సంపాదకీయం
‘నిర్మాణ’ వైపరీత్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన రెండువేల నాలుగువందల మతపరమైన కట్టడాల గురించి తెలంగాణ ఉన్నత న్యాయస్థానం వారు ఆందోళనను వ్యక్తంచేయడం సరికొత్త పరిణామం. అక్రమ నిర్మాణాలు అప్రతిహతంగా కొనసాగుతుండడం ఈ ఆందోళనకు నేపథ్యం. 2010లోనే దాదాపు ఆరువేల ఏడువందల అక్రమ నిర్మాణాల సంగతి బయటపడిన సంగతిని ఒక ‘ప్రజాహిత న్యాయ యాచిక’- పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్- పిల్- విచారణ సందర్భంగా ప్రధాన ఉన్నత న్యాయమూర్తి రాఘవేంద్ర సింహచౌహాన్, ఉన్నత న్యాయమూర్తి అభిషేక్‌రెడ్డి బుధవారం ప్రస్తావించారట! ఈ అక్రమ భవనాలు, కట్టడాలు, ప్రాంగణాలలో దాదాపు రెండువేల నాలుగువందలు మతపరమైనవన్నది న్యాయమూర్తులు చెప్పిన మాట! ఇంతకాలం ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేయకపోవడం పట్ల న్యాయమూర్తులు వ్యక్తం చేసిన ఆగ్రహం ప్రభుత్వ నిర్వాహకుల పట్ల ‘అభిశంసన’వంటిది. అక్రమ నిర్మాణాలను ప్రధానంగా మతం పేరుతో వెలసిన అనుమతి లేని కట్టడాలను కూల్చివేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉందా? అని న్యాయమూర్తులు ప్రశ్నించారట! ఈ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పవలసి ఉంది! ఈ పదేళ్లలో ఈ అక్రమ నిర్మాణాల సంఖ్య మరింతగా పెరిగిపోయి ఉండవచ్చునన్నది ఉన్నత న్యాయమూర్తులు చేసిన నిర్ధారణ! అక్రమంగా ఇళ్లను, భవనాలను ప్రాంగణాలను నిర్మించడం కేవలం తెలంగాణ రాజధాని నగరానికి కానీ, తెలంగాణ ప్రాంతానికి కానీ పరిమితమైన అంశం కాదు. దేశమంతటా వివిధ ప్రాంతాలలో లక్షల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు జరిగిపోతుండడం బహిరంగ రహస్యం! హరిత నియమాలను అటవీ పరిరక్షణ నిబంధనావళిని నిర్లజ్జగా ఉల్లంఘిస్తున్న ప్రభుత్వేతర సంస్థలు దేశమంతటా అక్రమ భవనాలను, పారిశ్రామిక వాటికలను, పట్టణ వాటికలను నిర్మిస్తూనే ఉన్నాయి! విహార, వినోద యాత్రలను ప్రోత్సహించే పేరుతో విలాసవంతమైన హోటళ్లను, అతిథి గృహాలను నిర్మిస్తున్న ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తున్నాయి! హరిత న్యాయ మండలులు- గ్రీన్ ట్రిబ్యునల్-, ఉన్నత న్యాయస్థానాలు, సర్వోన్నత న్యాయస్థానం నిరంతరం ఈ అక్రమాలను అభిశంసిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు మాత్రం ‘‘బధిరాంధక’’ ప్రవృత్తితో నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం నడచిపోతున్న వైపరీత్యం...
