సంపాదకీయం

పుల్వామా స్ఫురణ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరిహద్దుల గోడ దాటు
బీభత్సం దూకువేళ,
కశ్మీర్ కంఠం చుట్టూ
ఉరి బిగించి ఉన్నవేళ..
నిగమాగమ స్వర విపంచి
‘నిప్పుల’రాగం పలికెను!
వరములిచ్చు కరములందు
శత‘శతఘ్ని’ చెలరేగెను..
గత ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మన వైమానిక దళాలు పాకిస్తాన్‌లోని ‘బాలకోట’ వద్ద నెలకొని ఉండిన బీభత్స స్థావరాలను బద్దలుకొట్టాయి. గత ఏడాది ఫిబ్రవరి పదునాలుగవ తేదీన జాయిష్ ఏ మొహమ్మద్- జెఇఎమ్- అన్న పాకిస్తానీ జిహాదీ బీభత్స ముఠాకు చెందిన ముష్కరులు జమ్మూ కశ్మీర్‌లోని ‘అవన్తీపురా’ వద్ద జరిపిన పైశాచిక హత్యాకాండ ‘బాలకోట’ వద్ద మన వైమానికులు జరిపిన సాయుధ చికిత్సకు తక్షణ నేపథ్యం! దశాబ్దుల తరబడి పాకిస్తానీ ప్రత్యక్ష, ప్రచ్ఛన్న జిహాదీలు జరిపిన భయంకర బీభత్సకాండను ఉపేక్షించిన మన ప్రభుత్వం ఇటీవలికాలంలో ‘దోషులను దండించే కార్యక్రమానికి’ శ్రీకారం చుట్టింది. బీభత్సకారులను ఇలా దండించడంలో భాగం మన సైనికులు ‘బాలకోట’ వద్ద నెలకొని ఉండిన జిహాదీల స్థావరాలను ధ్వంసం చేయడం. అవన్తీపురా జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో నెలకొని ఉంది. జమ్మూ-శ్రీనగర్ ‘మహాపథం’ హైవేలో వున్న అవన్తీపురా సమీపంలో పయనిస్తుండిన ‘కేంద్ర రిజర్వ్ పోలీసుల’ వాహనశ్రేణిపై ‘జాయిష్ ఏ మొహమ్మద్’ బీభత్సకారులు గత ఏడాది ఫిబ్రవరి పదునాలుగవ తేదీన జరిపిన దాడులలో నలభైమంది మన వీరులు అమరులయ్యారు. ఈ రాక్షస చర్యకు ఒడిగట్టిన పాకిస్తానీ జిహాదీ ముష్కరులను ఇరవై ఆరవ తేదీన మన ప్రభుత్వం శిక్షించగలిగింది. పుల్వామా -అవన్తీపురా వద్ద అసువులుబాసిన మన అమర జవానుల త్యాగనిరతికి భారతజాతి ఘటించిన ఆయుధ సుమాంజలి ఇది.. మన వీరులను మన ప్రజలను బలిగొంటున్న ‘ఆతతాయి’- టెర్రరిస్టు- పాకిస్తాన్ ప్రభుత్వ దుశ్చర్యలకు తగిన దండన ఇది. ఏడు దశాబ్దులలో పాకిస్తాన్ జిహాదీ ముష్కరులు వేలమంది సైనికులను, అనుబంధ సైనికులను, పోలీసులను, పౌరులను బలికొనడం చరిత్ర. 2015 నుంచి మన ప్రభుత్వం ఈ బీభత్స చరిత్రను నిరోధిస్తోంది.. పాకిస్తానీ జిహాదీ తండాలను ఎప్పటికప్పుడు శిక్షిస్తోంది. ఆధీనరేఖను దాటి వచ్చిన ముష్కరులను మాత్రమే కాక, పాకిస్తాన్‌లో పొంచివున్న బీభత్సపు తోడేళ్లను సైతం మట్టుబెట్టడానికి మన ప్రభుత్వం నడుం బిగించి ఉండడం గత ఐదేళ్లుగా ఆవిష్కృతవౌతున్న రక్షణ దృశ్యం.. మన ప్రభుత్వం ఇలా బీభత్స వ్యతిరేక పటిష్ఠ చర్యలను నిర్వహిస్తుండడం వల్ల అంతర్జాతీయ సమాజం కూడ పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స స్వరూపాన్ని క్రమంగా గుర్తిస్తోంది! ఈ అంతర్జాతీయ అభిశంసనను తప్పించుకొనడంలో భాగంగానే పాకిస్తాన్‌లోని లాహోర్ ప్రత్యేక న్యాయస్థానం గురువారంనాడు ‘హఫీజ్ సరుూద్’కు ఐదున్నర సంవత్సరాల కారాగృహ శిక్షను విధించింది!!
