సంపాదకీయం

మిడతల దాడి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుజరాత్‌లో గత ఏడు, రాజస్థాన్‌లో నెలల తరబడి మిడతల దండు దాడి చేస్తుండడం అన్నదాతల ఆక్రందన చరిత్రలో సరికొత్త వైపరీత్యం. ఈ మిడతల గుంపు ఒకసారి పొలంపై కూర్చుండి పైకి లేచినట్టయితే కొన్ని వందల ఎకరాలలో పంట నష్టమైపోతోందని రాజస్థాన్ రైతులు వాపోతున్నారట. మన దేశానికి దూర దూర దేశాలనుంచి ధ్రువ ప్రాంతాలనుంచి లక్షల కోట్ల పక్షులు వివిధ ఋతువులలో వలస వస్తున్నాయి, ఋతువు మారగానే వెనుదిరిగి స్వస్థలాలకు వెళ్లిపోవడం అనాదిగా ఆవిష్కృతవౌతున్న దృశ్యం... ఈ దృశ్యం ఆహ్లాదకరం, ఆనందకరం!! ‘మిడతల’ దండు మాత్రం వెనుదిరిగి వెళ్లడం లేదు, వేల లక్షల ఎకరాలలో పచ్చని పంటలను నమిలి మింగేసి దేశమంతటా విస్తరిస్తోంది! శతాబ్దుల తరబడి పడమటి వైపునుంచి ఆఫ్రికానుంచి, పశ్చిమ ఆసియానుంచి ఎడారులను దాటుకొని ‘మిడతలు’ మన దేశంలో చొఱబడి పంట పొలాలను ధ్వంసం చేస్తుండడం చరిత్ర! తిండి, నీరు దొరకని ఎడారులలోకి చొఱబడిన మిడతలు అక్కడ ఉండలేక సస్యశ్యామల కోమలసీమల వైపుగా దూసుకొని రావడం సహజం! ఇది ప్రాకృతిక వైపరీత్యం. ఆరు ‘‘ఈతిబాధల’’లో ‘మిడతల దాడి’ ఒకటన్నది తరతరాల కఠోర వాస్తవం! పదకొండేళ్ల క్రితం భయంకర రీతిలో మిడతల దండు ‘ఈజిప్ట్’దేశంలోని పంటలను తినేయడం అంతర్జాతీయంగా ప్రకంపనలను సృష్టించిన ఘటన... మిడతల దండును నిరోధించడం, నిర్మూలించడం ప్రకృతి నిహితమైన వ్యవస్థ. ఈ వ్యవస్థ భగ్నం అయినప్పుడల్లా గగనంలో మైళ్లతరబడి విస్తరించే మిడతలు పంటలపై దూకడం, పాడుచేయడం పరిపాటి! ఈ మిడతలను నిరోధించే- శలభ నియంత్రణ- వ్యవస్థలో కప్పలు తదితర క్రిమికీటక భోక్తలు ప్రధాన పాత్రను పోషించాయి. కానీ పనికట్టుకొని అటవీ విధ్వంసంచేస్తున్న మానవులు ఈ వ్యవస్థను భంగపరుస్తున్నారు, ప్రాకృతిక సమతుల్యం భంగపడుతోంది. ఆఫ్రికాలోని ఇథియోపియానుంచి బయలుదేరిన మిడతల దండు పశ్చిమ ఆసియాను దాటి పాకిస్తాన్ మీదుగా మన రాజస్థాన్‌లోకి చొఱబడిపోవడం ఈ ‘‘సమతుల్యం’’ నష్టమైన ఫలితం! సంపన్న దేశాలు పారిశ్రామిక కాలుష్యాన్ని పెంచుతున్నాయి, పెరిగిన కాలుష్యంవల్ల విస్తరణవల్ల ప్రవర్ధమాన దేశాలు ప్రధానంగా నష్టపోతున్నాయి. పొరుగు దేశాలలోకి మిడతల దండు విస్తరించకుండా ప్రతి దేశం నిరోధించవలసి ఉంది. పాకిస్తాన్ కానీ పాకిస్తాన్‌కు పడమట ఉన్న దేశాలు కాని ‘మిడతల’ను నిర్మూలించే కార్యక్రమం పట్ల ధ్యాస వహించనందువల్లనే పాకిస్తాన్ సరిహద్దులను దాటిన మిడతలు రాజస్థాన్ పొలాలలోకి చొఱబడినాయి! లక్షల రైతుల ఆహారాన్ని ధ్వంసంచేశాయి!! ఈ విషయాన్ని పాకిస్తాన్ వైఫల్యాన్ని రాజస్థాన్ అధికారులు ధ్రువపరిచారు!!
