలిచేయడం, ఇస్లామేతరులను తరిమివేయడం, బానిసలుగా పట్టుకొని వివిధ దేశాలలో అమ్మివేయడం, ఇస్లామేతర మతాల వారిని బలవంతంగా ‘ఇస్లాం’లోకి మతాంతీకరణ చేయడం వంటివి ‘జిహాదీ’లు శతాబ్దులపాటు సాగించిన ‘అన్యమత నిర్మూలన’ కార్యక్రమాలు ఈ ‘నిర్మూలన’ బీభత్సకాండ నుంచి తప్పించుకొని ఈ మూడు దేశాలలోని ‘ఇస్లామేతర మతాల’వారు శరణార్థులై మన దేశానికి వచ్చేశారు.
ఇలా వచ్చిన దాదాపు ముప్పయి ఐదువేల మంది శరణార్థులు మన దేశపు పౌరసత్వం పొందడానికి ఏళ్లతరబడి వేచి ఉండవలసి రావడం ఘోరమైన వైపరీత్యం. రెండు కోట్ల మందికి పైగా బంగ్లాదేశీయులు ఇతర ఇరుగు పొరుగు దేశాలవారు దశాబ్దుల తరబడి మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించారు. ఇలాంటి అక్రమ ప్రవేశకులను దేశం నుండి వెళ్లగొట్టకపోవడం మన దేశపు అంతర్గత భద్రతకు భంగం కలిగిస్తున్న వైపరీత్యం. ఇలాంటి అక్రమ ప్రవేశకులు ఎక్కువమంది పశ్చిమ బెంగాల్‌లోను, అస్సాంలోను, ఈశాన్యంలోను తిష్ఠవేసి ఉన్నారు. దేశమంతటా కూడ లక్షల మంది అక్రమ ప్రవేశకులు స్థిరపడి ఉన్నారు. అక్రమ ప్రవేశకులను వెళ్లగొట్టే ప్రక్రియను వ్యతిరేకిస్తున్నవారే శరణార్థులకు భారతీయ పౌరసత్వాన్ని కల్పించే ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు. ఇదీ మన దేశానికి మాత్రమే పరిమితమైన విచిత్రం. రెండు కోట్ల మందికి పైగా ‘అక్రమ ప్రవేశకులు’ దేశమంతటా విస్తరించారన్నది దశాబ్దుల తరబడి జరిగిన ప్రచారం. ఈ అక్రమ ప్రవేశకులలో కొన్ని వేల మంది ‘జిహాదీ’ బీభత్సకారులు కూడ ఉన్నట్టు ప్రచారమైంది. కానీ అక్రమ ప్రవేశకులను వెళ్లగొట్టరాదన్నది మన దేశంలోని కొన్ని రాజకీయ పక్షాల అభిమతం! ఇలాంటివారు అస్సాంలో రూపొందిన ‘జాతీయ పౌరసత్వ సూచిక’ను వ్యతిరేకించారు, వ్యతిరేకిస్తున్నారు. ఈ ‘జాతీయ పౌరసత్వ సూచిక’-నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్- ఎన్‌ఆర్‌సీ-ప్రకారం అస్సాంలోనే దాదాపు పంతొమ్మిది లక్షల మంది విదేశీయులు అక్రమంగా చొరబడినవారు ఉన్నట్టు ధ్రువపడింది! ఈ పంతొమ్మిది లక్షల మంది అక్రమ ప్రవేశకులకు సైతం మన దేశపు పౌరసత్వం ఇవ్వాలని వాదిస్తున్నవారే ‘శరణార్థుల’కు మన దేశపు పౌరసత్వం ఇవ్వరాదని కోరుతున్నారు. ఇదీ వీరి మానసిక బీభత్స వైచిత్రి!!
