సంపాదకీయం

ఆరని చిచ్చు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిజ్‌బుల్ ముజాహిదీన్ జిహాదీ ముఠాకు చెందిన మొదటి ఉగ్రవాది బుర్హన్ వానీకి పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లో సంస్మరణ సభలు జరగడం విస్మయకరం కాదు. ఈ సంస్మరణ సభలను జరిపించడం ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వం తన బీభత్స స్వరూపాన్ని మరోసారి ప్రదర్శించింది. తద్వారా పాకిస్తాన్ ప్రభుత్వం మన దేశాన్ని మరోసారి కవ్వించింది. మన ప్రధాని నరేంద్ర మోదీ ఆఫ్రికా దేశాలలో జిహాదీ ఉగ్రవాదాన్ని నిరసిస్తూ ప్రసంగిస్తున్న తరుణంలోనే పాకిస్తాన్ ప్రధాన మంత్రి కార్యాలయం జమ్ము కశ్మీర్‌లో పెద్దఎత్తున పైశాచిక కాండను జరుపుతున్న బీభత్సకారులకు మద్దతు పలుకుతోంది. జమ్మూ కశ్మీర్‌లో దశాబ్దులుగా విద్రోహ కలాపాలను సాగిస్తున్న హిజ్‌బుల్ ముఠా బీభత్స సంస్థ అన్నది అంతర్జాతీయ సమాజం గుర్తించిన వాస్త వం. ఈ ముఠా నాయకుడుగా చెలామణి అయిన బుర్హన్ వానీ బీభత్సకారుడన్నది ధ్రువపడిన వాస్తవం. ఐఎస్‌ఐస్ వివిధ దేశాలలో భయానక హత్యాకాండ సాగిస్తున్న అంతర్జాతీయ జిహాదీ ముఠా. ఐఎస్‌ఐఎస్ తరహాలో హిజ్‌బుల్‌ను తీర్చిదిద్ది జమ్మూ కశ్మీర్‌ను మరోసారి బీభత్స దవానల జ్వాలలలో ముంచెత్తడం బుర్హన్ వానీ లక్ష్యమన్నది ధ్రువపడిన వాస్తవం. ఐఎస్‌ఐఎస్‌లో టెర్రరిస్టులను చేర్పిస్తున్న జాకిర్ నాయిక్‌ను ప్రస్తుతిస్తూ బుర్హన్ వానీ గతవారం సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేసి ఉన్నాడు. కశ్మీర్‌లోని హిజ్‌బుల్ ముఠా ఇలా ఐఎస్‌ఐఎస్‌తో అనుసంధానమై ఉంది. ఈ అనుసంధాన వ్యవస్థను ఏర్పాటు చేసింది పాకిస్తాన్ ప్రభుత్వ గూఢ చర్య-బీభత్స-విభాగమైన ఐఎస్‌ఐ అన్నది బహిరంగ రహస్యం! బుర్హన్ వానీని మన భద్రతా దళాలు మట్టుపెట్టిన వెంటనే కశ్మీర్ లోయను అతని మద్దతుదారులు కల్లోలగ్రస్తం చేస్తున్న తీరు ఈ అనుసంధాన వ్యవస్థకు మరో సాక్ష్యం! కశ్మీర్‌ను కల్లోల గ్రస్తం చేయాలన్నది కేవలం బుర్హన్ వానీతో ముడివడిన కుట్ర కాదు! ఏదో ఒక సాకుతో కశ్మీర్‌లో హింసాకాండను నిరంతరం ప్రజ్వలింపచేయడం జిహాదీల దీర్ఘకాల వ్యూహం, వారిని ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ ప్రభుత్వం పన్నాగం! బుర్హన్ వానీ వధకు పూర్వం కూడ జూన్ 25వ తేదీన కశ్మీర్ లోయ ప్రాంతం లో దేశ విద్రోహులు పెద్దఎత్తున హింసా ప్రదర్శన చేసారు. కశ్మీర్ పండితులకు లోయ ప్రాంతంలో పట్టణ వాటికలను నిర్మించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అదంతా నిరసన. అందువల్ల బుర్హన్ వానీని భద్రతాదళాలు మట్టుపెట్టకపోయి ఉండినప్పటికీ మరోసాకుతో హింసాకాండను జిహాదీలు రగిలించి ఉండేవారు. ఎందుకంటే ప్రస్తుతం కొనసాగుతున్న అమర్‌నాథ్ యాత్రలను రద్దు చేయించడం విద్రోహుల తక్షణ లక్ష్యం.