హఫీజ్ సరుూద్ ఐక్యరాజ్యసమితి నిర్థారించిన అంతర్జాతీయ బీభత్సకారుడు. ‘లష్కర్ ఏ తయ్యబా’ అన్న బీభత్సపు ముఠాను ప్రారంభించి మనదేశాన్ని ‘బద్దలు కొట్టే లక్ష్యాన్ని’’ సాధించడానికి యత్నించినవాడు! లష్కర్ ఏ తయ్యబా- ఎల్‌ఇటి- బీభత్సకాండ అంతర్జాతీయ ‘కుఖ్యాతం’ కావడంలో ఐక్యరాజ్యసమితి ఒత్తిడికి లొంగిన పాకిస్తాన్ ప్రభుత్వం ‘లష్కర్ ఏ తయ్యబా’ను నిషేధించవలసి వచ్చింది! వెంటనే హపీజ్ సరుూద్ ‘జమాత్-ఉద్-దావా’ అన్న మరో బీభత్స సంస్థను ప్రారంభించాడు! ఈ బీభత్సపు ముఠా వారే 2008 నవంబర్‌లో మన ముంబైలో భయంకర హత్యాకాండ సాగించారు! ఈ బీభత్సకాండకు నూట అరవై ఆరుమంది బలయ్యారు. వందలమంది క్షతగాత్రులయ్యారు. అప్పటినుంచి ఇప్పటివరకు మన ప్రభుత్వం పదే పదే కోరినప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం ‘హఫీజ్ సరుూద్’ అన్న ఈ పైశాచిక బీభత్సకారుడిని మనకు అప్పగించలేదు.. కనీసం తమ దేశంలో కూడ శిక్షించలేదు. ‘జమాత్ ఉద్ దావా’- జెయుడి-ను నిషేధించాలని, హఫీజ్‌ను నిర్బంధించి విచారించాలని 2008 డిసెంబర్‌లో ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. ఈ తీర్మానాన్ని అమలుజరిపినట్టు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ‘జమాత్’ను పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధించలేదని 2009 జూలైలో లాహోర్ హైకోర్టు నిర్థారించింది. ఫలితంగా గృహ నిర్బంధంలో ఉండిన హఫీజ్ సరుూద్‌ను లాహోర్ హైకోర్టు విడుదల చేసింది. అలా పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయ సమాజాన్ని వంచించింది. ఈ వంచన క్రీడ ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది!
హఫీజ్ సరుూద్‌ను గృహ నిర్బంధంలో ఉంచడం, మళ్లీ విడుదల చేయడం ఈ వంచన క్రీడలో భాగం. ఇపుడు హఫీజ్ సరుూద్‌ను పాకిస్తాన్‌లోని లాహోరు ప్రత్యేక న్యాయస్థానం రెండు అభియోగాలలో దోషిగా నిర్థారించింది. ఒక్కొక్క ‘కేసు’లో ఐదున్నర ఏళ్లు ‘జైలు’శిక్షను పదిహేను వేల రూపాయల జరిమానాను విధించింది. అయితే ఈ రెండు అభియోగాలు కూడ ముంబయిలో జిహాదీలు జరిపిన బీభత్సకాండకు సంబందించినవి కావు. బీభత్సకారులకు హఫీజ్ సరుూద్ ఆర్థిక సహాయం చేస్తున్నాడన్నది ధ్రువపడిన అభియోగాలు! ఈ రెండు శిక్షలు ఒకేసారి అనుభవించాలని న్యాయస్థానం నిర్దేశించింది కనుక సరుూద్ ఐదున్నర ఏళ్లు మాత్రమే జైలులో ఉండవలసివస్తోంది! హత్యానేరం నుంచి తప్పించుకొనడానికి వీలుగా ‘జేబు దొంగతనం’ నేరానికి శిక్షను పొందడం నేరస్థుల ఎత్తుగడ! పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఎత్తుగడకు పాలుపడింది. ముంబయి హత్యాకాండ జరిపించిన నేరానికి ఈ హఫీజ్ సరుూద్ అనే పిశాచానికి కనీసం యావజ్జీవ కారాగృహ శిక్షను విధించాలి! కానీ ఈ పెద్ద నేరం గురించి భయంకర నేరం గురించి పాకిస్తాన్ ప్రభుత్వం కాని, న్యాయస్థానాలు కాని పట్టించుకోవడంలేదు. నిజానికి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ‘ఆర్థిక కార్యాచరణ నిఘాదళం’ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ -ఎప్‌ఎటిఎఫ్- పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుపుతున్న పరిశోధన సరుూద్ వ్యతిరేక చర్యకు కారణం! పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయ జిహాదీ బీభత్స సంస్థలకు నిధులు లభించడానికి మాధ్యమంగా మారింది. సౌదీ అరేబియా తదితర దేశాలలోని ‘జిహాద్’ సమర్థక సంపన్నులు ఈ నిధులను సమకూర్చుతున్నారు. ఈ సంగతి ఎఫ్‌ఏటిఎఫ్ పరిశోధనలో ధ్రువపడింది. అందువల్ల పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఆర్థిక ఆంక్షలు విధించడానికి ‘సమితి’ పూనుకొంటోంది! ఈ ఆంక్షలను తప్పించుకొనడానికై పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం పన్నిన పన్నాగంలో భాగం హఫీజ్ సరుూకు ఈ ‘నామమాత్రపు’ శిక్ష విధించడం..
పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్సకాండకు పుల్వామా -అవన్తీపురాలో మన జవానులు బలైపోయి సరిగ్గా ఏడాది గడిచింది..
వారి త్యాగనిరతి చూసి..
ఒక కంట ఆనందాశ్రువు..
అమరుల ఎడబాటు తలచి
మరోకంట శోకజలము..
హర్షవ్యథా సంగమస్థితి
ఆవహించె భారతి మది
ఎదకందని భావాలను
శ్రుతి చేస్తూ ఉంది జాతి!!