సంపాదకీయం

‘బట్టమేక’ భూమికగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బట్టమేక పిట్ట- ది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్-ను పరిరక్షించడం వచ్చేవారం గుజరాత్‌లో జరుగనున్న అంతర్జాతీయ వన్యప్రాణి సదస్సునకు నేపథ్య భూమిక కావడం హర్షణీయం... వ్యవసాయ, సస్య పరిరక్షక ప్రవృత్తికి ఈ ‘బట్టమేక పక్షి’ ప్రతీక! ‘‘అతిథి దేవోభవ’’అన్న సనాతన భారత జాతీయ స్ఫూర్తితో జరుగుతున్న ఈ అంతర్జాతీయ సదస్సునకు నూట ముప్పయికి పైగా దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారన్నది కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ సోమవారం చేసిన ఆవిష్కరణ! ఐక్యరాజ్యసమితి పర్యావరణ పరిరక్షణ విభాగం ఆధ్వర్యవంలో ఈ ‘ప్రవాస సముదాయ వన్యప్రాణి పరిరక్షణ’- జంగిల్ జాన్వరోంకీ ప్రవాసీ ప్రజాతియోంకే సంరక్షణ్- సదస్సు జరుగుతోంది. ప్రధానంగా ‘వలస పక్షుల’- మైగ్రేటరీ బర్‌డ్స్-కు మన దేశం అనాదిగా ‘ఆతిథ్య ప్రాంగణం’ కావడం సనాతన భౌగోళిక వాస్తవం! ఉత్తర ధ్రువం వంటి సుదూర ప్రాంతాలనుంచి కూడ సుదీర్ఘ గగనయానం చేస్తున్న ఈ ‘ప్రవాస విహంగాలు’ మన దేశంలోని వివిధ ప్రాంతాలలోని చెఱువుల చుట్టూ, సరోవరాల చుట్టూ కొలువుతీరడం ప్రతి సంవత్సరం వివిధ ఋతువులలో పునరావృత్తం అవుతున్న దృశ్యాలు. నదీ తటాలు, సముద్ర తీరాలు ఈ ప్రవాస పక్షులకు అతిథి గృహ ప్రాంగణాలుగా మారిపోవడం సుందర సుమనోజ్ఞ ప్రాకృతిక పటలం... అమిత చలికి గురయ్యే ప్రదేశాల నుంచి, అమిత వేడిమికి బలయ్యే ప్రాంతాలనుంచి- భూమండలం నలుమూలల నుంచి- సమశీతోష్ణ మండలమైన మన దేశానికి పక్షులు వలసరావడం అనాది చరిత్ర! మన దేశానికి మాత్రమే కాదు, పక్షులు, జలచరాలు, ఇతర వన్యప్రాణులు ‘స్వభావాత్మకం’గా వివిధ ఋతువులలో ఒకచోటినుంచి మరోచోటికి వలసపోతున్నాయి. భూమి మొత్తం ఈ విహంగాలకు, జలచరాలకు, వన్యప్రాణులకు ఇల్లు- అన్న వాస్తవాన్ని, సనాతన ప్రాకృతిక ధర్మాన్ని జావడేకర్ ప్రస్తావించారు! భూమిపై జీవించే అధికారం మానవులతో సమానంగా ఇతర జీవజాలానికి కూడ ఉందన్నది శాశ్వత- సనాతన- జీవన ‘్ధ్వని’! ఈ సత్యాన్ని గుర్తించిన భారతీయుల జీవన వ్యవహారంలో ‘నితాంత అపార భూతదయ’ నిహితమై ఉండడం యుగయుగాల చరిత్ర! ఈ ‘నితాంత అపార భూతదయ’ మానవుడు మానవేతర జీవజాల పరిరక్షణ చేయడానికి దోహదం చేసింది! భారతీయులు అనాదిగా వివిధ పక్షులలోని దివ్యత్వాన్ని గురించి పక్షులను పూజించడం ఈ దేశపు సమాజ ‘విలాసం’-్ఫ్యషన్-! ప్రాణుల పట్లకల మమకారం ప్రాణులను దైవరూపాలుగా ఆరాధించడం... చిట్టి చీమతోను, పెద్ద ఏనుగుతోను, హంసతోను, నెమలితోను, చిలుకలతోను, పావురములతోను, కోకిలలతోను, చేపలతోను మానవ జీవనప్రస్థానం ముడివడి ఉండడం ప్రకృతి...!
