సంపాదకీయం

అన్ని నదులకూ వర్తింపజేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ కొద్దికాలం క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం గోముఖ్ నుంచి, హరిద్వార్ వరకు గంగానదిలో ఎవైనా చెత్త వేసినట్లయతే రూ.20 వేల వరకు జరిమానా విధి స్తారు. గంగానది కాలుష్యపై నివేదిక పంపాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కూడా ఎస్‌జిటిని ఆదేశిం చింది. ఆదేశాలు పాటించని కంపెనీలను మూసివే యాలని కూడా ఎస్‌జిటిని ఆదేశించింది. గంగానదిలోకి ఆసుపత్రులు, ఆశ్రమాలు, కంపెనీలు, మఠాలనుంచి నేరుగా నీరు వదిలినా కఠిన చర్యలు తీసుకుంటారు. అయతే కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలను కేవలం గం గానదికే పరిమితం చేయకుండా దేశంలోని అన్ని నదులకు వర్తింప జేయాలి.
- సివిఆర్ కృష్ణ, హైదరాబాద్
356వ అధికరణ దుర్వినియోగం
రాజ్యాంగంలోని 356వ అధికరణాన్ని ప్రతిసారీ రాజకీయ కక్షసాధింపు కోసమే వాడుతుండడం విచారకరం. గణతంత్ర దినోత్సవం నాడే అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన విధించడం ఇందుకు మరో ఉదాహరణ. తాను అధికారంలో ఉండగా కాంగ్రెస్ ఇటువంటి పనులకు పాల్పడింది. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న భాజపా తీవ్రస్థాయలో కాంగ్రెస్‌పై విరుచుకు పడింది. మరిప్పుడు ఆ పార్టీ చేసేదేమిటి? కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత ప్రమాదకరమైంది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు రాష్టమ్రైనందున ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అవసరమైతే వైరిపక్షాలు కలసి పనిచేయాల్సిన రాష్ట్రం. సర్కారియా కమిషన్ సూచనలను, 356వ ఆర్టికిల్‌పై సుప్రీంకోర్టు భాష్యాన్ని కూడా కేంద్రం పాటించాల్సిన అవసరం ఉంది.
- డివిజి శంకరరావు, పార్వతీపురం
నిఘా కెమేరాలు ఏర్పాటు చేయాలి
అన్నవరం దేవస్థానం కళ్యాణకట్ట వద్ద, నిఘా కెమేరా లను ఎందుకని తొలగించారో తెలియడం లేదు. ఈ కెమేరాలు ఉన్న కాలంలో అక్కడ పనిచేసే క్షురకులు లంచాలు తీసుకోవడాన్ని పూర్తిగా నిరోధించలేకపోయనా, అదుపులో మాత్రం ఉండేది. ఇప్పుడు ఈ కేమెరాలను తీసివేయడంతో బాహాటంగా లంచాలు డిమాండ్ చేస్తున్నారు. తలనీలాలు సమర్పించుకోవడానికి అధికా రిక రుసుము రూ.15లు. ప్రతి క్షురకుడు భక్తుల నుంచి రూ.20లు బలవంతంగా వసూలు చేస్తున్నారు. భక్తుల్లో ఎవరైనా అమాయకుడిగా కనిపిస్తే రూ.50 వరకు ఇవ్వాలని అర్థిస్తున్నారు. వ్యవస్థను మెరుగు పరచాలన్న ఉద్దేశం దేవాదాయ శాఖకు ఉన్నట్టు కనిపించడం లేదు. కాగా అన్న ప్రసాదం నిర్వహణ మాత్రం అద్భుతం గా ఉంది.
- పి.వి. నరసింహారావు, రాజమండ్రి
వరుస ప్రమాదాలతో ఇక్కట్లు
విశాఖ నగర శివార్లలో జవహర్‌లాల్ నెహ్రూ స్మారక సిటీలలో ఉన్న వివిధ కంపెనీలలో సంభవిస్తున్న వరుస ప్రమాదాలు పరిసర గ్రామాల ప్రజలను, కార్మికులను బెంబేలెత్తిస్తున్నాయ. ఈ ప్రమాదాలపై అధికార యం త్రాంగం పటిష్టమైన విచారణ జరిపి భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చూడాలి. ఇప్పటి వరకు జరిగిన 15 ప్రమాదాలలో 30 మంది కార్మికులు మృతి చెందగా, వందమంది శాశ్వత వికలాంగులయ్యారు. రసాయన చర్యల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతుండగా, ఈ పరిశ్రమల స్థాపన సమయంలో కనీస భద్రాతా ఏర్పాట్లు చేయలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయ. రసాయనాల వద్ద పనిచేసే కార్మికులకు భద్రత కల్పించాలి. లోపభూయష్టంగా ఉన్న కర్మాగారాల లైసెన్స్‌లను రద్దు చేయాలి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
పుష్కరాలు ఘనంగా జరపాలి
కృష్ణా పుష్కరాలు ఈ ఏడాది ఆగస్టులో జరుపనున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. వీటిని అత్యంత వైభవంగా జరపాలి. ఎలాంటి అవకతవకలు, ప్రమాదాలు జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గత గోదావరి పుష్కరాల మాదిరిగా ఘనంగా కృష్ణా పుష్కరాలను జరపాలి.
-ప్రపుల్ల చంద్ర, ధర్మవరం
కొండను తవ్వి...
నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కి చెందిన రహస్య పత్రా లు బయటకు వచ్చాయ. కొండను తవ్వి ఎలుకని పట్టిన ట్టు ఆయన 1945 ఆగుస్టు 18న విమాన ప్రమాదంలో మరణించినట్టు మరొకసారి ధ్రువపడింది. ఈ లోగా మే ధావులూ, పాత్రికేయులూ, వివిధ టివి ఛానళ్లవారు నెహ్రూను ఆడిపోసుకున్నారు. బోస్ తిరిగి వస్తే నెహ్రూ పదవికి గండమని భయపడిపోయ రాకుండా అడ్డుకు న్నారని పత్రికల్లో కథనాలు ప్రచురితమ య్యాయ. ఈ తొందరపాటు రాతలూ, రాద్ధాంతాలూ పిల్లలపై ఎటువం టి ప్రభావం చూపుతాయో గమనించారా?
- సుగుణా మహీధర్, ఏలూరు
పేద ప్రజల బడ్జెట్ రావాలి
తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్‌లో పేద ప్రజలను దృష్టిలో ఉంచుకోవాలి. వృధాగా పడివున్న గతంలో ప్రకటించిన సంక్షేమ పథకాల స్థానే కొత్త పథకాలను ప్రకటించి అమలు చేయాలి. పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి బడ్జెట్‌లో ప్రాధాన్యతనివ్వాలి. ఇందుకోసం తగినన్ని నిధులు కేటాయంచాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై నిరుపేద లబ్దిదారులకు పూర్తి అవగాహన కల్పించేలా చైతన్య కార్యక్రమాలను రూపొందించాలి. పథకాల వివరాలను వారికి పూర్తిగా తెలియజేయాలి.
- ఈసునూరి వెంకటేశ్వర్లు, నెక్కొండ