సంపాదకీయం

‘హరిత’ విస్తరణ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత రెండేళ్లలో మన దేశపు ‘ఆకుపచ్చదనం’ పరిమాణం ఐదువేల నూట ఎనబయి ఎనిమిది చదరపు కిలోమీటర్ల మేర పెరగడం శుభ పరిణామం... స్వచ్ఛ భారత పునర్ నిర్మాణ కార్యక్రమం వేగవంతం కావడానికి దోహదం చేస్తున్న పరిణామం ఇది! వాణిజ్య ‘ప్రపంచీకరణ’-గ్లోబలైజేషన్- అడవుల పాలిట ‘గొడ్డలి’గా మారడం గత ఇరవై ఆరేళ్ల చరిత్ర! రెండు దశాబ్దులకు పైగా అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గిపోవడానికి కారణం ‘ప్రపంచీకరణ’! అడవులను, ఆకుపచ్చని పొలాలను, అరటి తోటలను, తమలపాకుల తోటలను, చివరికి కొండలను సైతం విధ్వంసంచేసి ఆయా స్థలాలలో ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’, ‘సిమెంటు’ కట్టడాల ప్రాంగణాలను ఏర్పాటుచేయడం ప్రపంచీకరణ! ఈ ‘సిమెంటు’ కట్టడాలు విహార వినోదయాత్రా కేంద్రాలు- టూరిస్ట్ రిసార్టులు-, ‘ప్రత్యేక ఆర్థిక మండలాలు’- స్పెషల్ ఎకనామిక్ జోన్స్- సెజ్‌లు-! ప్రగతి పేరుతో పారిశ్రామిక కేంద్రీకరణ జరిగింది! ‘అభివృద్ధి’ -డెవలప్‌మెంట్- పేరుతో ‘హరిత శోభల’ను హననం చేశారు! భూమిని అభివృద్ధి చేయడమన్నది తరతరాల ‘్భరతీయ జీవన విధానం! అటవీ హరిత శోభలు కొలువుతీరడం యుగయుగాల జాతీయ ప్రస్థానం! అడవుల మధ్యలో మానవ జీవన సంస్కారాలు అంకురించడం చరిత్ర! ఋషి వాటికలు, గురుకులాలు, అధ్యయన ప్రాంగణాలు, సంస్కార పరిమళాలు, వన జనుల నివాసాలు- హరిత శోభల మధ్య అలరారడం భారతీయ సనాతన సంప్రదాయం! గిరిజనులు స్వచ్ఛ మానవీయ మూల్యాలకు, సంస్కారాలకు ప్రతీకలుగా సహస్రాబ్దుల తరబడి యుగాల తరబడి సహజ జీవనప్రస్థానం సాగించడం చరిత్ర, కృత్రిమ నాగరిక కుతంత్రాలు అంటని అడవుల ప్రాంగణాలలో విద్యాబోధన జరగడం చరిత్ర! ‘‘్భమి అభివృద్ధి’’అంటే నిజానికి ఇదంతా! అడవులలో జంతుజాలం, వృక్షజాలం మనుగడ పరస్పరం పెనవేసుకుని పరిఢవిల్లడం ఈ చరిత్ర! అసంఖ్యాక ఓషధుల నిలయమైన అడవులు మానవుల ఆరోగ్యాన్ని పరిరక్షించాయి, పెంపొందించాయి! అడవుల నుంచి స్రవించిన అమల జలాలు ఈ వైవిధ్య ఓషధుల- మందు మొక్కల- స్పర్శతో అమృత వాహినులుగా ప్రవహించడం చరిత్ర! అక్రమ వాణిజ్య భావం అంకురించని వనజనులు, వనవాసులు స్వభావ స్వచ్ఛతా రూపాలుగా భరతావని నలుచెఱగులా నడయాడడం చరిత్ర! అడవి ఇలా జాతీయ సంస్కార నందన భూమిక కావడం భారతీయుల అభివృద్ధి... భూమి అభివృద్ధి! ‘అభివృద్ధి’అన్న పదానికి అర్థంమారిపోవడం బ్రిటన్ దురాక్రమణకారులు నేర్పిన పాఠం... ప్రపంచీకరణ ఈ పాఠానికి మరింత విస్తృతి! చెట్లు, పాడి పశువులు, పంట పొలాలు, పిచ్చుకలు, ఉడుతలు నిండిన పల్లెలను చూసి నోరు విరిచి, ‘‘ఈ పల్లె అభివృద్ధి చెందలేదు, ఈ భూమి అభివృద్ధి-డెవలప్‌మెంట్- కాలేదు...’’ వ్యాఖ్యానించడం ఆధునిక కృత్రిమ నాగరిక జీవన విన్యాసం! భూమి ‘అభివృద్ధి’- డెవలప్‌మెంట్- అని అంటే చెట్లను కొట్టివేయడం, పంటలను పాడుపెట్టడం, పాడి పశువులను అమ్మివేయడం- హత్యచేయడం! పిచ్చుకలు, ఉడుతలు కనబడని ‘సిమెంటు’కట్టడాల ప్రాంగణంగా భూమిని మార్చడం... ఇదీ ‘డెవలప్‌మెంట్’!!