ఇలా లక్షల మంది ధ్రువపడిన అక్రమ ప్రవేశకులు, మరికొన్ని లక్షల మంది ధ్రువపడని అక్రమ ప్రవేశకులు అస్సాంలోను, ఈశాన్యంలోను తిష్ఠవేసి ఉండడం గురించి పట్టించుకోనివారు, కొన్ని వేల మంది ‘శరణార్థులు’-అప్ఘానిస్థాన్‌నుంచి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి తరిమివేతకు గురయిన నిస్సహాయులు- ఈశాన్యంలో స్థిర నివాసం ఏర్పరచుకోవడం వల్ల ప్రమాదం సంభవిస్తుందని ఆర్భాటిస్తున్నారు. పౌరసత్వపు చట్టానికి జరుగుతున్న సవరణ వల్ల 2014 డిసెంబర్ 31కి ముందు ఈ మూడు దేశాలనుంచి శరణార్థులై వచ్చిన ముప్పయి ఐదువేల మందికి మాత్రమే భారతీయ పౌరసత్వం లభిస్తుందట. వీరందరూ దేశంలోని వివిధ ప్రాంతాలలో స్థిరపడి ఉన్నారు. అందువల్ల ఈశాన్యంలోని ఈ ఆరు ప్రాంతాలలో స్థిరపడేవారు ఐదారు వేల మంది కూడ ఉండబోరు. మొత్తం ఈ ముప్పయి ఐదువేల మంది శరణార్థులు కూడ ఈశాన్యంలోనే స్థిరపడినప్పటికీ రాగల ప్రమాదం ఏమీ లేదు. అందువల్ల పౌరసత్వపు ‘సవరణ’ను ఈశాన్య ప్రాంతానికి వర్తింపచేయకపోవడం ‘ఒకే దేశం- ఒకే ప్రజ’- వన్ నేషన్ వన్ పీపుల్- స్ఫూర్తికి విరుద్ధం, రాజ్యాంగ సర్వసమగ్ర అన్వయ సూత్రానికి వ్యతిరేకం! ఈ ‘వైరుధ్యాని’కి, ఈ ‘వ్యతిరేకత’కు ఏడు దశాబ్దుల ప్రతీక అయిన రాజ్యాంగపు మూడువందల డెబ్బయ్యవ అధికరణం ఆగస్టులో రద్దయింది. విచ్ఛిన్న వాదాన్ని పెంచిన ‘కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి’ రద్దయింది. కానీ పౌరసత్వపు సవరణ ‘బిల్లు’ ఈశాన్యంలోని ఆరు ప్రాంతాలకు వర్తించదని నిర్దేశించడం ఈ ప్రాంతాలకు ‘కశ్మీర్ తరహా ప్రత్యేకత’ను కల్పించడం మాత్రమే కాగలదు. ఇలా ఆరు ప్రాంతాలకు ఈ ‘సవరణ’ వర్తించబోదని చెబుతున్న ప్రభుత్వం ‘మణిపూర్’కు మాత్రం ఈ మినహాయింపు ఇవ్వడం లేదు... ఎందుకని?
అఫ్ఘానిస్థాన్ నుంచి పాకిస్తాన నుంచి బంగ్లాదేశ్ నుంచి ఇస్లాం మతేతరులు తరిమివేతకు గురికావడం ‘అఖండ భారత్’ వివిధ సమయాలలో విభజనకు గురికావడం వల్ల ఏర్పడిన మానవీయ వైపరీత్యం. అందువల్ల ‘అఖండ భారత్’లో సహజ పౌరులైన, తరతరాల స్థానికులైన వీరిని ‘అవశేష భారత్’లో కూడ సహజ పౌరులుగా గుర్తించడం మానవీయ ధర్మం. ఎలాంటి కొత్త చట్టం కూడ ఇందుకు అవసరం లేదు. 1947నుంచి మన దేశానికి శరణార్థులుగా వస్తున్న వారందరికీ కేవలం దరఖాస్తు ప్రాతిపదికగా దశాబ్దులపాటు మన దేశ పౌరసత్వం లభించింది. అందువల్ల 2014 డిసెంబర్ 31వ తేదీకి ముందు వచ్చినవారికి మాత్రమే పౌరసత్వం కల్పించడం, ఆ తరువాత వచ్చిన శరణార్థులకు పౌరసత్వం కల్పించరాదనడం అన్యాయం! పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ‘జిహాదీ’లు తరిమివేస్తున్నవారు ఇప్పటికీ శరణార్థులై మన దేశానికి వస్తూనే ఉన్నారు. అందువల్ల ‘కాలవ్యవధి’తో నిమిత్తం లేకుండా శరణార్థులందరికీ పౌరసత్వం కల్పించాలి!!