సంపాదకీయం

రొదలేని పరివర్తన...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా థెరేసా మాయ్ బుధవారం పాలనా బాధ్యతలను స్వీకరించడం మార్గెరట్ థాచర్ స్ఫూర్తిని మరోసారి స్ఫురింపచేస్తోంది. థాచరమ్మ వలె మాయమ్మ కూడ మహిళ కావడం గురించి బ్రిటన్‌లో మాత్రమే కాక అంతర్జాతీయంగా ప్రచారవౌతోంది. శతాబ్దుల బ్రిటన్ ప్రజాస్వామ్య రాజ్యాంగ పథ ప్రస్థాన రథానికి మహిళ సారథ్యం వహించడం ఇది రెండవసారి మాత్రమే కావడం ప్రచారానికి కేంద్ర బిందువు. ఇంతవరకు బ్రిటన్ ఆంతరంగిక వ్యవహారాలమంత్రి-హోమ్ సెక్రటరీగా ఉండిన థెరేసా జూన్ 23వ తేదీన సంభవించిన చారిత్రాత్మక రాజకీయ విస్ఫోటనం కారణంగా ప్రధానమంత్రి పదవిని కైవసం చేసుకోగలిగింది... ఐరోపా సమాఖ్య-యూరోపియన్ యూనియన్-నుండి తమ దేశం వైదొలగాలని జూన్ 23న ఐక్యరాజ్యం-యునైటెడ్ కింగ్‌డమ్-గా అధికారిక నామం కల బ్రిటన్ వోటర్లు నిర్ధారించడం ఈ రాజకీయ విస్ఫోటనం! 2010 మే నెలనుండి బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉండిన కన్సర్వేటివ్ పార్టీ నాయకుడు డేవిడ్ కామెరాన్ తమ దేశం ఐరోపా సమాఖ్య-ఇయు-లో కొనసాగాలని ఆకాంక్షించాడు. 23వ తేదీనాటి అభిప్రాయ సేకరణ-రెఫరెండమ్-కు పూర్వరంగంగా జరిగిన ప్రచార సందర్భంగా తన ఆకాంక్షకు మద్దతునివ్వలసిందిగా ప్రజలకు పిలుపునిచ్చాడు. కానీ దాదాపు యాబయి ఒక్క శాతం ఓటర్లు వైదొలగడం-ఎగ్జిట్-తమ అభిమతమని తీర్పునిచ్చారు. అందువల్ల బ్రిటన్ సమాఖ్య నుండి వైదొలగడానికి రంగం సిద్ధమైంది. తన అభిప్రాయాన్ని అధిక శాతం ప్రజలు మన్నించలేదు కనుక పదవినుండి తప్పుకోవాలని డేవిడ్ కామెరాన్ నిర్ణయించడం ఊహించని విపరిణామం. కేవలం నైతిక బాధ్యతను వహించి పదవినుండి తప్పుకోవాలని నిర్ధారించడం ద్వారా కామెరాన్ ప్రజాస్వామ్య సత్ సంప్రదాయాలను నిలబెట్టగలిగాడు, ప్రపంచ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలలోని ప్రభుత్వాధినేతలకు ఆదర్శ ప్రాయుడయ్యాడు. 23న జరిగిన జనవాక్య సేకరణ కేవలం బ్రిటన్ ఐరోపా సమాఖ్యలో ఉండాలా? వద్దా? అన్న సమస్యకు సంబంధించినది, కామెరాన్ ప్రభుత్వంపై విశ్వాసం లేదా అవిశ్వాస ప్రకటనకు సంబంధించింది కాదు. బ్రిటన్ ప్రతినిధుల సభ-హవుస్ ఆఫ్ కామన్స్-లో కామెరాన్ ప్రభుత్వానికి పూర్తి ఆధిక్యం ఉంది, సభ కామెరాన్ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించలేదు. అయినప్పటికీ కామరాన్ నైతిక బాధ్యతను వహించి పదవినుంచి వైదొలగడం మార్గెరట్ థాచర్ వారసత్వం...1979 నుండి బ్రిటన్ ప్రధానిగా పనిచేసిన మార్గరెట్ 1990లో రాజీనామా చేసిన నాటికి ఆమెకు పార్లమెంటులో పూర్తి మెజారిటీ ఉంది...
