సంపాదకీయం

సామాజిక న్యాయస్ఫూర్తి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో జారీ చేసిన 123వ నంబరు ఉత్తరువు హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఎస్‌కె కయత్ ఆగస్టు మూడవ తేదీన రద్దు చేయడం సామాజిక న్యాయసాధన పథంలో మరో ప్రగతిపథం. భూమి సేకరణ వ్యవహారం ప్రభుత్వానికీ, ప్రభుత్వేతర సంస్థలకూ, భూమి యజమానులకూ మాత్రమే పరిమితమైన వ్యవహారం కాదని వ్యవసాయ భూమిపై ఆధారపడిన శ్రామికుల బతుకు తెరువునకు సైతం సేకరణతో సంబంధం ఉందని, న్యాయస్థానం తీర్పుద్వారా మరోసారి స్పష్టమైంది. ఈ స్పష్టీకరణ 2013లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన భూమిసేకరణ, ప్రత్యామ్నాయ ఉపాధి, పునరావాసం వ్యవహారాల చట్టం-లాండ్ అక్విజిషన్ రిహాబిలిటేషన్ రిసెటిల్‌మెంట్ యాక్ట్-లోని నిబంధనలకు అనుగుణంగా ఉంది. 1894లో బ్రిటన్ దురాక్రమణదారులు మన దేశంపై పెత్తనం సాగించిన సమయంలో రూపొందిన భూమిసేకరణ చట్టంలో వ్యవసాయ శ్రామికుల ప్రసక్తి లేదు, భూములను ప్రభుత్వానికి అప్పగించే రైతులకు పునరావాసం, ప్రత్యామ్నాయ ఉపాథి కల్పించడం గురించి ప్రస్తావన లేదు. దురాక్రమణదారులు మన నెత్తికెత్తిపోయిన ఆ పాతబడిన, కాలదోషం పట్టిన, ప్రజావ్యతిరేకమైన చట్టాన్ని రద్దు చేయాలని 2013వ సంవత్సరానికి పూర్వం దాదాపు పదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వాన్ని అనేకసార్లు కోరింది! నత్తనడకతో పోటీపడి కదలిన కేంద్ర ప్రభుత్వం చివరకు 2013లో కొత్తచట్టాన్ని రూపొందించక తప్పలేదు. ఈ కొత్త చట్టంలో భూములను కోల్పోయే రైతులకు మాత్రమే కాక, ఉపాధిని కోల్పోయే శ్రామికులకు సైతం ప్రత్యామ్నాయ ఉపాధిని, పునరావాసాన్ని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై వుందన్నది న్యాయమూర్తి సురేశ్ కుమార్ కయిత్ చేసిన నిర్ధారణ. చట్టంలోని ఈ ఉపాధి స్పూర్తిని భంగ పరిచినందువల్ల మాత్రమే 123వ నంబరు ప్రభుత్వ ఉత్తరువు-జివో-న్యాయమూర్తి రద్దు చేశారు! ఈ తీర్పును రద్దు చేయాలని, న్యాయమూర్తి కయిత్ తీర్పు అమలు జరగకుండా తాత్కాలికంగా నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనానికి అప్పీలు చేసింది. అయితే న్యాయమూర్తి కయిత్ తీర్పును తాత్కాలికంగా నిలిపివేయడానికి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్ రంగనాధన్, న్యాయమూర్తి యు.దుర్గాప్రసాదరావులు ఐదవ తేదీన తిరస్కరించారు. అందువల్ల ధర్మాసనం వారి తుది తీర్పు వెలువడే వరకు న్యాయమూర్తి సురేశ్‌కుమార్ కయిత్ తీర్పు అమలులో వుంటుంది. వ్యవసాయ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించకుండా పునరావాసం కల్పించకుండా సంబంధిత గ్రామాలలోని వ్యవసాయ భూమిని తెలంగాణ ప్రభుత్వం సేకరించజాలదు!
తెలంగాణ ప్రభుత్వం ఇలా వ్యవసాయ కార్మికులు ప్రత్యామ్నాయ ఉపాధి గురించి, పునరావాసం గురించి మరచిపోవడం హడావుడిగా భూమిని సేకరించి పారిశ్రామిక వాటికలను ఏర్పాటు చేయాలని తలపెట్టడం ప్రతీక మాత్రమే! దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోను ఈ వైపరీత్యం కొనసాగుతోంది. నూతన రాజధాని నిర్మాణం కోసం ముప్పయి మూడు వేల ఎకరాల భూమిని అనేక గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరించింది. కానీ 2013వ సంవత్సరంనాటి జాతీయ స్థాయి చట్టం ప్రకారం ఆయా గ్రామాల వ్యవసాయ కార్మికులకు అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధిని, పునరావాసాన్ని కల్పించడానికి ఎలాంటి పథకాన్ని రూపొందించిందన్నది ప్రచారం కావడంలేదు! రైతులకు భూమిని కోల్పోయిన యజమానులకు నవ్యాంధ్ర ప్రభుత్వం సమకూర్చనున్న సదుపాయాలు మాత్రమే ఇంతవరకు ప్రచారానికి నోచుకున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్‌లో మాత్రమే కాదు, దేశంలోని వివిధ రాష్ట్రాలలో సైతం ఈ వ్యవసాయ శ్రామికుల పునరావాసం ప్రత్యామ్నాయ ఉపాధి ధ్యాస ప్రభుత్వాలకు లేదు, వ్యవసాయ శ్రామికులకు సైతం లేదు. అందువల్ల నిర్వాసితులై నిరుపాధులైన వ్యవసాయ శ్రామికులు వౌనంగా రోదిస్తూ మరో చోటికి వెళ్లిపోతున్నారు. మెదక్ జిల్లాలోని ఝురాసంగం మండలంలోని బర్దీపూర్ గ్రామానికి చెందిన తుక్కమ్మకు, మరో ఇరవై రెండుమంది వ్యవసాయ శ్రామికులకు ఈ ధ్యాస కలగడం, తమ హక్కుల గురించి తెయడం అపవాదం మాత్రమే. అందువల్లనే వీరంతా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగలిగారు. తెలియని వారు ఎన్ని లక్షల మంది ఎన్ని కోట్లమంది ఉన్నారో...!
