సంపాదకీయం

బయటపడిన బ్రిటన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరోపా సమాఖ్యనుంచి నిష్క్రమించాలని బ్రిటన్ ప్రజలు నిర్ణయించడం దీర్ఘకాల ప్రభావయుతమైన చారిత్రక విపరిణామం. గురువారం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ-రెఫరెండమ్-లోప్రస్ఫుటించిన ఈ నిర్ణయానికి బ్రిటన్‌లో పెరుగుతున్న జాతీయ అస్తిత్వ ధ్యాస ప్రధాన ప్రాతిపదిక. ఐరోపా సమాఖ్య-ఇయు-విస్తృత రాజకీయ ఆర్థిక ప్రభావం తమ జాతీ య అస్తిత్వాన్ని దిగమింగేస్తోందన్న భ్రాంతికి బ్రిటన్ ప్రజలు గురి అవుతుండడం నాలుగు దశాబ్దులుగా నడుస్తున్న చరిత్ర... జాతీయతా భ్రాంతికి పరాకాష్ఠ గురువారం నాటి బ్రిటన్ జనాదేశం... ఈ జనాదేశాన్ని శిరసావహిస్తున్నట్టు గురువారం తెల్లవారుజామున ప్రకటించిన బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ పదవీ పరిత్యాగం చేయాలని నిర్ణయించడం మరో రాజకీయ విపరిణామం. రెఫరెండం ఫలితాలు కామెరాన్ పట్ల ప్రజల అవిశ్వాసానికి ప్రతీక కాదు. ఐరోపా సమాఖ్య పట్ల బ్రిటన్‌లోని అధికాధిక పౌరుల వైముఖ్యతకి మాత్రమే చిహ్నాలు. కామెరాన్ నాయకత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ ప్రభుత్వం వారు కొందరు సమాఖ్య నుండి బ్రిటన్ వైదొలగ రాదని ప్రచారం చేశారు. అంతమాత్రాన రెఫరెండం తీర్పు ప్రాతిపదికగా కామెరాన్ కాని, ప్రభుత్వం కాని వైదొలగవలసిన పనిలేదు. అలాంటి నిబంధన లేనేలేదు. రెఫరెండం ఫలితాలు తమ సమాఖ్య విధానానికి వ్యతిరేకంగా వచ్చినట్టయతే తాను పదవికి రాజీనామా చేస్తానని కామెరాన్ వోటింగ్‌కు ముందు కాని, ప్రచారం సందర్భంగా కాని ప్రకటించలేదు. అలా చేయవలసి ఉంటుందని ప్రత్యర్థులు, సమాఖ్య నుండి బ్రిటన్ విడిపోవాలని ప్రచారం చేసిన వారు సైతం కోరలేదు. నిజానికి ఈ రెఫరెండం పార్టీల విధానానికి అతీతంగా జరిగింది. అధికారపక్షంలోను, ప్రతిపక్షాలలో కూడ సమాఖ్యవాదులు సమాఖ్య వ్యతిరేకులు ఉన్నారు. అయినప్పటికీ కామెరాన్ పదవి నుండి వైదొలగాలని నిశ్చయించడం నైతికతకు అద్దం..జనాదేశం ప్రాతిపదికగా ఐరోపా సమా ఖ్య నుండి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియ పరిసమాప్తం కావడానికి దాదాపు రెండేళ్లు పట్టనుంది. తమ విధానానికి విరుద్ధమైన ఈ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో తాను ప్రభుత్వానికి సారథ్యం వహించడం కామెరాన్‌కు చిత్త క్షోభకు గురిచేసే విచిత్ర ప్రహసనం. అందువల్లనే అక్టోబర్‌లో పదవి నుంచి ఆయన వైదొలగనున్నాడు. అధికార కన్సర్వేటివ్ పార్టీ వారు ఆలోగా మరో పార్లమెంటరీ నాయకుడిని ఎన్నుకుంటారట. విషాద స్థితిని విలక్షణరీతిలో అధిగమిస్తున్న కామెరాన్ అభినందనీయుడు..