పక్షులు మాత్రమేకాదు, సముద్రాలలోని చేపలు, తాబేళ్లు, తిమింగలాలు, మొసళ్లు, ఇతర సముద్ర చరాలు కూడ దూరదూర జల మండలాలకు, నీరు గడ్డకట్టే శీతల ప్రాంతాలనుంచి నీరుకరిగే వెచ్చని సముద్ర ప్రాంతాలకు వలసపోతూనే ఉన్నాయి. ఒక ఋతువులో ఒకవైపునకు సాగిన వలసలు మరో ఋతువులో వ్యతిరేక దిశలో జరిగి పక్షులు, ప్రాణులు తిరిగి స్వస్థలాలకు చేరుతున్నాయి. దారిని గుర్తించడంలోను తమ స్వస్థలాలను జ్ఞాపకం ఉంచుకొనడంలోను విహంగ సముదాయాలకున్న సహజ పరిజ్ఞానం ప్రకృతి నిహిత విజ్ఞానం. ఎంత దూరంగా వెళ్లినప్పటికీ పక్షులు, పిట్టలు తిరిగి ఎప్పుడో అప్పుడు మళ్లీ సొంత గూటికి చేరుతూనే ఉన్నాయి. ఇది సహజ స్వభావం- ఇన్‌స్టింక్ట్-! ఈ ‘స్వస్థల’నిబద్ధత ప్రాణులకు ఇలా సహజ ప్రవృత్తికావడం సృష్టిక్రమం! ‘విచక్షణ’కల మానవుడు ఈ ‘సహజ ప్రాకృతిక స్వభావం’నుంచి పాఠం నేర్చుకొని ‘‘ఇది నా ఇల్లు, ఇది నా దేశం, ఇది నా మాతృభూమి’’అని గ్రహిస్తున్నాడు. సహజ స్వభావానికి ‘విచక్షణ’తోడైన మానవుడు ఈ ‘మమకారం’పట్ల అప్పుడప్పుడు నిబద్ధతను సడలించుకొనడం వైపరీత్యం, అపవాదం... ‘విచక్షణ’లేదని మనం భావిస్తున్న ‘విహంగాల’కు, జల చరాలకు, వన్యప్రాణులకు మాత్రం ‘సహజ స్వభావం’ ఎప్పటికీ చెడిపోవడం లేదు. అందుకే అవి తమ మాతృ స్థలానికి నియతంగా తిరిగి వెడుతున్నాయి... ‘రోజు’ చివర కావచ్చు, ‘ఋతువు’చివర కావచ్చు...
ఇలా వస్తున్న ‘వలస పక్షుల’కు ‘‘అతిథి దేవోభవ’’అన్న సనాతన స్ఫూర్తితో ఆతిథ్యం ఇవ్వడం జావడేకర్ పునరావిష్కరించిన జీవనసూత్రం! విదేశాలలో చిత్రహింసలకు, నిర్మూలనకు, బీభత్సకాండకు, వేధింపులకు బలైన వివిధ జాతుల ప్రజలకు సహస్రాబ్దుల తరబడి మన దేశంలో శాశ్వత ఆతిథ్యం లభించడం చరిత్ర! ఈ హైందవ జాతీయ మానవీయ ఆతిథ్యం గురించి క్రీస్తుశకం పంతొమ్మిదవ శతాబ్ది చివరిలో అమెరికాలో జరిగిన సర్వమత సమావేశంలో వివేకానందస్వామి ప్రస్తావించాడు! యూదులు, పారశీకులు అలా శతాబ్దుల క్రితం మన దేశంలో ఆతిథ్యం పొందారు. మానవుల పట్ల మాత్రమేకాదు, ఇతర ప్రాణుల పట్ల కూడ మమకారం చూపడం అనాదిగా భారతీయులు ప్రకృతిలో గుర్తించిన తమ ‘అద్వైత తత్త్వాని’కి నిదర్శనం. సకల చరాచర సృష్టిపట్ల అద్వైతం పొందడం భారత జాతీయతత్త్వం! ఈ జాతీయ జీవనం జీవజాలాన్ని ప్రకృతిని రక్షించింది! సముద్రంలో కెరటాలను, భారీ ప్రాణులను చూసి జడుసుకున్న చిట్టి చేప పిల్లను ‘వైవస్వత మనువు’ రక్షించి తన ఆశ్రమంలో ఆశ్రయం కల్పించడం మహాయుగాల పూర్వంనాటి చరిత్ర! ‘పక్షి మిథునం’లోని ఒక పక్షిని చంపడాన్ని చూసిన వాల్మీకి మహర్షి హృదయం కల్లోలగ్రస్తం కావడం యుగాల పూర్వంనాటి కథ! హంసల రాయబారాలు, పర్జన్యుని దౌత్యం వంటివి ప్రకృతి పట్ల భారతీయుల మమకారం! ఈ మమకారం తగ్గినకొద్దీ పక్షులను వేటాడి చంపి తినేశారు! వన్యప్రాణులను విచక్షణ రహితంగా వధించి మాంసంతో విందులు చేసుకున్నారు. ‘ది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్’- బట్టమేక పక్షి- మాత్రమేకాదు వివిధ పక్షులు అంతరించి పోవడానికి ఇదీ కారణం!
ఒకప్పుడు మన దేశంలో అసంఖ్యాకంగా విహరించిన బృహత్ విహంగాలు ‘బట్టమేక పక్షులు’, ఎదిగిన పక్షి దాదాపు మీటర్ పొడవు పెరుగుతుందట. పదహైదునుంచి ఇరవై కిలో బరువుఉండే ఈ ‘బట్టమేక’ దాదాపు అంతరించి పోయిందన్నది దశాబ్దుల పూర్వం వ్యాపించిన భయం. ‘పద్మవిభూషణ్’గ్రహీత, ‘సుప్రసిద్ధ పక్షి జీవనవేత్త’ సలీం అలీ క్రీస్తుశకం 1980వ దశకంలో ఈ ‘బట్టమేక’ను మళ్లీ గుర్తించాడట! కర్నూలు జిల్లా నందికొట్కూరు సమీపంలోని ‘రోళ్లపాడు’వద్ద సంచరించిన ‘బట్టమేక’లను సలీం అలీ గుర్తించాడట! ఆ తరువాత ఈ ప్రాంతంలో ఏర్పడిన ‘అభయారణ్యం’లో ఈ పక్షులు సంచరిస్తున్నాయట. తెలుగు నేలపై కేవలం నూటయాబయి బట్టమేక పక్షులు మిగిలి ఉన్నాయన్నది సలీం అలీ బయటపెట్టిన వాస్తవం! అందువల్ల ఈ పక్షుల పరిరక్షణ గుజరాత్‌లో జరుగనున్న ‘వలసపక్షుల’ సదస్సుకు భూమిక కావడం ఆనందకరం. రాజస్థాన్ ప్రభుత్వం ఈ పక్షిని తమ ‘‘ప్రాంతీయ అధికారపక్షి’’గా గుర్తించి ఉందట! పంటలను పాడుచేసే క్రిమికీటకాలను భోంచేసే ‘బట్టమేక’లు వ్యవసాయ బాంధవులు! అయితే విష రసాయనాలు నిండిన ‘ఆహారం’ తింటున్న పక్షులు అకాల మరణం పాలవుతున్నాయి. ఎఱువులు, క్రిమిసంహారకాలు ఈ రసాయన విషాలు... పక్షుల పరిరక్షణ పర్యావరణ స్వచ్ఛతకు ప్రాతిపదిక! ప్రపంచంలో వలస పక్షులు విహరించే తొమ్మిది గగన మార్గాలున్నాయట... చైనానుంచి మన దేశానికి ఏకబిగిన నూటఅరవై గంటలు పయనించి వస్తున్న పక్షులు కొన్ని వారాలు ఇక్కడ నివసించి ఆ తరువాత ఆఫ్రికాలోని సోమాలియావరకూ వెడతాయన్నది జావడేకర్ చెప్పిన మాట... ఈ గగన మార్గాలు స్వచ్ఛంగా ఉండగలవా??