జాతీయ ఉత్పత్తుల, పెట్టుబడుల మండలం-నిమ్జ్-ను ఏర్పాటు చేయడం కోసం ఈ ఝురాసంగమ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ గ్రామాలకు చెందిన భూములను కేటాయిస్తోందట! ఈ నిమ్జ్‌ను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ-టిఎస్‌ఐఐసి-వారు ఏర్పాటు చేస్తున్నారట! 2013 నాటి భూమి సేకరణ చట్టం ప్రకారం ఒక గ్రామంలో వ్యవసాయ భూమిని ప్రభుత్వ పథకాల కోసం ప్రభుత్వం సేకరించదలచినప్పుడు ఆ గ్రామానికి చెందిన కనీసం డెబ్బయి శాతం భూమి యజమానులు తమ ఆమోదాన్ని తెలపవలసి వుంది. ప్రభుత్వేతర పథకాల కోసం పరిశ్రమల స్థాపన కోసం భూమిని సేకరించినప్పుడు కనీసం ఎనబయి శాతం భూమి యజమానులు ఇలా అనుమతిని తెలపడం అనివార్యం...ఈ నిబంధనలను తొలగించి 2013 నాటి భూమిసేకరణ చట్టాన్ని సవరించడానికి ఏడాదికి పైగా కేంద్ర ప్రభుత్వం విఫలయత్నం చేసింది. పార్లమెంటు ఆమోదం లభించడం అసాధ్యమమని తెలిసి కూడ అధ్యాదేశాల ద్వారా చట్టంలో ఈ మార్పులను చేసింది. అధ్యాదేశాల ద్వారా మారిన చట్టం అమలు జరిగిన సంవత్సరం కాల వ్యవధిలో ఈ ఎనబయి శాతం, డెబ్బయి శాతం రైతుల అనుమతి అనివార్యం కాలేదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూమి సేకరణ రైతుల అనుమతి లేకుండానే బలవంతంగా జరిగిపోయిందన్న ప్రచారం కూడ జరిగింది. దేశవ్యాప్తంగా కూడ ఈ అధ్యాదేశాలు అమలైన సమయంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా గబగబా లక్షలాది ఎకరాల భూమిని సేకరించేశాయన్నది కొనసాగిన ఆరోపణ. నిజానిజాలు నిగ్గు తేలలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ సవరణ బిల్లును రద్దు చేసుకొనడం తరువాతి కథ. అందువల్ల 2013 నాటి చట్టంలో నిర్దేశించిన విధంగా డెబ్బయి శాతం. ఎనబయి శాతం భూమి యజమానులు ఆమోదించిన తరువాతనే భూమిసేకరణకు వీలు కలుగుతుందన్న నిబంధన యధావిధిగా అమలు జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జివో ఈ నిబంధనను కూడ ఉల్లంఘించిందా? అన్న విషయం స్పష్టం కాలేదు. త్వరిత గతిన భూమిసేకరణకు ఈ 123వ జివో వీలు కల్పించిందన్నది మాత్రమే ప్రచారమైన వాస్తవం!
2005నాటినుండి అమలు జరుగుతున్న ప్రత్యేక ఆర్థిక మండలుల చట్టం-సెజ్‌ల చట్టం కింద జరుగుతున్న వేలాది లక్షలాది ఎకరాల భూమి సేకరణ 2013 నాటి చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించరాదన్నది కేంద్ర ప్రభుత్వాలు గమనించవలసిన అంశం! కానీ పారిశ్రామిక కాలుష్య కవాటాలను ఏర్పాటు చేయడానికి దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు నడుములను బిగించి ఉండడం ప్రపంచీకరణ వైపరీత్యం. కృత్రిమ పారిశ్రామిక భ్రాంతికి గురి అవుతున్న పాలకులు శాశ్వతమైన సహజమైన వ్యవసాయ ప్రగతిని దెబ్బతీస్తున్నారు. బర్దీపూర్ గ్రామవాసులైన శ్రామికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పించవచ్చు...దేశంలోని ఇతరుల సంగతి??్భమిని సేకరిస్తున్న గ్రామాలలోని వ్యవసాయ శ్రామికులకు ప్రత్యామ్నాయ ఉపాధిని, పునరావాసాన్ని కల్పించ నున్నట్టు వారికి న్యాయం చేయనున్నట్టు, తెలంగాణ ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించడం ముదావహం. ప్రభుత్వ ఉత్తర్వులో ఈ మార్పు జరిగినట్లయతే నిరుపేదలకు న్యాయం జరుగుతుంది.