మార్గరెట్ థాచర్ 1990లో రాజీనామా చేయడానికి కూడ కారణం ఐరోపాలోని మిగిలిన దేశాలతో బ్రిటన్ సంబంధాలే! 1967లో ఏర్పడిన ఐరోపా కూటమి-యురోపియన్ కమ్యూనిటీ-ఇసి-లో బ్రిటన్ చేరలేదు. 1973 వరకూ చేరలేకపోయింది. ఎందుకంటే కూటమిలో బ్రిటన్ చేరినట్టయితే తమ ఆధిపత్యం దెబ్బ తింటుందని ఫ్రాన్స్ భావించింది. 1973లో మాత్రమే బ్రిటన్ పట్ల తన వ్యతిరేకతను ఫ్రాన్స్ సడలించింది. ఐరోపా కూటమి 1993లో ఐరోపా సమాఖ్య-ఇయు-గా అవతరించే నాటికి మార్గరెట్ థాచర్ బ్రిటన్ ప్రధాని కాదు. ఐరోపా ఆర్థిక వాణిజ్య వ్యవస్థలోను, రాజకీయ సమీకృత వ్యవస్థలోను, బ్రిటన్ సమగ్ర భాగస్వామి కావాలన్నది థాచర్ విధానం. అయితే ఈ విధానం కన్సర్వేటివ్ పార్టీలో తీవ్రమైన విభేదాలు తలెత్తడంతో మానసిక క్షోభకు గురి అయిన థాచర్ ప్రధాని పదవికి రాజీనామా చేసారు. ఊహించని ఆ పరిణామం బ్రిటన్ రాజకీయ వర్గాలను, అంతర్జాతీయ పరిశీలకులను విస్మయానికి గురి చేసింది. 1983, 1988 నాటి ఎన్నికలలో కూడ తన పార్టీకి ఘన విజయం సాధించగలిగిన థాచర్ 1827 తరువాత అత్యంత దీర్ఘకాలంపాటు ప్రధాని పదవిని నిర్వహించిన ఘనతను సాధించింది. ఆమెను రాజీనామా చేయవలసిందిగా పార్టీ కోరలేదు. పార్లమెంటులో ఆమె మెజారిటీ కోల్పోలేదు! అందువల్ల కామెరాన్ నిష్క్రమణ థాచరమ్మ స్ఫూర్తికి పునరావృత్తి! పార్లమెంటరీ పార్టీ తొలగించేవరకూ, పార్లమెంటులో మెజారిటీ కోల్పోయే వరకు, ఎన్నికలలో పరాజయం పాలయ్యే వరకు పదవిని పట్టుకుని వేలాడరాదన్నది ఈ స్ఫూర్తి...ప్రజల అభిమానం ఆదరణ కొనసాగుతున్నప్పుడే సగౌరవంగా అధికార పరిత్యాగం చేయడం ఈ స్ఫూర్తి...ఇతరులకు కూడ ప్రధాని పదవిని నిర్వహించడానికి అవకాశం ఇవ్వడం థాచర్ స్ఫూర్తి...కామెరాన్ స్ఫూర్తి! ఈ స్ఫూర్తి కారణంగానే థెరేసా ఇప్పుడు బ్రిటన్ ప్రధాని కాగలిగింది...
