సంపాదకీయం

‘జిహాద్’ను నిరోధించలేమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టర్కీలోని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఉగ్రవాదులు బుధవారం సృష్టించిన భయంకర రక్తపాతం..మన హైదరాబాద్‌లో హత్యాకాండ జరుపడానికి ఇరాక్ సిరియా ఇస్లాం మతరాజ్యం-ఐఎస్‌ఐఎస్-కుట్ర చేసినట్టు వెల్లడి కావడం.., అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లు గురువారం నలబయి మంది ప్రభుత్వ దళాలను పొట్టనపెట్టుకొనడం..విడివిడిగా కనిపిస్తున్న ఈ దుర్ఘటనల మధ్య నిహితమై ఉన్న సమాన స్వభావం జిహాద్! ప్రపంచంలోని ఇతర మతాలను ధ్వంసం చేసి ఇస్లాంను ఏకైక మతంగా నిలబెట్టడం జిహాద్ లక్ష్యం. జిహాద్ నిరంతరం విస్తరిస్తోంది. జిహాద్ వికృత తాండవం చేస్తోంది. జిహాదీ కోరలు మానవులను నములుతున్న బీభత్స ధ్వనులు అంతర్జాతీయ సమాజానికి నిరంతరం వినిపిస్తున్నాయి. జిహాద్ విశ్రమించడం లేదు. జిహాదీ లక్ష్యాలను కలాపాలను అంగీకరించని ఇస్లాం మతస్థులను సైతం జిహాదీ తోడేళ్లు పొట్టనపెట్టుకుంటున్నాయి. ఇరాక్ సిరియాలను ఏకీకృతం చేసి మత సామ్రాజ్యం నిర్మించాలన్న లక్ష్యంతో రెండేళ్లక్రితం మళ్లీ మొదలైన జిహాద్, ఐఎస్‌ఐఎస్ రూపం ధరించి ఉంది. అఫ్ఘానిస్తాన్‌లో ప్రజాస్వామ్య మత సహిష్ణుతలను వ్యతిరేకిస్తున్న జిహాద్ తాలిబన్, అల్‌ఖాయిదా ముఠాల రూపమెత్తి ఉంది. భారత దేశంలో దశాబ్దుల తరబటి రక్తపాతం సృష్టిస్తున్న జిహాద్ లష్కర్ ఏ తయ్యబా, జమాత్ ఉద్ దావా, హుజి, సిమి, హిజ్‌బుల్ వంటి పేర్లతో చెలామణి అయింది. ఐఎస్‌ఐఎస్ ముఠావారు రెండేళ్లకు పైగా మనదేశంపై జిహాద్‌ను ఎక్కుపెట్టి ఉండడం అంతర్జాతీయ బీభ త్స విస్తరణలో భాగం. హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ దేవి మందిరాన్ని పేల్చివేయడానికి, దేశమంతటా రక్తపాతం సృష్టించడానికి కుట్ర చేసిన ఐదుగురు ఐఎస్‌ఐఎస్ దుండగులు బుధవారం పట్టుబడ్డారు. బంగ్లాదేశ్‌లో పద్ధెనిమిది నెలలో నలబయి ఎనిమిది మంది హిందువులను జిహాదీలు హత్య చేశారు. ఈ జిహాదీలలో ఎక్కువ మంది ఐఎస్‌ఐఎస్ వారే. అనేక దేశాలలో ఒకే జిహాదీ ముఠా హత్యాకాండ జరపడం, ఒకేదేశంలో అనేక జిహాదీ ముఠాలు రక్తపాతం సృష్టించడం, వివిధ దేశాలలో విభిన్నమైన పేర్లున్న ముఠాలు మారణకాండ జరపడం, ఇదంతా విస్తృత అనుసంధాన వ్యవస్థలో భాగం. ఈ విస్తృత అనుసంధాన వ్యవస్థ సూత్రధారి పాకిస్తాన్ ప్రభుత్వం...