సమాఖ్యనుంచి బ్రిటన్ వైదొలగుతుండడం ఐరోపా దేశాల స్వభావంలో నిహితమై ఉన్న చారిత్రక వైరుధ్యాలకు పునరావృత్తి. ఈ వైరుధ్యాలు క్రీస్తుశకం ఇరవయ్యవ శతాబ్దిలో రెండు ఐరోపా యుద్ధాలకు దోహదం చేశాయి. ఈ ఐరోపా యుద్ధాలు ఆ తరవాత ప్రపంచ యుద్ధాలుగా ప్రచారం కావడం ఐరోపా జాతుల ఆధిపత్య దురహంకార ప్రవృత్తికి చారిత్రక సాక్ష్యం. ఐరోపాహితం ప్రపంచ హితం, ఐరోపా కష్టం ప్రపంచ కష్టం, ఐరోపా పరిగణన ప్రపంచ పరిగణన, ఐరోపా యుద్ధం ప్రపంచ యుద్ధం..’’ అన్న అతిశయం అవనీతలాన్ని అధిగమించడానికి యత్నించడం ఐదు శతాబ్దులకు పైగా నడచిన ఇతిహాస క్రమం. ఇతర దేశాలను తాము కనిపెట్టిన తరువాత మాత్రమే అవి దేశాలయ్యాయని ఆయా కనిపెట్టుడునకు గురైన ప్రజలు ప్రజలయ్యారని ఫ్రాన్స్, పోర్చుగల్, డచ్, బ్రిటన్ వంటి ఐరోపా జాతు లు చరిత్రను వ్రాసుకున్నారు. ఈ చరిత్రను తాము దురాక్రమించిన దేశాల ప్రజల బుద్ధులకు ఎక్కించారు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలగడం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను, ఐరోపా రాజ్య వ్యవస్థను దీర్ఘకాలం పాటు ప్రభావితం చేయగల పరిణామం. వైదొగడం బ్రిటన్‌కు స్వాతంత్య్రం రావడంతో సమానమని నైగెల్ ఫిరిజ్ వంటి నిష్క్రమణ-బ్రిటన్ ఎగ్జిట్-బ్రిగ్జిట్-సమర్ధకులు హర్షధ్వానాలు చేస్తున్నారు. ఈ నిష్క్రమణ వల్ల బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కుప్పకూలిపోతుందని ఐరోపా సమాఖ్య అధ్యక్షుడు డోనాల్ట్‌టస్క్ వంటి ‘సంఘటన’-బ్రిటన్ రిమైన్స్ ఇన్ ఇయు-బ్రిమైన్-సమర్థకులు భవిష్యత్ వాణిని వినిపిస్తుండగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోవడం, బంగారం ధరలు పెరిగిపోవడం వివిధ దేశాల వినిమయ ద్రవ్యాల విలువలు తగ్గిపోవడం వంటి తాత్కాలిక కృత్రిమ పరిణామాలు ఐరోపాకున్న ప్రాధాన్య భ్రాంతికి నిదర్శనాలు. ‘‘ఐరోపా ఏడుపు అవని ప్రజల ఏడుపు’’’.. అన్న అతిశయ చరిత్రకిది పునరావృత్తి.