పదవిలో అక్టోబర్ వరకు కొనసాగనున్నట్టు ప్రకటించి కామెరాన్ ఇంత ముందుగానే నిష్క్రమించడం కూడ ఊహించని మరో పరిణామం, థెరేసాకు కలసివచ్చిన అదృష్టం! ఐరోపా సమాఖ్యలో బ్రిటన్ కొనసాగడం తన విధానం కాబట్టి, విడిపోయే ప్రక్రియకు నాయకత్వం వహించరాదని కామెరాన్ నిర్ణయించాడు. ఈ ప్రక్రియ రెండేళ్ల పాటు కొనసాగనుంది, అప్పుడు మాత్రమే బ్రిటన్‌కు ఐరోపా వాణిజ్య బంధం నుండి పూర్తి విముక్తి లభిస్తుంది. కానీ థెరేసా కూడ జన వాక్య సేకరణ సందర్భంగా కామెరాన్ విధానాన్ని బలపరిచింది. అందువల్ల విడిపోయే ప్రక్రియకు ఆయన నాయకత్వం వహించినప్పటికీ, ఆమె నాయకత్వం వహించినప్పటికీ తేడాలేదు! అందువల్ల ప్రధాన మంత్రి పదవి ఆమెను వరించడం ఊహించని పరిణామం. కామెరాన్ తప్పుకోనున్నట్టు ప్రకటించగానే ఐదుమంది ప్రముఖులు కన్సర్వేటివ్ పార్లమెంటరీ నాయకత్వానికి పోటీపడ్డారు. పోటీచేసిన మరో మంత్రి స్టీఫెన్ క్రాబ్ కూడ మాయ్‌తోపాటు కామెరాన్ పాటించిన సమాఖ్యతో సమైక్య విధానాన్ని బలపరిచాడు. థెరేసాతో పోటీపడిన మరో ముగ్గురు ఇంధన శాఖ మంత్రి ఆండ్రియా లెడ్‌సమ్, న్యాయమంత్రి మైకెల్ గోవ్, మాజీ రక్షణ మంత్రి లియామ్ ఫాక్స్ బ్రిటన్ ఇయునుంచి వైదొలగాలని ప్రచారం చేసిన విభజన వాదులు. మొదటి దశ ఎన్నికలలోనే 330 మంది కన్సర్వేటివ్ ప్రతినిధులలో 132 మంది థెరేసాకు మద్దతు పలికారు. రెండవ దశ ఎన్నికలలో థెరేసాకు 199 మంది సమర్ధన లభించగా మరో మహిళా అభ్యర్థి ఆండ్రియాకు 89 ఓట్లు పడ్డాయి. అందువల్ల తదుపరి ప్రధాని మహిళ అన్నది జూలై ఏడవ తేదీన స్పష్టమైపోయింది. అయితే ఈ ఇద్దరి మధ్య సెప్టెంబర్‌లో జరుగవలసి ఉండిన తుది పోరాటం ఇప్పుడే పరిసమాప్తి అయింది. ఆండ్రియాస్ లెడ్‌సమ్ పోటీనుంచి తప్పుకోవడంలో నిర్ధారిత సమయం కంటె ముందుగానే మాయమ్మకు ప్రధాన మంత్రి పదవి దక్కింది...
కామెరాన్ బుధవారం ఉదయం పార్లమెంటులో ప్రసంగించాడు, ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్నాడు, బకింగ్ హామ్ భవనానికి వెళ్లి బ్రిటన్ రాణి రెండవ ఎలిజబెత్‌ను కలిసాడు, పదవికి రాజీనామా సమర్పించాడు, డౌన్‌వింగ్ వీధిలోని అధికార నివాసానికి తిరిగి వెళ్లి భార్యా బిడ్డలను పిలుచుకుని సొంత ఇంటికి వెళ్లాడు. థెరేసా మాయ్ నూతన ప్రధానిగా ప్రయాణంచేసింది. ఇలా ఆర్భాటం లేకుండా ఇన్ని సంఘటనలు ఒకేరోజున జరగడం కూడ విలక్షణమైన రాజ్యాంగ కార్య పద్ధతికి నిదర్శనం...