సంపాదకీయం

మాట మార్చిన మోదీ..!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశానికంతటికీ వర్తించగల ‘జాతీయ పౌర సంకలనం’- నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్- ఎన్‌ఆర్‌సి- గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశ వ్యవహారాల మంత్రి అమిత్‌షా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం అంతుపట్టని వ్యవహారం!! ఈ వైరుధ్యం ప్రస్ఫుటించడంవల్ల ‘జాతీయ పౌర సంకలనం’ పట్ల వ్యతిరేకతను వెళ్లగక్కుతున్న విచ్ఛిన్నశక్తులు మరింత పేట్రేగిపోయే ప్రమాదం ఏర్పడింది. ‘పౌర సంకలనం’ రూపొందడంవల్ల అంతర్గత భద్రత మరింత పెరుగుతుంది. దేశ పౌరులు ఎవ్వరో, దేశంలోకి విదేశాలనుంచి చొఱబడి తిష్ఠవేసిన వారెవ్వరో తెలుసుకొనడానికి ఎంతోకొంత వీలవుతుంది. ‘‘ఎంతో కొంత’’అనడం ఎందుకంటె, ‘‘దశాబ్దులుగా మన దేశంలోకి దుర్బుద్ధితో అక్రమంగా చొఱబడిపోయిన లక్షల మంది విదేశీయ దుర్జనులలో అత్యధికులు ఇదివరకే భారతీయ పౌరులుగా చెలామణి అవుతున్నారు. రకరకాల అక్రమ పద్ధతుల ద్వారా ఈ విదేశీయ దుర్జనులు మన దేశం పౌరసత్వం పొందగలిగారన్నది ప్రచారమైన వాస్తవం. కానీ ఈ వాస్తవాన్ని ‘‘బ్రహ్మదేవుడు’’కూడ ధ్రువపరచలేడు. పదేళ్ల క్రితమే, పాతికేళ్ల క్రితమే, ఇంకా ఎక్కువ ఏళ్లక్రితమే, అక్రమ పద్ధతుల ద్వారా మన దేశం పౌరసత్వం సంపాదించగలిగిన విదేశీయ దుర్జనులు స్వజాతీయ సజ్జనులుగా చెలామణి కాగలుగుతున్నారన్నది కూడ ఇప్పుడు ధ్రువపరచలేని వాస్తవం!! ఈ విదేశీయులను స్వదేశీయులుగా చెలామణి చేయించగలిగినవారు కొందరు రాజకీయవేత్తలు, లంచగొండి అధికారులు ఉద్యోగులు, దళారీలు!! విదేశీయులకు ‘చౌక ధరల నిత్యావసరాల సరఫరా పత్రాల’- రేషన్ కార్డులు-ను ఇప్పించడం, వారిని భారతీయ ‘మత ప్రదాత’- వోటర్-లుగా నమోదు చేయించడం, వివిధ ప్రభుత్వ సహాయ సంక్షేమ పథకాల ప్రయోజనాలను ఈ నకిలీ పౌరులకు లభింపచేయడం ఈ ‘చెలామణి’లోని కొన్ని అంశాలు మాత్రమే!! చివరికి ‘ఆధార్’ గుర్తింపు పత్రాలను సైతం ఈ విదేశీయులకు - భారతీయులుగా చెలామణి అవుతున్నవారికి, చెలామణి కావడానికి యత్నిస్తున్నవారికి- కట్టబెట్టే సఫల ప్రయత్నాలు, విఫల ప్రయత్నాలు జరిగాయి. చివరికి భారతీయ స్వరూపంకంటె భిన్నమైన స్వరూపం కలిగిన చైనా వారికి సైతం మన ‘ఆధార్’ గుర్తింపు పత్రాలు లభించడం అక్రమాలకు పరాకాష్ఠ. 2013లో మన దేశంలోకి చొఱబడి మణిపూర్ ప్రాంతంలోను తరువాత ఢిల్లీలోను తిష్ఠవేసిన ఛా ఎర్లీపెంగ్ అనే చైనీయుడి ఉదంతం ఒక ఉదాహరణ మాత్రమే! భారతీయ యువతిని పెళ్లిచేసుకోగలిగిన ఈ ‘్ఛ’ మణిపూర్‌లో స్థిరపడి ‘్భరతీయ ప్రయాణ అనుమతి పత్రం’- పాస్‌పోర్ట్- పొందగలిగాడు. ఆ తరువాత ఢిల్లీలోని ‘ద్వారక’ ప్రాంతం చిరునామాతో ‘ఆధార్’ గుర్తింపు పత్రాన్ని సైతం పొందాడు. ఐదేళ్ల తరువాత ఇతగాడిని 2018 సెప్టెంబర్‌లో ఢిల్లీ పోలీసులు పసికట్టి పట్టుకోవడం వేఱుకథ. పట్టుబడని ఇలాంటి ‘్ఛ’లు, ‘్ఛ’లు దేశంలో ఎంతమంది ఉన్నారో?? బర్మానుంచి వచ్చిన ‘రోహింగియా’ అక్రమ ప్రవేశకులలో చాలామందికి ఇలా ‘్భరతీయ పౌరసత్వం’ నిర్ధారణ అవసరమైన ‘పత్రాలు’ ఆధారాలు ఏర్పడి ఉండడం నడుస్తున్న చరిత్ర...
పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, పర్షియా సింధుశాఖ ప్రాంత దేశాలనుంచి, ఆఫ్రికానుంచి యాత్రికులుగా, వ్యాపారులుగా మన ‘ప్రవేశ అనుమతి పత్రాల’- ‘వీసా’ల-ను పొంది మన దేశానికి వస్తున్న వేల మంది ‘వీసా’ గడువు ముగిసిన తరువాత స్వదేశాలకు వెళ్లలేదు, మన జనాభాలోకి కలిసిపోతున్నారు. హైదరాబాదులోనే దాదాపు మూడువేల మంది ఇలాంటి పాకిస్తానీలు నివసిస్తుండినట్టు పదేళ్లక్రితం ప్రచారమైంది! ఈ పదేళ్లలో మరెంత వచ్చి చేరారో మరి!! ఇలా వచ్చిన బంగ్లాదేశీయ అక్రమ ప్రవేశకులవల్ల అస్సాం, పశ్చిమ బెంగాల్ జనాభా ‘మత నిష్పత్తులు’ మారిపోవడం బహిరంగ రహస్యం. విదేశీయ అక్రమ ప్రవేశకులవల్ల అంతర్గత భద్రతకు ప్రమాదం ఏర్పడిందన్నది ప్రభుత్వం పదేపదే చెబుతున్నమాట! బర్మా, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చి స్థిరపడిన అక్రమ ప్రవేశకులలో వేలాది జిహాదీ బీభత్సకారులున్నారు. ఇలాంటి ‘జిహాదీ’ల వల్ల అస్సాంలోను బెంగాల్‌లోను, ఇతర ప్రాంతాలలోను బీభత్స కలాపాలు విస్తరించాయి. ముంబయి, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ వంటి చోట్ల పట్టుబడిన అక్రమ ప్రవేశకులకు ‘జిహాదీ’ బీభత్స ముఠాలతో సంబంధాలున్నట్టు అనేకసార్లు ధ్రువపడింది. పాకిస్తాన్ ప్రభుత్వం నడిపిస్తున్న జిహాదీ ముఠాలు మాత్రమేకాక ‘ఇరాక్ సిరియా ఇస్లాం మత రాజ్యం’- ఐసిస్- జిహాదీ ముఠాకు చెందిన బీభత్సకారులు సైతం ఈ అక్రమ ప్రవేశకులలో ఉన్నట్టు ధ్రువపడింది!! అస్సాంలో వందలకొలదీ హిందూ బాలికలను బంగ్లాదేశీయ ‘జిహాదీ’లు లైంగిక బీభత్సకాండకు బలిచేశారు, అపహరించుకొని పోయారు! అనేక జిల్లాలో అక్రమ ప్రవేశకుల సంఖ్య పెరిగిపోయింది. కరీంగంజ్ వంటి చోట్ల ఈ విదేశీయులే అధిక సంఖ్యలో ఉన్నట్టు కూడ వెల్లడైంది. ‘కల్పనాడే’ అన్న తొమ్మిదవ తరగతి విద్యార్థినిని కరీంగంజ్ జిల్లాలో బంగ్లాదేయ జిహాదీలు లైంగిక బీభత్సానికి బలిచేసి, హత్యచేసిన భయంకర ఘటన 2003లో ప్రచారమైంది. ఆ నేపథ్యంలో ‘జాతీయ మహిళల హక్కుల సంఘం’వారు అస్సాంలో విస్తృతంగా పర్యటించి వెల్లడించిన ‘లైంగిక బీభత్సకాండ’ వివరాలు దేశవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టించడం చరిత్ర...
