సంపాదకీయం
‘మత కూటమి’ దుశ్చర్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జమ్మూకశ్మీర్ గురించి చర్చించడానికై ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేయాలని ‘ఇస్లామీ సహకార సమాఖ్య’- ‘ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్’- ఓఐసి- దేశాలు నిర్ణయించడం మతోన్మాదం ఉద్ధృతవౌతోందనడానికి మరో నిదర్శనం... మన దేశపు అంతర్గత వ్యవహారాలలో అక్రమంగా జోక్యం చేసుకొనడానికి ఈ ‘ఇస్లాం మత రాజ్యాల కూటమి’వారి మరో ప్రయత్నం!! ‘సర్వమత సమభావ ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలు’ అన్ని దేశాలలోను ఏర్పడాలన్నది ‘ఐక్యరాజ్యసమితి’వౌలిక స్ఫూర్తి! కానీ ‘ఐక్యరాజ్యసమితి’లో సభ్యత్వం ఉన్న ‘ఓఐసి’దేశాలు ఈ స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా ఇస్లామేతర మతాల పట్ల విద్వేషం ప్రాతిపదికగా పరిఢవిల్లుతున్నాయి. ఇది దశాబ్దుల అంతర్జాతీయ వైపరీత్యం! ‘ఐక్యరాజ్యసమితి’ ఏర్పడడానికి పూర్వం శతాబ్దులపాటు అంతర్జాతీయ సమాజంలో అంకురించి పెంపొందిన ‘జిహాదీ’మతోన్మాదం ‘ఓఐసి’ అస్తిత్వానికి ప్రధాన ప్రాతిపదిక! ‘మతం’మాత్రమే ప్రాతిపదికగా ఈ ఇస్లామీ దేశాల కూటమి ఏర్పడింది. ఇస్లామేతర మతాల ప్రజల పట్ల భయంకరమైన వివక్ష ‘ఓఐసి’కి చెందిన దాదాపు అన్ని దేశాలలోను కొనసాగుతోంది! ఈ భయంకర వివక్షకు స్ఫూర్తి ‘ఇస్లాం’మతం ఆరంభమైనప్పటినుంచీ కొనసాగుతున్న ‘జిహాద్’... ప్రపంచంలోని అన్ని ఇతర మతాలను ధ్వంసంచేసి, నిర్మూలించి ఇస్లాంను ఏకైక మతంగా ప్రతిష్ఠించడం ‘జిహాద్’లక్ష్యం! ఈ లక్ష్యసాధనకోసం ‘జిహాదీ’లు ఎంచుకున్న మాధ్యమం బీభత్సకాండ! ఇతర మతాల వారిని చంపడం, లైంగిక బీభత్సకాండకు బలిచేయడం, బలవంతంగా ఇస్లాంలోకి మార్చడం, స్వస్థలాల నుంచి తరిమివేయడం- జిహాదీలు క్రీస్తుశకం ఏడవ శతాబ్దినుంచి అమలుజరుపుతున్న బీభత్స వ్యూహం! ఏడవ శతాబ్దికి పూర్వం ప్రపంచంలో ఇస్లాం మతం లేదు, ఇస్లాం మతస్థులు లేరు! ఇస్లాం మతం ఆరంభమైన తరువాత ఆ ‘మతం’ సిద్ధాంతాన్ని స్వచ్ఛంగా అంగీకరించి ఆ మతంలో చేరినవారు చాలా తక్కువ మంది! అలా చేరిన వారు సాగించిన ‘జిహాద్’వల్ల అధికాధిక ఇస్లాం మతేతరులు ఇస్లాంలోకి బలవంతంగా మార్పునకు గురిఅయ్యారు. ఇలా బలవంతపు, మతం మార్పిడికి గురిఅయినవారే, అధికాధిక ‘ఇస్లాం మతస్థులు’! వివిధ దేశాలలో ‘ఇస్లాం’మతం విస్తరించిన తీరు ఇది. ఈ ‘తీరు’ను వ్యాపింపచేయడానికై పారశీక దేశంలోకి చొఱబడిన ‘జిహాదీ’లు మొత్తం దేశ ప్రజలను బలవంతంగా ఇస్లాంలోకి మార్చగలగడం ఏడవ ఎనిమిదవ శతాబ్దుల నాటి విస్మయకరమైన భయంకర విపరిణామం! ‘జిహాదీ’ల నుంచి తప్పించుకొని మన దేశంలో ఆశ్రయం పొందిన అత్యల్ప సంఖ్యలోని పారశీక మతస్థులు మాత్రమే జీవనయాత్ర సాగించగలుగుతున్నారు. అన్ని ‘మతాలు’ ఒకే ధార్మిక, ఆధ్యాత్మిక లక్ష్యంకోసం ఏర్పడినాయన్నది మన దేశంలో అనాది జీవన వాస్తవం! అందువల్ల మన దేశంలో ‘ఇస్లాం’ రాక పూర్వం, వచ్చిన తరువాత కూడ ‘ఇస్లాం’ సహా అన్ని మతాలవారు హాయిగా జీవిస్తున్నారు! కానీ ఈ సర్వమత సమభావ రాజ్యాంగ, సామాజిక, సాంస్కృతిక, జీవన వ్యవహారాన్ని ‘జిహాదీ’లు అంగీకరించలేదు, శతాబ్దులుగా అంగీకరించలేదు. మన దేశం పట్ల ‘ఓఐసి’దేశాల విధానంలో ‘విరోధభావం’ నిహితమై ఉండడానికి ఈ చరిత్ర నేపథ్యం!!
