సంపాదకీయం
‘పట్టా’లకు పగుళ్లు..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రైళ్లను ప్రభుత్వేతర వాణిజ్య సంస్థలకు అప్పగించే కార్యక్రమం పుంజుకొంటోంది. ప్రభుత్వేతర సంస్థలకు ప్రభుత్వ సంస్థలను సేవలను అప్పగించరాదని వివిధ స్వదేశీయ స్వచ్ఛంద సంస్థలు, కార్మిక సంస్థలు, వ్యవసాయ సంస్థలు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తుండడం ఇందుకు విచిత్రమైన నేపథ్యం. ‘ప్రపంచీకరణ’ ముదురుతున్నకొద్దీ మన దేశపు ‘‘స్థూల జాతీయ ఉత్పత్తి’’- గ్రాస్ డొమస్టిక్ ప్రాడక్ట్- జిడిపి- పెరుగుదల మందగించి పోతోందన్నది ధ్రువపడిన వాస్తవం. ‘‘తొమ్మిది శాతం’’ సాలుసరి పెరుగుదల నుంచి ఐదు శాతానికి ‘జిడిపి’ అభివృద్ధి దిగజారడం, ‘ప్రపంచీకరణ’ ప్రభావం. ‘ప్రభుత్వరంగం’ పతనమైపోతుండడం అదృశ్యం కావడానికి రంగం సిద్ధంకావడం ఇరవై ఏళ్లుగా నడుస్తున్న ‘వాణిజ్య విలాసం’. ఈ ‘విలాసం’- ఫ్యాషన్- గతంలో కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానం... ప్రస్తుతం ‘్భరతీయ జనతాపార్టీ’ నాయకత్వంలోని ప్రభుత్వం కూడ చిత్తశుద్ధితో కాంగ్రెస్ ‘కాలం’నాటి దివాలాకోరు ఆర్థిక విధానాన్ని చిత్తశుద్ధితో అనుసరిస్తోంది. ‘జిడిపి’ మందగమనానికి, ప్రచారం అవుతున్న ‘తథాకథిత’-సోకాల్డ్- ఆర్థిక మాంద్యానికి ‘‘మన్‌మోహన్‌సింగ్ రూపకల్పన చేసి అమలుజరిపి ప్రస్తుత ప్రభుత్వం నెత్తికెత్తిన’’ ఈ ప్రపంచీకరణ విధానం కారణం. ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ వాణిజ్య భాగస్వామ్యపు ‘వాటా’లను అమ్మిపారేయడం ఈ ‘ప్రపంచీకరణ’ విధానం! ఈ అమ్మకాలకు, ఈ ప్రభుత్వ ఆస్తుల విక్రయాలకు ‘‘పెట్టుబడుల ఉపసంహరణ’’- డిస్ ఇనె్వస్ట్‌మెంట్- అన్నది ‘ప్రపంచీకరణకర్తలు’ పెట్టిన ముద్దు పేరు, గౌరవప్రదమైన నామధేయం. ఇలా ప్రభుత్వపు ‘వాటా’లను, ఆస్తులను అమ్మగా వచ్చిన సొమ్మును ‘ప్రత్యేక నిధి’గా పెట్టుబడుల నిధి- కాపిటల్ ఫండ్-గా ఏర్పాటుచేసి ఉండవచ్చు! అలా ఏర్పాటుచేసిన దాఖలా లేదు. వివిధ ప్రభుత్వ వాణిజ్య సంస్థలను, వివిధ సంస్థలలోని ప్రభుత్వపు ‘వాటా’లను అమ్మగా వచ్చిన ‘సొమ్ము’ను వార్షిక ఆదాయంగా జమకట్టుకొని ఏ సంవత్సరానికా సంవత్సరం ఖర్చుపెట్టేస్తున్నారు. ‘జిడిపి’ పెరుగుదల పాతాళ పతనం అవుతుండడానికి ఇది ప్రధాన కారణం! ఈ ‘అమ్మకాల’ విధానం మొదలైన తరువాత దాదాపు ప్రతి ప్రభుత్వరంగ సంస్థ కూడ నష్టాలలో నడుస్తున్నట్టు ప్రచారం అవుతోంది. అందువల్ల రైళ్ల సేవలను కూడ అమ్మిపారేయాలన్న బుద్ధి ప్రభుత్వానికి పుట్టింది. రైళ్లలో అనేక సేవలను ఇదివరకే ప్రభుత్వేతరుల పాలుచేశారు. ఇప్పుడు రైళ్లను నడిపే కార్యక్రమాన్ని కూడ ప్రభుత్వేతర సంస్థలకు ‘‘ఈనగాచి నక్కలపాలు చేసినట్టు’’గా, ధారాదత్తం చేస్తున్నారు...
భారతీయ ‘రైలు మార్గాలు’- ఇండియన్ రైల్వేస్- దేశంలో అనాదిగా ఏర్పడి ఉన్న ‘రాకపోకల’ అనుసంధానానికి ఆధునిక రూపాలు. జాతీయ మహాపథాలు- నేషనల్ హైవేస్- మన దేశంలో దక్షిణంనుంచి ఉత్తరానికి, పడమర నుంచి తూర్పునకు విస్తరించి ఉండడం సహస్రాబ్దుల చరిత్ర. ఈ ‘మహాపథాల’వెంట వాణిజ్య శకటాలు, రాజ్యాంగ రథాలు, తీర్థయాత్రలు కొనసాగడం తరతరాల జాతీయ సమైక్య అనుసంధానం! బ్రిటన్ దురాక్రమణ సమయంలో వేగం పెరగడం బ్రిటన్‌వారి ఘనత కాదు. కాలక్రమంలో వచ్చిన పరివర్తన ప్రభావం! మెల్లమెల్లగా పయనించే ‘వృషభ శకటాలు’-ఎద్దుల బండ్లు- అమిత వేగంతో పయనించిన ‘అశ్వ శకటాలు’- గుఱ్ఱాలను పూన్చిన రథాలు మన రాకపోకల చరిత్రలో భాగం. ఇందుకు వందల వేల ఉదాహరణలు చరిత్రలో ఉన్నాయి. ఈ ప్రాచీన ‘జాతీయ మహాపథాల’వెంట ఫలవృక్షాలను పెంచడం, బాటల పక్కన సత్రాలను, విశ్రాంతి గృహాలను నిర్మించడం పరిపాలకులు అమలుజరిపిన సంక్షేమ పథకాలు! ‘దమ్మిడీ’ ఖర్చు చేయనవసరం లేకుండా జాతీయ మహాపథాల వెంట కాలినడకన దక్షిణపు కొసనుంచి ఉత్తర భాగాన ఉన్న మానస సరోవరం వరకు కైలాస పర్వతంవరకు అతిసామాన్య మానవులు యాత్రలుచేసిన చరిత్ర మనది... బ్రిటన్ దురాక్రమణకారులు ఈ అతి ప్రాచీన ‘మహాపథాల’నే ‘‘హైవేస్’’అన్న పేరుతో అభివృద్ధిచేశారు. వారి లక్ష్యం తమ సైనిక దళాలను ఒకచోటనుంచి మరోచోటికి, దూరదూర ప్రాంతాలకు, అతి త్వరగా తరలించడం... తద్వారా స్వదేశీయుల స్వాతంత్య్ర విప్లవాలను అణచివేయడం! దేశంలోని వ్యవసాయ ఉత్పత్తులను, ముడి సరకులను గ్రామాలనుంచి వేగవంతంగా తరలించుకొని పోవడం బ్రిటన్ ముష్కరులు జాతీయ మహాపథాలను, ఇనుప మార్గాలను- రైలుమార్గాలను అభివృద్ధిపరచడంలో నిహితమైన రెండవ లక్ష్యం!