అస్సాంలోని విదేశీయులను గుర్తించి బయటికి పంపించడంలో దశాబ్దులపాటు చట్టాలు, ప్రభుత్వాలు విఫలమయ్యాయి. సర్వోన్నత న్యాయస్థానం వారి ఆదేశంతో అస్సాంలో ‘జాతీయ పౌర సంకలనం’ రూపొందడానికి ఇదంతా నేపథ్యం. ఈ ‘పౌర సంకలనం’ ప్రాతిపదికగా అస్సాంలో పంతొమ్మిది లక్షల మంది విదేశీయులు ఉన్నట్టు ధ్రువపడింది. బంగ్లాదేశ్‌నుంచి కోటిన్నర మంది బెంగాల్, అస్సాం, ఈశాన్య ప్రాంతాలలోకి అక్రమంగా చొఱబడినట్టు వివిధ సమయాలలో కేంద్ర ప్రభుత్వమే ధ్రువీకరించింది. అందువల్ల ‘కొండ’ను తవ్వి ‘తొండ’ను పట్టినట్టయింది. ‘ఏమయినప్పటికీ విదేశీయ అక్రమ ప్రవేశకులను గుర్తించడానికి ‘జాతీయ పౌర సంకలనం’వల్ల ‘ఎంతోకొంత’ వీలు కలుగుతోందన్నది సర్వోన్నత న్యాయస్థానం సైతం అంగీకరించిన వాస్తవం! అందువల్ల సర్వోన్నత న్యాయస్థాన నిర్దేశిత ‘జాతీయ పౌర సంకలన’ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నవారు న్యాయ ధిక్కారానికి రాజ్యాంగ ధిక్కారానికి పాల్పడినట్టయింది!! ‘అస్సాం’ ప్రాంతానికి వర్తించిన ‘పౌర సంకలన’ ప్రక్రియ దేశమంటికీ వర్తించాలన్నదే ఈ దేశ పౌరుల ఆకాంక్ష! ఈ దేశపు నిజమైన పౌరులెవ్వరన్నది నిగ్గుతేలడం పట్ల నిజమైన పౌరులకు ఎందుకు భయం? భయపడుతున్నవారు, ‘పౌర సంకలనం’ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నవారు అక్రమ ప్రవేశకులు మాత్రమే! ఈ అక్రమ ప్రవేశకులలో లక్షల మందిని ఇదివరకే ‘మతప్రదాత’- వోటర్-ల జాబితాకు ఎక్కించిన రాజకీయవేత్తలు, రాజకీయ దళారీలు కూడ ‘పౌర సంకలనం’ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల దేశం మొత్తానికి వర్తించే విధంగా ‘జాతీయ పౌర సంకలనం’రూపొందించే యోచన తమ ప్రభుత్వానికి లేదని ప్రధానమంత్రి ప్రకటించడం నిజమైన భారతీయ పౌరులకు విస్మయం కలిగిస్తున్న విపరిణామం... దేశమంతటికీ వర్తించే విధంగా దేశవ్యాప్త ‘జాతీయ పౌర సంకలనాన్ని’ రూపొందిస్తున్నట్టు దేశ వ్యవహారమంత్రి నవంబర్ 20వ తేదీన రాజ్యసభలో ప్రకటించాడు. 2024నాటికి ఈ ‘సంకలనం’ రూపొందనున్నట్టు కూడ ప్రభుత్వం ఆ తరువాత ప్రకటించింది. ఇదంతా ప్రధానమంత్రి ఆమోదంతోనే జరిగింది! మరి నరేంద్ర మోదీ మాట మార్చినట్టు కాలేదా??
మంగళవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ‘జాతీయ జనగణన’కు కొత్త కార్యక్రమాన్ని ఆమోదించింది... అలాగే కొత్తగా ‘జాతీయ జనాభా సంకలనం’కూడ రూపొందిస్తారట! ఈ ‘జాతీయ జనాభా సంకలనం’- నేషనల్ పాపులేషన్ రిజిస్టర్- ఎన్‌పిఆర్-ను వ్యితిరేకించనివారు ‘జాతీయ పౌర సంకలనాన్ని’ మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకని హింసాకాండను జరిపిస్తున్నారు?? ప్రధాని ‘ప్రకటన’ ఈ హింసాకాండ ముందు తల వంచినట్టు కాలేదా??