ఈ చారిత్రక పునరావృత్తి నిష్క్రమణ ప్రహసనంలో మరో విధంగా కూడ ప్రస్ఫుటించింది. అనేకానేక దేశాలు బ్రిటన్ రాజకీయ దాస్యం నుండి విముక్తిని కోరడం అందుకోసం ఉద్యమించడం, సాధించడం క్రీస్తుశకం ఇరవయ్యవ శతాబ్ది ఆరంభం నాటి దృశ్యం. బ్రిటన్ ప్రజలు ఐరోపా సమాఖ్య ఆర్థిక దాస్యం నుండి విముక్తి కోరడం, ఉద్యమించడం, గురువారం దానిని సాధించడం ఇరవై ఒక్క శతాబ్ది ఆరంభంలో ఆవిష్కృతమైన చిత్రం...ప్రపంచ దేశాలపై అక్రమంగా ఆధిపత్యం సాధించడానికి ప్రయత్నించిన ఐరోపా దేశాలు శతాబ్దుల పాటు పరస్పరం భయంకరంగా విరోధించుకున్నాయి. 1945లో ముగిసిన యుద్ధం తరువాత పశ్చిమ ఐరోపా దేశాలన్నీ రక్షణ వ్యూహాత్మక సమైక్యతను సాధించాయి. ఇందుకు కారణం ఐరోపా ఆధిపత్యానికి సవాలుగా పరిణమించిన సోవియట్ రష్యా కమ్యూనిస్టు సామ్రాజ్యం. సోవియట్ రష్యా కమ్యూనిజాన్ని వదిలించుకున్న తరువాత మాజీ రష్యా కూటమి లోని తూర్పు ఐరోపా దేశాలు కూడ పశ్చిమ ఐరోపాతో జట్టు కట్టడం మొదలైంది. ఐరోపా సమాఖ్య అవతరణకు, 28 దేశాల ఆర్థిక రాజకీయ సంఘటనగా దాని విలాసానికి ఇదంతా నేపథ్యం. ఐరోపా సమాజం-యూరోపియన్ కమ్యూనిటీ-ఇసి- పేరుతో ఐరోపా సమాఖ్య-ఇయు- అవతరించే నాటి బ్రిటన్ అంతర్జాతీయ ప్రాధాన్యం అంతరించింది. ఒకప్పుడు రవి అస్తమించని బ్రిటన్ సామ్రాజ్యం-బ్రిటిష్ ఎంపైర్-గా విర్రవీగిన దేశం కేవలం ఐక్యరాజ్యం-యునైటెడ్ కింగ్‌డమ్-యుకె-గా మిగిలింది. 1994లో ఐరోపా సమాజం, ఐరోపా సమాఖ్యగా మారింది. ఆరు ఐరోపా దేశాలు ఆరంభించిన సమాజంలో బ్రిటన్‌కు సభ్యత్వం లేదు. ఇప్పుడు బ్రిటన్ తనంత తానుగా సమాఖ్య సభ్యత్వాన్ని వదలించుకొంది..
ఐరోపా సమాజంలో చేరడానికి 1961 నుంచి 1973 వరకు బ్రిటన్ విఫలయత్నం చేయడం ఐరోపా అంతర్గత వైరుధ్యాలకు చిహ్నం. ఛార్లెస్ డీగాల్ నాయకత్వంలోని ఫ్రాన్స్ పుష్కరం పాటు బ్రిటన్ ప్రవేశాన్ని అడ్డుకొంది. ఫ్రాన్స్, బ్రిటన్‌లు శతాబ్దుల పాటు ఆధిపత్యం కోసం పరస్పరం యుద్ధాలు చేశాయి. రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో ఇవి మిత్ర దేశాలు కావడం అపవాదం మాత్రమే. సోవియట్ యూనియన్ ప్రాబల్య విస్తరణను, ఆ తరువాత చైనా వ్యూహాత్మక దురాక్రమణను అడ్డుకొనడానికి మాత్రమే ఐరోపా దేశాలలో వాణిజ్య రాజకీయ రక్షణ వ్యూహాత్మక సమైక్యం 1945 నుంచి వికసిస్తోంది. ఇప్పుడు రష్యా భయం లేదు. 28 దేశాల ఐరోపా సమాఖ్య ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ శక్తులలో ఒకటి. అందువల్ల భయంలేని బ్రిటన్‌లో, ఐరోపాలో మళ్లీ 1945కు పూర్వపు విభేదాలు, వైరుధ్యాలు, ఆధిపత్య భావాలు పునర్ జ్వలిస్తున్నాయి. బ్రిటన్‌లోని 51.11 శాతం వోటర్లు నిష్క్రమణను కోరడానికి ప్రధాన కారణం ఈచారిత్రక స్వభావం..బ్రిటన్ ఐరోపా ప్రధాన భూమికి దూరంగా నీళ్లకు అవతల నెలకొని ఉంది. ఈ భౌగోళిక వాస్తవం గురువారం మరోసారి ధ్రువపడింది. బ్రిటన్, ఐరోపాలోని ఇతర దేశాల దృష్టిలో, ‘నీళ్లకవతలి’ దేశం...