దశాబ్దుల తరబడి అటవీ హననానికి ఈ కృత్రిమ ‘డెవలప్‌మెంట్’ ప్రాతిపదిక! పారిశ్రామిక ప్రగతి, పచ్చదనం పరిరక్షణ పరస్పర ‘పరిపూరకం’గాను ‘పరిపోషకం’గాను సహస్రాబ్దులపాటు మన దేశంలో వికేంద్రీకృత వ్యవస్థ విలసిల్లింది. అందువల్ల పచ్చదనం పాడుపడని రీతిలో పారిశ్రామిక ప్రగతి వికసించింది. మన మాతృభూమి పట్ల మమకారం లేని బ్రిటన్‌వారి బీభత్స పాలన సాగిన సమయంలో ఈ ‘వికేంద్రీకృత’ ప్రగతి వ్యవస్థ ధ్వంసమైపోయింది. బ్రిటన్ ప్రభుత్వం మన అడవులను ధ్వంసం చేసి, కలపను తరలించుకొనిపోయింది! ఈ అటవీ విధ్వంసానికి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో పరాకాష్ఠ ఏర్పడింది. గాంధీ మహాత్ముని స్వదేశీయ ఉద్యమ కార్యకర్తలు ఈ ‘‘చెట్లను నరికివేసే కార్యక్రమాన్ని’’ ప్రతిఘటించడం చరిత్ర! బ్రిటన్ ప్రేరిత వ్యాపారులు అడవులలో చెట్లను నరకి వేయిస్తున్న సమయంలో ‘కార్యకర్తలు’ ప్రతిఘటించడం, సత్యాగ్రహం చేయడం చరిత్ర... ఈ చరిత్ర బ్రిటన్ విముక్త భారత్‌లో కూడ కొనసాగింది! చెట్ల నరికివేతను వ్యతిరేకిస్తూ ‘చిప్‌కో’ఉద్యమం దశాబ్దుల తరబడి కొనసాగడం చరిత్ర! సుందర్‌లాల్ బహుగుణ వంటి ‘హరిత పరిరక్షణ’ ఉద్యమ నేతల ఆధ్వర్యవంలో కార్యకర్తలు చెట్లను కౌగిలించుకొని ‘గొడ్డళ్ల’ను నిరోధించడం చరిత్ర... కానీ అన్నిటికంటె అతి పెద్ద ‘గొడ్డలి’ ఏర్పడింది. ఈ ‘ప్రపంచీకరణ’ గొడ్డలికి లక్షల చెట్లు బలి అవుతుండడం నడుస్తున్న చరిత్ర... రహదారులను వెడల్పుచేసే పేరుతో దారులకు ఇరువైపుల ఉన్న మహావృక్షాలను నిర్మూలించారు, నిర్మూలిస్తున్నారు!! 2013వ సంవత్సరంలో వెలువడిన అధికార సమాచారం ప్రకారం సగటున దేశంలో ప్రతిరోజు ‘మూడువందల ముప్పయి ఎనిమిది ఎకరాల’ అడవులు ధ్వంసమయ్యాయి.