ఇలా భయానకమైన పరిస్థితులను కొనసాగించడానికి హింసాకాండ దోహదం చేస్తోంది. ఈ హింసాకాండకు జడిసి దేశం నలుమూలలనుంచి అమర్‌నాథుని దర్శనానికి వస్తున్న తీర్థయాత్రికులను నిరోధించడం జిహాదీల దీర్ఘకాల లక్ష్యం. ఇప్పుడు బుర్హన్ వానీ వధ తరువాత విరుచుకుని పడుతున్న వందలాది టెర్రరిస్టులు లక్షలాది ప్రజలను భయ భ్రాంతికి గురి చేస్తున్నారు. ఫలితంగా టెర్రరిస్టుల పిలుపులను పాటించి కశ్మీర్‌లోయలోని ప్రజలు దుకాణాలను మూసివేస్తున్నారు, విద్యాసంస్థలను మూసివేస్తున్నారు. రాకపోకలను రద్దు చేసుకుంటున్నారు. ఇదంతా బుర్హన్ వానీ పట్ల ప్రజలకు గల ఆదరాభిమానాలకు నిదర్శనమని లోయ ప్రాంతంలో హురియత్ తదితర జిహాదీ సమర్ధక ముఠాల వారు ప్రచారం చేస్తున్నారు, పాకిస్తాన్ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి సైనికుల అత్యాచారాల గురించి దర్యాప్తు జరిపించనున్నట్టు ప్రకటించడం టెర్రరిస్టుల ముందు రాజ్యాంగ వ్యవస్థ మోకరిల్లుతోందన్నదానికి నిదర్శనం. కశ్మీర్‌లో సైనికులు మానవ అధికారాలకు విఘాతం కలిగిస్తున్నారన్న పాకిస్తాన్ వాదానికి ఇది బలం చేకూర్చగలదు! అయినప్పటికీ జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఇలాంటి అనాలోచిత ప్రకటనలకు పాలుపడడం విచిత్రమైన వ్యవహారం. భయంకర బీభత్సకారుడు బుర్హన్ వానీ గొప్ప నాయకుడని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. ఈ ప్రకటనలు వాస్తవానికి అనుగుణమని చిత్రీకరించడానికి మాత్రమే టెర్రరిస్టులు ఇలా కల్లోలాలను సృష్టించారు కానీ లక్షలాది సామాన్య ప్రజలు కశ్మీర్‌లోయలో బుర్హన్ వానీ ముఠాను వౌనంగా నిరసిస్తూనే ఉన్నారు.