రాజస్థాన్‌లోని పదమూడు జిల్లాలలోకి వారంరోజుల క్రితం చొఱబడిన ‘మిడతలు’ దాదాపు తొమ్మిది లక్షల ఎకరాలలోని పాల కంకులను, ‘సుంకు’- పువ్వు దశలో ఉన్న గింజలు-ను చప్పరించేశాయట! శ్రీ గంగానగర్ జిల్లాలోనే దాదాపు రెండు లక్షల అరవై వేల ఎకరాలలోని పప్పు ధాన్యం పంటలను, ఆవాలు, జీలకర్ర, గోధుమ పంటలను ఈ మిడతలు భోంచేశాయట! పాకిస్తాన్ సరిహద్దులకు సమీపంలోని జయసలీర్ తదితర జిల్లాలలో కూడ మిడతలు భారీగా పంటలను ధ్వంసంచేశాయి. పదిహేను రోజుల క్రితం మొదలైన ‘దాడి’ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రతి ఎకరానికి ఇరవై వేల రూపాయల చొప్పున రైతులు నష్టపోయారన్నది ధ్రువపడిన వైపరీత్యం! గత సంవత్సరం మే నెలలో పాకిస్తాన్ వైపునుంచి నీలం రంగు మేఘాల సమూహంవలె మిడతలు చొఱబడినాయట. జూలై, సెప్టెంబర్ నెలలో ‘రంగు’మారింది. గులాబీ రంగులోకి మిడతలు పంటలపై పడి పువ్వులను, గింజలను తినేశాయి. రాజస్థాన్ శలభ నియంత్రణ మండలి’ - లోకస్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్- ఎల్‌సిఓ-అధికారులు, వ్యవసాయశాఖ అధికారులు సరైన నిరోధక చర్యలను తీసుకొనలేక పోయారన్నది ఆరోపణ. పంటలపై ‘క్రిమిసంహార రసాయనాల’ను పిచ్చికారీ చేయించడం మినహా ఈ అధికారులు చేయగలిగింది లేదు! ‘మిడతలు’ ఈ ‘రసాయన సహితంగా’ పంటలను మెక్కేశాయి. అందువల్ల మిడతల నిరోధానికి, నిర్మూలనకు ప్రత్యామ్నాయ పద్ధతులను అనే్వషించవలసి ఉందన్నది రైతులు చెప్పిన మాట! ఈ మిడతల ఉత్పత్తి మన రాజస్థాన్‌కు సమీపంలోని పాకిస్తాన్ ప్రాంతంలో భారీగా జరిగిందట! ఈ ‘మిడతల’ను అక్కడికక్కడే పాకిస్తాన్ ప్రభుత్వం నిర్మూలించి ఉండాలి! మేనెల నుంచి పెద్దపెద్ద సమూహాల మిడతలు బయలుదేరి మన దేశం వైపుగా పయనించినప్పటికీ పాకిస్తాన్ అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా ఈ ఉత్పాదక కేంద్రంలనుంచి మరింత పెద్ద సంఖ్యలో మిడతలు వచ్చి పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వంతో ‘నిరోధం’, ‘నిర్మూలన’గురించి చర్చించాలన్నది రాజస్థాన్ రైతులు చేసిన నివేదన...