గత ఐదేళ్లుగా అటవీ ప్రాంత విస్తీర్ణం- తగ్గిపోవడం మాని- స్థిర పడడం, పెరగడం అందువల్ల సంతోషం కలిగించగల పరిణామం! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుజరుపుతున్న హరిత పరిరక్షణ కార్యక్రమాలు ఇందుకు కారణం కావచ్చు! తెలంగాణ ప్రభుత్వం పచ్చదనం పెంచడంకోసం ‘హరితహారం’కార్యక్రమాన్ని అమలుచేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా రెండువందల కోట్లకు పైగా కొత్త మొక్కలను నాటడం లక్ష్యం... అయితే గత నాలుగేళ్లలో నాటిన కొత్త మొక్కలలో ఎన్ని మారాకులు వేసి, మానులుగా ఎదిగాయన్న వివరాలు లేవు. గత రెండేళ్లలో దేశంలోవలెనే తెలంగాణలో కూడ అడవుల పరిమాణం పెరిగిందన్నది ఆధికారిక నిర్ధారణ. రెండేళ్ల క్రితంతో పోల్చినప్పుడు రాష్ట్రంలోనూ అరవైమూడు చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగిందట! ‘హరిత వైశాల్యాన్ని’ రెండు విధాలుగా వర్గీకరించినట్టు అధికార గణాంకాలవల్ల వెల్లడైంది. మొదటిది అటవీ విస్తీర్ణం! రెండవది వృక్ష సముదాయ- ట్రీకవర్- విస్తీర్ణం. దేశంలో గత రెండేళ్లలో మూడువేల తొమ్మిది వందల డెబ్బయ్యారు చదరపు కిలోమీటర్ల మేర అడవుల విస్తీర్ణం పెరిగిందట. వృక్ష సముదాయ విస్తీర్ణం పనె్నండు వందల పనె్నండు చదరపు కిలోమీటర్ల మేర పెరిగిందట! అటవీ పరిమాణం, వృక్ష సమూహ విస్తీర్ణ పరిమాణం కలసి ‘ఆకుపచ్చదనం పరిమాణం’-గ్రీన్‌కవర్-గా నిర్ధారిస్తున్నారు. రహదారుల పక్కన, నగరాలలోను పట్టణాలలోను పల్లెలలోను పెరిగిన చెట్లను ‘వృక్ష సమూహం’గా గుర్తిస్తున్నారట! తెలంగాణలో నూట అరవై మూడు చదరపు కిలోమీటర్ల మేర అడవుల విస్తీర్ణం పెరిగినప్పటికీ, నూట యాబయి ఐదు చదరపు కిలోమీటర్ల ‘వృక్ష సమూహం’ ఈ రెండేళ్లలో నష్టమైపోయిందట! రహదారుల వెడల్పు పేరుతో విచ్చలవిడిగా చెట్లను నరికివేయడం ఇందుకు కారణం కావచ్చు! ఈ చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా తెలంగాణ రాజధాని ప్రాంతంలోను, వివిధ పట్టణాలలోను నిరసనలు చెలరేగుతున్నాయి. ప్రభుత్వం ప్రారంభించిన ‘హరిత హారం’ ఫలితాలు ఇంకా ప్రస్ఫుటించడం లేదన్నది స్పష్టం. ఆంధ్రప్రదేశ్‌లో గత రెండేళ్లలో తొమ్మిది వందల తొంబయి చదరపు కిలోమీటర్లమేర అటవీ విస్తీర్ణం పెరగడం ముదావహం.
దేశంలోని మొత్తం భూమిలో కనీసం మూడవ వంతు అంటే ‘ముప్పయినాలుగు శాతం’ అడవులు పెరగాలన్నది ఆదర్శం! కానీ ఈ లక్ష్యం ఎప్పటికి నెరవేరుతుందన్నది సమాధానం లేని ప్రశ్న. దేశంలో ప్రస్తుతం దాదాపు ఇరవై రెండు శాతం భూభాగం మాత్రమే ‘అడవి’గా ఏర్పడి ఉంది... తెలంగాణలో అటవీ విస్తీర్ణం దాదాపు పద్దెనిమిదిన్నర శాతమని, ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు పద్దెనిమిది శాతమని కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన అధికార నివేదికలో నిర్ధారించారు. 2029 నాటికి రాష్ట్రం విస్తీర్ణంలో యాబయి శాతం అటవీ భూమి కాగలదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో నిర్ధారించింది. ఈ లక్ష్యం నెరవేరుతుందా??