అమర్‌నాథ్ యాత్రను ప్రభుత్వం శనివారం రద్దు చేసింది. సోమవారం పాక్షికంగా మాత్రమే పునరుద్ధరించారు. దీనివల్ల కూడ టెర్రరిస్టుల ముందు ప్రభుత్వం మోకరిల్లినట్టు అయింది. కేంధ్ర ప్రభుత్వం కొత్తగా పనె్నండు వందలమంది అనుబంధ సైనిక దళాలను కశ్మీర్‌కు తరలించిన తరువాత మాత్రమే అమర్‌నాథ్ యాత్ర పాక్షికంగానైనా పునరుద్ధరించారు. మొత్తంమీద కశ్మీర్ లోయలో యుద్ధం జరుగుతోందన్న భావాన్ని లేదా భ్రాంతిని సృష్టించడంలో టెర్రరిస్టులు కృతకృత్యులయ్యారు. ప్రధాన మంత్రితోపాటు ఆఫ్రికాకు వెళ్లిన జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారుడు అజిత్‌దోవల్ హుటాహుటిన ఢిల్లీకి తిరిగి వచ్చాడు. దేశ వ్యవహారాల మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశాలను అత్యవసరంగా ఏర్పాటు చేసారు. రాజ్‌నాధ్ సింగ్ వివిధ రాజకీయ పక్షాల అధినాయకులతో కశ్మీర్ కల్లోలాలను అదుపు చేయడం గురించి చర్చలను జరపడం కూడ పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. కశ్మీర్‌లో సైనిక దళాల ఉనికి వ్యతిరేకిస్తున్నవారు ఇప్పుడేమంటారో? సైనిక దళాల సంఖ్య తగ్గిపోయింది కాబట్టి టెర్రరిస్టుల వారి సమర్ధకులు ఇలా కశ్మీర్ వీధుల విశృంఖలంగా విహరించగలగుతున్నారు. గతంలో కేంద్ర పోలీసులపై సైనికులు రాళ్లు రువ్వి బీభత్సం సృష్టించిన ఆరు వందల ముప్పయి నాలుగు మందిని జమ్ము కశ్మీర్ ప్రభుత్వం జులై మొదటి వారంలో జైళ్లనుండి విడుదల చేయడంకూడ ఇప్పుడు కొనసాగుతున్న కాండకు బలం చేకూర్చింది. విడుదల అయినవారిలో అత్యధికులు సైనికులపై మళ్లీ రాళ్లను రువ్వుతున్నారు...
మోకరిల్లే విధానం వల్ల కాక మట్టుపెట్టే విధానం వల్ల మాత్రమే దేశ వ్యతిరేక, పాకిస్తాన్ సమర్ధక జిహాదీ తండాలను అదుపు చేయడానికి వీలుందని ప్రభుత్వాలు ఇప్పుడైనా గ్రహించాలి. దుర్జనుణ్ని మన్నించి ఉపకారం చేసినందువల్ల వాడు శాంతించడు, ప్రతిగా అపకారం చేయడంవల్ల మాత్రమే దుర్జనుణ్ని అణచివేయగలం...శామ్యేత్ ప్రత్యపకారేణ, నోపకారేణ దుర్జనః- అని మహాకవి కాళిదాసు చెప్పిన నిజం ఇప్పటి బీభత్సకారులకు వర్తిస్తోంది. అందువల్లనే భద్రతా దళాలవారు వానీని తొలగించడం ద్వారా హిజ్‌బుల్ నడుమును విరిచేసారు. నడుం విరిగిన హిజ్‌బుల్ వికృతంగా కేకలు పెడుతుండడం ప్రస్తుత కల్లోలం! ఈ కల్లోలం కారణంగా పాకిస్తాన్ వౌలిక స్వభావం మరోసారి బట్టబయలైంది. మీ శత్రువులు మాకు మిత్రులు, మీ నాయకులు మాకు శత్రువులు, మీ సంస్కృతికి పూర్తి విరుద్ధమైనది మా సంస్కృతి..అని పాకిస్తాన్ నిర్మాత మహ్మదాలీ జిన్నా గతంలో భారతీయులకు స్పష్టం చేయడం చరిత్ర! ఈ చరిత్రను పాకిస్తాన్ నిరంతరం పునరావృత్తం చేస్తోంది. అందువల్లనే బుర్హన్ వానీ గొప్ప నాయకుడని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది! అతగాడి సంస్మరణ శ్రద్ధాంజలి సభలు హఫీజ్ సరుూద్ హాజరవుతున్నాడు. జమాత్ ఉద్ దావా ముఠా నాయకుడైన సరుూద్ మన దేశంలో జరిగిన అనేక బీభత్స ఘటనలకు సూత్రధారుడు. ఫలానావాడు టెర్రరిస్టు అనడానికి సాక్ష్యాలు చూపండి అని మన ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్న పాకిస్తాన్ పెత్తందార్లు ధ్రువపడిన టెర్రిరిస్టులను నాయకులుగా చిత్రీకరిస్తున్నారు...