మన దేశంలో అందువల్లనే ‘ఇస్లాం’సహా అన్ని మతాలకు సమాన ప్రతిపత్తి ఉంది, సమాన అవకాశాలు, సమాన అధికారాలు, సమాన అభ్యుదయ సంక్షేమాలు ఏర్పడి ఉన్నాయి. ఈ ‘సర్వమత సమభావ’ స్ఫూర్తికి ‘జిహాదీ’లు వ్యతిరేకం! ‘ఓఐసి’ వ్యతిరేకం. మన దేశంలోని ‘ఇస్లాం’ మతస్థులు సర్వమత సమభావ వ్యవస్థలో హాయిగా జీవిస్తున్నారు. పాకిస్తాన్, అప్ఘానిస్థాన్, సౌదీ అరేబియా, ఇరాక్ వంటి దేశాలలో ‘ఇస్లామేతర మతస్థులు’ నిరంతరం జిహాదీ బీభత్సానికి బలిఅవుతున్నాయి. ఈ యాబయి ఏడు ‘ఓఐసి’దేశాలలోను ‘ఏకమత’ రాజ్యాంగ వ్యవస్థలే కొనసాగుతున్నాయి. మన దేశంలో ‘బహుళ మత’ ‘సర్వమత సమభావ’ రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడి ఉంది. ‘ఓఐసి’దేశాలు మన దేశాన్ని వౌలికంగా వ్యితిరేకించడానికి పాకిస్తాన్‌ను సమర్ధించడానికి ఇదీ కారణం! ‘జమ్మూకశ్మీర్’లో ‘‘మన ప్రభుత్వం మానవ అధికారాల’’ను ఉల్లంఘిస్తోందని ‘ఓఐసి’ఆరోపించడం సాకు మాత్రమే. రాజ్యాంగపు మూడువందల డెబ్బయ్యవ అధికరణాన్ని రద్దుచేయడం మరో సాకు!! మన దేశంలో జిహాదీల బీభత్సకాండ నిరంతరం కొనసాగాలన్నదే ‘ఓఐసి’దేశాల అసలు లక్ష్యం! శతాబ్దుల ఈ జిహాదీ బీభత్సం కారణంగానే అఖండ భారత్ విభజనకు గురిఅయింది, పాకిస్తాన్ ఏర్పడింది. పాకిస్తాన్‌గా ఏర్పడిన ప్రాంతంలో క్రీస్తుశకం 712నాటికి- అరబ్బీ బీభత్సకారుడు మహమ్మద్ బిన్ కాసిమ్ సింధు ప్రాంతంలోకి చొఱబడిన నాటికి- ఇస్లాం మతస్థులు లేరు. 1947 ఈ ప్రాంతంలో ఇస్లాం మతస్థుల సంఖ్య జనాభాలో డెబ్బయి నాలుగు శాతం కావడానికి కారణం జిహాదీ బీభత్సకాండ, మతం మార్పిడులు! ఇస్లాం మతస్థులు అధిక సంఖ్య అయిన పాకిస్తాన్‌లో ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థ ఎందుకు ఏర్పడింది? ఇస్లాం మతస్థులు అల్పసంఖ్యలో ఉన్న ‘అవశేష భారత్’లో సర్వమత సమభావ వ్యవస్థ-యథాపూర్వంగా- ఎందుకు కొనసాగ గలుగుతోంది?? అన్నవి చారిత్రక ప్రశ్నలు! ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఉన్న అధికాధిక దేశాలలో ‘ఏకమత రాజ్యాంగ వ్యవస్థ’ ఏర్పడి ఉంది! ‘ఓఐసి’ ఇలా ఏకమతోన్మాదానికి ప్రతి రూపం, మన దేశం ఇస్లాం సహా సర్వమత సమభావ చిహ్నం!! ‘ఓఐసి’మన దేశాన్ని వ్యతిరేకించడానికి ఇదీ కారణం!!