గుజరాత్‌లోకి, రాజస్థాన్‌లోకి అరవై ఏళ్ల క్రితం మిడతలు పెద్దఎత్తున చొఱబడి దాదాపు పదకొండు వేల ఎకరాలలోని పంటలను ధ్వంసం చేశాయట! దేశమంతటా కూడ ‘‘పంటలను మిడతలు పాడుచేయడం’’ శతాబ్దుల వ్యవసాయ స్మృతి! పక్షులను, కోతులను పంటలు పాడుచేయకుండా చప్పుడుచేసి తోలేయవచ్చు. కానీ ‘మిడతల’ను తోలడం అసంభవం. మిడతలు పంటలలో చొఱబడి మొక్కలపై తిష్ఠవేస్తాయి. అవి నేలకు దిగిన సమయంలో మాత్రమే కప్పలు వాటిని భోంచేస్తాయి. మానవ ప్రయత్నానికి అతీతమైన ప్రాకృతిక ప్రమాదాలు ‘ఈతి’బాధలు. ఈతి బాధలలో ‘మిడతల’ దాడి ప్రధానమైనది. చాలా ఎక్కువగా వర్షం కురవడం అసలు కురవకపోవడం, ఎలుకలు విస్తరించడం, మిడతలు దాడి చేయడం, చిలకలు కొరికి వేయడం- ఈ ఐదు ఈతి బాధలు. వీటికితోడు ఆరవ బాధ ప్రభుత్వం అక్రమంగా జనజీవన వ్యవహారాలలో జోక్యం చేసుకొనడం! ఈ ఆరు ఈతి బాధలు..- ‘‘అతివృష్టిః అనావృష్టిః మూషికాః శలభాః శుకాః, అత్యాసన్న రాజానః షడేతే ఈతయః స్మృతాః’’-!!
సేంద్రియ పద్ధతులలో వ్యవసాయం జరగడం యుగయుగాల చరిత్ర! ఈ చరిత్రలో కూడ పంటలను ‘మిడతలు’ఆరగించడం భాగం! కానీ సేంద్రియ పద్ధతులు మూలపడినాయి. అడవులు, ఆవులు హత్యకు గురికావడం ఇందుకు కారణం. సంప్రదాయ సిద్ధమైన ఎఱువులు కనుమరుగు కావడానికి కారణం అడవుల నిర్మూలన, గోసంతతి నిర్మూలన! ఫలితంగా కృత్రిమ రసాయన విషాలను ఎఱువులుగా, క్రిమినాశక ఔషధాలు వాడవలసి వస్తోంది! ఈ రసాయన విషాలు నిర్మూలించకూడని జీవజాలాన్ని కూడ నిర్మూలించాయి. ఫలితంగా విష క్రిమికీటకాలను ‘మింగి’పంటలను కాపాడే జీవజాలం కూడ నిర్మూలనకు గురిఅయింది! ‘మిడతలు’ మితిమీరి ‘‘దురాక్రమించడానికి’’ ఇదీ కారణం. ‘‘జన్యు పరివర్తన’’వల్ల ఏర్పడుతున్న ‘‘మహాసంకర’’- జిఎమ్- పంటల వల్ల కూడ రంగురంగుల రకాల పురుగులు, ఈగలు, మిడతలు, దోమలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ కొత్త రకం వింత కీటకాలు ‘జిఎమ్’పంటలను తినేస్తున్నాయి!- ‘బిటి’పంటను గులాబి రంగు పురుగులు ధ్వంసం చేయడం ఒక ఉదాహరణ-! అంతటితో ఆగడం లేదు, ఈ వింత క్రిములు, రంగురంగుల కీటకాలు విస్తరించి అన్ని పంటలపై దాడులు చేస్తున్నాయి. అందువల్ల సేంద్రియ వ్యవసాయాన్ని, అడవులను, ఆవులను పునరుద్ధరించాలన్నది పాలకులు, ప్రజలు నేర్వవలసిన గుణపాఠం...