ఇస్లాం, సిరియా మతరాజ్య వ్యవస్థ కూడ ఈ అనుసంధాన వ్యవస్థలో భాగమై ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వ గూఢచర్య విభాగమైన ఇంటర్ సర్సీస్ ఇంటెలిజెన్స్-ఐఎస్‌ఐఎస్-పశ్చిమ ఆసియాలోను, ఆఫ్రికాలోను పుట్టుకొచ్చిన అన్ని రకాల జిహాదీ సంస్థల గొడుగులాగ తయారైంది. ఆఫ్రికాలోని బోకొహరామ్ సంస్థకు, పశ్చిమ ఆసియాలోని హిజ్‌బొల్లా వంటి సంస్థలకు శిక్షణనిస్తున్నది పాకిస్తానీ ఐఎస్‌ఐ వారే..మాల్‌దేవులనుంచి పాకిస్తాన్‌కు వెళ్లి ఐఎస్‌ఐ బట్టీలలో జిహాదీలుగా రూపొందినవారు తిరిగి మాల్‌దీవులకు చేరుకుంటున్నారు. మాల్‌దీవులలో మతోన్మాదం పెరగడానికి భారత వ్యతిరేకత విస్తరించిపోతుండటానికి, ఇదీ కారణం. మాల్‌దీవుల వాణిజ్య రక్షణ రంగాలలో చైనా ప్రవేశానికి కూడ ఇదే కారణం. సోమాలియా కేంద్రంగా అరేబియా సముద్రంలోను, హిందూమహా సాగరంలోను అక్రమ కలాపాలను సృష్టిస్తున్న ఓడదొంగలతో తాలిబన్లను అనుసంధానం చేసింది కూడ పాకిస్తానీ ఐఎస్‌ఐ వారే! అఫ్ఘానిస్తాన్ నుండి ఉత్తర అట్లాంటిక్ రక్షణ కూటమి-నాటో-దళాలు నిష్క్రమించిన తరువాత జిహాదీలు మళ్లీ చెలరేగుతున్నారు. తాలిబన్లు, అల్‌ఖాయిదా ముష్కరులకు తోడు అఫ్ఘానిస్తాన్‌లో హక్కానీ ముఠాను కూడ ప్రవేశపెట్టింది పాకిస్తాన్ సైనిక దళాల వారేనన్నది జగమెరిగిన సత్యం. టర్కీలోని ఇస్తాంబుల్ గతంలో కాన్‌స్టాంట్‌నోపెల్ అన్న పేరుతో ప్రసిద్ధమైంది. ఆసియా ఖండం ఐరోపాతో సంగమించే చోట నెలకొని ఉన్న ఇస్తాంబుల్‌పై దాడులు జరపడం శతాబ్దుల జిహాద్‌లో భాగం. టర్కీ అమెరికా నాయకత్వంలో ఉత్తర అట్లాంటిక్ రక్షణ కూటమిలోని సభ్యదేశం. ఐరోపా సమాఖ్యలో సైతం చేరాలని పశ్చిమ ఆసియా ఉత్తరాగ్రాన నెలకొని వున్న టర్కీ దశాబ్దులుగా యత్నిస్తోంది. ఇస్లాం మత రాజ్య వ్యవస్థలున్న అనేక దేశాలకు విరుద్ధంగా టర్కీ మత సహిష్ణతను పాటిస్తున్నట్టు పేరు తెచ్చుకుంది. అందువల్లనే ఇస్లాం మతస్థులు దాదాపు తొంబయి తొమ్మిది శాతం ఉన్న టర్కీ క్రైస్తవ మతస్థులు బహుళ సంఖ్యలో ఉన్న ఐరోపా సమాఖ్య సభ్యత్వం కోరింది. జిహాదీ ఉన్మాదులైన ఐఎస్‌ఐఎస్ టర్కీపై దాడులు చేస్తుండడానికి ఇది కూడ ప్రధాన కారణం...