ఇండోనేసియా వంటి ఇస్లాం జనబాహుళ్య దేశాలు శతాబ్దులపాటు సర్వమత సమభావ వ్యవస్థలుగా వికసించడం చరిత్ర! కానీ ‘ఓఐసి’ ఏర్పడిన తరువాత ‘సౌదీ అరేబియా’ ప్రేరణతో ‘ఇండోనేసియా’లో సైతం ‘జిహాదీ’లు విజృంభించారు! టర్కీలో ‘ఇస్లాం’మత ప్రజలు అధిక సంఖ్యాకులు... కానీ టర్కీ ప్రభుత్వం దశాబ్దులపాటు సర్వమత ‘సమభావం’ తమ విధానంగా ప్రకటించుకొంది. క్రైస్తవ జనాభా అధిక సంఖ్యలో ఉన్న ‘ఐరోపా సమాఖ్య’లో చేరాలన్న అభిలాషను సైతం వ్యక్తం చేసింది. కానీ ఇటీవలి కాలంలో టర్కీ ప్రభుత్వం కూడ ‘ఇస్లాం’ మత రాజ్యాంగ విధానాలను అనుసరిస్తోంది! ‘జమ్మూకశ్మీర్’ విషయంలో టర్కీ మన దేశాన్ని బాహాటంగా వ్యతిరేకిస్తోంది! మలేసియాలో ఇటీవల ‘ఓఐసి’ దేశాలలోని సౌదీ అరేబియా వ్యతిరేకులు ఒక సమావేశం నిర్వహించారు. టర్కీ, ఇరాన్ దేశాలు ఈ వ్యతిరేక కూటమికి నాయకత్వం వహిస్తున్నాయి. ‘మలేసియా’ సమావేశం ఏర్పాటుచేయడం నిజానికి పాకిస్తాన్ పన్నాగం! జమ్మూకశ్మీర్ గురించి ఆ సమావేశంలో ప్రస్తావించాలన్నది పాకిస్తాన్ ఎత్తుగడ! కానీ ‘ఓఐసి’లో అంతఃకలహంవల్ల పాకిస్తాన్ ఆ సమావేశానికి వెళ్లలేదు! సౌదీ అరేబియా ప్రభుత్వం ఒత్తిడికి తల వంచిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మలేసియా సదస్సుకు వెళ్లలేదు!! అందువల్ల ‘‘అంతర్గత సమరం’’లో ఇరాన్‌పై సౌదీ అరేబియా ఆధిక్యతను సాధించినట్టయింది. ఇందుకు కృతజ్ఞతగా ‘జమ్మూకశ్మీర్’పై భారత వ్యతిరేక చర్చను నిర్వహించడానికి వీలుగా మొత్తం ‘ఓఐసి’ దేశాల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేయడానికి సౌదీ అరేబియా అంగీకరించిందట...
‘‘నోరు మాట్లాడుతూనే ఉంది, నొసులు వెక్కిరిస్తూనే ఉంది...’’అన్నట్టు సౌదీ అరేబియా ప్రభుత్వం, ఇరాన్ ప్రభుత్వం మన దేశంతో ద్వైపాక్షిక ‘మైత్రి’ని అభినయిస్తున్నాయి, ‘ఓఐసి’ద్వారా సమష్టి విద్వేషాన్ని వెళ్లగక్కుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఇప్పుడప్పుడే మార్పురాదు! ‘ఓఐసి’ దేశాలలో కూడ మన దేశంలోవలెనే ‘సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ’లు ఏర్పడినప్పుడు మాత్రమే ఆ దేశాలలో ‘విచక్షణ’ వికసించగలదు! జాత్యహంకార పూరిత వర్ణవివక్షను పాటించిన దక్షిణాఫ్రికా వంటి దేశాలలో ప్రజాస్వామ్య ‘వర్ణసమభావ వ్యవస్థ’కోసం ‘సమితి’కృషిచేసింది. ‘ఓఐసి’ దేశాలలో మత వివక్షను తొలగించి సర్వమత సమభావ వ్యవస్థను ఏర్పరచడానికి మాత్రం ‘సమితి’ పూనుకోవడం లేదు!