స్థిరాస్తి రంగం-రియల్ ఎస్టేట్-లో భయంకరమైన అక్రమాలు జరిగిపోతుండడం ప్రభుత్వాల ‘బధిరాంధక’ ప్రవృత్తికి నిదర్శనం! ఈ అక్రమాలను సక్రమాలుగా మార్చడం ద్వారా ప్రభుత్వాలు కొంత ఆదాయాన్ని పొందుతున్నాయి. అపరాధ శుల్కం- పెనాల్టీ-చెల్లిస్తే చాలు. అక్రమ నిర్మాణాలు సక్రమ నిర్మాణాలుగా మారిపోతున్నాయి. ఈ ప్రక్రియ పేరు ‘క్రమబద్ధీకరణ’... దాదాపు అన్ని ప్రాంతాలలోను ఈ ‘‘క్రమబద్ధీకరణ’’ ప్రహసనం కొనసాగుతోంది. ప్రభుత్వాలు విడతలు విడతలుగా క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రకటిస్తున్నాయి. అందువల్ల అనుమతి లేకుండా అంతస్థుల భవనాలను నిర్మిస్తున్నవారికి ధీమా ఏర్పడి ఉంది. అనుమతి లేకుండా నిర్మించిన భవనాలను, నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన భవనాలను ప్రభుత్వాలు కూల్చివేయబోవన్నది ఈ ధీమా! భవన ప్రాంగణంలో ఉండవలసిన ఖాళీ స్థలం ఉండకపోవడం, రెండు అంతస్థుల నిర్మాణానికి అనుమతిని పొంది నాలుగు అంతస్థులను నిర్మించడం, నాలుగు అంతస్థుల భవనానికి అనుమతి పొంది ఆరు అంతస్థులను నిర్మించడం అక్రమాలలో కొన్ని మాత్రమే! అక్రమాలను కనిపెట్టిన పురపాలక, నగరపాలక అధికార బృందంవారు ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం లేదు. అక్రమ నిర్మాతల వద్ద ‘‘అంతో ఇంతో పుచ్చుకొని’’ ఎఱగనట్టు అభినయిస్తున్నారు. ఈ అభినయ క్రీడలో అధికారులు, రాజకీయవేత్తలు, ప్రభుత్వ నిర్వాహకులు ఇతరేతర దళారీలు భాగస్వాములన్నది జరుగుతున్న ప్రచారం! ఈ ‘‘్భగస్వామ్యం’’ కారణంగానే ‘లావాసా’వంటి విదేశీయ సంస్థలు ‘మహారాష్ట్ర’లోని పూణే నగరం సమీపంలో సువిశాల పట్టణ వాటికలను నిర్మించి ‘‘విలాస, విహార, వినోదయాత్రా’’ పరిశ్రమను పెంపొందించగలిగారు, పడమటి కనుమలకు కన్నంపెట్టి భూగర్భంలో నీటి చుక్క మిగలకుండా ఎండగట్టగలిగారు! ఈ అక్రమ భాగస్వామ్యం వల్లనే నగరాలలోను, పట్టణాలలోను చెఱువులను, సరస్సులను, వాగులను పూడ్చివేసి ఇళ్లను కట్టేస్తున్నారు! చెఱువులు ‘మరవపోయి’ - పొంగి పొరలి- ప్రవహించే ప్రవాహాల దారిని నిరోధించి దురాక్రమించి ప్రవాహపథాన్ని ఇళ్ల ప్రాంగణాలుగా మార్చివేస్తున్నారు! చివరకు నదుల తీరాలను సైతం దురాక్రమించి ఇళ్లుకట్టేశారు! ఉత్తరఖండ్‌లోని కేదారనాథ్, బదరీనాథ్ తీర్థస్థల ప్రాంగణం భయంకరమైన ‘‘బురద వరదల’’తో కూరుకొని పోవడానికి ఇలా నదీ తీరాలపై వెలసిన అక్రమ నిర్మాణాలు కారణం!! భాగ్యనగరంలో వరదలు విరుచుకొని పడడానికి కారణం కూడ ఇలాంటిదే...