ఏమయినప్పటికీ ఈ మహాపథాల వల్ల, రైలుమార్గాలవల్ల బ్రిటన్ ముక్త్భారత్‌లో ప్రజలకు రాకపోకల సదుపాయాలు పెరగడం నిరాకరింపజాలని నిజం. ప్రపంచ దేశాలలోని అతి పొడవైన రైలుమార్గాలలో మన రైలుమార్గం మూడవ, రెండవ స్థానాన్ని ఆక్రమించడం హర్షణీయ పరిణామం. రైళ్లలో పెట్టెల నిండా జనం కిక్కిరిసిపోవడం, తొక్కిసలాటలు, తోపులాటలు జరగడం ప్రయాణ చరిత్రలో మరపురాని స్మృతి కావచ్చు! అయినప్పటికీ ‘రైలుస్టేషను’ రైలుపట్టాలు, రైలు ప్రయాణం ఈ ‘వైపరీత్య’ బాధకు అతీతంగా దేశ భౌగోళిక సాన్నిహిత్య సాధనకు ఉపకరిస్తున్నాయి. దూర దూర ప్రాంతాల మధ్య అనుసంధానం ఈ భౌగోళిక సాన్నిహిత్యం... ‘‘మా బంధుల ఊళ్లో భోంచేసి, నోట్లో మెతుకులు వేసుకుంటూనే, నాలుగు మైళ్లు నడిచి, రైలెక్కాను. రైలు ఎక్కాను- అని వ్రాయడం తేలికే కాని, ఎక్కడం మాత్రం చాలా కష్టం! లోపలివాళ్లు ఎక్కనివ్వరు... క్రీస్తుశకం 1950వ దశకంలో రైళ్ల ప్రయాణం గురించి ‘‘దమయంతీ స్వయంవరం’’అన్న తన ‘రచన’లో కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ చెప్పిన మాటలివి. ఆయన రైలు ప్రయాణం ఇంకా ఇలా సాగింది- ‘‘రైలులో నేనెంత కష్టపడుతూ ప్రయాణం చేస్తున్నా...నిలుచోవడానికి కూడ కష్టంగాఉన్నా... నేను నిజమైన భారతీయ పౌరుణ్ణి-అన్న అహంకారంతో ప్రయాణం చేశాను. ఎందుచేతనంటే... రైల్వే బడ్జెట్టులో ఎప్పుడు కూడ రెండు కోట్లు, మూడు కోట్ల రూపాయల లాభం కనిపిస్తుంది కదా... అది జాతి యొక్క ఉచ్చస్థితికి నిదర్శనం కదా’’!!
ఇదంతా అరవై డెబ్బయి ఏళ్ల క్రితం సంగతి. ఆ రెండుమూడు కోట్ల రూపాయల వార్షిక లాభం వందల కోట్ల రూపాయలకు విస్తరించడం ‘రైల్వే’ల దశాబ్దుల సముత్కర్ష స్థితి! ‘ప్రపంచీకరణ’ 1990వ దశకంలో మొదలైంది. అప్పటినుంచి దాదాపు అన్ని ప్రభుత్వ ‘రంగ’ సంస్థలు కూడ నష్టాలతో నడవడం, నడవలేక కూలపడడం మూతపడడం మొదలైంది. ‘రైలు మార్గ’సంస్థ కూడ నష్టాల పట్టాలనెక్కింది. ‘రైలుమార్గ సంస్థ’ నిజానికి ప్రభుత్వసంస్థ, ప్రభుత్వ విభాగం! ‘ప్రపంచీకరణ’కూ ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల నష్టాలకూ మధ్యకల సంబంధం ప్రభుత్వ నిర్వాహకులకు అంతుపట్టక పోవడం ‘స్వేచ్ఛావిపణి’ మాయాజాలం! కానీ నష్టాలను నిరోధించడానికి కృషిచేయవలసిన ప్రభుత్వం ‘రైళ్ల’సేవలను అమ్మిపారేస్తోంది! ఇది ‘అంకురం’... ప్రభుత్వేతరులతో పోటీపడలేక ‘రైలు మార్గ’ ప్రభుత్వసంస్థ మూతపడడం క్రమానుగత విషవృక్ష వికాసం! ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాలలో ప్రభుత్వేతర సంస్థలు ఇదివరకే రైళ్లను నడుపుతున్నాయి, భయంకరంగా ‘్ఛర్జీ’లను పెంచేశాయి. కొత్తగా వంద మార్గాలలో నూటయాబయి రైళ్ళను నడపడాన్ని ప్రభుత్వేతర సంస్థలకు అప్పగిస్తారట... విషపు మొక్క మారాకులు వేస్తోంది! నిలబడి ప్రయాణంచేయడం ఒకప్పుడు అసౌకర్యం... కానీ ఇప్పుడు నగరాలలో ‘మెట్రో’రైళ్లలో నిలబడి ప్రయాణం చేయడం సౌకర్యమట!!