ఐరోపా దేశాలపై మాత్రమే కాక రష్యాపై కూడ ఐఎస్‌ఐఎస్ గత ఏడాదిగా అనేకసార్లు దాడులు చేసింది. ఐఎస్‌ఐఎస్ ఇలా బలపడడానికి విస్తరించడానికి జిహాదీ నిధులను సమకూర్చింది ఎవరు? ఏ దేశం ప్రభుత్వం ఈ జిహాదీ ముఠాకు ఆయుధాలను సమకూర్చుతోంది? లేక ఏఏ దేశాలకు చెందిన ప్రభుత్వేతర సంస్థలు ఐఎస్‌ఐఎస్‌కు అండగా నిలబడి ఉన్నాయి. ఇలాంటి ప్రశ్నలకు అంతర్జాతీయ సమాజం ఇప్పుడైనా సమాధానాలను అనే్వషించవలసి ఉంది. ఇస్తాంబుల్ విమానాశ్రయంలో కాల్పులు జరిపి బాంబులు పేల్చిన దుండగులు నలబయి ఒక్కరిని పొట్టన పెట్టుకున్నారు. దాదాపు రెండు వందల నలబయి మందిని గాయపరిచారు. పిడికెడంతమంది దాడి చేసి వందల మందిని హత్య చేయగలగడం గాయపరచగలగ డం ఆయుధ పటిమకు, దాడుల తీవ్రతకు నిదర్శ నం. అందువల్ల ఈ ఆయుధాల బట్టీలు ఎక్కడ ఉన్నా యి? శిక్షణ కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఇస్లాం మత రాజ్యవ్యవస్థలున్న దేశాల ప్రభుత్వాలు కొన్ని పైపైకి బీభత్స కాండను నిరసిస్తున్నాయి. కానీ తమ దేశాలలో జిహాదీలు పొందుతున్న శిక్షణను, వారికి సమకూరుతున్న నిధులను చూసీ చూడనట్టు వదిలేస్తున్నాయి. సౌదీ అరేబియా జిహాద్‌కు శతాబ్దులుగా సైద్ధాంతిక స్ఫూర్తి కేంద్రం, పాకిస్తాన్ కార్యాచరణ వ్యూహాలు రూపొందుతున్న దేశం. అందువల్ల ఈ రెండు దేశాలను ఒంటరిని చేయడానికి అమెరికా రష్యా ఫ్రాన్స్ బ్రిటన్ జర్మనీ వంటి సంపన్నదేశాలు ఇప్పటికైనా ఎందుకని ప్రయత్నించవు? పాకిస్తాన్ జిహాదీ కలాపాలను బాహాటంగా సమర్ధిస్తున్న చైనాను ఎందుకని నిలదీయవు? ఇస్తాంబుల్ విమానాశ్రయంపై దాడులు జరగగానే రష్యా ప్రభుత్వం మళ్లీ టర్కీ ప్రభుత్వానికి స్నేహహస్తాన్ని అందించింది. ఇది ప్రశంసనీయం. టర్కీ గత నవంబర్‌లో తమ విమానాన్ని కూల్చివేసిన తరువాత రష్యా ఆ దేశంతో తెగతెంపులు చేసుకుంది. అయితే ఉమ్మడి శత్రువైన ఐఎస్‌ఐఎస్‌తో పోరాడడానికై రష్యా టర్కీతో మళ్లీ జట్టు కట్టడం అభినందనీయం...
ఇస్తాంబుల్ నల్ల సముద్ర తీరంలో నెలకొని ఉంది. కొంత నగరం ఆసియాలోను మరికొంత నగరం ఐరోపాలోను విస్తరించి ఉండడం విచిత్రమైన భౌగోళిక స్థితి...రోము సామ్రాజ్య పతనం తరువాత బైజాంటీన్ సామ్రాజ్యానికి ఇది 1453 వరకు రాజధాని. అప్పటి వరకు అనేకసార్లు దాడి చేసిన జిహాదీలు ఆ సంవత్సరం ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు, కాన్‌స్టాంట్ నోపుల్ అన్న పేరును ఇస్తాంబుల్‌గా మార్చారు. ఇస్తాంబుల్ ఇలా మళ్లీ దాడులకు గురికావడం చారిత్రక పునరావృత్తి...ఈ చరిత్ర గతిని మార్చడానికి అంతర్జాతీయ సమాజం కృషి చేయడం ఇప్పుడు అనివార్య కర్తవ్యం కావాలి...