నిరంతరం ఈ అక్రమాలను ప్రభుత్వాలు ‘క్రమబద్ధం’చేయడం మాత్రమే కాదు ‘సరళీకరణ’పేరుతో నిర్మాణ నియమాలను పదే పదే సడలిస్తున్నారు. ప్రధానంగా నిషిద్ధ ప్రాంతాలలోను, సముద్ర తీరాలలోను, నదీ తటాలలోను ఇళ్లుకట్టుకునే ప్రక్రియ సులభమయిపోతోంది. ఫలితంగా ‘అనుమతి’తీసుకొని నిర్మిస్తున్నవారు అనుమతి పరిధిని ఉల్లంఘించి మరిన్ని నిర్మాణాలు చేయగలుగుతున్నారు. విహార ప్రాంగణాల- టూరిస్ట్ రిసార్ట్‌లు- నిర్మాణాలవల్ల సముద్ర తీరాలు కాలుష్య వలయాలుగా మారిపోతున్నాయి, చేపలు, తాబేళ్లు, తిమింగలాలు, వివిధ రకాల పక్షులు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి! అక్రమ నిర్మాణాలవల్ల హైదరాబాద్ నగరం మాత్రమేకాదు దేశంలోని దాదాపు అన్ని నగరాలు కూడ కాలుష్య వలయాలుగా మారి ఉండడం నిరాకరింపజాలని నిజం. ప్రభుత్వాలు ఎప్పుడో అప్పుడు- న్యాయస్థానాలు అదలించినప్పుడు- నడుములను బిగించి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుండడం హర్షణీయం. కానీ కూల్చిన కొన్ని నెలల తరువాత అదే స్థలాలలోను లేదా సమీప ప్రాంతాలలోను చెఱువుల స్థలాలను, నదుల తీరాలను ‘‘అక్రమ నిర్మాతలు’’ మళ్లీమళ్లీ దురాక్రమిస్తున్న దృశ్యాలు దేశమంతటా ఆవిష్కృతవౌతున్నాయి. కేరళలోని కొచ్చి నగరం శివారులోని ‘‘మరాడు’’ ప్రాంతంలో నిర్మించిన నాలుగు బృహత్ ప్రాంగణ అంతస్థుల సౌధాలను గత నెల పదకొండవ తేదీన ప్రభుత్వ అధికారులు కూల్చివేశారు. పంతొమ్మిది అంతస్థుల ఈ మహాభవనాలను విస్ఫోటన సామగ్రి ఉపయోగించి కూల్చివేయవలసి వచ్చింది, ‘సముద్ర తీర నిర్మాణ నియంత్రణ మండలి’- కోస్టల్ రెగ్యులేషన్ జోన్- సిఆర్‌జెడ్- నిబంధనలకు వ్యతిరేకంగా ‘మరాడు’ పట్టణం సమీపంలో సముద్ర తీరంలో నిర్మించిన ఈ నాలుగు అక్రమ బృహత్ సౌధాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన తరువాత కాని కేరళ ప్రభుత్వం కూల్చివేయలేదు... అయితే ఈ సముద్ర తీర ప్రాంత నిర్మాణ నియంత్రణ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం భారీగా సడలించడం గత నెల పదహైదవ తేదీన జరిగిన సమాంతర విపరిణామం... అందువల్ల ఈ సమయానికి పూర్వం నిర్మించడం అక్రమమైన చర్య ఆ తరువాత నిర్మించడంవల్ల సక్రమం కాబోతోంది! ఇదీ అక్రమ నిర్మాణ పరంపరకు ‘‘తార్కిక’’ ప్రాతిపదిక... హైదరాబాదు శివారులోని అన్నమరాయుని చెఱువు చుట్టూ ‘‘వెలసిన’’ అక్రమ నిర్మాణాలను గత ఏడాది జూలైలో ప్రభుత్వం తొలగించిందట!! కానీ ఇటీవల మళ్లీ అక్కడ ‘ఆక్రమణ’లు ‘నిర్మాణాలు’ ప్రారంభమయ్యాయట...
మన దేశంలో అనాదిగా దేవాలయాలను ప్రశాంత పరిసరాలలో ఎవరికీ ఇబ్బంది కలుగనిచోట నిర్మించారు... కానీ ఇటీవల కాలంలో స్థలాలను, అడవులను, కొండలను, రహదారులను దురాక్రమించి మత స్థలాలను నిర్మించడం కొందరికి విలాసం-్ఫ్యషన్-గా మారింది!